గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జులై 2024, ఆదివారం

భాషాసు ముఖ్యా మధురా .. మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో. భాషాసు ముఖ్యా మధురా - దివ్యా గీర్వాణ భారతీ |

తస్యాం హి కావ్యం మధురం - తస్మాదపి సుభాషితం ||  

తే.గీ.  భాషలందున ముఖ్యమై వరలు మధుర

భాష గీర్వణ భాషయే, వాస్తవమిది,

అందుకావ్యముల్ మధురమ్ము లరసి చూడ,

వరసుభాషితములు గొప్ప వాటికన్న.

భావము. భాషలన్నిటిలోనూ ముఖ్యమైనది, తీయనిది, దివ్యమైనది 

(విశేషమైనది) గీర్వాణ భారతి అనగా సంస్కృత భాష. అందులోకూడా 

కావ్యం మధురమైనది. దాని కంటెనూ కూడా సుభాషితం మధురమైనది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.