శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.
(గర్భకవితామృతము)
రచన. చింతా రామకృష్ణారావు.
భక్త జన పోష ! భవశోష ! పాపనాశ !
శ్రితజనోద్భాస ! యాదాద్రి శ్రీనృసింహ !
చరవాణి సంఖ్య. 9 2 4 7 2 3 8 5 3 7 //…// 8 2 4 7 3 8 4 1 6 5
అక్షరక్రమములో 118 వివిధ ఛందముల వివరములు.
శతకమునందలి సీస పద్యముల సంఖ్య 108.
108 సీసపద్యములందు గర్భితములైయున్న పద్యములందున్న వివిధ ఛందముల సంఖ్య 118.
అక్షరక్రమములో 118 వివిధ ఛందముల వివరములు.
క్రమ సంఖ్య/సీస గర్భస్థ పద్య నామము/శతకములోని సీస పద్య సంఖ్య/(పద్య లక్షణము)
01 అంతరాక్కర - 44. (1సూర్యగణము, 2ఇంద్రగణములు, 1చంద్రగణము .. యతి 3వ గణము చివరి అక్షరము)
చంద్ర గణములు.
రగ/నగగ/తగ/సలగ/భగ/నలగ/మల/సగల/రల/నగల/తల/సలల/భల/నలల)
02 అంబురుహ - 70. (భ భ భ భ ర స వ .. యతి 13)
03 అజితప్రతాప - 68. (1.3పాదములకు స జ స స .. యతి 9 / 2.4 పాదములకు న భ జ ర .. యతి 8)
04 అతివినయ - 4. (న న న న న స .. యతి 11)
05 అపరాజిత - 71. (న న ర స వ .. యతి 9)
06 అలసగతి - 51. (న స న భ య .. యతి 10)
07 అశ్వగతి - 72. (భ భ భ భ భ గ .. యతి 10)
08 ఆటవెలది - 14.18. 44. (1.3.పాదములలో 3సూ.గ.2 ఇం.గ., 2.4. పాదములు 5 సూ.గ.
యతి 4వ గణము మొదటి అక్షరము. ప్రాస యతి చెల్లును)
09 ఇందువదన - 69. (భ జ స న గ .. యతి 9)
10 ఇంద్రవజ్ర - 74. (త త జ గగ .. యతి 8)
11 ఉత్కళిక - 98. (ఉత్కళిక - రెండు పాదములు. పాదమునకు 4 త్రిమాత్రాగణములు. అంత్యప్రాస కలదు)
12 ఉత్సాహ – 18. 38. (7 సూర్య గణములు 1 గురువు .. యతి 5వ గణము 1వ అక్షరము)
13 ఉపజాతి - 76. (1.3పాదములు తతజగగ ఇంద్రవజ్ర - 2.4పాదములు జతజగగ ఉపేంద్రవజ్ర. .. యతి 8)
ఇంద్రవజ్ర. - ఇత్తా, జ, గా సంగతి - నింద్రవజ్రా-వృత్తంబగున్ సన్నుత - వృత్తరేచా!
ఉపేంద్రవజ్ర. - సపద్మ పద్మా! జత - జల్గగంబున్ - ఉపేంద్ర వజ్రాఖ్యము - నొప్పుఁజెప్పన్.
ఉపజాతి - ఈ రెండు వృత్తంబులు - నిందుఁగూడన్=సరోజనేత్రా! యుప - జాతి యయ్యెన్.
(భీమన ఛందము)
14 ఉపేంద్రవజ్ర - 75. (జ త జ గగ .. యతి 8)
15 ఊర్వశి - 33. (న త త ర గ .. యతి 8)
16 కంద - 100. (1.3.పాదములలో 3 చొప్పున 2.4. పాదములలో 5 చొప్పున "నల-నగ-సల-భ-ర-త"
అనేగణములే రావచ్చును.4వగణము1వ అక్షరముతో7వగణము1వ అక్షరమునకుయతి.
ప్రాస కలదు. ప్రాస యతి చెల్లదు. జగణము2.4.6. గణములలోనే రావచ్చును.
6వగణము నల లేదా జ మాత్రమే రావలయును. 8వ గణము చివర గురువు రావలెను)
17 కమలవిలసిత - 92. (న న న న గగ.. యతి 9)
18 కమలాకర - 93. (స న జ జ య .. యతి 11)
19 కలరవ - 77. (స న న న లగ .. యతి 8)
20 కలిత - 31. (న న భ స న న వ .. యతి 12)
21 కవిరాజవిరాజిత - 28. (న జ జ జ జ జ జ లగ .. యతి 1-8-14-20)
22 కుసుమవిచిత్ర - 63. (న య న య .. యతి 7)
23 కోకిలక - 100. (న జ భ జ జ వ .. యతి 1-8-14)
24 కోమల - 83. (1.3పాదములు న జ జ య .. యతి 8/ 2.4 పాదములు జ భ స జ గ .. యతి 9)
సలలితరీతి నజాయగణంబుల్ - చళుక్యభూప జభసజస్థగస్థితిన్.
మలయుచునర్థసమర్థతచేతన్ - వెలుంగఁ గోమల మను వృత్త మొప్పగున్.
25 కౌముది - 15. (న త త గ .. యతి 6)
26 గజవిలసితము - 10. (భ ర న న న గ .. యతి 8)
27 గాథా - 108. (విలక్షణ గురులఘు క్రమముతో ఎక్కువ తక్కువలు లేకుండా ఒక్కొక మారు మూడు లేక
ఒక్కొక మారు ఆరు చరణములు కలిగి పాడుకొనుటకు వీలు కలిగినది గాథా అను ఛందస్సుగా
ప్రసిద్ధికెక్కినది.गाथास्त्रिभिः षड्भिश्चरणैश्चोपलक्षिताः!! १.१८ !! (केदार भट्टस्य वृत्तरत्नाकरः)
28 గీతాలంబన - 61. (త జ జ వ .. యతి 8)
29 చంద్రలేఖ - 103. (న స ర ర గ .. యతి 7)
30 చంద్రవర్త్మ - 101. (ర న భ స .. యతి 7)
31చంద్రిక - 37. (న న ర వ .. యతి 7) నగణయుగమునన్ రవంబులన్ - బ్రగుణరసవిరామసంగతిన్
తగిలి హరికథాసమేతమై - నెగఁడు గృతుల నిండి చంద్రికన్.
32 చంపకమాల - 1. 100. (న జ భ జ జ జ ర .. యతి 11)
33 చౌపద - 65. (4మాత్రాగణములు3, నగణము, అంత్యప్రాస .. యతి 3వగణాద్యక్షరము.జగణము వాడరాదు)
34 జలద - 66. (భ ర న భ గ .. యతి 10)
35 జాగ్రత్ - 107. (స న జ న భ గగ .. యతి 11)
36 జ్ఞాన - 8. (త న భ భ స గ .. యతి 10)
37 తరలి - 39. (భ స న జ న ర .. యతి 11)
38 తరల (ధృవకోకిల) - 9. (న భ ర స జ జ గ .. యతి 12)
39 తరువోజ - 99. (3ఇం.గ, 1సూ.గ. 3ఇం.గ. 1సూ.గ. యతి 1-3-5-7 గణాద్యక్షరములు)
40 తాండవజవము - 30. (స న న స న య .. యతి 12)
41 తారక - 95. (స న జ జ న గగ .. యతి 11)
42 తురగవల్గిత - 97. (న న న న స జ జ గ .. యతి 15)
43 తేటగీతి - 44.100. (ప్రతీ పాదమున 1సూ.గ. 2ఇం.గ. 2 సూ.గ.వచ్చును.
యతి 4వ గణము 1వ అక్షరము. ప్రాసయతి చెల్లును)
44 తోటక - 40. (స స స స .. యతి 9)
45 తోదక - 59. (న జ జ య .. యతి 8) జలరుహవక్త్ర! న, - జా, యగణంబుల్
వెలయగఁ దోదక - వృత్తముఁ జెప్పున్. (భీమన ఛందము)
46 త్రిపది - 47. (1వ పాదమున 4ఇం.గ. 2వ పాదమున 2ఇం.గ. 2సూ.గ. 3వ పాదమున 2 ఇం.గ. 1సూ.గ)
47 త్వరితపదగతి - 86. (న న న న న య .. యతి 11)
48 దండక - 105. (అనేక తగణములు. చివర గగ)
49 దేవరాజ - 18. (న ర న జ భ స .. యతి 11)
50 ద్రుతవిలంబిత - 100. (న భ భ ర .. యతి 7)
51 ద్విపద - 7.9.99. (2పాదములు. ప్రతీ పాదమున 3ఇం.గ.1సూ.గ .. యతి 3వ గణము 1వ అక్షరము)
52 ద్విరదగతిరగడ - 57. (2పాదములు. ప్రాస, అంత్య ప్రాస నియమం కలదు. ప్రతి పాదమునందు 5 మాత్రలు
గణములు 4 ఉండును. యతి 3వ గణము 1వ అక్షరము)
53 నది - 50. (న న త జ గగ .. యతి 8)
54 నర్కుట - 100. (న జ భ జ జ వ .. యతి 11)
55 నవనందిని - 81. (స జ స న గగ .. యతి 9)
56 నవమాలిని - 102. (న జ భ య .. యతి 8)
57 నాందీముఖి - 82. (న స త త గగ .. యతి 8)
58 నిశా వృత్తము - 46.(న న ర ర ర ర .. యతి 9)
59 పంక్తి - 106. (భ భ భ గ .. యతి 7)
60 పణవము - 5. (మ న య గ .. యతి 6)
61 పదమాలి - 79. (న జ జ ర .. యతి 10)
62 పాదప - 78. (భ భ భ గగ .. యతి 7) పాదపవృత్తము భాభగగంబుల్ - మోదముతో నిరుమూఁటవిరామన్.
63 పాలాశదళ లేదా శశిశోభ - 32. (15 లఘువులు గగ .. యతి 11)
64 ప్రణవము - 29. (మ న య గ .. యతి 6)
65 ప్రభాత - 85. (న జ జ ర గ .. యతి 8)
66 ప్రమితాక్షర - 52. (స జ స స .. యతి 9)
67 ప్రముదితవదన - 23. (న న ర ర .. యతి 8)
68 ప్రహరణకలిత - 67. (న న భ న వ .. యతి 8)
69 ప్రియంవద - 48. (న భ జ ర .. యతి 8)
70 ప్రియకాంత - 50. (న య న య స గ .. యతి 11)
71 ఫలసదన - 56. (న న న న స గ .. యతి 10)
72 బలభిన్మణి - 21. (భ స న న గ .. యతి 7)
73 బంభరగానము - 17. (న న భ భ గ .. యతి 8)
74 భుజంగప్రయాత - 105. (య య య య .. యతి 8)
75 భూతిలక - 94. (భ భ ర స జ జ గ .. యతి 12)
76 భూనుత - 73. (ర న న భ గగ .. యతి 10) (భూనుత 2.ర న భ భ గగ అని కొందరిమతము)
77 మంగళమణి - 96. (భ స న జ న గ .. యతి 11)
78 మంజరీద్విపద - 22. (3ఇం.గ. 1సూ.గ. యతి 3వగణము 1వ అక్షరము. 2పాదములుండును.
ప్రాస నియమము లేదు. ప్రాసయతి చెల్లును)
79 మందారదామ - 54. (త త త గగ .. యతి 7)
80 మణిగణనికర - 58. (న న న న స .. యతి 9)
81 మణిభూషణ - 100. (ర న భ భ ర .. యతి 10)
82 మణిరంగ - 64. (ర స స గ .. యతి 6)
83 మత్తకోకిల - 7.99. (ర స జ జ భ ర .. యతి 11)
84 మత్తహంసిని - 104. (జ త స జ గ .. యతి 7)
85 మత్తేభ - 20. (స భ ర న మ య వ .. యతి 14)
86 మదన - 6. (త భ జ జ గగ .. యతి 9)
87 మధురాక్కర - 80. (1సూ.గ-3ఇం.గ-1చం.గ .. యతి 4వ గణము 1వ అక్షరము)
88 మధ్యాక్కర - 100. (2 ఇం.గ. 1 సూ.గ. 2 ఇం.గ. 1 సూ.గ .. యతి 4వ గణము 1వ అక్షరం)
89 మనోజ్ఞ - 25. (న జ జ భ ర .. యతి 10)
90 మనోహర - 62. (1.3. పాదములు కాంతా {గీతాలంబన} వృత్తము త జ జ వ .. యతి 8.
2.4.పాదములు తోటక వృత్తము స స స స .. యతి 9)
91 మలయజము - 2. (న జ న స న న భ న లగ .. యతి 1-8-15-22).
92 మానిని - 24. (భ భ భ భ భ భ భ గ .. యతి 1-7-13-19)
93 మాలిని - 35. (న న మ య య .. యతి 9)
94 మోహప్రలాప - 41. (భ భ త ర గ .. యతి 7)
95 మౌక్తికమాల - 60. (భ త న గగ .. యతి 7)
96 రుచిర - 45. (జ భ స జ గ .. యతి 9)
97 లఘుసీసము - 42. (6`నలల’లు. 2నగణములు .. మొదటి నాలుగు గణములు 1వ అర్థ పాదము.2వ
4గణములు 2వ అర్థ పాదము. 1వ గణము 1వ అక్షరముతో 3వగణము 1వ
అక్షరమునకు, 5వ గణము 1వ అక్షరముతో 7వ గణము 1వ అక్షరమునకు యతి.
ప్రాసయతి చెల్లును. పద్యాంతమున ఆ.వెలది కాని, తేటగీతి కాని తప్పక ఉండవలెను)
98 లత - 84. (న య న న గ .. యతి 7)
99 లలితగతి - 13. (న న న జ స .. యతి 11)
100 వంశపత్రపతిత - 3. (భ ర న భ న వ .. యతి 11)
101 వనమంజరి - 87. (న జ జ జ జ భ ర .. యతి 14)
102 వనమయూర - 89. (భ జ స న గగ .. యతి 9)
103 వరాంగి - 90. (1-2-4 పాదములు జ త జ గగ, 3వ పాదము త త జ గగ .. యతి 8)
సరిత్పదాబ్జా జతజల్ గగల్ బం - ధురం బగున్ రెంట జతుర్థకాంఘ్రిన్
గారాముతోఁ దాజగగల్ వరాంగిన్-హరార్చితా మూఁడవయంఘ్రి నొందున్.
104 వసంతతిలక - 88. (త భ జ జ గగ .. యతి 8)
105 వసంతమంజరి - 91. (న భ భ న ర స వ .. యతి 13)
106 విద్రుమలత - 36. (న జ న న వ .. యతి 8)
107 వృంతము - 43. (న న స గగ .. యతి 9)
108 శంభునటన - 12. (జ స న భ జ స న భ వ .. యతి 1-10-18)
109 శతపత్ర లేదా చారుమతి - 11. (భ జ స న భ జ స న గ .. యతి 1-13-17)
110 శార్దూల - 16. (మ స జ స త త గ .. యతి 13)
111 శివశంకర - 19. (స న జ న భ స .. యతి 11).
112 షట్పదద్వయ - 53. (1వ పాదమునందు 2ఇం. గ. 2వ పాదమునందు 2ఇం.గ.
3వ పాదమునందు 2ఇం. 1 చం. గణములు, 4వ పాదమునందు 2ఇం. గణములు,
5వ పాదమునందు 2ఇం. గణములు, 6వ పాదమునందు 2ఇం. 1 చంద్ర గణములుండును.
యతి 3వ పాదమునందు 3వ గణము1వఅక్షరము6వ పాదమునందు
3వ గణము యొక్క 1వ అక్షరము.
113 సన్నుత - 26. (ర జ న భ స .. యతి 10)
114 సరసాంక - 34. (స జ స స య .. యతి 10)
115 సర్వలఘుమధ్యాక్కర - 42. (2 ఇం.గ. 1 సూ.గ. 2 ఇం.గ. 1 సూ.గ .. యతి 4వ గణము 1వ అక్షరం)
116 సాధ్వీ - 27. (భ న జ న స న న భ గ .. యతి 1-8-15-22)
117 సుందర - 55. (భ భ ర స వ .. యతి 9)
118 స్రగ్విణి - 105. (ర ర ర ర .. యతి 7)
Ref:
http://www.andhrabharati.com/bhAshha/ChaMdassu/ChaMdOdarpaNamu/index.html
(http://chandam.apphb.com/?chandassu=tel)
http://chandam.apphb.com/?ChaMdOratnaavaLi https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:%E0%B0%B0%E0%B0%BE%E0%B0%95%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0/%E0%B0%9B%E0%B0%82%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81
శ్రీ లక్ష్మీనరసింహస్వామి అష్టోత్తరశత నామాంచిత పద్య వివరణ.
1. ఓం నారసింహాయనమః.
చంపకమాల వృత్త గర్భ సీసము.
2. ఓం మహాసింహాయ నమః.
మలయజ వృత్త గర్భ సీసము.
3. ఓం దివ్యసింహాయ నమః.
వంశపత్రపతిత వృత్త గర్భ సీసము.
4. ఓం మహాబలాయ నమః.
అతివినయ వృత్త గర్భ సీసము.
5. ఓం ఉగ్రసింహాయ నమః.
పణవ వృత్త గర్భ సీసము
6. ఓం మహాదేవాయ నమః.
మదన వృత్త గర్భ సీసము.
7. ఓం స్తంభజాయ నమః.
మత్తకోకిల వృత్త - ద్విపదద్వయ గర్భ సీసము.
8. ఓం ఉగ్రలోచనాయ నమః.
జ్ఞాన వృత్త గర్భ సీసము.
9. ఓం రౌద్రాయ నమః.
తరల వృత్త - ద్విపదద్వయ గర్భ సీసము.
10. ఓం సర్వాద్భుతాయ నమః.
గజవిలసిత వృత్త గర్భ సీసము.
11. ఓం శ్రీమతే నమః.
శతపత్ర వృత్త గర్భ సీసము.
12. ఓం యోగానందాయ నమః.
శంభునటన వృత్త గర్భ సీసము.
13. ఓం త్రివిక్రమాయ నమః.
లలితగతి వృత్త గర్భ సీసము.
14. ఓం హరయే నమః.
ఆటవెలది గర్భ సీసము.
15. ఓం కోలాహలాయ నమః.
కౌముది వృత్త ద్వయ గర్భ సీసము.
16. ఓం చక్రిణే నమః.
శార్దూల వృత్త గర్భ సీసము.
17. ఓం విజయాయ నమః.
బంభరగాన వృత్త గర్భ సీసము.
18. ఓం జయవర్ధనాయ నమః.
ఆటవెలదిద్వయ - దేవరాజ వృత్త - ఉత్సాహ గర్భ సీసము.
19. ఓం పంచాననాయ నమః.
శివశంకర వృత్త గర్భ సీసము.
20. ఓం పరబ్రహ్మణే నమః.
మత్తేభ వృత్త గర్భ సీసము.
21. ఓం అఘోరాయ నమః.
బలభిన్మణి వృత్త గర్భ సీసము.
22. ఓం ఘోరవిక్రమాయ నమః.
మంజరీద్విపద చతుష్టయ గర్భ సీసము.
23. ఓం జ్వలన్ముఖాయ నమః.
ప్రముదితవదన వృత్త గర్భ సీసము.
24. ఓం మహాజ్వాలాయ నమః.
మానిని వృత్త గర్భ సీసము.
25. ఓం జ్వాలామాలినే నమః.
మనోజ్ఞ వృత్త గర్భ సీసము.
26. ఓం మహాప్రభవే నమః.
సన్నుత వృత్త గర్భ సీసము.
27. ఓం నిటలాక్షాయ నమః.
సాధ్వీ వృత్త గర్భ సీసము.
28. ఓం సహస్రాక్షాయ నమః.
కవిరాజవిరాజిత వృత్త గర్భ సీసము.
29. ఓం దుర్నిరీక్షాయ నమః.
ప్రణవ వృత్త గర్భసీసము.
30. ఓం ప్రతాపనాయ నమః.
తాండవజవ వృత్త గర్భ సీసము.
31. ఓం మహాదంష్ట్రాయుధాయ నమః.
కలిత వృత్త గర్భ సీసము.
32. ఓం ప్రాఙ్ఞాయ నమః.
పాలాశదళ వృత్త గర్భ సీసము.
33. ఓం చండకోపినే నమః.
ఊర్వశి వృత్త గర్భ సీసము.
34. ఓం సదాశివాయ నమః.
సరసాంక వృత్త గర్భ సీసము.
35. ఓం హిరణ్యకశిపుధ్వంసినే నమః.
మాలిని వృత్త గర్భ సీసము.
36. ఓం దైత్యదానవభంజనాయ నమః.
విద్రుమలత గర్భ సీసము.
37. ఓం గుణభద్రాయ నమః.
చంద్రికాద్వయ గర్భ సీసము.
38. ఓం మహాభద్రాయ నమః.
ఉత్సాహ వృత్త గర్భ సీసము.
39. ఓం బలభద్రకాయ నమః.
తరలి వృత్త గర్భ సీసము.
40. ఓం సుభద్రకాయ నమః.
తోటక గర్భ సీసము.
41. ఓం కరాళాయ నమః.
మోహప్రలాప వృత్త గర్భ సీసము.
42. ఓం వికరాళాయ నమః.
సర్వ లఘు మధ్యాక్కర గర్భ లఘు సీసము.
43. ఓం వికర్త్రే నమః.
వృంత వృత్త గర్భ సీసము.
44. ఓం సర్వకర్తృకాయ నమః.
అంతరాక్కర - తేటగీతి - ఆటవెలదిద్వయ గర్భ సీసము.
45. ఓం శింశుమారాయ నమః.
రుచిర గర్భ సీసము.
46. ఓం త్రిలోకాత్మనే నమః.
నిశా వృత్త గర్భ సీసము.
47. ఓం ఈశాయ నమః.
త్రిపదిద్వయ గర్భ సీసము.
48. ఓం సర్వేశ్వరాయ నమః.
ప్రియంవద వృత్త గర్భ సీసము.
49. ఓం విభవే నమః.
ప్రియకాంత వృత్త గర్భ సీసము.
50. ఓం భైరవాడంబరాయ నమః.
నది వృత్త గర్భ సీసము.
51. ఓం దివ్యాయ నమః.
అలసగతి వృత్త గర్భ సీసము.
52. ఓం అచ్యుతాయ నమః.
ప్రమితాక్షర వృత్త గర్భ సీసము.
53. ఓం కవిమాధవాయ నమః.
షట్పదద్వయ గర్భ సీసము.
54. ఓం అధోక్షజాయ నమః.
మందారదామ గర్భ సీసము.
55. ఓం అక్షరాయ నమః.
సుందర వృత్త గర్భ సీసము.
56. ఓం శర్వాయ నమః.
ఫలసదన వృత్త గర్భ సీసము.
57. ఓం వనమాలినే నమః.
ద్విరదగతిరగడ ద్వయ గర్భ సీసము.
58. ఓం వరప్రదాయ నమః.
మణిగణనికర వృత్త గర్భ సీసము.
59. ఓం విశ్వంబరాయ నమః.
తోదక వృత్త గర్భ సీసము.
60. ఓం అద్భుతాయ నమః.
మౌక్తికమాల వృత్త గర్భసీసము.
61. ఓం భవ్యాయ నమః
గీతాలంబన గర్భ సీసము.
62. ఓం శ్రీవిష్ణవే నమః..
మనోహర వృత్త గర్భ సీసము.
63. ఓం పురుషోత్తమాయ నమః.
కుసుమవిచిత్ర వృత్త గర్భ సీసము.
64. ఓం అనఘాస్త్రాయ నమః.
మణిరంగ వృత్త గర్భ సీసము.
65. ఓం నఖాస్త్రాయ నమః..
చౌపద గర్భ సీసము.
66. ఓం సూర్య జ్యోతిషే నమః
జలద వృత్త గర్భ సీసము.
67. ఓం సురేశ్వరాయ నమః.
ప్రహరణకలిత వృత్త గర్భ సీసము.
68. ఓం సహస్రబాహవే నమః.
అజితప్రతాప గర్భ సీసము.
69. ఓం సర్వఙ్ఞాయ నమః.
ఇందువదన వృత్త గర్భ సీసము.
70. ఓం సర్వసిద్ధప్రదాయకాయ నమః.
అంబురుహ వృత్త గర్భ సీసము.
71. ఓం వజ్రదంష్ట్రాయ నమః.
అపరాజిత వృత్త గర్భ సీసము.
72. ఓం వజ్రనఖాయ నమః. .
అశ్వగతి వృత్త గర్భ సీసము.
73. ఓం మహానందాయ నమః.
భూనుత గర్భ సీసము.
74. ఓం పరంతపాయ నమః
ఇంద్రవజ్ర వృత్త గర్భ సీసము.
75. ఓం సర్వమంత్రైకరూపాయ నమః.
ఉపేంద్రవజ్ర గర్భ సీసము.
76. ఓం సర్వతంత్రాత్మకాయ నమః.
ఉపజాతి వృత్త గర్భ సీసము.
77. ఓం సర్వయంత్రవిదారణాయ నమః.
కలరవ వృత్త గర్భ సీసము.
78. ఓం అవ్యక్తాయ నమః.
పాదపము లేదా తోదకము లేదా దోధకము - గర్భ సీసము.
79. ఓం సువ్యక్తాయ నమః
పదమాలి వృత్త గర్భ సీసము.
80. ఓం భక్తవత్సలాయ నమః.
మధురాక్కర గర్భ సీసము.
81. ఓం వైశాఖ శుక్ల భూతోత్ధాయ నమః.
నవనందిని వృత్త గర్భ సీసము.
82. ఓం శరణాగత వత్సలాయ నమః.
నాందీముఖి వృత్త గర్భ సీసము.
83. ఓం ఉదార కీర్తయే నమః.
కోమల వృత్త గర్భ సీసము.
84. ఓం పుణ్యాత్మనే నమః.
లత గర్భ సీసము.
85. ఓం మహాత్మనే నమః.
ప్రభాత వృత్త గర్భ సీసము.
86. ఓం చండవిక్రమాయ నమః.
త్వరితపదగతి వృత్త గర్భ సీసము.
87. ఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమః.
వనమంజరి వృత్త గర్భ సీసము.
88. ఓం భగవతే నమః.
వసంతతిలక వృత్త గర్భ సీసము.
89. ఓం పరమేశ్వరాయ నమః.
వనమయూర వృత్త గర్భ సీసము.
90. ఓం శ్రీవత్సాంకాయ నమః.
వరాంగి వృత్త గర్భ సీసము.
91. ఓం శ్రీనివాసాయ నమః.
వసంతమంజరి వృత్త గర్భ సీసము.
92. ఓం జగద్వ్యాపినే నమః.
కమలవిలసిత (లేదా సురుచిర లేదా ఉపచిత్ర లేదా సుపవిత్ర) వృత్త గర్భ సీసము.
93. ఓం జగన్మయాయ నమః.
కమలాకర వృత్త గర్భ సీసము.
94. ఓం జగత్పాలాయ నమః.
భూతిలక వృత్త గర్భ సీసము.
95. ఓం జగన్నాధాయ నమః.
తారక వృత్త గర్భ సీసము.
96. ఓం మహాకాయాయ నమః.
మంగళమణి గర్భ సీసము.
97. ఓం ద్విరూపభృతే నమః.
తురగవల్గిత వృత్త గర్భ సీసము.
98. ఓం పరమాత్మనే నమః.
ఉత్కళిక చతుష్టయ గర్భ సీసము.
99. ఓం పరంజ్యోతిషే నమః.
గోమూత్రికాబంధ గూఢ పంచమ పాద యుక్త తరువోజ - మత్తకోకిల - ద్విపదద్వయ గర్భ సీసము.
100. ఓం నిర్గుణాయ నమః.
1.చంపక,2.మధ్యాక్కర, 3.నర్కుట, 4.కోకిలక, 5.మణిభూషణ, 6.ద్రుతవిలంబిత, 7.కంద,8.గీత గర్భసీసము.
101. ఓం నృకేసరిణే నమః.
చంద్రవర్త్మ వృత్త గర్భ సీసము.
102. ఓం పరతత్త్వాయ నమః.
నవమాలిని వృత్త గర్భ సీసము.
103. ఓం పరస్మైధామ్నే నమః.
చంద్రలేఖ వృత్త గర్భ సీసము.
104. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః.
మత్తహంసిని వృత్త గర్భ సీసము.
105. ఓం లక్ష్మీనృసింహాయ నమః.
దండక - స్రగ్విణి - భుజంగప్రయాతపంచక గర్భ సీసమాలిక.
106. ఓం సర్వాత్మనే నమః.
పంక్తి గర్భ సీసము.
107. ఓం ధీరాయ నమః.
జాగ్రత్ వృత్త గర్బిత సీసము.
108. ఓం ప్రహ్లాదపాలకాయ నమః.
గాథా ఛందోయుత మంగళ గీతిక గర్బ సీసము.
4.
ఆముఖము.
శా. శ్రీమన్మంగళ దివ్యరూప! వరదా! శ్రీ నారసింహప్రభూ!
ప్రేమన్ లోకహితంబుఁ గూర్చుచు సదా విఖ్యాత యాదాద్రి శ్రీ
ధామంబందునఁ బూజలన్
వినఁబడున్. త్వన్నామముల్ దీప్తిగా
నా మంజుధ్వనినెంచి కూర్తు శతకం బష్టోత్తరంబొప్పుగన్. 1.
భావము.
మంగళప్రదమయిన
లక్ష్మీప్రదమయిన
రూపముగలిగిన
వరదాయివయిన
ఓ లక్ష్మీనరసింహా! ఎల్లప్పుడూ నీ అష్టోత్తర శత
నామములు
ప్రేమతో లోకమునకు మేలును కూర్చుచు ప్రసిద్ధమయిన యాదగిరిపై పూజలలో వినబడుచుండును. ఆ
మనోహరముగా
ధ్వనించు
నామములను
స్వీకరించి
అష్టోత్తరశతకమును
కూర్చుదును.
చ. అగణిత దివ్య ధాత్రిని జయంబులనిచ్చెడి శ్రీ నృసింహ! యీ
జగతి శుభాస్పదంబుగను, సజ్జనపాళికి స్వర్గధామమై,
ప్రగణిత వేదభూమిగ ప్రభావితమౌనటు చేయుమయ్య! నీ
సుగుణచయంబులన్ దెలిపి చూపఁగ నన్నుననుగ్రహింపుమా! 2.
భావము.
వర్ణింప శక్యముకాని గొప్పదైన ఈ భూమిపై జయమునను ప్రసాదించెడి ఓ లక్ష్మీ నరసింహా! ఈ లోకము శుభములకు తావు
అగునట్లుగనుండి మంచి వారికి స్వర్గ ధామమగుచు, మిక్కిలి పొగడఁబడెడివేద భూమిగ ప్రభావము పొందు విధముగ
ఒనరింపుము. నీలో ఉన్న మంచి గుణముల సమూహమును నేను తెలుపుచు పాఠకులకు నిన్ను చూపించువిధముగ
నన్ననుగ్రహింపుము.
పరమాత్మ స్వరూపులైన కల్వపూడి వేంకట వీర రాఘవాచార్య గురుదేవులు.
ఉ. శౌర్యతనొప్పి యాదగిరి సత్ప్రభ పెంచిన శ్రీ నృసింహ! నా
ధుర్యుఁడ! నీకిలన్ శతకతోయజ సత్కృతిఁ జేయఁ జేయ నే
నార్యులు కల్వపూడి సుమహాబ్ధిజ వేంకట వీర రాఘవా
చార్య గురూత్తమున్ గొలిచి, సాగిలి మ్రొక్కుదు భక్తియుక్తునై. 3.
భావము.
సౌర్యముతో ప్రకాశించుచు యాదగిరి యొక్క మంచి ప్రభను అధికము చేయుచున్న ఓ నరసొంహా!
నా బాధ్యతను
వహించినవాఁడా!
ఈ ధరిత్రిపై నీకు శతకపద్యపద్మములతో సత్కారము చేయునట్లు చేయుట కొఱకు నేను నా
గురువులగు కల్వపూడి వీరవేంకట రాఘవాచార్యులవారిని కొలిచి, సాష్టాంగ నమస్కారము భక్తితో చేయుచుంటిని.
చ. నిరతము నీ పదాబ్జములనే స్పృశియించుచు సేవఁ జేయు ధీ
వరులు, పునీత జన్ములు, వివర్జిత కామ మహాత్ములర్చకుల్.
పరమ పవిత్ర భక్తులగు వారి పదాబ్జ పరాగమంటినన్
దెరవును జూపు నిన్ గనఁగ. దివ్యుఁడ! నాకు లభింపఁ జేయుమా! 4.
భావము.
దివ్యుఁడవైన ఓ నరసింహా! ఎల్లప్పుడూ నీ పాద పద్మములనే తాకుచు,సేవచేయుచున్నటువంటి జ్ఞానశ్రేష్టులైన
అర్చకస్వాములు పవిత్రమైన జన్మ కలవారు.ఐహిక వాంఛలు లేనటువంటి మహనీయులు. నీకు పరమ భక్తులైన ఆ
అర్చకుల పాదధూళి సోకినంతనే నిన్ను కనుగొను మార్గము గోచరించును కదా. అట్టి వారి పాద ధూళి నాకు ప్రాప్తింపఁ
జేయుము.
సీ. పురుషోత్తమా! నేను సరస సత్కవి కల్వ - పూడి వంశోద్భవ పుణ్య మూర్తి
వినుత శ్రీ వేంకట వీర రాఘవ సదా - చార్యుల శిష్యుఁడ నార్య నుతుఁడ.
చిత్ర, బంధ సుగర్భ చిత్రపద్యములల్ల - మహిని చిత్రకవిసామ్రాట్టుననుచు
నల కోట నరసింహుఁ డిల నన్నుమెచ్చిన - చింతాన్వయుండను, చేరితి నిను.
గీ. రామకృష్ణాఖ్యు, సన్యాసిరామ పుత్రు
జనని వేంకటరత్నము. కనుమ నన్ను.
భక్త జన పోష! భవశోష! పాపనాశ!
శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ! 5.
భావము.
భక్తజనులనుపోషించునట్టి, చెడును నశింపఁజేయునటువంటి, పాపములను హరించునటువంటి సత్యప్రకాశుఁడవయిన
శ్రీ యాదాద్రి పురుషోత్తమా! నారసింహా! నేను సరస సత్కవి యైన కల్వపూడి వేంకటవీర రాఘవాచార్యులవారి శిష్యుఁడను.
పెద్దల సన్నుతిభాగ్యుఁడను. చిత్ర బంధ గర్భ కవితలల్లువాడనగుటచే నన్ను చిత్రకవితా సామ్రాట్టుననుచు అవధాని
బ్రహ్మశ్రీ కోట నరసింహము గారిచే ప్రశంసింపఁబడినవాడను. చింతా వంశజుఁడను, సన్యాసిరామారావు, వేంకటరత్నము
పుణ్యమూర్తుల సుతుఁడను. అటువంటి నన్ను నీవు ఆనందప్రదముగ చూడము.
క. అష్టోత్తరశత నామము - లిష్టంబుగఁ జేర్చి చిత్ర మేర్పడ సీసం
బష్టోత్తర శతసంఖ్యను - సృష్టింతును నీదు కృపను శ్రీశ! నృసింహా! 6.
భావము.
లక్ష్మీపతివైన ఓ నారసింహా! నీ నూటయెనిమిది నామములను ప్రీతితో చేర్చి నూటయెనిమిదిసీసపద్యములనునీకృపచే
వ్రాయుదును.
ఉ. పెక్కు ప్రసిద్ధ ఛందముల విస్తృతినొప్పెడి గర్భ సీసముల్,
చక్కని దండకాదులు ప్రశస్తిగనొప్పఁగ సీసమాలికల్,
మ్రొక్కఁగ నిన్ను పాటలను, పొల్పు వహించెడి సీసపద్యముల్,
నిక్కము వ్రాయనెంచితిని, నీవె రచింపఁగ చేయుమా హరీ! 7.
భావము.
ఓ నృహరీ! అనేకమైన సుప్రసిద్ధ ఛందములు విస్త్రుతముగా గర్భితమై ఒప్పునట్లుగను, మనోజ్ఞమైన దండకము
మొదలగునవి గర్భితమై ఒప్పురీతిని,నిన్ను మనసారా మ్రొక్కుటకనుకూలమైన పాటలు గర్భితమై ఒప్పునట్లును,
ప్రసిద్ధికెక్కు సీసపద్యములను ఖచ్చితముగ వ్రాయనెంచితిని. నీవే శక్తికొలిపి రచించునట్లుగా నన్ను చేయుము.
ఉ. ఇట్టి ప్రయత్నమందు పరమేశ్వర నీ కృపఁ గల్గి యుండుటన్
బట్టు ననేక ఛందములు భాసిలు సీసములందు, నింక నీ
వెట్టుల యానతిచ్చిన మహేశ్వర నిన్గని వ్రాయుదట్టులే.
గుట్టుగ నా మదిన్ నిలిచి కోరిక తీర రచింపుమా హరీ! 8.
భావము.
ఇటువంటి ప్రయత్నములో నీ కృప ఉండుట చేత సీపద్యములలో వివిధ ఛందములు గర్భితములయి ప్రకాశించును.
ఇంక నీవు ఏ విధముగ ఆనతినిత్తువో ఆవిధముగా నిన్నుచూచుచు వ్రాయుదును.నీవు గుంభనముగా నా మదిలో
మెదలుచు నా కోరికను తీరునట్లు నాచే రచింపఁజేయుము.
చ. గుణములు పెక్కులుండనగుఁ గోమల సత్శతకంబునందు. స
ద్గుణ రహితంబునై సొగసు కోల్పడి యుండియునుండవచ్చు, దు
ర్గుణ రహితంబుగాఁ, గుసుమ కోమలమై, వర భావ సంపదన్,
మనమున భక్తిఁ గొల్పునటు, మన్ననలంద, రచింపఁ జేయుమా! 9.
భావము.
నేను రచింపఁబూనిన శతకమున సద్గుణములు పెక్కు ఉండవచ్చును, లేదా గుణరహితమైయుండిఅందము
నశించియైనను ఉండవచ్చును. చెడు గుణములు లేని విధముగను, పూలవలె సుకామారముగానొప్పి, శ్రేష్టమైన
భావమనెడి సంపదతో ఒప్పునట్లు, పాఠకుల మదులలో భక్తి భావమును కొలుపు విధముగను, అందరి మన్ననలు
పొందునట్లుగను నాచే రచన చేయించుము.
క. పరిపూర్ణ మానసంబున - స్థిరముగ యాదాద్రి శ్రీ నృసింహ శతకమున్,
ధర చదువు సుజన పాళికి - వరముగ నీవుండి కాచి వరలు నృసింహా! 10.
భావము.
ఓ నారసింహా! నిండు మనసుతో ఈ యాదాద్రి శ్రీ నృసింహశతకమును చదువు సుజనులైన పాఠకుల వరముగా నీవే ఉండి
కాపాడుచూ నీవు ప్రసిద్ధిగానుండుము.
అంకితము.
కృతిభర్త. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి.
ఉ. భద్రతనిచ్చు శ్రీపతికి, భాగ్య విధాతకు, బ్రహ్మ తాతకున్.
సద్రమణీయ రత్న విలసన్నుత సజ్జన సేవ్య భద్ర యా
దాద్రి నృసింహదేవునకు, హారముగా నొనరింప నిచ్చెదన్
మద్రచనన్ గృపన్ గొనఁగ. మార్గ సుదర్శి నృసింహ మూర్తికిన్. 11.
భావము.
సుజనులకు భద్రత కల్పించెడి లక్ష్మీపతికి, భాగ్యవిధాతయైన ఆ హరికి, భక్త రక్షకునకు, మంచిరమణీయమైన
రత్నకాంతులతోవిలసించి ప్రకాశించుచు, సజ్జనుల సేవలందుకొనుచున్న భద్రమైన యాదాద్రి వాసుఁడైన,
మార్గదర్శియైన శ్రీనరహరికి, ఆభరణముగా చేయుటకొఱకు ఈ శతకమును కృపతో స్వీకరించుట కొఱకు నంకితమిత్తును.
సీ. యదుసింహు నునికిచే యాదగిరి వెలిసె. - యదుసింహుడే నేటి మధుర నృహరి.
చినజియ్యరులవారి చిత్తమందున వెల్గి - యాదాద్రిగా మారె యాదగిరియు.
చంద్రశేఖరరావు జరిపించ యజ్ఞముల్ - యాదాద్రి వేదాద్రి యనఁగనొప్పె.
వేదాద్రియైన యీ యాదాద్రి వాస! నీ - సంతసంబునకేను శతకమల్లి,
గీ. చిత్ర కవితయౌ గర్భ సత్ సీసములను
నీదు నామాంచితంబుగా నేర్పుమీర
వ్రాసితిని, రామకృష్ణుఁడ, భక్తితోడ.
స్వీకరింపుము తృప్తిగా శ్రీ నృసింహ! 12
భావము.
యదుసింహుఁడై ఆ పరమాత్మ ఉనికి వలననే యాదగిరి ప్రసిద్ధమై వెలిసెను.నాటి యదు సింహుఁడే నేటి యీ మధుర
నరసింహుఁడు. స్వామి చినజియ్యరుస్వామి మనసులో వెలిగి ఈ యాదగిరి యాదాద్రిగా మారెను. మన రాష్ట్ర ముఖ్య
సచివులు చంద్రశేఖరరావు యజ్ఞములు జరిపించుటచే యాదాద్రి వేదాద్రియాయనునట్లొప్పెను. వేదాద్రియైన శ్రీ
యాదాద్రిని నివాసముగా కలఓ నరసింహా!నీ సంతోషము కొఱకు నేను శతక రచన చేసి, చిత్ర కవితగా నలరారునట్లు
అనేకఛందోగర్భ సీసములను నీనూటెనిమిది నామములను చేర్చి నిపుణత మీర భక్తి భావముతో వ్రాసితిని. చింతా
రామకృష్ణారావు అనే పేరుగల నీ భక్తుఁడను. దీనిని నీవు తృప్తిగా స్వీకరించుమని ప్రార్థించుచున్నాను.
క. ఖర నామ వత్సరంబున
సరిగా నాశ్వయుజ శుద్ధ షష్టిని, జ్యేష్టన్,
వర చింతా వంశ జనితు,
పరమేశ్వర! రామకృష్ణ వర చిత్ర కవిన్.
13. (D.B/06-10-1951.A.D)
భావము.
చింతా రామకృష్ణారావు అనే పేరుగల చిత్రకవినైన నేను శ్రీ చాంద్రమాన ఖర నామ సంవత్సర ఆశ్వియుజ శుద్ధ సప్తమినాడు
జ్యేష్టానక్షత్రమున జనించితిని.
గీ. నీదు నూటెన్మ్దినామాలు స్వాదు గీతు
లందు సీసాంతములను నేఁ బొందుపరచి,
నూట పదు నెన్మ్ది ఛందముల్ తేటపడఁగ
సీస గర్భితమౌనటు వ్రాసితినయ. 14.
భావము.
ఓ స్వామీ నీయొక్క నూటెనిమిది నామములను సీసాంతములందు గీతులలో పొందుపరచితిని. నూట పద్ధెనిమిది
ఛందస్సులు స్పష్టమగునట్లుగా సీస గర్భితములుగా వ్రాసితినని మనవి చేయుచున్నాను.
చ. గుణములు నా కవిత్వమున గోచరమైన నృసింహ! నీవి. దు
ర్గుణములు, దోష సంహతియు గోచరమైన నిజంబు నావి. నా
మనమునఁ గల్గు భక్తిఁ గని, మన్ననఁ జేసి గ్రహింపుమీ కృతిన్.
గుణగణనాభిరాముఁడవు. కోరిక తీర్చుమ శ్రీ నృసింహుఁడా! 15.
భావము.
ఓ లక్ష్మీ నరసింహుఁడా! నాచే రచింపఁబడిన శతకమున సద్గుణములు గోచరించినచో అవియన్నియు నీవే సుమా. ఆ
విధముగా కాక చెడుకాని, దోషజాలము కాని కనిపించినచో అవి నా అపరిపక్వత కారణముగా సంభవించినవగుటచే నావే
సుమా. నీవు నా మనసులోని భక్తి భావమును చూచి, మన్నించుచు ఈ కృతిని స్వీకరింపుము. నీవు సుగుణ
గణాభిరాముఁడవు కదా! నా కోరికను తీరునట్లు చేయుము.
6. శ్రీయాదాద్రి
లక్ష్మీనృసింహస్వామి వారికి అష్టోత్తరశత నామాంచిత పద్యపుష్పార్చన.
1. ఓం నారసింహాయ నమః.
చంపకమాల వృత్త గర్భ సీసము.
అగణిత భవ్యదేహ! శుభుఁడైన మహేశ్వ - ర, శ్రీగణేశులన్! సుశ్రవణుని,
జగమును నిల్పు మా జనని సన్నుత భార - తి, శ్రీరమాసతిన్, దీక్షఁ గొలుతు,
బ్రగణిత రాఘవున్, పరమ పావన సత్క - వి వ్రాతమున్, లసత్ విశ్వ జనుల,
జగతికి వెల్గులౌ సుగుణసాంద్రుల నంచి - త ప్రేమఁ గొల్చెదన్, తలచి మదిని.
గీ. బంధ బహుఛంద సీసముల్ వరలఁ గొలుప - వీర నరసింహ శతకంబు *నారసింహ*.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
1వ సీస గర్భస్థ చంపకమాల వృత్తము.. (న జ భ జ జ జ ర .. యతి 11)
అగణిత భవ్యదేహ! శుభుఁడైన మహేశ్వ - ర, శ్రీగణేశులన్!
జగమును నిల్పు మా జనని సన్నుత భార - తి, శ్రీరమాసతిన్,
బ్రగణిత రాఘవున్, పరమ పావన సత్క - వి వ్రాతమున్,
జగతికి వెల్గులౌ సుగుణసాంద్రుల నంచి - త ప్రేమఁ గొల్చెదన్,
భావము.
భక్తులను పోషించువాఁడా!
భవబంధములను నశింపఁజేయువాఁడా!
పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా! ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా!
పొగడ శక్యముకాని గొప్ప దేహము కలవాఁడా! వీర
నరసింహ! శతకము అనేక ఛందములు గర్భితములై వరలు గొలుపు నిమిత్తము శుభములను కలిగించు శ్రీ
మహేశ్వరులను, సుశ్రవణుఁడయిన గణపతి దేవులను,
సృష్టిని నిలిపెడి నా తల్లి శారదాంబను, మంగళస్వరూపిణియైన
లక్ష్మీదేవిని, సాటి
లేనిదైన పార్వతీ మాతను దీక్షతో కొలిచెదను, మిక్కిలి పొగడఁ బడు శ్రీరాముని, గొప్ప పావన మూర్తులైన
సత్కవుల సమూహమును, విశ్వమందలి సజ్జనులను, ఈ లోకమునకే వెలుఁగుగానున్న మంచిగుణములు కలవారిని,
నా
మదిలో తలచి తగిన
విధముగా ప్రేమతో కొలిచెదను.
2. ఓం మహాసింహాయ నమః.
మలయజ వృత్త గర్భ సీసము.
సురనుత దైవమ! సుజనుల ధైర్యమ! - శుభములు గొల్పఁగఁ జొరుము హృదిని.
భరమొకొ నన్ గన భవభయ దూరుఁడ! - వరగుణ వర్ధన! వరలు మెదను.
మరిమరి కొల్చెద మహిమను జూపర. - మనుజులు నీదగు మహిమఁ గనఁగ.
నరహరి దైవమ! నయగుణ వర్తిగ - ననుఁ గను నిత్యము నడుపుమికను.
గీ. నన్నుఁ గరుణించి నా దరినున్న నీవు. - చింతలుండవు శ్రీ *మహాసింహ* దేవ.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
2వ సీస గర్భస్థ మలయజ వృత్తము. (న జ న స న న భ న ల గ .. యతి 1-8-15-22)
సురనుత దైవమ! సుజనుల ధైర్యమ! శుభములు గొల్పఁగ చొరుము హృదిన్.
భరమొకొ నన్ గన భవభయ దూరుఁడ! వరగుణ వర్ధన! వరలు మెదన్.
మరిమరి కొల్చెద మహిమను చూపర మనుజులు నీదగు మహిమఁ గనన్.
నరహరి దైవమ! నయగుణ వర్తిగ ననుఁ గను నిత్యము నడుపుమికన్.
భావము.
భక్తులను పోషించువాఁడా!
భవబంధములను నశింపఁజేయువాఁడా!
పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా! ఓ
యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! దేవతలచే పొగడఁబడెడి దైవమా!
మంచివారికి
ధైర్యమైనవాఁడా! శుభములు కలుఁగఁ జేయుటకు నా హృదయమున ప్రవేశించుము. భవభయములను తొలగించువాఁడా!
నన్నుచూచుట నీకు కష్టమా? శ్రేష్ఠగుణములనభివృద్ధి చేయువాడవయిన ఓ దేవా! నా మదిలో మెదలుచుండుము.
నిన్ను పదే పదే కొలిచెదను.
ఈ జనులు నీ మహత్వముచూచువిధముగ
నీ మహత్వమును చూపించు తండ్రీ!
శ్రీ
మహాసింహదేవా! నీవు
నాదరినున్నచో నాకు విచారములుండవు.
3. ఓం దివ్యసింహాయ నమః.
వంశపత్రపతిత వృత్త గర్భ సీసము.
ఓ పరమాత్ముఁడా! యురుగుణా! యొనరఁ గ - నుమయా. కృపాసాంద్ర ప్రముదమిడఁగ.
శ్రీపతివైన నీ చెలువమే సిరిగఁ గొ - లుపుమా! మహాదేవ! స్వపర రహిత!
నీ పదపద్మముల్ నియతితో నిధియని - కననీయవయ్య మా కమలనయన!
దీపిత నేత్రుఁడా! తెలియనేది యది తె - లుపుమా! నృసింహుఁడా! కృపను జూచి.
గీ. కరమునందించి కావరా! ఘన సుచరిత! - తేజమునుఁ గొల్పి వరలించు *దివ్యసింహ*!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
3వ సీస గర్భస్థ వంశపత్రపతిత వృత్తము.. (భ ర న భ న వ .. యతి 11)
ఓ పరమాత్ముఁడా! యురుగుణా! యొనరఁ గనుమయా.
శ్రీపతివైన నీ చెలువమే సిరిగఁ గొలుపుమా!
నీ పదపద్మముల్ నియతితో నిధియని కననీ!
దీపిత నేత్రుఁడా! తెలియనేది యది తెలుపుమా!
భావము.
భక్తులను పోషించువాఁడా!
భవబంధములను నశింపఁజేయువాఁడా!
పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా! ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ పరమాత్ముఁడా! గొప్ప గుణములకు నిలయమైనవాఁడా!
ఓ గొప్పకృప కలవాడా! నాకు మిక్కిలి ఆనందము కలుగునట్లుగా ఒప్పిదముగా నన్ను చూడుమయ్యా! స్వపరములన్నవి
లేనటువంటివాఁడా! లక్ష్మీపతివైన నీ యొక్క చెలువమునే నాకు ధనముగా కలుఁగఁ జేయుము. మావాఁడవయిన ఓ
పద్మములవంటి నేత్రములు కలవాఁడా! నీ పాదపద్మములే మాకు నిధియని నియమముతో కననిమ్ము.
ప్రకాశవంతమైన
కన్నులు కలవాఁడా!
ఓ నరసింహా! మాలో తేజమును కలిగించి, మేము వరలునట్లు చేయునట్టి ఓ దివ్య సింహా! నన్ను
కృపతో చూచి, తెలుసుకొనవలసినదేది కలదో అది నాకు తెలియునట్లు చేయుము.
4. ఓం మహాబలాయ నమః.
అతివినయ వృత్త గర్భ సీసము.
హరివి నినుఁ గనిన తరిని నను నిలుపు - మయ నృహరీ! కాంచుమయ్య నన్ను.
వరద! ప్రణతులయ, పరమపథ వర ఫ - లమునిడుమా! నాదు లక్ష్యమరసి.
తలప ఘనము కద ధరను గన, ఘనుఁడ - నిను మదిలోనుంచి నిత్యముగను.
సరిగఁ గనఁబడుమ కరుణఁ గని, కనుల - కును. ప్రవరాత్మలోతున వసించు.
గీ. కనక కశిపునిఁ గరుణించి కనుచు పరమ - పదము నిడిన *మహాబలా *! ప్రణుతిఁ గొనుము.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
4వ సీస గర్భస్థ అతివినయ వృత్తము. (న న న న న స .. యతి 11)
నినుఁ గనిన తరిని నను నిలుపుమయ నృహరీ!
ప్రణతులయ పరమపథ వర ఫలమునిడుమా!
ఘనము కద ధరను కన ఘనుఁడ నిను మదిలో.
కనఁబడుమ కరుణఁ గని, కనులకును ప్రవరా!
భావము.
భక్తులను పోషించువాఁడా!
భవబంధములను నశింపఁజేయువాఁడా!
పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా! ఓ
యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ మహాబలా!
నీవు మా శ్రీహరివి. నిన్ను నేను చూచు
సమయమున నీ యందు నన్ను నిలిపి, నన్ను చూడుము.
ఓ వరదుఁడా! నీకు నమస్కారములు.
నా యొక్క లక్ష్యమును
తెలుసుకొని, పరమపదమనెడి శ్రేష్ఠమైన ఫలితమును నాకు ప్రసాదించుము.
ఓ ఘనుఁడా ఆలోచింపఁగా మానవులు
నిన్ను ఎల్లప్పుడు మనసులో నిలిపి భూమిపై నిన్ను చూచుట గొప్పయేకదా!
హిరణ్యకశిపుని కరుణించి చూచి అతనికి
పరమ పదమును ప్రాప్తింప చేసితివి. నా
నమస్కారములు స్వీకరింపుము! ఓ గొప్ప శ్రేష్ఠుఁడా! నన్ను
కరుణతో చూచి,
నా
కనులకు సరిగా కనిపించుము. నాహృదయపులోతులలో నీవు నివసించుము.
5. ఓం ఉగ్రసింహాయ నమః.
పణవ వృత్త గర్భ సీసము.
మహిత! గుణాభిరామా! రావయ. రమణీ - యాక్షాక్షయా! నరహరి! నుతింతు.
నో దేవ! సత్య ప్రేమోద్భాసుఁడ! శ్రియముల్ - కొల్పన్ గ నన్నెంచి, నిల్ప రమ్ము.
మాన్యుఁడా! వినుము. నీమంబొప్పఁగ నిను నేఁ - గొల్తున్ హృదిన్నీవు కొలువు తీరు.
మాతల్లి యైన శ్రీమాతాశ్రయ! శ్రిత స - త్పోషా! మదిన్ నిత్య తుష్టినిమ్ము.
గీ. నీవు కాకున్న మాకింక నేతలేరి? - యుర్వి దౌష్ట్యంబులణచెడి *ఉగ్రసింహ*!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
5వ సీస గర్భస్థ పణవ వృత్తము. (మ న య గ .. యతి 6)
రామా! రావయ. రమణీయాక్షా! - ప్రేమోద్భాసుఁడ! శ్రియముల్ కొల్పన్.
నీమంబొప్పఁగ నిను నేఁ గొల్తున్ - శ్రీమాతాశ్రయ! శ్రిత సత్పోషా!
భావము.
భక్తులను పోషించువాఁడా!
భవబంధములను నశింపఁజేయువాఁడా!
పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా! ఓ
యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ గొప్పవాఁడా!
మంచిగుణములచే అందముగ
శోభించువాఁడా! రమణీయమైన నాశ రహితుఁడా! ఓ నరహరీ! నిన్ను నుతింతును నీవు రమ్ము. ఓ దేవా! సత్యములోను,
ప్రేమలోను ప్రకాశించువాఁడా!
నన్ను నీవు గుర్తించి నాకు శ్రేయములు కొలుపుచు నిలబెట్టుటకు రమ్ము.
ఓ
మాననీయుఁడా!
నామాట వినుము.
నేను నిన్ను నియమముతో కొలుచుదును.
నా మనసులో నీవు కొలువు తీరుము. మా
తల్లి శ్రీమాతను ఆశ్రయించినవాఁడా! ఆశ్రయించిన
మంచి వారిని పోషించువాఁడా! నా
మనసుల నిత్యసంతుష్టిని
కల్పింపుము. భూమిపై దుర్మాగములనణచెడి ఓ ఉగ్రసింహా! నీవు కాకున్నచో ఇంక మాకు నాయకులేరి?
6. ఓం మహాదేవాయ నమః.
మదన వృత్త గర్భ సీసము.
అరసి రక్షించు యాదాద్రి వాస నృహరీ! - యభయంబునిమ్మా. మహానుభావ!
దయఁ గల్గి మమ్ము మోదంబుతోడ కనుమో - భువనైకవేద్యా! ప్రపూజ్యదేవ!
యసుర సంహార! పాదాంబుజంబులకు నన్ - బ్రణమిల్లనిమ్మా సవినయముగను.
దరహాసముఖుఁడ! మోదంబుఁ గూర్చు, వరదా! - భువిపైన మాకున్. సుకవి వినోద!
గీ. పరమ భక్తుఁడు ప్రహ్లాదునరసి కాచు - కరుణవార్ధి! *మహాదేవ*! కావ రావ!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
6వ సీస గర్భస్థ మదన వృత్తము. (త భ జ జ గగ .. యతి 9)
యాదాద్రి వాస నృహరీ! యభయంబునిమ్మా.
మోదంబుతోడ కనుమో భువనైకవేద్యా!
పాదాంబుజంబులకు నన్ బ్రణమిల్లనిమ్మా.
మోదంబుగూర్చు వరదా! భువిపైన మాకున్.
భావము.
భక్తులను పోషించువాఁడా!
భవబంధములను నశింపఁజేయువాఁడా!
పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా! ఓ
యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! మమ్ములను ఎఱిగి రక్షించునటువంటి
మహానుభావుఁడవైన ఓ యాదాద్రినివాసుఁడవైన
నరసింహా! మాకు అభయమిమ్ము.
ప్రసిద్ధముగా
పూజింపఁబడెడివాడా! మాపై
దయ కలిగి మమ్ములను సంతోషముతో చూడుము. ! సృష్టిలో తెలుసుకొనఁదగినవాడా! ఓ
రాక్షసాంతకా! నీ
పాదపద్మములకు నయవినయములతో నన్ను నమస్కరింపనీయుము.
చిరునవ్వులొలుకు
ముఖమువాఁడా! మంచి కవులకు వినోదమును కూర్చువాఁడా!
వరములనొసఁగు ఓ నరసింహా! భూమిపై
మాకు సంతోషమును కలిగించుము. పరమ భక్తుఁడయిన ప్రహ్లాదుని అరసి,
కాపాడు కరుణా సముద్రుఁడవైన ఓ
మహాదేవా! నన్ను కాపాడుటకు రమ్ము.
7. ఓం స్తంభజాయ నమః.
మత్తకోకిల - ద్విపదద్వయ గర్భ సీసము.
మంచి చెడ్డలు వీడి, మాన్యుల మార్చి, వం - చనఁ జేయుచున్ వారి ఘనతఁ బాపి,
కొంచెమైనను భీతిఁ గ్రుంగక కొల్పుచుం - డిరి బాధలన్ దుష్ట పరులు భువిని.
వంచితాత్ములనెంచి వంచనఁ బాపి, కా - వుమ మాన్యులన్ నీవు విమల చరిత!
మంచి పెంచుచు, పెంచు మమ్ముల మాన్యతన్. - నరసింహుఁడా! నీదు కరుణఁ జూపి.
గీ. దుష్ట సంహారమును చేసి శిష్ట జనులఁ - సాకి రక్షించు సుజన హృత్ *స్తంభజా*త!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
7వ సీస గర్భస్థ మత్తకోకిల. (ర స జ జ భ ర .. యతి 11)
మంచి చెడ్డలు వీడి మాన్యుల మార్చి వంచనఁ జేయుచున్
కొంచెమైనను భీతిఁ గ్రుంగక కొల్పుచుండిరి బాధలన్.
వంచితాత్ములనెంచి, వంచనఁ బాపి, కావుమ మాన్యులన్,
మంచి పెంచుచు, పెంచు మమ్ముల మాన్యతన్! నరసింహుఁడా!
7వ సీస గర్భస్థ ద్విపద ద్వయము. (2పాదములు. ప్రతీ పాదమున 3ఇం.గ.1సూ.గ. యతి 3వ గణము 1వ
అక్షరము ప్రాస నియతి కలదు)
1.మంచి చెడ్డలు వీడి మాన్యుల మార్చి - కొంచెమైనను భీతిఁ గ్రుంగక కొల్పు.
2.వంచితాత్ములనెంచి, వంచన బాపి, - మంచి పెంచుచు, పెంచు మమ్ముల మాన్య!
భావము.
భక్తులను పోషించువాఁడా!
భవబంధములను నశింపఁజేయువాఁడా!
పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా! ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! భూమిపై దుర్మార్గులు మంచిచెడులను పూర్తిగ విడిచిపెట్టి,
మంచివారిని సహితము మాయమాటలతో మార్చివేయుచు,
వారి ఔన్నత్యమును నశింపఁ జేయుచు,
పాపభీతి
కొంచెమైనను లేనివారై వారిని బాధపెట్టుచుండిరి.
సుజనుల హృదయములందుండు ఓ స్తంభ జాతా! దుష్ట స్వభావులను
సంహరించి, శిష్టులను కాపాడి,
పోషించు విమలచరిత్రుఁడవైన
ఓ నరసింహుఁడా! నీకరుణఁ జూపి మోసస్వభావము
కలవారిని నీవు గ్రహించి, వారిలోగల వంచన స్వభావమును పోఁగొట్టి, మంచివారికి రక్షణ కల్పించుము.
8. ఓం ఉగ్రలోచనాయ నమః.
జ్ఞాన వృత్త గర్భ సీసము.
బలమైన నీ పాదములను బట్టితి.
నేని - క విడఁ జాలన్, హరీ!
కావుమీవు
ప్రగణిత శ్రీ పాదయుగళమే నిలిచెన్ న - ను నిలుపంగన్ గృపన్ ఘనతరముగ.
కలిగిన పాపాళి తొలగఁగాఁ గనవచ్చు - నిను నృసింహా! సదా కనుము నన్ను.
సుగణితా! దీపించును గద నీదగు దివ్య - ప్రతిభ దేవా! నన్ను వరలఁజేయ.
గీ. జ్ఞాన గర్భ సుసీసస్థ కల్పతరువ! - *ఉగ్రలోచనా*! నన్నుననుగ్రహించు.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
8వ సీస గర్భస్థ జ్ఞాన వృత్తము. (త న భ భ స గ .. యతి 10)
నీ పాదములను బట్టితి నేనిక విడఁజాలన్ - శ్రీపాద యుగళమే నిలిచెన్ నను, నిలుపంగన్.
పాపాళి తొలగఁగాఁ గనవచ్చు నిను నృసింహా! - దీపించును గద నీదగు దివ్య ప్రతిభ దేవా!
భావము.
భక్తులను పోషించువాఁడా!
భవబంధములను నశింపఁజేయువాఁడా!
పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా! ఓ
యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ శ్రీ హ్రీ! శక్తివంతమైన నీ పాదములను నేను
పట్టుకొంటిని. ఇంక
విడువను. నన్ను కాచువాడవు నీవే సుమా.
మిక్కిలి పొగఁడఁబడెడివాఁడా!
లక్ష్మీప్రదమైన నీ
పాదద్వయమే నన్ను నిలఁబెట్టుటకు నిలిచెను. నాకు సంతోషమునొసగును. ఓ నరసింహా! నన్నంటియున్న పాపమ