జైశ్రీరామ్.
శ్లో. తావన్మౌనేన నీయన్తే కోకిలశ్చైవ వాసరాః|
యావత్సర్వం జనానన్దదాయినీ వాఙ్న ప్రవర్తతే ||
తే.గీ. కూతవచ్చునందాక తా కోయిలమ్మ
మౌనముననుండి పిదపతా గానఫణితి
ప్రకటనముచేయు నట్టులే ప్రతిభు లవని
సమయమును చూచి పలుకుట జాణతనము.
భావము. తనకు కూత వచ్చే వరుకు కోయిల మౌనంగా ఉండి రోజులు
గడుపుతుంది. కాలక్రమంలో మధురమైన స్వరంతో అందరినీ ఆకర్షిస్తుంది.
అదే విధంగా సమయం వచ్చినప్పుడే సందర్భోచితమైన మాట పలికి
అందరినీ మెప్పించాలి. సమయం సందర్భం రానంతవరుకు మౌనం
వహించడమే ఉత్తమం.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.