గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జులై 2024, గురువారం

త్రివర్గఫలదాః సర్వే .. మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  త్రివర్గఫలదాః సర్వే  -  దానయజ్ఞజపాదయః |

ఏకం సంగీతవిజ్ఞానం - చతుర్వర్గఫలప్రదమ్ ||  (శివసర్వస్వం)

తే.గీ.  దాన యజ్ఞ జపాదులు ధరణిపైన 

పరగు ధర్మార్థకామసత్ఫలము లొసగు,

పూజ్య సంగీత మొసగును మోక్షఫలము,

భక్తిసంగీత సాధకుల్ ముక్తిగాంత్రు.      

భావము.

దానము చేయుట, యజ్ఞయాగాదులను ఆచరించుట, దివ్యమంత్రాల 

పునశ్చరణ  అనునవి త్రివర్గ ధర్మము అర్థము కామము అను ఫలములను 

మాత్రమే ఇచ్చును. సంగీతము యొక్క సమ్యక్‌జ్ఞానమొక్కటే నాలుగవదైన  

మోక్షాన్ని ఇవ్వగలదు.

జైహింద్.

Rephrase with Ginger (Ctrl+Alt+E)
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.