జైశ్రీరామ్.
శ్లో. ధనం తావదసులభం లుబ్ధం కృచ్ఛ్రేణ రక్ష్యతే।
లబ్ధానాశో తథా మృత్యుః తస్మాదేతన్న చిన్తయేత్॥
తే.గీ. ధన సమార్జన కష్టము దాని రక్ష
ణంబు మిక్కిలి కష్టమో యంబుజాక్ష!
యదియు నిలుచునో, పోవునో, యంతలోనె
చత్తుమేమో? ధనార్జనాసక్తి తగదు.
భావము. ధనసంపాదన చాలా కష్టము. సంపాదించిన దానిని రక్షించుట
మరీ కష్టము. లభించిన ధనము పోనూవచ్చు, లేదా తానే మృతినొందవచ్చు.
కావునా ధనముగూర్చి అంతగా వ్యసనపడుట మంచిది కాదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.