గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జులై 2024, బుధవారం

శ్రీరమా సహిత శ్రీహరీ! నతులు చేసెదన్ గొనుమ శ్రీకరా! .. భ్రమరశింజిని/సురనర్తకి (ర న ర న ర న ర - యతి 7, 13) రచన .. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్. 

భ్రమరశింజిని/సురనర్తకి (ర న ర న ర న ర - యతి 7, 13)

శ్రీరమా సహిత శ్రీహరీ! నతులు చేసెదన్ గొనుమ శ్రీకరా!

భారవాహివయి భక్తఁపాళిఁగను పావనాఘ్రియుత! వందనం

బో రమాహృదయ! యో శుభావహుఁడ! యో జగన్నుతుఁడ! యోధుఁడా!

నేరముల్ గనక నీవె నన్నుఁ గను, నీదు భక్తుఁడను, నిత్యుఁడా!🙏🏼

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.