జైశ్రీరామ్.
శ్లో. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
తే.గీ. మునిమనుమఁడు వశిష్ఠుఁడన్ మునికి యతఁడు,
శక్తికిన్ మనుమఁడు పరాశరుని సుతుఁడు,
శుకమహర్షికి తండ్రి వ్యాసుం డకల్మ
షుఁడు, తపోనిధి, యతనికి నిడుదు నతులు.
భావము. వశిష్ఠ మహర్షికి ముని మనుమడు, శక్తికి మనుమడు,
పరాశరునకు పుత్రుడు, శుక మహర్షికి తండ్రియైన తపోనిధుడు,
కల్మష రహితుడైన వ్యాసునకు నమస్కారం.
శ్రీమన్మంగళ సద్గురుం బుధనుతం శ్రీరాఘవాచార్య సత్
ప్రేమాంభోధి మనంత పుణ్య ఫలదం, విజ్ఞానభాస్వన్మణిం,
రామానందసుధాపయోధి మమరం, రమ్యస్వభావోజ్వలం,
క్షేమానందకరం, సదా శుభకరం, కీర్తిప్రదం భావయే.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.