జైశ్రీరామ్.
శ్లో. ప్రభుర్వివేకీ ధనవాంశ్చ దాతా - విద్వాన్ విరాగీ ప్రమదా సుశీలా।
తురఙ్గమః శస్త్రనిపాతధీరః" - భూమణ్డలస్యాభరణాని పఞ్చ॥
తే.గీ. తెలివి కల రాజు నీవిని కలుగు ధనుఁడు,
నుత విరాగియౌ చదువరి, క్షితి సుశీల
వనిత, యుద్ధముననిలుచు ఘనతరాశ్వ
మనెడి యైదును ధాత్రికి కనగ నగలు.
భావము. తెలివైన రాజు, దానగుణంకల ధనవంతుడు, పేరుప్రతిష్టలయందు
కోరిక లేనట్టి విద్వాంసుడు, సత్ప్రవర్తనగల స్త్రీ, శత్రుసమూహమునందు ధైర్యంగా
నిలిచే గుఱ్ఱం - ఈ అయిదుగురు భూమికి ఆభరణములు."
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.