జైశ్రీరామ్.
శ్లో. అగచ్ఛన్ వైనతేయోఽపి - పదమేకం న గచ్ఛతి
యోజనానాం సహస్రాణి - శనైర్గచ్ఛేత్ పిపిలికాః.
తే.గీ. ఒక్క యడుగైన వేయక నిక్కవముగ
వెడలేడుగరుఁడుడైన విశ్వమందు,
చీమమెల్లగా నడచుచు చేరుకొనదె
వేలయోజనాల్ గతియించు వలయు చోటు.
భావము. ప్రయత్నం-కదలిక లేనిదే గరుత్మంతుడైనా అంగుళం
ముందుకు పోలేడు..అదే..చీమలు క్రమశిక్షణ, నిబద్ధతో మెల్ల మెల్లగా
వేలకొలది యోజనాలను దాటిప్రయాణిస్తాయి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.