జైశ్రీరామ్.
శ్లో. యదధ్రువస్య దేహస్య - సానుబంధస్య దుర్మతిః |
ధ్రువాణి మన్యతే మోహాద్గృ - హక్షేత్రవసూని చ || (భాగవతం)
తే.గీ. నిత్యదూరమౌ దేహ సన్నిహితమైన
ధరను గృహము, పొలము, స్వర్ణ ధనములయెడ,
భ్రాంతి వీడక మూర్ఖుఁడు బ్రతుకుచుండు,
మోసపోవుచుండెనుండె తా నాస మునిగి.
భావము. వివేకంలేని మనిషి అనిత్యమైన మరియు అనేక బంధాలతో కలిగిన
ఈ శరీరానికి సంబంధించిన ఇల్లు, భూమి, ధనం మొదలైన వాటిని మోహంతో
శాశ్వతమైనవి అని తలుస్తాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.