హైశ్రీరామ్.
శ్లో. ముక్తాఫలైః కిం మృగపక్షిణాం చ - మృష్టాన్న పానం కిము గార్దభానామ్।
అంధస్య దీపో బధిరస్య గీతం - మూర్ఖస్య కిం ధర్మకథాప్రసంగః|| (నీతి చంద్రిక)
తే.గీ. అల మృగములు పక్షులకు ముత్యములవేల?
మధురమైనట్టి భుక్తి గాడిదలకేల?
నంధ బధిరులకును దీప, సుందర నుత
గీతమేల? ద్రాబకు ధర్మ గీతులేల?
భావము. మృగాలకుగానీ పక్షులకుగానీ ముత్యాల అవసరమే లేదు.
గాడిదలకు మధురమైన భోజనము గానీ, మధురపానీయము గానీ అవసరమే లేదు.
గ్రుడ్డివానికి దీపముతో పని లేదు. చెవిటివానికి సంగీత మవసరము లేదు.
మూర్ఖునికి ధర్మబోధలతో ప్రయోజనము లేదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.