శ్లో. యావత్తోయధరా ధరా ధర ధరాధారాధర శ్రీధరా
యావచ్చారుచచారుచారుచమరం చామీకరం చామరమ్ |
యావద్రావణరామ రామరమణం రామాయణం శ్రూయతే
తావద్భో భువి భోగభోగ భువనం భోగాయ భూయాద్విభో |
పదవిభాగము.
యావత్, తోయధరాః, ధరా, ధర, ధరా + ఆధార, అధర, శ్రీధరా, యావత్, చారు,
చచా, రు, చారు, చమరం, చామీకరం, చ, అమరం, యావత్, రావణరామ, రామ,
రమణం, రామాయణం, శ్రూయతే, తావత్, భో, భువి, భోగభోగ, భువనం, భోగాయ,
భూయాత్, విభో.
అన్వయము.
తోయధరాః, ధరా, ధర, ధరా + ఆధార, అధర, శ్రీధరాః, యావత్, చ, చారు,
చచా, రు, చారు, చమరం, అమరం, చామీకరం, యావత్, రావణరామ, రామ,
రమణం, రామాయణం, భువి, యావత్, శ్రూయతే, తావత్, భోగభోగ, భో విభో,
భువనం, భోగాయ, భూయాత్.
ప్రతిపదార్థము.
తోయధరాః = సముద్రాలు
ధరా = భూమి
ధర = పర్వతాలు
ధరా + ఆధార = భూమికి ఆధారమైన
అధర = అధోలోకంలో ఉండే
శ్రీధరాః = విషధరుడైన ఆదిశేష సర్పం (లేదా లక్ష్మిని ధరించిన కూర్మం)
యావత్ = ఎప్పటివరకు (ఉంటాయో)
చ = మరియు
చారు = మనోజ్ఞమైన
చచా = ‘చచ’ అనే
రు = ధ్వనిని చేసే
చారు = అందమైన
చమరం = చమరమృగాలు కల
అమరం = దేవతలకు సంబంధించిన
చామీకరం = స్వర్ణనిలయమైన మేరుపర్వతం
యావత్ = ఎప్పటివరకు (ఉంటుందో)
రావణరామ = రామ రావణు లనే
రామ = జగత్తు నాకర్షించే
రమణం = నాయక, ప్రతినాయకులు కల
రామాయణం = రామాయణం
భువి = భూమిపైన
యావత్ = ఎప్పటివరకు
శ్రూయతే = వినిపిస్తుందో
తావత్ = అప్పటివరకు
భోగభోగ = భోగాలకు భోగభూతుడవైన
భో విభో = ఓ రాజా!
భువనం = భూమండలం
(తే) భోగాయ = నీ అనుభవం కోసం
భూయాత్ = అగును గాక!
తాత్పర్యము.
ఓ రాజా! సముద్రాలు, భూమి, పర్వతాలు, భూమికి ఆధారమైన అధోలోకంలో ఉండే
విషధరుడైన ఆదిశేష సర్పం (లేదా లక్ష్మిని ధరించిన కూర్మం) ఎప్పటివరకు
(ఉంటాయో), చ = మరియు, మనోజ్ఞమైన, ‘చచ’ అనే ధ్వనిని చేసే అందమైన
చమరమృగాలు కల, దేవతలకు సంబంధించిన, స్వర్ణనిలయమైన మేరుపర్వతం
ఎప్పటివరకు (ఉంటుందో) రామ రావణు లనే జగత్తు నాకర్షించే నాయక,
ప్రతినాయకులు కలరామాయణం భూమిపైన ఎప్పటివరకు వినిపిస్తుందో
అప్పటివరకు భోగాలకు భోగభూతుడవైన భూమండలం, నీ అనుభవం కోసం
అగును గాక!
జై హింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.