జైశ్రీరామ్
శ్లో. సత్యం మాతా పితా జ్ఞానం - ధర్మోభ్రాతా దయా సఖాI
శాంతి: పత్నీ క్షమా పుత్రా: - షడైతే మమ బాంధవా:II
తే.గీ. సత్యమే తల్లి యగు నాకు, శాంతి భార్య,
ధర్మమే భ్రాత, జ్ఞానంబు తండ్రి యగును,
క్షమయె సుతుఁడగును, దయయె కనగ హితుఁడు,
పరగు నీయారుగురె నాదు బంధుకోటి.
భావము: సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయయే స్నేహితుడు,
శాంతియే భార్య, ఓర్పే పుత్రుడు.. ఈ ఆరు మానవునకు నిజమైన బంధువులు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.