జైశ్రీరామ్.
శ్లో. సర్వపాపాని వేం ప్రాహుః - కటస్తద్దాహ ఉచ్యతే |
తస్మాద్ వేంకటశైలోఽయం - లోకే ఖ్యాతిం గమిష్యతి ||
(పారమాత్మికోపనిషత్ వ్యాఖ్యా)
తే.గీ. పాపజాలంబు వేం మని పరఁగు, కట య
నంగ నశియింప జేయుట, నరుల యఘము
పాపునది కాన వేంకట పర్వతమది
వేంకటాచలమని యొప్పె, విశ్వమునను.
భావము. సకల పాపాలు కలిసి "వేం" అవుతుంది. వాటిని కాల్చివేయడమే
"కట". అలా పాపాలను కాల్చివేసే పర్వతమే వేంకటాచలం. ఇది అన్ని పాపాలను
దహనం చేస్తుంది అనియే దానికి ప్రాశస్త్యం ఉంది. అలాగనే
ఈ పేరు లోకంలో ప్రసిద్ధి చెందింది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.