గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జులై 2024, సోమవారం

దత్త పది .. అంశం:- ఇడ్లీ, పూరీ, ఉప్మా, కాఫీ, .. ఈ పదాలాతో, ముంబయి మారణ కాండని, గజేంద్ర మోక్షానికి అన్వయిస్తూ, మత్తేభంలో పద్యం చెప్పాలి .. ధవళ సోమశేఖర్. .. సోమవారం 26 జూలై 2010

జైశ్రీరామ్. 

నా పూరణ

ll

కసభుక్కీల దురంత నక్ర మిచటన్ "కాల్చుండిదిడ్లీ యనన్"

ముసుగుల్ దాలిచి పట్టె మమ్ము గనుడీపూరీ జగన్నాయకా!

ఉసురుల్ తీయగ నుండె కావు డిలలో ఉప్మా దేవా మమున్!

విషమంబియ్యదిఇట్టి చిన్న పనికా ఫిర్యాదటం చెంచకన్!

(ఇక్కడ నా మనోగతమును మీకు కొంచెం వివరిస్తున్నాను.  కాల్చుండు + ఇది +  + ఢిల్లీ + అనన్ > కల్చుండిది +ఇడ్డిల్లీ + అనన్ >  కాల్చుండిదిడ్లీ యనన్ = ఇదే ఢిల్లీకాల్చేయండి అని సందేశమివ్వగానే)

భావము:-

టెఱ్ఱరిష్టులు వేసే గడ్డి తినే కసబ్ అనెడి పేరు గల అగ్ని జ్వాల యనెడి మొసలి ఇక్కడ " ఇది  ధిల్లీయేకాల్చుఁడు " అని పలుకగానే చెలరేగిన పొగ యనెడి ముసుగులు ధరించి మమ్ము పట్టుకొనెను పూరీ జగన్నాయకా ఉప్మాక వెంకటేశ్వరాఇది చూడండిమాప్రాణములు తీయుటకు సిద్ధముగా నుండెనుఇది మాకు మిక్కిలి విషమ మయిన సమయము. " ఇటువంటి చిన్న పనికేనా ఇలా  మానవకుంజరములు పిర్యాదు చేయుచున్నవి " అని మాత్రము భావించక భూలోకములో మమ్ములను కాపాడండి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.