గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జులై 2024, బుధవారం

సంఘం శరణం గచ్ఛామి(ఏకాదశ రుద్రాత్మకమ్)రచన:-శ్రీవల్లభ

 జైశ్రీరామ్.

కం:_శ్రీమాతా కరుణింపుమ
        నీమావృతి నడచు జగము నిన్నే దలపన్
        రామాశ్రిత రమ్య జగతి
        ధామంబును గూర్చి గావ దలచెదు మాతా!

తే గీ:-కర్మ సిద్ధాంత జనితమై ధర్మ నిరతి!
       మర్మ కర్మాంత  వేద్యుల మాయ దవిలి
      చర్మ ధారుల దౌర్భాగ్య సాయకముల
     మర్మ స్వార్ధపు మాంగళ్య మందె కలిని!    1.

తే గీ:-స్వార్ధ భూయిష్ట సంసార కడలి నిలచి
       వ్యర్ధ జీమూత సంఘంబు పట్టు జిక్కి
      ధర్మ మన్నది దరిజేర తప్పటంచు
     వర్ధ మానుల రీతిని వరల దగునె?          2

తే గీ:-శక్తి రూపిణి స్త్రీ మాత జగతి క ర్త
        కష్టముల కోర్చి కన్నట్టి కన్న త ల్లి
       కృ ళ్ళు సంఘాన కుత్సితాకులము చెంది
       భిక్షు లోకాన వేస రి వేడె శివుని!          3

తే గీ:-అన్న ముక్కంటి గనవేమి?యాటవికుల
       చేష్ట లన్నియు కలి నడ్డి చితుక కొట్టె
      ధర్మ గ్లానియు చేకురి తల్లడిల్లె
     దురితులను  చీల్చి ఛెండాడ తెగువ లేద? 4.

తే గీ:-కుల మతాల కుంపట్ల జ్వాల లెగసె
       జాతి మత సంక్షోభ చరిత మిగిలె!
      రక్ష యవి నీతి భక్షణ రక్ష గనక
      శిక్ష గూర్చెడి శివ మూర్తి చక్షువంటె!      5.

(అవినీతి జ్వాల లు శివుని మూడవ కన్నును జేరుటచే
చూడ జాలక మూసియుంచెను)

తే.గీ:-చక్షువును మూసి న్యాయంపు సరళి గనుచు
        దొంగ దోబూచి మాటల లొంగి పోయె
        జగతి కాధార మూర్తివి! జనకు డీవు!
       జాల మేలుచు లోకాన్ని  చక్క దీర్చు!   6.

తే.గీ:-  దుష్ట సంహారమును జేసి శిష్ట రక్ష
           నిష్టమై జేయు నిర్మల నీతి మంత!
          సమ సమాజంబు డబ్బుతో!చక్క బడునె?
         మమత మమకారములు పెంచు మహితమూర్తి! 7.

తే గీ:-భూమి కబళించు మృచ్ఛులు పుట్టి రిలను
        తట్టు కో లేక కన్నీట తడిసె దేల?
       విలయ తాండవ మేర్చుమా!వినుతి గనెదు!
       తండ్రి తలకోయు ధన్యులు ధాత్రి గలరు!         8.

తే.గీ:-క్షమకు కాలంబు చెల్లెను చచ్చె సుఖము!
        జీవ హింసయె జీవన సరళి యాయె!
        పాప కూపాన మిట్టాడ పద్ధ తగునె?
        ధర్మ దేవత కను గుడ్డ తగదు విడుమ!       9.

(కంటితోచూచి విని చెప్ప నీయని ధర్మము సంపూర్ణత
గనునా?)

తే.గీ;-జనన మరణాల నాపంగ శక్య మగునె?    
         సృష్టి కర్తృక మంతయు శివ మయంబు!
        లోక దౌర్భాగ్య దుస్తితి లోను యగుచు
        దురితు లాయెడి వారల దురిత మాపి!     10.

తేగీ:-సత్తు తత్తుల దృష్టిని సాగ నిచ్చి
       సత్వ బుద్ధిని నేర్పించి జగము బ్రోచి!
       కావు కల్యాణ కారకా!కన్న తండ్రి!
      శివము శాంతంబు కాదొకో? జీవ ధాత్రి!   11.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.