॥ శ్రీలక్ష్మీసహస్రనామావలిః ॥
శ్రీ
లక్ష్మీ సహస్ర
నామాంచిత పద్యసహస్ర
దళపద్మము.
రచన.
చింతా
రామకృష్ణారావు.
ఓం
శ్రీమహాలక్ష్మీం ఉపాస్మహే
సీ. ఆషాఢ బహుళపాడ్యమి నాడు యాదాద్రి
- నృహరిపాదార్చకుల్ మహిత నృహరి
దూరశ్రవణమునన్ కోరిమాటాడిరి. నన్ బ్రశం సించుచు నరహరి శత
కము ఘనంబనినారు, రమణీయ శ్రీ రమా నామసహస్రంబు స్వామి మెచ్చ
పద్యపుష్పములందు భాసిల్లగా నిల్పి
పదిదినంబులలోన వ్రాయమనిరి.
తే.గీ.
విదియ
మొదలు నేకాదశి వెడలులోపు
- వ్రాయ జేసెను శ్రీలక్ష్మి వాసి చూపి,
దినమునకు నూరు పద్యముల్ వినయముగను
- వ్రాసినాడను దైవంబు వ్రాయఁజేయ.
సద్విధేయుఁడు
- చింతా రామకృష్ణరావు.
స్వస్తిశ్రీ చాంద్రమాన శుభకృన్నామ సంవత్సర ఆషాఢ బహుళ ఏకాదశీ
భానువారం. ఆంగ్ల తేదీ. 24 - 7 - 2022
పండితాభిప్రాయములు.
అనపాయినీ వరివస్య
వాగ్విదాంవర బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ
శ్రీమన్నారాయణుడుధర్మస్థాపనప్రయోజనమునాశించి అనేక అవతారములను దాల్చి ఆనుషంగికముగా భక్తరక్షణ లీలను కూడా ప్రకటించెను.కానీ కేవలము భక్తరక్షణయే లక్ష్యముగా స్వామి స్వీకరించిన రూపు నారసింహావతారము. ఇతర అవతారముల వలె కాక నారసింహావతారము ఉపసంహారములేని నిత్యావతారము. అంటే సదా భక్తరక్షణ తత్పరుడన్న మాట. ఆ స్వామి ప్రేరణతో శ్రీ చింతా రామకృష్ణారావుగారు నారసింహ అష్టోత్తర శతనామాలకు ఆయా నామాలను పద్యపాదములలో నిలుపుచు,
నిలువెత్తు భక్తితో పదికాలాలు నిలిచేశతకాన్నివెలయించి స్వామికి సమర్పించిన ధన్యులు.
స్వామి ఉదరములో ప్రపంచాలన్నీ ఉన్నాయని గుర్తు చేయటానికేమో ప్రతి పద్యములో మరొక పద్యాన్ని దాచి ఉంచిన గర్భకవిత్వము ఈ శతకములోని మరొక విశేషము.
అది నేపధ్యం.
ప్రకృతములో యాదాద్రి నారసింహక్షేత్రములో స్వామి ప్రధానార్చకులు శ్రీమాన్ నరసింహాచార్యులుగారి రూపములో స్వామి మరొక ఆదేశం పంపారుట, లక్ష్మీ సహస్రనామాలను కూడా పద్యస్థం చేయమని, అది కూడా
10 రోజుల్లో పూర్తి చేయమని.
అంటే రోజుకొక శతకము.
భాగవతుల ఆజ్ఞ భగవదాజ్ఞగా స్వీకరించి అమ్మపైన అచంచల విశ్వాసముతో చింతావారు నడుము బిగించి అనుకున్న పదిరోజులలో పద్యపుష్పసహస్రము సిద్ధము చేసారు.
తాను వ్రాస్తున్నాను అనుకోలేదు అమ్మ వ్రాయించింది అన్నది భావన.
అందుకే ముందు సహస్రనామములలో శ్లోకము, తరువాత ఆ శ్లోకాంతర్గత నామములకు అమ్మ నామముతో చతుర్ధ్యంతముగా నమస్కరించి,
సంక్షిప్తముగా నామవిశేషము
చెప్పి అమ్మదయతో పద్యము వ్రాసారు. ఇది కొత్త ప్రక్రియ. శ్లోకమును నామములుగా విభజించునప్పుడు కొంత కాఠిన్యము కలుగుతుంది. కనుక వివిధ విభజనలను సమన్వయపరుచుకొని సర్వజనామోదముగా స్థిరీకరించుకొనుట మరొక ఇబ్బంది.
ఛందోవిషయకముగా ఒక మాట చెప్పుకోవాలి.
ప్రసిద్ధమైన పద్యలక్షణాలు కొన్ని మాత్రమే సాధారణ వినియోగములో ఉన్నాయి. అయితే పద్యపాదాక్షరాలను అనుగుణముగా 1 నుండి 26 ఛందస్సులుగాను,
అలా ఒకొక్క ఛందస్సులో ప్రస్తారము వేయగా సుమారు 13 కోట్ల వృత్తాలు అవుతాయని లాక్షణికులు చెప్తారు. ఇక్కడ అమ్మ నామము యథాతథముగా పద్యములో ఉండాలన్న నియమము పెట్టుకున్నారు.
అందుకు అనువైన కందము,
తేటగీతి ఇత్యాది జాత్యుపజాత్యులను వినియోగించినారు. ఉత్పల, మత్తేభ,
శార్దూల, పంచచామరాదులు కూడా విస్తృతముగా వినియోగించారు.అయితే కొన్ని నామాలు ప్రసిద్ధపద్యలక్షణాలలో ఇమడవు కనుక అలాంటి విశేషలక్షణాలు నిర్మించుకుని నామము వచ్చేలాగా పద్యనిర్మాణం చేసారు.
అలాంటి నూతనముగా నిర్మించుకున్న పద్య లక్షణాలను ఉదాహరణగా 128వ పద్యములో చూడవచ్చు. ఇది అంత సులువు కాదు. పద్యము నడక, లయ గమనికలో ఉంచుకుని చేయాల్సిన జిలుగుపని. ఇది అమ్మ అనుగ్రహముతో జరిగినది అన్న భావనతో ఇలాంటి క్రొత్త వృత్తాలకు ఆ నామమునే లేక ఆయా నామములలోని ఒక భాగమునో వృత్తనామముగా వ్రాసి
‘స్వయంకల్పిత మృణాలి వృత్తము’
అని స్పష్టపరిచినారు. ఇలాంటి చాలా కొద్ది సంఖ్యలోనే ఉన్నాయి. పైన చెప్పినట్లు శ్లోకమునకు భిన్నమైన నామవిభజనలు కనబడ్డాయి అన్నాను కదా. వీరు అలాంటి భిన్నమైన విభజనలకు అన్ని రకాల పద్యాలు
(క్రమసంఖ్య లేకుండా) వ్రాసినారు.
అంటే ఎవరైనా తమకు నచ్చిన పద్యము చదువుకోవచ్చునన్నమాట. ఉదాహరణకి
77వ పద్యమునకు సంబంధించిన శ్లోకం గమనించవచ్చు.
ఇక్కడ ‘కాలిమా’ అన్న శ్లోకపదాలు కాలి, మా అని రెండుగా కొందరైతే కాలిమా అని ఏకపదముగా కొందరు విభజించారు. చింతావారు కాలి,
మా, కాలిమా అని మూడు నామాలకు మూడు పద్యాలు వ్రాసారన్నమాట. అలా అనేకమైన ఇబ్బందులను అమ్మదయతో అద్భుతముగా నిర్వహించబడినది.
శ్రీకారాదిగా పద్యసహస్రాన్ని క్షేమకరముగా ప్రారంభించారు. వేయి నామాలు వేయి పద్యాలు.
ముందుమాట వ్రాయుటలో నిడివికున్న సంక్షిప్తతను దృష్టిలో ఉంచుకుని కొన్ని విశేషాలు, ఈ గ్రంథము చదువునప్పుడు గమనించవలసిన అంశాలు మాత్రమే ప్రస్తావిస్తాను.
అమ్మ స్తుతి పద్యములో కవికి తన స్వకీయమైన భావమును పద్యము వ్రాసి ఈ నామమును సంబోధనగా చేయుట సులువైన పని. సాధారణముగా శతకకర్తలు ఆశ్రయించే విధానము కూడా.
అదిదోషము ఎంతమాత్రము కాదు కూడా. కానీ చింతావారు ఈ తేలికమార్గమును స్వీకరించలేదు.
పైన చెప్పినట్లు నామమునకు సంక్షిప్తమైన అర్థము చెప్పారు. పద్యములో అర్థము విస్తృతమైనదిగా ఆ నామవ్యాఖ్యగా ప్రకటించారు.
అంటే పద్యలక్షణాన్ని ఎన్నుకోవటంలో ఈ వ్యాఖ్యాపదాలకు కూడా అనుగుణమైనవిగా గమనించుకోవాలి.
కవి పరిశ్రమ ఎంతదో ఊహించవచ్చు.
ఇన్ని జాగ్రత్తలతో వేయి పద్యాలు పది రోజులలో పూర్తిచేయడం అనితరసాధ్యము.
అందుకు చింతావారికి ఎన్నిసార్లు నమస్కరించినా తక్కువే.
ఇలాంటి ఈ గ్రంథనిర్మాణమునకు కర్త,
కారయితా, ప్రేరకుడు, అనుమోదకుడు కూడా ఆ నారసింహుడే,
కేవలం వివిధరూపాలలో కనబడ్డాడు అంతే. చింతావారు ఈ పద్యరచనా తపస్సులో కృతకృత్యులయ్యారనుటకు ఎట్టి సందియము లేదు. తప్పక ఆద్యంతము చదువదగినది,
పదే పదే చదువదగినది.
అమ్మ పాఠకులకు అజ్ఞాతదోషనివృత్తిపూర్వకముగా సకల శుభములు తప్పక కలుగచేస్తుంది అన్నది నా ప్రగాఢ విశ్వాసము. ఇలాంటి మహద్గ్రంథాన్ని తొలి పాఠకుల జాబితాలో నేను కూడా ఉండటం నా అదృష్టము. అందుకు మా చింతారామకృష్ణారావు అన్నగారికి నమస్కరిస్తు, వారు మరింత సాహిత్యసేద్యము చేయుటకు ఆయురారోగ్యభాగ్యాలను అమ్మ అనపాయినీదేవి కలిగించాలని ప్రార్థిస్తూ..
స్వస్తి
హైదరాబాదు గురుపాదధూళి
తేది; 16.10.2022 నారుమంచి వేంకట అనంతకృష్ణ
డా. రాణి సదాశివ మూర్తిః…ఉపకులపతిః…రాష్ట్రియ సంస్కృత విశ్వవిద్యాలయః,…తిరుపతిః
నవరత్నమాలికా.
శ్రీలక్ష్మీ సహస్రనామాంచితపద్యసహస్రదళపద్మార్చనం
శ్రీ మహాగణాధిపతయే నమః …శ్రీ మాత్రే నమః…శ్రీ గురుభ్యోనమః
శ్లో. వికసితే
సహస్రారే - మోక్షద్వారస్య ఫుల్లతా।
కిం
వక్తవ్యం సహస్రాబ్జే
- ఫుల్లే యది సహస్రధా।।1।।
శ్లో. రామస్త్రేతాపతిర్భూత్వా - ధర్మమార్గమదర్శయత్।
కృష్ణో
ద్వాపర సంజాతో
- ముక్తిమార్గమదర్శయత్।।2।।
శ్లో. కలౌ
కాలుష్యకాంతారే - చింతాపనోదదీక్షితః।
రామకృష్ణ
కవీంద్రోऽయం
- భక్త్యుపాయం ప్రయచ్ఛతి।।3।।
శ్లో. చంద్రే
విలసితే పూర్ణే
- జ్యోత్స్నాశ్రీః ప్రసరేద్భువి।।
ఫుల్లే
కవిమనస్యద్య - కవితాశ్రీర్విభాసతే।।4।।
శ్లో. శ్రియః
స్తోత్రం చిత్రమార్గే - పద్యాధ్వన్యవతారయన్।
తారయత్యాశు
సల్లోకం
- శ్రీవాగేకసమర్చయా।।5।।
శ్లో. శ్రియః
పాదార్చనాసక్తః - ఆంధ్రపద్యవిభూషణః।
శ్రీ
చింతా రామ కృష్ణార్యః
- శ్రీచింతన తపఃప్రియః।।6।।
శ్లో. దశశతవర్త్మారూఢామ్ - ఏకవర్త్మని రూపయన్।
శ్రియం
శ్రీశే సుభక్తిమాన్ - కృతకృత్యః కృతీ కవిః।।7।।
శ్లో. స్వయం
దివ్యత్వ పాత్రం సత్
- సతామపి శుభప్రదః।
కవీంద్రో
రాజతే భూయో
- భూయస్తత్త్వార్థదర్శకః।।8।।
శ్లో. వర్ధతాం
భక్త్యధ్వైషో - వర్ధతాం కవిరాట్సుధీః।
వర్ధతాం
భక్తభూర్భూమిః - వర్ధతాం శ్రీః కవిగృహే।।9।।
ఇత్థం సనతితతిశతమ్ బుధజనవిధేయః రాణి
సదాశివ మూర్తిః
బ్రహ్మశ్రీ రాణి సదాశివ మూర్తి మహోదయులకు
నా కృతజ్ఞతాంజలి.
ఉ.
మాటలు చాలకుండెనయ మాన్యమహోదయ! మీ కృపన్ గనన్, -
కోటికి
యొక్కరుండుదురు కూర్మిని మీవలె చూపువారిలన్,
దీటుగ
వ్రాయనేర్వనయ దివ్యపు మీ కవితామృతమ్ముతో, - సాటియె
లేరు మీకు, మనసార నమస్కృతులందుడిమ్ముగన్.
నా మనసులో మాట.
ఓం
శ్రీమాత్రే నమః.
శ్రీ మహాలక్ష్మి మహిమలు చెప్పఁ జాల.
శ్రీమన్మంగళదివ్యతేజ శ్రీమల్లక్ష్మీ జగన్మాత అనుగ్రహ విశేషమున యాదాద్రి
శ్రీమల్లక్ష్మీనారసింహులనిరంతర సంసేవనా పునీత జన్ములయిన ప్రథానార్చకులగు శ్రీ
నారసింహాచార్యులవారు శ్రీ శుభకృత్ ఆషాఢబహుళ పాడ్యమినాడు నాతో దూరవాణిద్వారా
మాటాడుచు, శ్రీ
యాదాద్రి నారసింహ శతక పద్యములు మీరు వ్రాసిస్వామికి అర్పించుకొనినారు. చాలా బాగున్నవి.
మరి లక్ష్మీ అమ్మవారి సహస్రనామములకు పద్యములు వ్రాయండి. అమ్మవారికి ఆనందం కలిగించండి వారంపది రోజులలో పూర్తి చెయ్యండి అని ఆదేశించిరి. ఇది సాక్షాత్ అమ్మవారి ఆదేశంగా భావించి ఆశ్చర్య చకితుఁడనయ్యాను. పదిరోజులలో వేయి నామములకు పద్యములు వ్రాయుట నావంటి
సామాన్యునకు సాధ్యమెట్లగును? అని భావించి,
అంతా అమ్మే వ్రాసుకోనుందేమో అని, నా
ప్రత్నములో భాగంగా పాడ్యమినాడి సహస్రనామములు పొందుపరచుకొని ఉంచుకొనినాను.
మరునాడు విదియ రోజున నామములను
పద్యములలో నిక్షేపించుచు వ్రాయుట ప్రారంభించితిని.
అమ్మవారే స్వయముగా నాచే రోజునకు వంద
నామములకు పద్యములు వ్రాయించుకొని ఆషాఢబహుళ ఏకాదశి నాటికి పరిపూర్ణముగా రచన
చేయించుట, నేను
ఆచార్యస్వాములవారికి ఈ వైనము విన్నవించి ఆ పద్య సహస్రమును వారికి పంపుట చేసితిని. వారు నామములకు వివరణకూడా వ్రాసినచో ప్రయోజనకరముగా ఉండునని సూచించి మరికొంత
సమయము తీసుకొమ్మనిరి. నేను నామ వివరణవ్రాయుటతో పాటు ముద్రారాక్షసములను కూడా సరిచేసి వారికి ఈ ప్రతి
పంపుట జరిగినది.
శ్రీ యాదాద్రి
లక్ష్మీనరసింహస్వామి దయాంతరంగాన్ని కనీసము ఊహించుటకైననూ నేను సరిపోను. వారిపై అష్టోత్తర శత నామాంచితముగా అనేక ఛందస్సులు
గర్భమునందుండు సీసములను వ్రాయించుకొని,
ఇప్పుడు వారి హృదయేశ్వరి కడగంటి కాంతికిరణము నాపై ప్రసరింపఁజేయనెంచి
ఈ తలంపు కలిగించి ఈ మహత్కార్యమును నాపేర పూర్తి చేయించిరి.
ఏ నాటి నా పెద్దల, గురుదేవుల
పుణ్యఫలమో ఈనాటి ఈ మహద్భాగ్యమును నేననుభవించుట సంభవించినది.
నేను వ్రాసిన ప్రతిని సరిచూచు
పనిని శ్రీ మాచవోలు శ్రీధరరావు గారు, శ్రీ కటకం వేంకటరామ శర్మగారు, శ్రీఅన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డిగారు శ్రమతో పూర్తి చేసిరి. శ్రీ యల్లాపంతుల సూర్యనారాయణ గారు యాదాద్రిలో ఒక ఉద్యోగి. వీరితో పరిచయము నా భాగ్యమని చెప్పవలెను. వీరి
మూలముననే ప్రథానార్చకుల పరిచయ భాగ్యము నాకు కలిగినది.
వారి ఆకంక్ష మేరకే ఈ గ్రంథ రచనకు బీజము పడుట, పదిరోజులలో సుసంపన్నమగుట తటస్థపడినది.
శ్రీ ప్రథానార్చకుశ్రీ
లక్ష్మీనరసింహాచార్యులవారికి, శ్రీ యల్లాపంతుల సూర్యనారాయణ గారికి, శ్రీ మాచవోలు
శ్రీధరరావుగారికి,
శ్రీ కటకం వేంకటరామ శర్మగారికి, శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి నా ధన్యవాదములు. నాకు కలిగిన సందేహములలో తన ఆలోచనలను
జోడించి సందేహనివృత్తి చేయుచు ముందుకు నడిపిన నా అర్థాంగి చి.ల.సౌ.విజలక్ష్మి గారికి నా ఆశీస్సులు.
రచనలో నా కెదురయిన సమస్యలు.
అమ్మవారి వేయి నామములూ నూట ఏభైనాలుగు శ్లోకములలో ఉన్నవి. ఈ నామములను
కొందరు కొన్నివిధములుగను, మరికొందరు మరికొన్ని విధములుగను విడదీసి యుండిరి. కొందరు
వేయి నామములుగా చూపిరి,
మరికొందరు వేయీ ఎనిమిది నామములుగా చూపిరి, మరికొందరయితే వేయీముప్పదినామములకు పైగా చూపిరి.
నేనుముందు అన్ని నామములకూ అందరి
మతములననుసరించి పద్యములు వ్రాసితిని. ఆతరువాత ఔచిత్యముగా ఉన్నవిధమును భావించి వేయీ యెనిమిది నామములను గుర్తించి
సంఖ్యలు నామములకు నిర్దేశించి పద్యములు వ్రాసియుంటిని.
మిగిలినమతములప్రకారము కూడా పద్యములు వ్రాసి చూపి యుంటిని. ఎవరికి కావలసిన విధముగా వారు అమ్మవారు తోపించినవిధముగా చేయుట జరిగినది.
కొన్ని నామములు అనేకపర్యాయములు శ్లోకములలో
ఉన్నప్పటికీ కేవలము ఒక నామమునకే సంఖ్యనొసగి మిగిలినవాటికి పద్యములు మాత్రము వ్రాసి
ఉంచితిని.
అన్ని నామములూ సుపరిచిత ఛందస్సులలో నప్పకపోవుచుండుటతో అమ్మవారి
ప్రేరణననుసరించి అటువంటి నామములకు ఛందస్సులు స్వయముగా కల్పించి పద్యరచనలొ ఆ నామములను
ఉంచి వ్రాయుట జరిగినది.
సహృదయులు దైవప్రేరణతో జేసిన ఈ
రచనలో నాదైన జ్ఞాన లేశమైననూ లేదనే విషయమును గుర్తించి గుణములన్నియూ అమ్మవారి
ప్రేరణ కారణముగా వ్రాయబడినవని గ్రహింతురుగాక.
దోషములున్న అవి నా అజ్ఞానముగా భావించి పెద్దమనసుతో భక్తిని మాత్రమే
స్వీకరింతురుగాక.
ఈ నా కృతిని భక్తితో పఠించి తమ
అమూల్యమయిన అభిప్రాయములను అందఁజేసిన వాగ్విదాంవర బిరుదాంకితులు బ్రహ్మశ్రీ నారుమంచి
వేంకట అనంత కృష్ణ సహోదరులకు నా ఆనందమును తెలియఁజేయుచున్నాను.
నాపై అవ్యాజానురాగమును
చూపెడి ఆచార్య రాణీ సదాశివమూర్తి మహోదయులు నాయొక్క ఈ గ్రంథమును ఆమూలాగ్రమూ
చదివి తమ అమూక్యమయిన అభిప్రాయమును చక్కని
మనోహరమయిన శ్లోక నవరత్నమాలిక రూపమున అందించియున్నారు.
వీరు చూపిన అభిమానమునకు నా హృదయపూర్వక
ధన్యవాదములు తెలియఁజేసుకొనుచున్నాను.
ఈ గ్రంథ ముద్రణను యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ దేవస్థాన ప్రథానాచార్యస్వాములవారి
ద్వారానే జరుగనున్నందున ముద్రించబోవు పుణ్యాత్ములకు,
వారికి ప్రేరణ కలిగించిన ఆచార్య మహోదయులకూ నా ధన్యవాదములు
తెలియఁజేసుకొనుచున్నాను.
ఓం వాసుదేవాయ నమః..
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః.
సద్విధేయుఁడు
చింతా రామకృష్ణా రావు.
ప్రార్థన.
శా. శ్రీమన్మంగళ
భావనాచయముతో
శ్రీలక్ష్మిసన్నామముల్
ప్రేమన్
వేయి తెలుంగు పద్యముల దీప్తిన్ వ్రాయ శాసించె నా
శ్రీమద్రమ్య
రమాలలామ నను నో శ్రీ
విఘ్నరాజా కృపన్
నీమంబొప్పఁగ
వ్రాయఁ జేయుము లసన్నిర్విఘ్నధారాగతిన్.
శా. శ్రీవాణీ!
రచియింతు
పద్యములు
లక్ష్మీనామ
సాహస్రమున్
భావోద్భాససుధాస్రవంతిగఁ, గృపన్
వ్రాయించు
నాచేత, నా
కీవే
దిక్కు, రమాభిరామముగనాకిమ్మా! పదాళిన్ గృతిన్
జీవంబైవెలుగొందఁ జేయ,
జననీ! శ్రీ బాసరాంబా! నతుల్.
శా. శ్రీలక్ష్మీ! ననుఁ గన్న తల్లి! కృప నాశీర్వాదమందించి, స
ల్లీలన్
నామ సహస్రమున్ శుభగతిన్ క్లేశంబులన్ బాపుచున్
నాలోనుండి
రచింపుమా! కొలుతు నిన్, నవ్యార్థ సద్భావనల్
నీలోనుండి
జనించునమ్మ, జననీ! నీభక్తులే పొంగగన్.
మ. గురువౌ వేంకట
వీర రాఘవుని
నే
కూర్మిన్, సభక్తుండనై
చరణంబుల్
శరణంబు వేడెదను, భాషాయోష యుప్పొంగగా
స్థిరమౌ
నామ సహస్రమున్ నిలుపుచున్ దీపించు పద్యంబులన్,
కరిసంరక్షకునాలి మెచ్చునటులన్
కల్పించి
వ్రాయించగన్.
శా. నీమంబొప్పఁగ
వ్రాయఁజేయుచు
ననున్ నీవానిగాఁ జూడు మో
శ్రీ
మన్మంగళ నారసింహ! జయముల్ క్షేమంబుఁ జేకూర్చుమా
శ్రీమంతంపు
సహస్ర పద్య పఠనన్ శ్రీమద్రమన్ గొల్చు స
ద్ధీమాన్యాళికి శ్రీరమా
కృపను సత్తేజంబుఁ గల్పించుమా.
అంకితము.
శ్రీ,
మన్మంగళ దివ్య భాసుర శుభశ్రీపూర్ణ శ్రీదేవికిన్,
శ్రీమంతుండగు
విష్ణుమూర్తి
సతికిన్, జీవాళినే బ్రోవగా
ప్రేమన్
దివ్య ధనంబులిచ్చెడి జగద్విఖ్యాత శ్రీలక్ష్మికిన్,
శ్రీమంతంబుగనంకితంబిడితి భాసింపంగ నీ గ్రంథమున్.
శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.
శ్లో.
నిత్యాగతానంతనిత్యా నందినీ జనరంజనీ ।
నిత్యప్రకాశినీ చైవ స్వప్రకాశస్వరూపిణీ ॥ 1 ॥
1. ఓం *నిత్యాగతా*యై నమః ।
నామ
వివరణ.
నిత్యమూ
వచ్చుచుండెడి తల్లి మన అమ్మ లక్ష్మీ మాత.
శా. శ్రీమన్మంగళ
భవ్యభాగ్యద రమా! శ్రీ రూప!
*నిత్యాగతా!*
ప్రేమోదార
గుణాలయా! శుభద! నీవే సృష్టిలో మూలమై
క్షేమంబున్
గలిగింప మాకు సతమున్, శ్రీదేవివై వత్తువే,
నీ
మాతృత్వమునెన్న నాకుఁ దరమా, నిన్నున్ సదా కొల్చెదన్.
2. ఓం *అనన్తనిత్యా*యై నమః ।
నామ
వివరణ.
అంతము
లేని శాశ్వతమయిన తల్లి రమామాత.
కం. పరమాత్ముని
నారాయణు
నరయుట
నీ కృపను గలుగు నమ్మా! శుభదా!
కరుణ
ననంతుని జూపెడి
నిరుపమ
జననీ! *యనంత
నిత్యా!*
కొలుతున్,
3. ఓం *నన్దిన్యై* నమః ।
నామ
వివరణ.
ఆనందమును
కలుగఁ జేయు తల్లి మన అమ్మ శ్రీదేవి.
తే.గీ.
వినుత
*నన్దినీ!*
యానంద మనుభవైక
వేద్యమమ్మరో
నీకృపన్ బ్రీతిఁ గనిన,
సతతమానందము
న్మదిన్ సదయ నిలిపి,
కాచి
రక్షించఁ, గొల్తు నిన్ గమల నయన!
4. ఓం *జనరఞ్జన్యై* నమః ।
నామ
వివరణ.
జనుల
మనసులకానందము కలుగజేయు తల్లి మన శ్రీదేవి.
తే.గీ.
దివ్య *జనరఞ్జనీ!* సన్నిధిగనె నీకు
నన్ను
నిలుపుకొనుము కృపన్, సన్నుతముగ
జనుల
రంజింప జేసెదన్ ఘనతనెన్ని
పద్యములు
వ్రాసి నీపైన భవహరముగ.
5. ఓం *నిత్యప్రకాశిన్యై* నమః ।
నామ
వివరణ.
ఎల్లప్పుడూ
ప్రకాశించు తల్లి లక్ష్మీదేవి.
తే.గీ.
జనని
*నిత్యప్రకాశినీ!*
జయము నీకు,
నీవె
నిత్యప్రకాశమై నిండి మదిని
నీదు
తేజంబు నాలోన నిండనిమ్ము
జ్ఞానసద్భాగ్య
దాయినీ! కరుణఁ గనుమ.
6. ఓం *స్వప్రకాశస్వరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
స్వయముగా
ప్రకాశించు స్వరూపము కల తల్లి.
తే.గీ.
*స్వప్రకాశస్వరూపిణీ!*
విప్ర పూజ్య!
నీ
ప్రకాశమ్ము నాలోన నిలువనిమ్ము,
జ్ఞాన
దివ్యప్రకాశమ్ము కలుగఁ జేసి,
కనఁగఁ
జేయుము
నీ
పతిన్ గాంక్షతీర.
శ్లో.
మహాలక్ష్మీర్మహాకాలీ మహాకన్యా సరస్వతీ ।
భోగవైభవసంధాత్రీ భక్తానుగ్రహకారిణీ ॥ 2 ॥
7. ఓం *మహాలక్ష్మ్యై* నమః ।
నామ
వివరణ.
గొప్ప
లక్ష్మీదేవి మన అమ్మ. అందరికీ జీవనాధారమయిన తల్లి మన
మహాలక్ష్మితల్లి.
తే.గీ.
నుత
*మహాలక్ష్మి!*
నినుఁ గొల్చు బ్రతుకు బ్రతుకు.
క్షితిజ
మానవ జాతికి బ్రతుకు నీవె,
నీవు
లేకున్న బ్రతుకులే లేవు జనని,
నీదు
కృపజూపి భక్తుల నాదుకొనుము.
8. ఓం *మహాకాల్యై* నమః ।
నామ
వివరణ.
మిక్కిలి
శక్తిస్వరూపిణి అయిన కాలీ స్వరూపము మన తల్లి. మిక్కిలి
నల్లగా
ఉండు
తల్లి ఈ జనని.
తే.గీ.
శ్రీ
*మహాకాలి!*
నిలుము నా చిత్తమందు,
నా
గృహంబున నీవుండి నన్ను గనుచు
నైహికంబును
బరము నాకందఁ జేసి
నన్ను
గాపాడుమమ్మరో సన్నుతముగ.
9. ఓం *మహాకన్యా*యై నమః ।
నామ
వివరణ.
మన
అమ్మ లక్ష్మీమాత గొప్ప కన్యక. కన్యకలయందు ప్రకాశించు మహాకన్యక
మన
అమ్మ.
తే.గీ.
కన
మహాకన్య వీవమ్మ కల్పవల్లి!
కొలిచెదన్
*మహా కన్య!* నిన్ గొప్పగాను,
కన్యకామణులందునఁ
గలిగి నీవు
వినుత
లక్ష్మీప్రదమ్ముగా వెలుగుదువుగ.
10. ఓం *సరస్వత్త్యై* నమః
నామ
వివరణ.
మన
అమ్మయగు లక్ష్మీ మాతయే సరస్వతీ స్వరూపము.
తే.గీ.
ఓ
*సరస్వతీ!*
నీకృపనొప్పిదముగ
జీవితము
సాగుచుండును సేవిత పద!
హంసవాహినివగుచు
నీవమరియుండి
చిత్తమునవెల్గు
చుందువే చిన్మయముగ.
11. ఓం *భోగవైభవసంధాత్ర్యై* నమః ।
నామ
వివరణ.
భోగమును
వైభవములను మనకు ప్రసాదించుజనని లక్ష్మీమాత.
తే.గీ.
*భోగవైభవ సన్ధాత్రి!* పూజలంది
భోగవైభవములనిమ్ము
పూజ్యముగను,
యోగమును
గొల్ప ముక్తికై, యోగ్యులకును,
నిన్ను
సేవించు యోగమే నిరుపమమిల.
12. ఓం
*భక్తానుగ్రహకారిణ్యై* నమః ।
నామ
వివరణ.
భక్తులపై
అనుగ్రహ కారణమయిన జనని లక్ష్మీమాత.
శా. *భక్తానుగ్రహకారిణీ!*
జయము, నీ భక్తాళి ధన్యాత్ములై
రక్తిన్
నిన్ మదిలోన నిల్పి సతమున్ బ్రార్థింతురోయమ్మ! నీ
శక్తిన్
మానసమందు నెంచి కృపకై సాంతంబు నిన్ గొల్తురే,
భక్తిన్
శక్తి నిహంబు సత్ పరము నా భాగ్యంబుగాఁ గొల్పుమా.
శ్లో.
ఈశావాస్యా మహామాయా మహాదేవీ మహేశ్వరీ ।
హృల్లేఖా పరమా శక్తిర్మాతృకాబీజరూపిణీ ॥ 3 ॥
13. ఓం *ఈశావాస్యాయై* నమః ।
నామ
వివరణ.
అంతటనూ
తానై యున్న తల్లి లక్ష్మీ మాత.
శా. *ఈశావాస్య! * జయోzస్తు తే, యనుచు నిన్నే కొల్తురోయమ్మ! స
ద్ధీశాలాగ్రణు
లెల్లవేళలను, స్వాధీ
నాత్ములై ధాత్రి, వా
గీశానీ
నుత సత్ స్వరూపిణివి దేవీ!
లోకమందంతటన్
నీ
శక్తిన్ గను నేర్పునిమ్ము కృపతో నిత్యంబు నిన్ గొల్చెదన్.
14. ఓం *మహామాయాయై* నమః ।
నామ
వివరణ.
అష్ట
లక్ష్మీ స్వరూపిణియైన జనని గొప్ప మాయా స్వరూపిణి.
శా. మాయామోహములన్
జయింపనయితిన్ మాయన్ ద్యజించన్
*మహా
మాయా!*
నీ పదపద్మముల్ కొలిచెదన్ మాయన్ విడన్ జేయుమా,
నీ
యాజ్ఞన్ శిరసావహించి నడచున్ నీ సృష్టి సర్వంబు, నీ
మాయన్
బాపుట నీకు లెక్కయగునా? మాతల్లివే, పాపుమా.
15. ఓం *మహాదేవ్యై* నమః ।
నామ
వివరణ.
గొప్ప
దేవత జహన్మాతయైన లక్ష్మీ మాత.
కం. భావాతీతవుగ
*మహా
దేవీ!*
మద్భాగ్యలబ్ధ దీపిత వీవే
కావక
యున్నను నాకిక
నేవారలు
ప్రోవఁగల రహీన దయాబ్ధీ!
16. ఓం *మహేశ్వర్యై* నమః ।
నామ
వివరణ.
గొప్ప
ప్రభ్విణి మన లక్ష్మీ మాత. మహేశ్వరుని అర్థాంగలక్ష్మి మహేశ్వరి.
కం. నీ
యనుఁగు భక్తుల కిలను
శ్రేయములిడు
శ్రీ *మహేశ్వరీ!* నినుఁ గొలుతున్.
నాయందు
కృపను నిలువుము
మాయను
పోకార్పి కావ, మహిలో జననీ!
17. ఓం *హృల్లేఖాయై* నమః ।
నామ
వివరణ.
హృదయమును తాకు జనని. హ్రీమ్ అనే అక్షరంలో ఉన్న జనని.
కం. *హృల్లేఖా!* నా మదిలో
కల్లోలములణచివేసి కారుణ్యముతోఁ
జల్లగ కావుము నన్నున్!
దల్లిగ నీ కృపను జూపి ధైర్యమునిమ్మా.
18. ఓం *పరమాయై*
నమః ।
నామ
వివరణ.
లక్ష్మీమాత
గొప్పదైన తల్లి.
కం. *పరమా* నిన్నే కొలిచెద
పరమార్థమునెన్ని
నేను ప్రఖ్యాతముగా,
నిరుపమ
సద్గుణ గణ్యా!
వరదాయిని
వీవె నీ ప్రభావము నెంతున్.
19. ఓం *శక్త్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
శక్తి స్వరూపణి.
తే.గీ.
శక్తివోయమ్మ
శ్రీ పరా! *శక్తి! * నీవు
ముక్తి
భాగ్యప్రదాయివి! పూజ్య దేవి!
యుక్తమైనట్టివిమ్ము
నాకొప్పిదముగ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *పరమాయై శక్త్యై* నమః.
నామ వివరణ.
గొప్ప శక్తి స్వరూపిణి మన లక్ష్ని మాత.
కం.
ననుఁ గను *పరమా! శక్తీ! *
నిను నామది నిలిపి సతము నిన్నే కొలుతున్,
కనిపించు కంటికెదురుగ
వినయంబుగఁ బ్రణుతులిడుదుఁ, బ్రీతిగ జననీ!
కం. అమ్మా! *పరమా శక్తీ!*
సమ్మోదము తోడ నాదు సంస్తుతి వినుమా,
నెమ్మదిఁ బరమాశక్తిగ
నిమ్మది నివసింపుమో యహీన దయాబ్ధీ!
20. ఓం *మాతృకాబీజరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
మాతృకా
వర్ణస్వరూపిణి మన అమ్మ.
తే.గీ.
*మాతృకాబీజరూపిణీ!*
మహితమయిన
మాతృకా
వర్ణమయముగా మదిని నిలిచి
పద్యసంస్తుతులందీవు
పరిఢవిల్లి
సంతసంబును
గొలుపుమా చదువరులకు.
శ్లో.
నిత్యానందా నిత్యబోధా నాదినీ జనమోదినీ ।
సత్యప్రత్యయనీ చైవ స్వప్రకాశాత్మరూపిణీ ॥ 4 ॥
21. ఓం *నిత్యానన్దాయై* నమః
నామ
వివరణ.
నిరంతరమూ
ఆనందమయమై భక్తులకు ఆనంద ప్రదాయినిగా వెలుగు తల్లి
మన
లక్ష్మీమాత.
కం. నిరుపమ
*నిత్యానందా!*
తరుగని
యానందమిమ్ము తలచిన నిన్నున్,
పరమానందమె
బ్రహ్మము,
తరణోపాయముగ
ముక్తిదా! మది నిలుమా.
22. ఓం *నిత్యబోధా*యై నమః ।
నామ
వివరణ.
నిరంతరమూ
బోధను గొలుపు మాతృదేవత లక్ష్మీమాత.
తే.గీ.
*నిత్యబోధా!*
నినుం గన్న నిత్యబోధ
నొందుచుండి
శుభావళిన్ బొందఁగలము,
నిత్యబోధన్
మదిన్ గొల్పి నిలుపు మమ్మ!
నిన్ను
స్మరియింప నిత్యమున్ నిరుపమాన!
23. ఓం *నాదిన్యై* నమః ।
నామ
వివరణ.
నాదమునకు
మూలమయి నాదమును కలిగించు తల్లి మన అమ్మ.
తే.గీ.
*నాదినీ!*
నీవె యోంకార నాదమెఱుఁగ,
నాదు
మదిలోన యోంకార నాదమీవె,
సేదఁ
దీర్చుచు నిహలోక బాధలుడుప
ఖేదమును
వాసి నీకు నేఁ గేలు మోడ్తు.
24. ఓం *జనమోదిన్యై* నమః ।
నామ
వివరణ.
జనులకు
సంతోషమును కలిగించు జనని మన అమ్మ.
కం. *జనమోదినీ!* వసుంధర
ఘనతర
శుభకర నిరుపమ కరుణామృతమై
మనఁ
జేయుచు జనపాళిని
వినుతంబుగ
నిలుతువు మది ప్రీతిగ శుభదా!
25. ఓం *సత్యప్రత్యయిన్యై* నమః ।
నామ
వివరణ.
సత్యమునకు
నిదర్శనముగా సత్యమై, సత్యము నిలుపు తల్లియైయొప్పు
జగజ్జనని
అమ్మ.
కం. *సత్యప్రత్యయినీ! ధర
స్తుత్యముగా
సత్యధనులతో నిలిచెదవే,
నిత్యము
నీదగు సుగుణౌ
న్నత్యము
సత్యముగ తెలిపి నతులందింతున్.
26. ఓం స్వప్రకాశాత్మరూపిణ్యై నమః ।
నామ
వివరణ.
స్వయముగా
ప్రకాశించు ఆత్మ స్వరూపము కల తల్లి లక్ష్మీ మాత.
తే.గీ.
*స్వప్రకాశాత్మరూపిణీ!*
సన్నుతింతు
నిన్ను,
నేనున్ బ్రకాశింతు నిన్ను దాల్చి
మానసంబందుఁ,
గృపతోడ మనుము నీవు,
నిన్నుఁ
దాల్చిన
నేనును
సన్నుతుఁడనె.
శ్లో.
త్రిపురా భైరవీ విద్యా హంసా వాగీశ్వరీ శివా ।
వాగ్దేవీ చ మహారాత్రిః కాలరాత్రిస్త్రిలోచనా ॥ 5 ॥
27. ఓం *త్రిపురాయై* నమః ।
నామ
వివరణ.
ముల్లోకముల
స్వరూపిణి మన అమ్మ. సర్వవ్యాపి మన అమ్మ. సర్వమూ తానే
అయిన
తల్లి లక్ష్మీ మాత.
కం. *త్రిపురా!* సర్వము నీవే
కృపఁ
జూపుచు నీవె మాకుఁ గేలొసగుచు మ
మ్మపమార్గదూరులగునటు
తపియించుచుఁ
జేయు నీకు
దండములమ్మా.
28. ఓం *భైరవ్యై* నమః ।
నామ
వివరణ.
భైరవిగా
నహీజ్వల ప్రకాశనుననుండి తల్లి లక్ష్మీ మాతయే.
తే.గీ. *భైరవీ!* దుష్టులను గూల్చి
భాతినిలుపు
భారతాంబకు,
నాత్మవై ప్రభను గొలుపు,
మంచివారిని
కాపాడు మహితముగను
దుష్ట
శిక్షణఁ జేయుము తోయజాక్షి!
29. ఓం *విద్యా*యై నమః ।
నామ
వివరణ.
సకల
విద్యా స్వరూపిణి జగన్మాతయగు లక్ష్మీదేవి.
తే.గీ. జనని!
*విద్యా! * ప్రణామముల్,
వినుము మొరల,
నైహికాముష్మికంబులనలరఁ
జేయు
విద్యలందఁగ
జేయుమా! విశ్వరూప!
విద్యగా
నీవె నాలోన వెలుగుమమ్మ.
30. ఓం *హంసాయై* నమః ।
నామ
వివరణ.
పరమహంస
మన లక్ష్మీ మాతయే.
తే.గీ.
జనని!
*హంసా!*
పరాశక్తి! ప్రణవమీవె,
యాత్మలో
హంసవైన నిన్నరయఁ దరమె?
జ్ఞాన
చక్షువు నాకిచ్చి కనఁబడుమిక.
వందనంబులు
చేసెదనందుకొనుము
31. ఓం *వాగీశ్వర్యై* నమః
నామ
వివరణ.
వాగీశ్వరి
అయిన భారతీ మాత మన అమ్మయే.
తే.గీ.
ప్రణుత
*వాగీశ్వరీ!*
నీదు పదయుగమ్ము,
నాదు
చిత్తమందున నిల్పి నీదు సేవ
చేయగన్
వాక్కులందించు జీవమిడుచు
వాక్ప్రభాసంపు
కవితలన్ వరల నిలుము.
32. ఓం *శివా*యై నమః ।
నామ
వివరణ.
శుభమే
అస్మ్మ.శుభాకారమే మన అమ్మ, శుభాధారమే అమ్మ.
తే.గీ.
ఓ
*శివా!*
శుభాకారమా! లేశమైన
నీదు
శివతత్వముల్ తెల్ప నేను జాల
ననుపమాన
శుభాస్పదా! కనుము నన్ను,
శుభకరంబగు
జీవన
శోభనిమ్ము.
33 ఓం *వాగ్దేవ్యై* నమః ।
నామ
వివరణ.
పలుకులకు
మూలాధారమయిన జనని మన అమ్మయే.
కం. ఓ
*వాగ్దేవీ!*
శుభకర
భావంబులు
వాగ్గరిమను వరలింపగ నన్
నీవే
యొసగుమ నాకున్,
జీవాత్మను
పరమమునను జేర్చగ నిమ్మా.
34. ఓం *మహారాత్ర్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
మహారాత్రి స్వరూపము. చీకటిలో కొట్టుమిట్టాడు భక్తులకు అండగా
నిలుచు
తల్లి.
ఉ.
శత్రు చయంబు చేతి కిల చక్కగ చిక్కి, గణింప నిన్,
*మహా
రాత్రి!* గ్రహింపు
నా వినతి, రక్షణఁ గొల్పుము, శత్రు షట్కమున్
,ధాత్రిని
మాపి, నామదికి దక్కుము నీవు ప్రపూజ్యమానవై,
యాత్రముతోడ
కోరితి నహర్నిశలున్ నిను గొల్వనెంచుచున్.
35. ఓం *కాలరాత్ర్యై* నమః ।
నామ
వివరణ.
దుష్ట
భయంకర రూపమయిన కాలరాత్రి జగజ్జనని అయిన మన తల్లియే.
చం. కరుణను
జూపఁబోకుమిక కల్మష హారిగ *కాళరాత్రి!* దు
స్తర
దురహంకృతుల్ సుజన సత్తములన్ గలగించుచుండుటన్
దురితములాచరించు
పలుదుష్టులపాలిట కాలరాత్రివై
నెరపుము
నీ విధానమును నివ్వెరపోవగ లోకమంతయున్.
36. ఓం *త్రిలోచనా*యై నమః ।
నామ
వివరణ.
సూర్యచంద్రాగ్నులనే
త్రిలోచనములుగా కల తల్లి లక్ష్మీదేవి.
తే.గీ.
సూర్య
చంద్రాగ్నులను గల్గి చూడ్కులొప్ప
వరలుచున్న
*త్రిలోచనా! * భరమొ
నీకు
నన్ను
గావంగ మది నిల్చి? సన్నుతాత్మ
దివ్యసామ్రాజ్ఞి!
కావనందిమ్ము కరము.
శ్లో.
భద్రకాలీ కరాలీ చ మహాకాలీ తిలోత్తమా ।
కాలీ కరాలవక్త్రాంతా కామాక్షీ కామదా శుభా ॥ 6 ॥
37. ఓం *భద్రకాల్యై* నమః ।
నామ
వివరణ.
భద్రమునకు,
మంగలమునకు స్థానమయిన తల్లి, భద్రమును కల్యాణ
ప్రదయు
అయిన తల్లి మన భద్ర కాలి.
తే.గీ.
*భద్రకాలీ!*
కృపన్నాకు భద్రదవయి
మానసంబున
నెలకొని మసలుచున్న
నిన్ను
మహనీయ యుక్తితో నెన్ని కొల్తు
భక్తి
భావంబుతో
నాదు
శక్తి కొలది.
38. ఓం *కరాళ్యై* నమః ।
నామ
వివరణ.
దుష్ట
సంహరూపిణి కరాలి మాత శిష్టులకు మంగలప్రద.
తే.గీ.
మహితమౌ
భీకర *కరాళి!* మానసమున
నిన్ను
నిలుపు టసాధ్యంబు, నిజము కనగ,
నీవె
నాలోన రహియించు నేర్పు మీర
నిత్య
మంగళ కారివై నిష్ఠతోడ.
39. ఓం *మహాకాల్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
మహాకాలీ స్వరూపమే. అంతు లేని కాలస్వరూపము అమ్మయే.
తే.గీ.
శ్రీ
*మహాకాలి*!
నీ దివ్య చేతన మది
లోకమునఁ
గల్గు జనులకు, శ్రీకరమగు,
నా
మదిన్ జేతనంబీవె, నన్ను లోక
మందు
వెలయింతు వీవమ్మ, సుందరముగ.
40. ఓం *తిలోత్తమా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
తిలోత్తమ. సర్వశ్రేష్ఠురాలు. దివ్యాత్మ అయిన తిలోత్తమ అమ్మయే.
అత్యంత
సౌందర్య వారాశి అయిన తిలొత్తమ అమ్మయే.
చం. సుగుణ
*తిలోత్తమా! * జగతి
శోభిలు నీ పదపంకజప్రభన్,
సగుణసురూపధారిణుల
సంస్కృతి వీవె దయా సుధాంబుధీ!
యగణిత
సత్య సత్ పథ మయాచితరీతిని గల్గు నీ కృపన్,
నిగమ
సువేద్యవీవు, గణనీయ శుభంబులు నాకుఁ గొల్పుమా.
41. ఓం *కాల్యై* నమః
నామ
వివరణ.
కాల
వర్ణముననొప్పు కాలీస్వరూపము కూడా అమ్మయే.
తే.గీ.
గౌరి!
నీవె యీ సృష్టిలో కలిని పెంచు
టేలను?
హరించుమమ్మరో! *కాళి!* దుష్ట
కలిని
బాపుము నా లోనఁ గలిగి నీవు,
కలిత
సద్గుణ సన్నుతా! సలలితాత్మ!
42. ఓం *కరాలవక్త్రాన్తా*యై నమః ।
నామ
వివరణ.
కరాలవక్త్రాంతము
అనగా భయంకరమయిన నోరు కలతల్లి మన అమ్మ
లక్ష్మీదేవియే.
ఉ. సంతత
సత్య సన్నుత లసద్గుణదాయిని! యో *కరాల
వ
క్త్రాంత! * శుభాస్పదా! జయము కల్గగఁ జేయుచు మంచివారికిన్,
చింతలఁ
ముంచు దుష్టులను జీల్చుచు నీ శుభ నామధేయమున్
సాంతము
నిల్పుకొందువు, ప్రశాంతతఁ గూర్చగ లోకమందునన్
43. ఓం *కామాక్ష్యై* నమః ।
నామ
వివరణ.
భక్తుల
కోరికలు తీర్చెడి కామాక్షీమాత మన అమ్మలక్ష్మీదేవియే.
కం. *కామాక్షీ!* శుభ దృష్టిని
క్షేమము
కలుగంగఁ జేసి కీర్తిని గనుచున్.
శ్రీమన్మంగల
సుజనుల
కైమోడ్పులు
గొనెడి నీకు కైమోడ్తునిటన్!
44. ఓం *కామదాయై* నమః ।
నామ
వివరణ.
కోరికలను
తీర్చు జనని కామద, మన అమ్మ. కమేశ్వర దర్శన భాగ్య ప్రదాత
మన
అమ్మ.
కం.
*కామద!*
నీ సద్భక్తుల
కామములగు
భుక్తి, ముక్తి, కరుణనొసగుచున్,
క్షేమము
గొలిపెదవమ్మా!
యేమని
నిన్ గోరువాడ నిమ్ము శుభాళిన్.
45. ఓం *శుభా*యై నమః ।
నామ
వివరణ.
శుభమనిన
మన అమ్మ్యే. ఈ కారణముగనే అమ్మ శుభా అను పేరు
గడించగలిగినది.
తే.
గీ.
వర
*శుభా! * సుజనాళికిన్ వరములొసగి
మంచినెన్నుచు
కాచెదవెంచి చూడ,
నేను
నీ దాసుడఁ, గనుచు నీవె నన్నుఁ
గాచి
రక్షించుమమ్మరో కనికరించి.
శ్లో.
చణ్డికా చండరూపేశా చాముండా చక్రధారిణీ ।
త్రైలోక్యజయినీ దేవీ త్రైలోక్యవిజయోత్తమా ॥ 7 ॥
46. ఓం *చణ్డికా*యై నమః ।
నామ
వివరణ.
చండప్రచ్ండ
క్రోధాకార్ముతో శత్రి భయంకర చండిక.
తే.గీ.
*చణ్డికా*
నీదగు ఘన ప్రచండ దృష్టి
దుష్టపాళిపై
పడనిమ్ము, సృష్టిలోన
మంచివారిని
కాపాడ మంచు నిన్ను
కోరుచుంటిని,
తీర్చుమా కోరికనిఁక.
47. ఓం *చణ్డరూపేశా*యై నమః ।
నామ
వివరణ.
శిష్ఠులపాలిట
కరుణాంఋత మూర్తి అయిన మన తల్లిదుష్టులపాలిట
చండరూపిణి.
తే.గీ. *చండ
రూపేశ!*
నీదైన చండ రూప
మనితరంబగు
శుభకారి వినయధనుల
కనుగుణంబుగ
దుష్టులనణచివేయు,
ఘనతరంబుగ
నిన్ను నే గాంచనుంటి.
48. ఓం *చాముణ్డా*యై నమః ।
నామ
వివరణ.
చాముండేశ్వరి
మన అమ్మ లక్ష్మీదేవియే.
కం. *చాముణ్డా*!
దురితాత్ములు
భూమిన్
ప్రళయాంతకులయి పుట్టుట గనితే?
ధీమంతులఁ
గాపాడగ
నీ
మహిమన్ ద్రుంచుమమ్మ నీచులనెలమిన్.
49. ఓం *చక్రధారిణ్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
ధర్మచక్రమును ధరించిన జనని.
తే.గీ.
*చక్రధారిణీ!*
నీ కాలచక్రమందు
నెవ్వరున్
శాశ్వతంబుగా నివ్వసుధను
నిల్చి
యుండరు. నిల్చెద నేను నీదు
పాదపద్మమ్ములన్
జేరి పరవశమున.
50. ఓం *త్రైలోక్యజయిన్యై* నమః ।
నామ
వివరణ.
ముల్లోకములనూ
జయించిన తల్లి ఈ త్రైలోక్య జయినని మన అమ్మయే.
తే.గీ.
మహిత
*త్రైలోక్య జయినీ!* నమస్కరింతు
నీకు
భక్తితో సాగిలి, నీదు కృపను
పొందకున్నచోఁ బరమెట్లు
పొందగలను?
భువిని
నున్నట్టి నన్ గను పూజ్యవీవు.
51. ఓం *దేవ్యై* నమః.
నామ
వివరణ.
దివ్యత్వము
ఉన్న దేవతా స్వరూపిణి మన దేవీమాత.
కం. దేవీ నిను నా మదిలో
భావింతును మోక్షదవని,
పరమేశ్వరి! నా
కీవే
దిక్కై యుంటివి,
కేవల
మోక్షంబొసంగ కీర్తింతు నినున్.
52. ఓం *త్రైలోక్యవిజయోత్తమా*యై నమః
నామ
వివరణ.
ముల్లోకములనూ
జయించిన ప్రథమ గణ్య త్రైలోక్య
విజయోత్తమ
మనకు శుభద.
కం. క్షేత్రంబేనెఱుఁగ
నటులె
క్షేత్రజ్ఞుఁడ
నెఱుగనమ్మ! కీర్తింతును ని
న్నే
త్రైలోక్యాధిష్ఠగ
మా
*త్రైలోక్య విజయోత్తమా!* నిను గొలుతున్.
శ్లో.
సిద్ధలక్ష్మీః క్రియాలక్ష్మీర్మోక్షలక్ష్మీః ప్రసాదినీ ।
ఉమా భగవతీ దుర్గా చాంద్రీ దాక్షాయణీ శివా ॥ 8 ॥
53. ఓం *సిద్ధలక్ష్మ్యై* నమః ।
నామ వివరణ.
అంతులేని
లక్ష్మీ తల్లి. ప్రసిద్ధమయిన మన తల్లి, భక్తులకోరికలను
సిద్ధింపజేయు
తల్లి.
తే.గీ.
*సిద్ధ లక్ష్మీ!* నినున్ గొల్చి సిద్ధి పొంది
యిహ
పరంబుల సౌఖ్యంబు మహితముగను
పొందవచ్చును నీకృపఁ
బొందవచ్చు,
శిష్ఠ
భక్తులన్ రక్షించి సిద్ధి నిమ్ము.
54. ఓం *క్రియాలక్ష్మ్యై* నమః ।
నామ
వివరణ.
అన్ని
పనులకూ వెనుకనుండి సాగఁజేయుక్రియాలక్ష్మి
మన లక్ష్మీజననియే.
తే.గీ.
ఓ
*క్రియాలక్ష్మి*! కార్యంబులొప్పిదముగఁ
జరుగఁ
జేయుచు మమ్ము నీవరయుమమ్మ
యిహపరంబులసౌఖ్యంబులిచ్చు
నిన్ను
పొగడ
నాతరంబగునొకో? పుణ్యలబ్ధ!
55. ఓం *మోక్షలక్ష్మ్యై* నమః ।
నామ
వివరణ.
నిరంతర
సాధనతో అమ్మను కొలుచు మోక్షార్థులకు మోక్షమును ప్రసాదించు
జనని
మోక్షలక్ష్మి.
తే.గీ.
ఎన్ని
జన్మలనెత్తిననేమి ఫలము
కడకు
సన్మోక్షలబ్ధిచేఁ గలుగు సుఖము.
*మోక్షలక్ష్మీ!* నినున్
గొల్వ మోక్షమబ్బు.
పూజ
చేయుదు నీకు సన్ ముక్తినిడుమ.
56. ఓం *ప్రసాదిన్యై* నమః ।
నామ
వివరణ.
భక్తులయెడ
ప్రసన్నముగా అనుగ్రహముతో నుండు జనని మన తల్లి
ప్రసాదిని.
తే.గీ.
శాంత
రూపా! *ప్రసాదినీ!* సదయ నీవు
భక్తులన్
జూచుచుండుటన్ శక్తి పెరిగి
భక్తులెన్నుచు
నిను గొల్త్రు ముక్తిఁ గోరి,
నీదు
ప్రాసాదగుణము గణింపలేను.
57. ఓం *ఉమా*యై నమః ।
నామ
వివరణ.
పరమ
శాంత స్వభావ ఉమ మన జనని లక్ష్మీదేవియే.
తే.గీ.
సుజన
సన్నుత శ్రీ *యుమా!* నిజము కనగ
నీదు
మాహాత్మ్యమెన్నంగ లేదు భాష,
మేటి
శరదిందుచంద్రికల్ సాటిరావు
నీదు
శాంతంబునకు, నన్ను నీవు కనుము.
58. ఓం *భగవత్యై* నమః ।
నామ
వివరణ.
ప్రకాశవంతముగా
జ్ఞానప్రభా భాసమనముగా నొప్పునట్టిది మన అమ్మ భగవతి
తే.గీ.
*భగవతీ!*
నినుఁ చేరెడి భాగవతులు
ధన్య
జీవుల్, పునర్జన్మ తప్పి వారు
ముక్తి
సాధింతురిద్ధరన్ భక్తి నిలిపి
నీదు
పదపంకజములపై నేర్పు మీర.,
59. ఓం *దుర్గా*యై నమః ।
నామ
వివరణ.
ఎవ్వరికినీ
తనను అధిగమింప సాధ్యము కానితల్లి దుర్గ.
కం. భర్గునకైనను
కుదరదు
*దుర్గా!* నిన్నధిగమింప, దుస్తరరిపుష
డ్వర్గము,
నిన్ లెక్కింపని
మార్గమునన్
నన్ను జేరె, మాపుము కృపతో.
60. ఓం *చాన్ద్ర్యై* నమః ।
నామ
వివరణ.
చన్ద్ర
కాంతులతో ప్రకాఇంచు చాంద్రీ మాత కరుణకు పెట్టినది పేరు.
కం. *చాన్ద్రీ!* పాలకడలియే
చన్ద్రునకున్
నీకు తండ్రి, చల్లని శోభల్
సన్ద్రంబు
నుండి గొనితో?
సాన్ద్రప్రభ
శశి కొసగితొ? చల్లగ నుండన్.
61. ఓం
*దాక్షాయణ్యై శివాయై*
నమః!
నామ
వివరణ.
దక్షుని
తనయ మన తల్లి దాక్షాయణి, శివప్రదాయిని మన అమ్మ శివా.
కం. *దాక్షాయణీ!
శివా! * నను
రక్షింపఁగ
నుంటివమ్మ ప్రాణప్రదవై,
మోక్షమునొందఁగ
నాకున్
శిక్షణనిడి
ప్రోవుమమ్మ శ్రీమంతముగా.
ఓం *దాక్షాయణ్యై* నమః ।
కం. *దాక్షాయణీ!* సుధాంబుధి!
రక్షింపుము నన్ను సతము, ప్రార్థింతును ని
న్నక్షయ శుభదవు నన్నున్
సుక్షేమము బడయఁజేసి శోభిలఁ గనుమా.
ఓం *శివా*యై నమః.
తే.గీ.
ఓ *శివా!
* దివ్య శుభద! మహోన్నతంబు
నీదు భావంబు పరికింప, లేదు తిరుగు,
సృష్టినే చేసి కాపాడు దృష్టి నీది,
వందనంబులు చేసెద నందుకొనుము.
శ్లో.
ప్రత్యంగిరా ధరావేలా లోకమాతా హరిప్రియా ।
పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యాప్రదాయినీ ॥ 9 ॥
62. ఓం *ప్రత్యఙ్గిరా*యై నమః
నామ
వివరణ.
హిరణ్య
కశ్యప వధానంతరము కూడా నరసింహుని కోపము శాంతించనందున
శివుఁడు
శరభేశ్వరుఁడుగా యుద్ధము చేయుటకు రాగా అమ్మవారు, శూలిని,
మహాప్రత్యంగిర,
అను రెండు రూపములలో ప్రభవించి శరభేశ్వరునకు రెండు
రెక్కలుగా
మారెను. ఆమెను ప్రప్రథమముగా చూచవారు ప్రత్యంగుడు
అంగిరసుడు
ను. కావున ఈ తల్లికి
ప్రత్యంగిరస అను నామము కలిగెను.
ప్రత్యంగిరా
అనగా ఎదురుతిరిగే దేవత అని కూడా అర్థమున్నందున అమ్మ
ప్రత్యంగిరస
సార్థక నామధేయ యినది.
కం. ప్రత్యఙ్గుడు,
నంగిరసుఁడు
*ప్రత్యఙ్గిర!* కనుటను నిను ప్రప్రథమముగా
ప్రత్యఙ్గిరగా
నిలిచితి
వత్యంతశుభాళినిడ
మహాత్ములకెపుడున్.
63. ఓం *ధరా*యై నమః ।
నామ
వివరణ.
సమస్థమును ధరించునది
కావున ధరా మన జనని.
కం. పరమాద్భుత
చిత్రంబిది,
ధరియింతువు
నీవఖిలము,
*ధర!*కనుమన్నన్
కరుణింపవప్పుడప్పుడు
చరణంబులు
పట్టితి నను సదయ కను, రమా!
64. ఓం *వేలా*యై నమః ।
నామ
వివరణ.
కాలస్వరూపిణి
అమ్మ, అందువలననే ఆమె వేళ అయినది.
కం. *వేలా!* నన్నున్ గనుగొన
వేలన్?
నా పయిని కృప యదేలఁ గలుఁగదో?
వేళ
గతించుచునుండెను,
జాలిని
గని ముక్తి నీయ జాలవొ? జననీ!
65. ఓం *లోకమాత్రే* నమః ।
నామ
వివరణ.
లోకములన్నింటికినీ
తల్లి మన లోకమాత.
తే.గీ.
*లోకమాతా! * దయోపేత!
శోక తప్త
జగతిలో
బాధలన్ దీర్చి ప్రగణితముగ
మంచి
బ్రతు కీయ రావమ్మ! మంచిఁ గొలిపి,
సంచితము
వాపి రక్షించు చక్కగాను.
66. ఓం *హరిప్రియా*యై నమః ।
నామ
వివరణ.
విష్ణుమూర్తియొక్క
ప్రియురాలు హరిప్రియ.
పంచచామరము.
*హరిప్రియా!* నమోస్తు
తే, మహాత్ములైన భక్తులన్,
నిరంతరంబు
కావుమమ్మ, నిన్ను నమ్మి యుండి నీ
దరిన్
శుభాళి కల్గునంచు తత్ శుభాళిఁ గోరుచున్
పరంబునందవేడువారి
పాలిటన్ కృపాబ్ధివై.
67. ఓం *పార్వత్యై* నమః ।
నామ
వివరణ.
పర్వతరాజ
పుత్రి మన పార్వతీ మాత.
తే.గీ.
*పార్వతీ*మాత నీ కృపన్ బ్రతుకుచున్న
నన్ను
దయఁజూచి పెంచిన సన్నుత మతి!
జన్మ
సార్థకంబగునట్లు సన్మనోజ్ఞ
ముక్తి
మార్గసుదర్శివై భక్తినిమ్ము.
68. ఓం
*పరమాదేవ్యై*
నమః.
కం. కృపఁ
గను *పరమా!
దేవీ! *
యపవిత్రము
కాను నే నహంబుగ నీవే
సుపవిత్రతఁ
గొలుపగను న
నుపమ!
మదిని నిలిచితేని యొప్పుగ, జననీ!
ఓం పరమాయై నమః.
నామ వివరణ.
ఉత్కృష్టమైన, ప్రథానమైన,ఆద్ద్యయైన పరమేశ్వరస్వరూపము పరమ.
కం. *పరమా!*
నినువివరింపగ
తరమా కవినైన గాని, దాక్షిణ్యముతో
నిరతము లోకము లేలుచు
పరిపరివిధములను కాచి వరలింతువుగా.
ఓం *దేవ్యై* నమః.
కం. *దేవీ!* నీ సౌభాగ్యము
భావింపగ సాధ్యమగునె? భాగ్యద జననీ!
నీవేగా నా దైవము,
రావమ్మా నన్ను కావ రసరమ్య గుణా!
69. ఓం
*బ్రహ్మవిద్యాప్రదాయిన్యై* నమః ।
నామ
వివరణ.
బ్రహ్మవిద్యను
ప్రసాదించు తల్లి బ్రహ్మవిద్యాప్రదాయిని.
తే.గీ.
*బ్రహ్మవిద్యాప్రదాయినీ!* బ్రహ్మమెఱుగ,
నిన్నె
బ్రహ్మంబుగా నేను నిత్య మెన్ని
కొలుచుచుందును,
నీలోన కలవనుందు
నాకు
బ్రహ్మైక్యసిద్ధిని నయత నిమ్ము.
శ్లో.
అరూపా బహురూపా చ విరూపా విశ్వరూపిణీ ।
పంచభూతాత్మికా వాణీ పంచభూతాత్మికా పరా ॥ 10 ॥
70. ఓం *అరూపా*యై నమః ।
నామ
వివరణ.
రూప
రహిత అరూప మన అమ్మ.
తే.గీ.
రూపమెన్నగ
లేని *యరూప!* జనని!,
నిన్ను
నిర్గుణ తత్వమంచెన్నవలయు,
మానసమ్మున
నిను దల్వ మధురమగును
పూర్ణమైన
స్వరూపిణీ! స్వర్ణమయమె.
71. ఓం *బహురూపా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
అన్నిరూపములలోను విరాజిల్లుచున్నందున ఆమె బహురూపిణి.
కం. *బహురూపా!* నీ యునికిని
బహురూపములలరుచుండె
ప్రఖ్యాతముగా
నిహపర
సాధకమార్గము
బహురూపా
నీవె కాదె? భావనఁ జేయన్.
72. ఓం *విరూపా*యై నమః
నామ
వివరణ.
ముక్కంటి
విరూప.
విశిష్ఠనయిన
రూపము కలది అమ్మ.
కం. పరమాద్భుతదర్శనమిడు
*విరూప!* కృపతో
కనఁబడు! విశ్వంభరవే
తరమా
గాంచుట నిన్ మది?
పరమేశ్వరి!
కృపను గనుము ప్రఖ్యాతముగా.
73. ఓం *విశ్వరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
విశ్వమే తన రూపముగా కలది.
తే.గీ.
*విశ్వ రూపిణీ!* కాదిల శాశ్వతమ్మ
దేదియున్
జూడ,
నీదగు
పాద పద్మ
ములె
కనంగను ముక్తిదములు నిజంబు,
కొమ్ము
నా సేవ పాదమ్ములిమ్ము కొలుతు..
74. ఓం *పఞ్చభూతాత్మికా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
పంచభూత స్వరూపిణి.
తే.గీ.
*పఞ్చభూతాత్మికా* యీ ప్రపంచమెన్న
నీదు
రూపంబె, యన్నిటన్ నీవె కలవు,
పఞ్చభూతంబులీవేను,
భద్రమీవె
భక్తి
నినుఁ గొల్తు కను నన్ను ముక్తిదవయి.
75. ఓం *వాణ్యై* నమః ।
నామ
వివరణ.
వాగ్రూపిణి
అయిన అమ్మ వాణియే.
తే.గీ.
వాక్సుధాస్రవంతిగ
నోట వరల రమ్ము,
జ్ఞాన
సద్భాగ్యదా! *వాణి!* కరుణఁ గనుము,
ప్రాణమీవేను
నాలోని జ్ఞానమీవె,
వందనమ్ములు
గొనుమమ్మ
బ్రహ్మరాణి!
76. ఓం
*పంచ భూతాత్మికా పరా*యై నమః
నామ
వివరణ.
భౌతిక
ప్రపంచమే రూపముగా కల పరా స్వరూపిణి మన తల్లి.
తే.గీ.
*పంచ
భూతాత్మికాపరా!* సంచిత ఫల
మగుచు
లభియించి తీవు నా కనుపమముగ
నీదుపాదాబ్జములఁబట్టి
నేను విడువ
ముక్తిసామ్రాజ్యదాయినీ!
శక్తినిమ్ము.
ఓం * పంచ భూతాత్మికా *యై
నమః ।
నామ వివరణ.
భౌతిక ప్రపంచమే రూపముగా కల తల్లి.
తే.గీ.
*పంచ భూతాత్మికా!* నీ ప్రపంచమందు
నేను జన్మించియుంటిని, నీదు సేవఁ
జేయు భాగ్యమ్ము కల్పించి చేదుకొమ్ము,
నీవు కాదన్న దిక్కేది? నీరజాక్షి!
ఓం *పరా*యై నమః ।
నామ వివరణ.
పరాశక్తి స్వరూపిణి అమ్మ
తే.గీ.
ఓ
*పరా!* నీదు పదసేవ నొప్పు బ్రతుకు
బ్రతుకనంబడు, కానిచో బ్రతుకు కాదు,
పరము నందంగఁ జేయు నీ పదయుగళము,
నాదు భక్తిలో నిలిచి నన్నాదుకొనుము.
ఓం *పరమాత్మికా*యై నమః
తే.గీ. వినుత *పరమాత్మికా!
* నీవు ప్రేమతోడ
నీదు వేయి నామంబులన్ నేర్పు మీర
పద్యములలోన పొదిగించి, పది దినముల
లోన వ్రాయించనుంటివా? జ్ఞాన భాస!
శ్లో.
కాలి మా పంచికా వాఙ్మీ హవిఃప్రత్యధిదేవతా ।
దేవమాతా సురేశానా దేవగర్భాఽంబికా ధృతిః ॥ 11 ॥
77. ఓం
*కాల్యై*
నమః
నామ
వివరణ.
కాలస్వరూపిణి
అయిన తల్లి కాలిమాత.
తే.గీ.
*కాలి*!
మా! నీదు కృపచేత మేలుఁ గనెద,
నీదు
సద్రూపమున్ జూతు నిత్యము మది,
కల్మషంబులు
వీడుదు కవితలల్లి
నిన్ను
మురిపింపఁ జేయుదున్ నేర్పు తనర.
78. ఓం
*మా*యై నమః.
నామ
వివరణ.
లోకములకే
తల్లి మన మాత.
తే,గీ.
కాలి!
*మా*!
నీదు కృపచేత మేలుఁ గనెద,
నీదు
సద్రూపమున్ జూతు నిత్యము మది,
కల్మషంబులు
వీడుదు కవితలల్లి
నిన్ను
మురిపింపఁ జేయుదున్ నేర్పు తలర.
ఓం *కాలిమ్న్యై* నమః
।
నామ వివరణ.
కాలస్వరూపిణి అయిన తల్లి కాలిమాత.
తే.గీ.
*కాలిమా!* నుతమౌ దయాశాలివమ్మ,
కాల గమనంబు నీవే, ప్రకాశమీవె,
లిప్తలిప్తయున్ సత్ఫల ప్రాప్తికగుచు
నిన్ను జేర్చుత నన్నునాపన్న రక్ష!
79. ఓం *పఞ్చికా*యై నమః ।
నామ
వివరణ.
పంచ
భూతములచే వ్యాప్తమయి యున్న జనని పంచిక.
తే.గీ.
*పఞ్చికా!*
నీవు వెలుఁగు భావాఞ్చితముగ
నాదువాక్కులన్
సతతంబు నవ్యగతుల,
నిన్ను
ప్రాప్తింపఁ జేసెడి నిరుపమాన
వాగ్భవంబగు
దైవంబు ప్రాప్తమగుత.
80. ఓం *వాఙ్మ్యై* నమః ।
నామ
వివరణ.
వాఙ్నైపుణ్యము
కల తల్లి
వాఙ్మి
తే.గీ.
*వాఙ్మి!* దివ్య
ప్రభాన్విత బంధ గర్భ
చిత్ర
కవితలన్ జేయంగఁ జేయుమమ్మ,
దివ్య
వాగ్ధాటి నొసగుచు భవ్యమయిన
నీదు
చరితంబు పలికించు నేర్పుఁ గొలిపి.
81. ఓం *హవిషే* నమః ।
నామ
వివరణ.
యజ్ఞమున
హవిస్సు అమ్మయే. అటువంటి హవిస్సుకు నమస్కారము.
తే.గీ.
ఓ
*హవీ!*
యజ్ఞఫలముల నొప్పునొసగ
హవిగ
రూపొంది నీ కృపనందఁజేసి
మమ్ము
కాపాడు చున్న మా మాతృ దేవి!
వందనంబులు
చేసెద నందుకొనుము.
82. ఓం *ప్రత్యధిదేవతా*యై నమః
నామ
వివరణ.
దేవతలు
అధిదేవతలతో పాటు దేహమానసములకు శక్తిని పెంచు
ప్రత్యధిదేవత
మన జనయిత్రి.
తే.గీ.
దేహ
మానస శక్తుల దీప్తిఁ బెంచు
సౌమ్య
*ప్రత్యధిదేవతా!*
సంస్తుతింతు,
నిరుపమాధిక
శక్తి సునిశ్చితముగ
నీదు
కృపచేత లభియించు
నిరుపమాన!
83. ఓం *దేవమాత్రే* నమః ।
నామ
వివరణ.
దేవతలకు
తల్లి మన అమ్మ దేవతామాత. మాతృప్రేమను పంచి చూచుటలో తల్లివంటి దేవత.
తే.గీ.
దీప్తమౌ
తల్లి వీవమ్మ *దేవమాత!*
దేవతా
వర తత్వమౌ దీప్తివీవు,
నీవు
కృపతోడఁ గాంచుమా నిరుపమాన!
నీదు
కృపకంజలించెద మోదమునను.
84. ఓం *సురేశానా*యై నమః ।
నామ
వివరణ.
సురలకు
దేవత సురేశాన.
తే.గీ.
ఓ
*సురేశాన!*
నీలోననున్న మహిమ
వర్ణనంబును
చేయగ పదము లేవి?
నీ
పదంబులు పట్టిన నిర్ణయముగ
పదములందును,
గొల్తు నీ పదయుగంబు.
85. ఓం *వేదగర్భా*యై నమః ।
నామ
వివరణ.
వేదములను
తన గర్భమునందే కలిగియున్న జనని వేద గర్భ.
తే.గీ.
*వేదగర్భా!* సువిదితమౌ వేదమీవె,
వేద
గర్భాననిండి యవేద్యవైన
నీ
ప్రభావంబు
నెఱిగింప
నేరనమ్మ.
విదితముగ
నాదు మదిలోన వెలుగుమమ్మ.
86. ఓం *అమ్బికా*యై నమః ।
నామ
వివరణ.
అంబికామాత
సృష్టికే తల్లి కావుననే అంబికగా లోకరక్షణ చేయుచున్నది.
తే.గీ.
*అంబికా!*
కన నీవే కృపాంబుధివిగ,,
తల్లిగా
మమ్ము కాపాడి తనియుదీవు,
నిన్ను
గౌరవింపగ లేని నిరుపయోగ
జన్మమీయకుమెవరికిన్,
జయనిధాన!
87. ఓం *ధృత*యే
నమః ।/
ఓం
*ధృత్యై నమః ।
నామ
వివరణ.
ధైర్య
సంతోష సౌఖ్యప్రద ధృతి మాత.
తే.గీ.
మహితవగు
*ధృతీ!* ధరియించి మమ్ము సతము
కంటి
పాపగా
చూచుచు
కాతువీవు,
కనులకున్నట్టి ఫలమును
కలుగఁ జేసి
నిన్ను
దర్శించుకోనిమ్ము కన్న
తల్లి!
శ్లో.
సంఖ్యా జాతిః క్రియాశక్తిః ప్రకృతిర్మోహినీ మహీ ।
యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యా విభావరీ ॥ 12 ॥
88. ఓం *సంఖ్యా*యై నమః ।
నామ
వివరణ.
దేహ
విలక్షణమయిన ఆత్మజ్ఞానమే సంఖ్యగా పిలువబడు మన అమ్మ.
తే.గీ.
ఆత్మ
సుజ్ఞాన రూపిణీ!
యాసురగుణ
బాహ్యునిగఁ
జేయుమో *సంఖ్య!* భక్తిఁ గొలుతు,
నీవె
సుజ్ఞాన దీప్తివై నిత్యముగను
నిలుమ
నామది లోగిలిన్ నిండంకృపను.
89. ఓం *జాతా* యై నమః ।
నామ
వివరణ.
సృష్టికి
పూర్వమే జాతమయిన తల్లి
జాత.
తే.గీ.
*జాత!*
కననిమ్ము నీలోని భాతి కృపను,
నా
తరంబౌనె
నిన్
దెల్ప నయ నిధాన!
ఖ్యాతిఁ
గాంచగ నీ దివ్య ఘనత వ్రాసి
లోకులకుదెల్పనిమ్ము
నా లోననుండి.
90. ఓం
*క్రియాశక్త్యై* నమః ।
నామ
వివరణ.
సృష్టి
క్రియా శూన్యమై యుండకుండుటకు జగన్మాత క్రియాశక్తిగా జీవకోటిలో
చైతన్యరూపమున
ఉండును, కావుననే ఈ తల్లి క్రియా శక్తి.
తే.గీ. ఓ *క్రియాశక్తి!* నిన్ గనుటొప్పు నాకు,
నిన్ను
దర్శించుకోనిమ్ము నీదు శక్తి
నాకు
ప్రేరకమగునమ్మ నమ్ముమమ్మ.
వందనమ్ములు
చేసెదనందుకొమ్మ.
91. ఓం *ప్రకృత్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
ప్రకృతిస్వరూపిణి.ప్రకృతి అమ్మయే.
తే.గీ.
దివ్య
సంభాసవగు *ప్రకృతీ!* మదంబ!
నాదు
ప్రకృతిలో సుగుణముల్ మోదమలర
నీవె
దయతోడఁ జేర్చుమా నిరుపమాన!
వందనమ్ములు
చేసెద వనజ నయన!
92. ఓం *మోహిన్యై* నమః
నామ
వివరణ.
శ్రీమన్నారాయణుని
మోహింపఁజేయు జనని మోహిని,
తే.గీ.
*మోహినీ*!
లోకమందున మోహమేల
సృష్టి
చేయఁబడెనొ కాని స్పష్టమమ్మ
మోహమున
మద మత్సరాల్ పూని మతిని
పాడుచేయుటన్
నినుఁ గనన్ వలనుపడదు.
93. ఓం *మహ్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
మహిగా సుప్రసిద్ధ.గోరూపమునను, భూ రూపమునను గల తల్లి మహి.
తే.గీ.
మహిమలకు
నిలయంబైన *మహి!* నుతింపఁ
జాలనమ్మరో
నిన్ను, నీ మ్రోల నిలిచి
సంతసంబును
పొందెదన్ జక్కనయిన
నీదు
సద్రూపమున్ గాంచి,
నిఖిలవేద్య!
94. ఓం *యజ్ఞవిద్యా*యై నమః ।
నామ
వివరణ.
జ్ఞాన
మోక్షప్రదమయిన యజ్ఞములకు సంబంధించిన విద్య మన అమ్మ,
తే.గీ.
*యజ్ఞవిద్యా!*
ప్రభాపూర్ణ యజ్ఞ మహిమ
నరయఁజేసి
నిన్ గనఁ జేసి,
పరమపథము
నొందు
మార్గము సూపుమా! సుందరముగ
నీకు
ఋణపడియుందును నిన్ నుతింతు.
95. ఓం *మహావిద్యా*యై నమః ।
నామ
వివరణ.
మహా
విద్యా స్వరూపిణి మన అమ్మ.
తే.గీ.
ఓ
*మహావిద్య!* పరము
నాకోర్పుతోడ
ఘన
మహావిద్యలంద నేన్,
మనము
పెట్టి
నేర్పుమోయమ్మ
పరమంద నేర్చుకొందు,
నిన్నుఁ
జేరగ నాకగు నేర్పుతోడ.
96 ఓం *గుహ్యవిద్యా* యై నమః ।
నామ
వివరణ.
అతి
రహస్యమయిన గుహ్యమయిన విద్య ఏది కలదో ఆ గుహ్యవిద్య అమ్మయే.
తే.గీ.
*గుహ్యవిద్యా!* మహామాత!
కూర్మితోడ
గుహ్యమైనట్టి
సద్విద్య కోరి నేర్తు,
చెప్పుమోయమ్మ
నాకది గొప్పగాను,
నిన్ను
చేరంగ నాకగున్ నేర్చుకొనిన.
97. ఓం *విభావర్యై* నమః ।
నామ
వివరణ.
పసుపు
మన జననియ్. రాత్రి అను గుణము జనని విభావరియే.
తే.గీ.
కనగ
లేను *విభావరీ!* గాఢ
తమస
మలముకొన్నట్టి
బుద్ధిచే నరసి నిన్ను,
నాదు
తమసమ్ము బాపుచున్ నీదు తేజ
మును
గనంజేయుమమ్మరో! ముచ్చటగను.
శ్లో.
జ్యోతిష్మతీ మహామాతా సర్వమంత్రఫలప్రదా ।
దారిద్ర్యధ్వంసినీ దేవీ హృదయగ్రంథిభేదినీ ॥ 13 ॥
98. ఓం *జ్యోతిష్మత్యై* నమః ।
నామ
వివరణ.
జనని
జ్యోతిష్మతి అనగా మెఱుపు తీగయే అమ్మ.
తే.గీ.
తగును
*జ్యోతిష్మతీ!*
నీకు దాసుడనని
కాచి
రక్షించుటన్నది కచ్చితముగ,
దారితెన్నులు
కనరాని
దారిఁ
బాపి
వినుత
జ్యోతిర్లతా! నాకు వెలుగునిమ్ము.
99. ఓం *మహామాత్రే* నమః ।
నామ
వివరణ.
ఈ
సృష్టిలోనే గొప్ప తల్లి మహామాత..
తే.గీ.
జలధి
జాతా! *మహామాత!* జయము
నీకు,
నిలువరించుము
నా మదిన్, నిశ్చలముగ
నుండఁ
జేయుము, భక్తితో
నిండు
మదిని
నిన్ను
సేవింపఁ జేయుము,
నిరుపమాక్షి!
100. ఓం *సర్వమన్త్రఫలప్రదా*యై నమః ।
నామ
వివరణ.
సర్వ
మంత్రముల ఫలితమును కలిగించు జనని సర్వమంత్రఫలప్రద.
తే.గీ.
*సర్వ మంత్రఫలప్రదా!* సన్నుతముగ
నిన్ను
సేవించు భక్తుల నెన్ని నీవు
సర్వమంత్రఫలంబులన్
సరగున నిడి
కాచి
రక్షించుచుందువో కమల నయన!
101 ఓం
*దారిద్ర్యధ్వంసిన్యై* నమః ।౧౦౦
నామ
వివరణ.
తనను
నమ్మి భజించు సాధకుల దరిద్రమును రూపుమాపు తల్లి
దారిద్ర్యధ్వంసినీ
మాత.
కం. చేరుచు
నిను నిజ భక్తులు
కోరుచు
భజియింప, వారు కోరకముందే
దారిద్ర్యమణచి
తీర్తువు,
*దారిద్ర్యధ్వంసినీ!* ముదంబున కోర్కెల్.
ఓం *దేవ్యై* నమః
కం. *దేవీ!* నీ శుభ తేజము
భావింపగనైన నాకు వశమా జననీ?
సేవాదృక్పథమిమ్మా,
సేవించెద నిన్ను సతము క్షేమంబొందన్.
102. ఓం *హృదయగ్రన్థిభేదిన్యై* నమః
నామ
వివరణ.
హృదయగ్రంధిని
భేదించు జనయిత్రి హృదయగ్రంధి భేదిని.
తే.గీ.
సాధకుని
చిత్తమరయుచు సాధనమున
సత్ఫలంబులు
కొల్పెడి సౌమ్యవీవు,
సాధనము
చేయ నేర, నన్ సాకుము విను
త *హృదయగ్రన్థిభేదినీ!* తప్పదమ్మ.
శ్లో.
సహస్రాదిత్యసంకాశా చంద్రికా చంద్రరూపిణీ ।
గాయత్రీ సోమసంభూతిస్సావిత్రీ ప్రణవాత్మికా ॥ 14 ॥
103. ఓం *సహస్రాదిత్యసఙ్కాశా*యై నమః ।
నామ
వివరణ.
వేయిమంది
సూర్యులతో సమానమయిన ప్రభాపూర్ణ మన లక్ష్మీమాత.
మ. అరిషడ్వర్గమునే
యడంచెడి
*సహస్రాదిత్య సంకాశ!* నీ
సరియెవ్వారలు
భక్త రక్షణమునన్ సారస్వతోద్భాసితా!
పరమేశాని
నినున్ మదిన్ సతతమున్ బ్రార్థించువాడన్, ననున్
దరిచేర్చంగను
చాలుదీవె కృపతో ధాత్రిన్ ననున్ బ్రోవుమా.
104 ఓం *చన్ద్రికా*యై నమః ।
నామ
వివరణ.
చల్లని
ప్రకాశమగు వెన్నెల ఏది కలదో అది మన అమ్మయే.
మ. చలువల్
పంచెడి *చన్ద్రికా!* హరి నుతా! సంస్కార సత్ సంపదన్
గలుగన్
జూడుము నాకు నెప్పుడును, రాకాచంద్ర సంకాశ! నీ
తలపే
పాప నివారణంబు కనగన్, ధర్మార్థసంసిద్ధికై
తలతున్
నిన్ సతతంబు, కావుము కృపన్ ధైర్యప్రదా! సన్నుతుల్.
105. ఓం *చన్ద్రరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
చంద్రుని
యొక్క రూపము ఏది కలదో అది అమ్మయే, చంద్రుని రూపమున
ఉన్న
తల్లి మన అమ్మ.
తే.గీ. *చన్ద్ర
రూపిణీ!*
నీ ముఖ చంద్రబింబ
మునకు
దాసోహమను హరి ముద్దుగాను,
బంధనములకు
లోనైతి పాప గతుల
నుంటిఁ
గాపాడుమా నమ్మియుంటి నిన్ను.
106. ఓం *గాయత్ర్యై* నమః ।
నామ
వివరణ.
సాధకులచే
గానము చేయఁబడుచు రక్షించఉ జనని
మన
అమ్మ గాయత్ర్రీ
స్వరూపిణి.
శా. *గాయత్రీ!* పరదేవతా! భగవతీ! కల్యాణ సంపత్కరీ!
శ్రేయోదాయక
సత్యమార్గ ముననే చిత్తంబు నే నిల్పుచున్
మాయామోహములన్
విడన్ గొలిచెదన్ మాన్యా! నినున్ నిత్యమున్,
నా
యజ్ఞానము పారద్రోలుచు కృపన్ నన్ గావుమా నిత్యమున్.
కం. *గాయత్రీ!*
జపియించెద
శ్రేయంబును
బొందఁ గోరి శ్రీకరమౌ నా
మాయను
బాపెడి మంత్రము,
నాయజ్ఞానమును
బాపి నను గావుమిలన్.
107. ఓం *సోమసమ్భూత్యై* నమః ।
నామ
వివరణ.
సోమునిఫాలమున
ధరించిన జ్ఞాని.
చంద్రమండల
మధ్యస్థ అమ్మ. ఉమా పరమేశ్వరుల వలన సంభూతమయిన జనని.
తే.గీ.
*సోమ
సమ్భూతి!* వర సతీ! శుభ నిధాన!
ప్రేమతో
నిన్నుఁ గొలువనీ విశ్వవేద్య!
చంద్రవంకను
దాల్చిన చక్కనమ్మ!
వందనంబులు
చేసెద నందుకొనుము.
తే.గీ.
*సోమ సమ్భూతి!* నాపైన బ్రేమ జూపి
నీ సహస్రనామావళిన్ నేర్పు మీర
వ్రాయఁజేసెదవోయమ్మ పద్యములను.
వందనంబులు చేసెద నందుకొనుము.
108. ఓం *సావిత్ర్యై* నమః ।
నామ
వివరణ.
సవితుని
ప్రకాశముతో విరాజిల్లు తల్లి సావిత్రి.
శా,
*సావిత్రీ! * కరుణామయీ! శుభనిధీ! శాంతిన్ బ్రసాదించుమా,
సేవాభావము
నీపయిన్ గొలుపుమా, చిద్భాసవై వెల్గుమా,
నీవాడన్,
సుతుడన్, దయాన్వితవు, నిన్నే గొల్చు నన్ గావుమా,
భావావేశముతోడ
పద్యముల నిన్ వర్ణింపఁగాఁ జేయుమా.
109. ఓం *ప్రణవాత్మికా*యై నమః ।
నామ
వివరణ.
ప్రణవమునే
ఆత్మగా కలది మన అమ్మ.
శా. సేవింతున్
*బ్రణవాత్మికా*
సతతమున్ సిద్ధిన్ గనన్ నిన్ను నేన్,
భావంబందున
నిల్చియుండుమ కృపన్ పద్యాళిలోఁ బ్రేమతో,
జీవాత్మన్
బరమాత్మలోన కలుపన్ సిద్ధంబుగానుంటి సద్
భావంబున్
వరసేవనా కుశలతన్ వర్ధిల్లనిమ్మా భువిన్.
శ్లో.
శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వదేవనమస్కృతా ।
సేవ్యదుర్గా కుబేరాక్షీ కరవీరనివాసినీ ॥ 15 ॥
110. ఓం *శాఙ్కర్యై* నమః
నామ
వివరణ.
శంకరుని
అర్థాంగి మన అమ్మ.
తే.గీ.
*శాంకరీ! * నీదు కృపచేత శంక లుడిగి
నిత్య
సంస్కారమున్ గల్గి నేను సతము
వెలుగు
నట్లుగ చేయు నావేల్పు వీవె,
వందనంబులు
చేసెద నందుకొనుము.
111. ఓం *వైష్ణవ్యై* నమః ।
నామ
వివరణ.
విష్ణు
సంబంధమయిన తల్లి మన అమ్మ వైష్ణవి.
తే.గీ.
*వైష్ణవీ! * నీవె నాయింట వరలుమమ్మ,
నిన్ను
సేవించు భాగ్యమున్ నేను గనుదు,
కన్నవారికి
సంతస కారణమగు
నన్ను
నమ్మిన వారికిన్ మన్నననిడు.
112. ఓం *బ్రాహ్మ్యై* నమః ।
నామ
వివరణ.
భ్రహ్మ
యొక్క అంశతో నొప్పారు జ్న్ని మన అమ్మ.
కం. *బ్రాహ్మీ!* నీ కృప కలిగిన
బ్రహ్మయు
తల వ్రాత మార్చి బ్రతుకఁగఁ జేయున్,
బ్రహ్మోపదేశమప్పుడు
బ్రాహ్మణులే
నిన్నుఁ జూపి వర్ధిలఁ గనిరే.
113. ఓం *సర్వదేవనమస్కృతా*యై నమః ।
నామ
వివరణ.
అందరు
దేవతలచేత నమస్కరింపబడు తల్లి.
తే.గీ.
*సర్వ
దేవ నమస్కృతా! * సహజ సుగుణ
భాసితులనిలఁ
గావుమా,
వరలఁ
జేయ,
దుష్ట
దుర్మార్గవర్తులన్ దునిమి, ధర్మ
రక్షణంబును
జేయుమా, ప్రస్తుతింతు.
ఓం *తస్మై* నమః.
నామ వివరణ.
కం. వందనమందుమ *తస్మై!*
సుందర సుకుమార గాత్ర! సుజనోద్భాసా!
మందస్మితమున సృష్టికి
విందగు దైవముగ నుండి, ప్రీతిఁ గనెదవే.
114. ఓం
*సేవ్య
దుర్గా*యై నమః.
నామ
వివరణ.
సేవింపఁబడు
దుర్గమమయిన తల్లి మన అమ్మ.
తే.గీ. *సేవ్య
దుర్గా!*
మహాదేవి! చిత్తమందు
నాకు
నీవుండుమోయమ్మ! శ్రీకరముగ,
సేవలందింతు
మదిని సద్భావపూర్ణ!
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *దుర్గాసేవ్యా*యై నమః ।
నామ వివరణ.
సేవించుచున్న దుర్గ కలది మన అమ్మ.
కం. *దుర్గాసేవ్యా!* ఖలు సం
సర్గంబులు పాపుమమ్మ! సదయను గనుచున్,
దుర్గతి పాపుదు వీవే
మార్గము నీవే సుగతికి మహిత గుణాఢ్యా!.
115. ఓం *కుబేరాక్ష్యై* నమః ।
నామ
వివరణ.
కేవలం
తన చూపుతో మనిషిని ధనవంతులను చేయగల తల్లి మన అమ్మ.
తే.గీ. ఓ
*కుబేరాక్షి*నీ చూపు లొంద లేక
పేదలై
జనులిద్ధరన్ వెతలఁ దేల
నీవు
చూడకయుండుట నీకు తగదు,
పేదవారిని
కరుణించి యాదుకొనుము.
116. ఓం *కరవీరనివాసిన్యై* నమః ।
నామ
వివరణ.
గన్నేరు
పూలను నివాసముగా కలది మన అమ్మ.
కం. శుభ
*కరవీర నివాసిని!*
యభయము
నీ వలన నాకు, ననుపమ వరదా!
శుభ
సంహతి చేకూర్చుచు
నభిమానులఁ
గావుమీ వహర్నిశలందున్.
శ్లో.
జయా చ విజయా చైవ జయంతీ చాఽపరాజితా ।
కుబ్జికా కాలికా శాస్త్రీ వీణాపుస్తకధారిణీ ॥ 16 ॥
117. ఓం *జయా* యై నమః ।
నామ
వివరణ.
జయమే
తానుగా అయియున్నది మన అమ్మ.
కం. నయమార్గంబున
వెల్గు వి
నయశీలురనెన్ని
జయము, నైతిక శక్తిన్
దయతో
నొసగెడి *జయ!* ని
శ్చయముగ
నన్ గాతువమ్మ, జయము లొసగుచున్.
118. ఓం *విజయా* యై నమః ।
నామ
వివరణ.
నిరంతర
విజయ స్వరూపిణి లక్ష్మీమాత.
కం. *విజయా!* నీ శుభ నామమె
విజయంబులు
కూర్చునమ్మ విజ్ఞులకెపుడున్,
నిజమిది,
నిన్ గొలిచెడి న
న్నజయ్యునిగ
చేసి కావు మద్భుత శక్తిన్.
(క్షయ్యజయ్యౌ శక్యార్థే...సూత్రం
మేరకు జయింపవీలు గానివాడు అజయ్యుడు . ఇది శక్తిని తెలుపుతుంది. క్షయ్య, జయ్య, శబ్దములు శక్యార్థములు:2
క్షయింప శక్యమైనది క్షయ్యము: జయింప శక్యమైనది జయ్యము. శక్యార్థముకాక యోగ్యార్థము గలిగినప్పుడు క్షేయము, జేయము, అనురూపములు గలుగును.
'క్రయ్యమనగా కొనువారు కొందురనుబుద్ధి నంగడియం దుంచబడినది. 'క్రేయ' మనగా విక్రయించుట కర్హమైనది.)
119. ఓం *జయన్త్యై* నమః
నామ
వివరణ.
నిరంతర
జయములతో ప్రకాశించు తల్లి.
పంచ
చామరము.
*జయన్తి!
* నీకసాధ్యమా
నిజంబుగా జయంబిడన్,
నయంబుతోడ
వెల్గుచు న్ననారతంబు కాతువే,
ప్రియంబుగా
కవిత్వమున్ భవిష్యవాణి యై మనన్
జయంబు
గొల్పు రీతిలో ప్రశస్తిగా నొసంగుమా.
120. ఓం *అపరాజితా* యై నమః ।
నామ
వివరణ.
ఇతరులచే
ఓడింప బడని తల్లి.
కం. *అపరాజితా! * మదంబా!
సుపవిత్ర
చరిత్ర కలిగి శోభిలు భక్తుల్
జపియింతురు
నిను నార్తిని,
ప్రపవై
నీవాదుకొని, పిపాస నడచుమా.
121. ఓం *కుబ్జికా*యై నమః ।
నామ
వివరణ.
ఆమె
ఎనిమిదేళ్ల బాలిక. ముడుచుకుని నిద్రపోవుచున్న జనని.
తే.గీ.
*కుబ్జికా!*
మాపుమా మరుగుజ్జుతనము
నాదు
దుర్భావ మిళితమౌ మేధ యందు,
నిన్ను
సేవించు నా బుద్ధి నిశ్చయముగ
నిన్ను
మెప్పించు నటులుండనిమ్ము జనని.
122. ఓం *కాలికా*యై నమః ।
నామ
వివరణ.
కాలికారూపమున
ఉన్న తల్లి మన అమ్మ.
తే.గీ.
*కాలికా! * నీదు రూపమున్ గలయఁ జూచి
యైహికాముష్మికములంది
యలరుదురుగ
నీదు
భక్తులు, నేనును నిన్నుఁ గొలిచి
భక్తి
యుక్తుఁడనై పొంది శక్తి , మనుదు.
123. ఓం *శాస్త్ర్యై* నమః ।
నామ
వివరణ.
జ్ఞానమును
శాసించు తల్లి.
తే.గీ.
శాస్త్ర
విజ్ఞాన ఖనివైన శాస్త్రివమ్మ,
నీవు
*శాస్త్రీ! * నిజంబిద్ది,, నేర్పు మీర
శాస్త్ర
విజ్ఞానమందించి చక్కగ నను
చూడుమమ్మరో
పుత్రుఁడన్, శుభద వగుచు.
124. ఓం *వీణాపుస్తకధారిణ్యై* నమః ।
నామ
వివరణ.
వీణను,
పుస్తకమును ధరించు జనని, నాద బ్రహ్మమును, జ్ఞానబ్రహ్మమును
తనలో
ధరించుతల్లి.
కం. *వీణాపుస్తక ధారిణి! *
కాణాచివి
విద్యలకును, కల్పకమీవే,
క్షోణిని
నిను స్మరియించిన
ప్రాణములను
నిలుపు విద్యఁ బడయగవచ్చున్.
శ్లో.
సర్వజ్ఞశక్తిశ్శ్రీశక్తి(సర్వజ్ఞః)ర్బ్రహ్మవిష్ణుశివాత్మికా ।
ఇడాపింగలికామధ్యమృణాలీతంతురూపిణీ ॥ 17 ॥
125. ఓం *సర్వజ్ఞశక్త్యై* నమః ।
నామ
వివరణ.
సమస్తమును
తెలిసిన శక్తి స్వరూపిణి అమ్మ.
కం. *సర్వజ్ఞ శక్తి! * వినుమా.
నిర్వేదము
నిన్నుఁ గొలువనీయదు జననీ!
పర్వంబులందునైనను
గర్వము
విడనాడి నిన్ను గాంచఁగనిమ్మా.
126. ఓం
*శ్రీశక్త్యై*
నమః.
నామ
వివరణ.
మంగలప్రపూర్ణమయిన
శక్తి అమ్మయే.
తే.గీ. మంగలప్రద *శ్రీ
శక్తి!* మాతృదేవి!
లోక
కల్యాణ కారిణీ! లోకమాత!
మంగలప్రద
శక్తిని మాకొసగుము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *సర్వజ్ఞా*యై నమః ।
కం.
సర్వము నీవే యనుచు న
ధర్వుని వేదమ్ము చెప్పు, తత్వజ్ఞులు నిన్
సర్వజ్ఞా యని కొలుతురు,
*సర్వజ్ఞా! * ననునొనర్పు సర్వజ్ఞునిగా.
127. ఓం *బ్రహ్మవిష్ణుశివాత్మికా*యై నమః ।
నామ
వివరణ.
సృష్టి
స్థితి లయకారకులయిన త్రిమూర్తుల ఆత్మ అమ్మయే.
తే.గీ.
*బ్రహ్మవిష్ణుశివాత్మికా* పరమ పథము
బ్రహ్మ
జిజ్ఞాసచే గాంచి పరగునట్లు
చేయు
తల్లివి, నన్నింక చేదుకొనుము,
బ్రహ్మజీవైక్యసిద్ధిని
వరల నిమ్ము.
128. ఓం *ఇడాపిఙ్గలికామధ్యమృణాలీతన్తు రూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
మనలోనుండు
ఇడ, పింగల, అను
నాడుల మధ్యనుండెడి
సుషుమ్నాడి
తామరతూడుదారముఆకారములో
ఏది యుండునో ఆ రూపము
అమ్మయే.
స్వయంకల్పిత మృణాలి వృత్తము.
గణములు. …..య స భ మ జ గ … యతి 9వ అక్షరము. ప్రాస
కలదు.
*ఇడాపిఙ్గలికామధ్యమృణాలీతన్తు రూపిణీ!*
వడిన్
నీవిక రావమ్మ! భవానీ! భాసురాంబికా!
కడన్
నిల్పగ నేలమ్మ! గణించమ్మా ననున్ సతీ!
కడున్
గౌరవ తత్వం బిఁక నీవేయిమ్ము గొప్పగా!
శ్లో.
యజ్ఞేశానీ ప్రథా దీక్షా దక్షిణా సర్వమోహినీ ।
అష్టాంగయోగినీ దేవీ నిర్బీజధ్యానగోచరా ॥ 18 ॥
129. ఓం *యజ్ఞేశాన్యై* నమః
నామ
వివరణ.
యజ్ఞమునకు
ప్రభ్విణి అమ్మయే,
కం. *యజ్ఞేశానీ!* సమ్య
గ్విజ్ఞాననిధానమనుచు
విశ్వమునందున్
విజ్ఞులు
మెచ్చగఁ జేయుము
సుజ్ఞానము
కలుగఁజేసి, చూపుము సుగతిన్.
130. ఓం *ప్రధా*యై నమః ।
నామ
వివరణ.
సృష్టిలో
సుప్రసిద్ధ అమ్మ.
పంచ
చామరము
*ప్రధా!* ప్రసిద్ధవమ్మ నీవు భక్తిఁ గొల్చు వారికిన్
ప్రదాతవై
శుభాళి గొల్పి భవ్య జీవనమ్ముచే
సదా
ముదంబు గొల్పుచున్ బ్రశాంతినిచ్చు తల్లిగా
మదంబ
నీదు పుత్రుఁడేను, మంచిఁ గొల్పి
ప్రోవుమా.
131. ఓం *దీక్షా*యై నమః ।
నామ
వివరణ.
యజ్ఞాదులాచరించుటకు
స్వీకరించు దీక్షయే జనని.
ఉ. దీక్షను
బూని తీవు గణుతించుచు భక్తుల ముక్తి సాధనన్
శిక్షణ
నిచ్చి సత్ పథము చేర్చుదునంచును, నీదు సత్ కృపన్
రక్షణ
పొంది భక్తతతి రమ్య సుధామయ భక్తి తత్వమున్
*దీక్ష! * గ్రహించి తీరుదురు, దివ్యము నీదగు దీక్ష శ్రీ సతీ!
132. ఓం *దక్షిణా*యై నమః ।
నామ
వివరణ.
సృష్టికి
దక్షురాలుగా కలిగిన తల్లి,
అన్నిటా
నైపుణ్యము కలిగిన జనని.
తే.గీ.
దక్షురాలవు
నీవమ్మ
శిక్షణనిడ,
*దక్షిణా!* గొల్తు భక్తితో శిక్షణనిడి,
యక్షయంబగు
సుజ్ఞాన మందఁజేసి
యిహపరమ్ములఁ
గను వరంబిమ్ము కృపను.
133. ఓం *సర్వమోహిన్యై* నమః ।
నామ
వివరణ.
సృష్టిలోని
సమస్తమూ తానె అయి మోహమును కలిగించు తల్లి.
తే.గీ.
మోహమది
ముంచు నన్ను సందేహమేల?
*సర్వమోహినీ!* మోహపు గర్వమణచి
నన్ను
రక్షింపుమమ్మరో నయనిధాన!
నిన్నె
నమ్మితిన్ మొరవిను మన్ననమున.
134. ఓం *అష్టాఙ్గయోగిన్యై* నమః ।
నామ
వివరణ.
అణిమాది
అష్టాంగ యోగి మన జనని.
కం.
అష్టాంగ యోగ నిరతులు
కష్టంబును
గనరు నిన్ను గాంచుట కొఱకో
*యష్టాంగయోగినీ!*,నా
కష్టంబులు
బాపి కావఁగాఁ దగు నీకున్.
ఓం
*దేవ్యై* నమః.
కం.
*దేవీ!*
నీ కృపచేతను
శ్రీవిష్ణువు
దర్శనమగు చిత్తము మురియన్,
నీవే
మము గను తల్లివి,
జీవాత్మను
బ్రహ్మమందుఁ జేర్చుదు వీవే.,
ఓం *అష్టాఙ్గయోగినీదేవ్యై* నమః ।
కం. శ్రీవాణీ! నా జననీ!
నీవే *యష్టాంగయోగినీదేవీ*! నా
భావనలో విహరింతువు
సేవలనందుచును సతము చిత్తేజముతోన్.
ఓం *అష్టాఙ్గయోగినీదేవ్యై* నమః ।
తే.గీ.
తెలుపు *మష్టాఙ్గయోగినీదేవి*! నీన్ను
తెలిసి పూజించుటెట్టులన్, దీనరక్ష!
భక్తి భావంబు కలిగియు భక్తులు నిను
చూడలేకుండిరేలనో? చూడనిమ్ము.
135. ఓం *నిర్బీజధ్యానగోచరా*యై నమః ।
నామ
వివరణ.
(ధ్యానావ స్థిత తద్గ తేన మనసా ప శ్య o తి యం యోగినః అని భాగవతము) ఏకాగ్రత తో
కూడిన
తీవ్రమైన ధ్యాన స్థితి నిర్బీజ ధ్యానము. అట్టి
ధ్యానములోనున్న
సాధకులకు గోచరించు జనని.
కం.
ప్రగణిత *నిర్బీజ ధ్యా
నగోచరా!*
గాంతు నిన్ను, నా ధ్యానమునన్
నిగమాంత
సారమీవే,
నగుచున్
గనిపించుమమ్మ నా కన్నులకున్.
శ్లో.
సర్వతీర్థస్థితా శుద్ధా సర్వపర్వతవాసినీ ।
వేదశాస్త్రప్రభా దేవీ షడంగాదిపదక్రమా ॥ 19 ॥
136. ఓం *సర్వతీర్థస్థితా*
యై నమః ।
నామ
వివరణ.
అన్ని
తీర్థములయందూ ఉండునట్టితల్లి.
తే.గీ.
*సర్వ తీర్థ
స్థితా!*
నేను
చక్కగ
నిను
మనసులో
కనినంత సమస్త తీర్థ
సేవనా
ఫలమొదవును చిత్రమిదియె,
నిన్ను
భావింపనిమ్మింక సన్నుతముగ.
137. ఓం* శుద్ధా*యై నమః ।
నామ
వివరణ.
అత్యంత
శుద్ధముగానుండు జనని మన అమ్మ.
కం. *శుద్ధా!* భక్తి సమృద్ధిని,
శ్రద్ధను
నీపైన నాకు
చక్కగ
నిపుడే,
రాద్ధాంతము
చేయక నా
బుద్ధిని
కరుణించి నిలుపు,
ప్రోచుట
కొఱకై.
138. ఓం *సర్వపర్వతవాసిన్యై* నమః ।
నామ
వివరణ.
సమస్తమగు
పర్వతములపైననూ వసించు లోకమాత.మత్తకోకిల.
మ.కో. *సర్వపర్వత వాసినీ!* నిను చక్కగా మది నిల్పనా?
గర్వహీనుఁడనమ్మ!
నన్నిఁక కాంచవచ్చును చక్కగా
నిర్వివాదము
నీ కృపామతి, నీవె నన్నిఁక కాంచుమా,
సర్వరక్షణ
భారవాహిని! సన్నుతింతును నీదయన్.
139. ఓం
*వేద శాస్త్రప్రభా*(దేవ్యై)యై నమః
నామ
వివరణ.
వేదప్రకాశ
స్వరూపిణి యగు దేవి ఈ లోకమాత.
తే.గీ.
*వేద శాస్త్రప్రభా!* దేవి! విశ్వ వేద్య!
నీదు
ప్రభలతో కవితలన్ నిండనిమ్ము,
నీదు
ప్రభలను వర్ణింప నేను జాల,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *వేదశాస్త్రప్రమాణ్యై* నమః
తే.గీ.
వేద శాస్త్ర ప్రమాణిగా విదితమీవు,
*వేద శాస్త్రప్రమాణి!*
నిన్ బోధఁ గలిగి ,
సాధనము చేయ లభియించు చక్కగాను
నీదు దర్శన భాగ్యమ్ము, నిశ్చయముగ.
ఓం
*దేవ్యై* నమః.
తే.గీ. *దేవి!* నీ పాద సన్నిధిన్ దివ్యమయిన
భావనంబులు
పొందుచు భవ్యమైన
కావ్యకర్తగా
నగుదును కరుణఁ జూపి
నీవె
కావ్యమై వెల్గుమా, నీరజాక్షి!
140. ఓం *షడఙ్గాదిపదక్రమా*యై నమః ।
నామ
వివరణ.
శిక్ష,
నిరుక్తి, ఛందస్సు, జ్యోతిషము, వ్యాకరణము, కల్పకము, అను
షడంగములను
క్రోడీకరించు జనని.
ఉ.
వేద పవిత్ర తేజ! సుమపేశల సన్నుత దేహవౌ *షడ
ఙ్గాదిపదక్రమా!*
శరణు,
కంజదళాయత నేత్ర! యీ షడ
ఙ్గాదిపదక్రమం
బెఱుఁగ, కాంచగ నేర షడంగ సారమౌ
నీదగు
దివ్య తేజమును, నీవె కనంబడు చిత్త భాసివై.
శ్లో.
శివా ధాత్రీ శుభానందా యజ్ఞకర్మస్వరూపిణీ ।
వ్రతినీ మేనకా దేవీ బ్రహ్మాణీ బ్రహ్మచారిణీ ॥ 20 ॥
141. ఓం
*శివా*యై నమః.
నామ
వివరణ.
శుభములను
క్లుఁగఁజేయు జనని శివా మన అమ్మ.
తే.గీ.
వర
శివానందమున్ *శివా!* భక్తులకును
గొలిపి
సంతోషమొప్ప నిన్ గొలువనిమ్మ.
నిన్ను
పూజించి తరియింతు సన్నుతముగ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
142. ఓం *ధాత్ర్యై* నమః ।
నామ
వివరణ.
సమస్తమును
ఇచ్చు జనని.
కం. *ధాత్రీ!* మాతవు
నీవే
ధాత్రీమాతవును
నీవె దయ కల తల్లీ!
యాత్రముతో
కోరెదను ప
విత్రా!
నిను, గనబడుమిక వేగమె నాకున్.
ఓం
*శివాధార్త్యై* నమః.
తే.గీ.
ఓ
*శివా ధాత్రి!* కాశీ మహోత్తమమగు
పురివి తలపన్! గృపాసాంద్ర! పూజ్యపాద!
శుభములను గొల్ప నాలోననభయదవయి
యున్న నిన్ గొల్తు నమ్మరో కన్నతల్లి!
143. ఓం *శుభానన్దా*యై నమః ।
నామ
వివరణ.
శుభములతో
ఆనందముగా ఉం డు జనని.
కం. దయఁ
గనుమ *శుభానందా*!
జయమార్గమునందు
నడిపి చక్కగ నన్నున్
లయయుత
పద్య సుకవిగా
ప్రియమున
నొనరించుమమ్మ వేడెదనిన్నున్.
144. ఓం *యజ్ఞకర్మస్వరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
యజ్ఞకర్మలయొక్క
స్వరూపము అమ్మ.
తే.గీ.
*యజ్ఞకర్మస్వరూపిణీ! * యమర వినుత
వాత్మలో
యజ్ఞసత్కర్మ నమరఁజేసి
యజ్ఞ
ఫలితంబునందించి యనుపమముగ
నీవె
సతతంబు నిలు మదిన్ నీరజాక్షి!
145. ఓం *వ్రతిన్యై* నమః ।
నామ
వివరణ.
తపస్సు
చేయు తల్లి
కం. *వ్రతినీ!* వ్రతములనెఱుగను,
మతిమంతులలోన
నిన్నుమాత్రమె కనుదున్
స్తుతమతివి
కానరావా?
యతులితప్రజ్ఞా
విభూతినందించంగన్.
146. ఓం *మేనకా*యై నమః ।
నామ
వివరణ.
మేన
కుమార్తె మన జనని.
కం. సారసనేత్రా!
*మేనక!*
తీరుగ
నిను కొలుతునమ్మ దీవించు ననున్,
శ్రీ
రమణీ! నా మదిలోఁ
గోరుచు
వసియింపుమమ్మ కూర్మిని జననీ!
ఓం
*దేవ్యై* నమః.
తే.గీ.
దేవివే
కాదు మా దివ్య భావివీవు,
సత్యసన్ముక్తి,
సద్భావి, సదయనొసగు
దివ్య
దేవతా నిన్ను మదిన్ స్మరింతు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
147. ఓం *బ్రహ్మాణ్యై* నమః ।
నామ
వివరణ.
బ్రహ్మ
యొక్క శక్తి మన అమ్మ.
కం. శరణము
*బ్రహ్మాణీ!*
నీ
స్మరణము
విజయాక్షరఫల మార్గము కనగన్,
సరిరారెవ్వరు
నీకిల,
భరమా
ననుఁ గావ నీకు? బ్రహ్మానందా!
148. ఓం *బ్రహ్మచారిణ్యై* నమః ।
నామౌచిత్యము.
బ్రహ్మధ్యాన
నిమగ్న మన అమ్మ.
తే.గీ.
*బ్రహ్మచారిణీ!*
సృష్టియె బ్రహ్మమయము,
జీవుఁడాబ్రహ్మమును
జేరు భావముననె
బ్రహ్మమున
జీవమైక్యమౌన్ ప్రకృతివీవె
బ్రహ్మచారిణివై
యొప్పు బ్రహ్మమీవె.
శ్లో.
ఏకాక్షరపరా తారా భవబంధవినాశినీ ।
విశ్వంభరా ధరాధారా నిరాధారాఽధికస్వరా ॥ 21 ॥
149. ఓం *ఏకాక్షరపరా*యై నమః ।
నామ
వివరణ.
ఓం
అనెడి ఏకాక్షరమే పరముగా కలిగిన తల్లి.
కం. *ఏకాక్షర
పర!*
నీ పతి
లోకేశుఁడు
నిన్ భజించి లోకము లేలున్,
శ్రీకారమైన
చుట్టడు
నీకృపయే
లేనినాడు, నిశ్చయమమ్మా.
150. ఓం *తారా*యై నమః
నామ
వివరణ.
దుఃఖ
సాగరమునుండి సాధకులను తరింపఁజేయు తల్లి.
కం. తారాడునాకసమ్మునఁ
దారలనంతముగ
నుండి ధాత్రికి వెలుగౌ
తారవు
నీవేనమ్మా!
*తారా*
నను బ్రోవుమమ్మ ధన్యుఁడనగుదున్.
151. ఓం *భవబంధవినాశిన్యై* నమః ।
నామ
వివరణ.
ఐహిక
భవ బంధములనునశింపఁ జేయు తల్లి మన అమ్మ.
ఉ. బంధనఁ
జిక్కినాము *భవబంధవినాశిని!
మాదు బంధముల్
ముందుగ
త్రుంచు తల్లివి ప్రమోదముతోడ, దయా స్వరూపిణీ!
కుందుచునుంటి
నేను నిటఁ గోర్కెలతో భవబంధనంబుచే
నెందుకుపేక్ష
చేసెద వహీన దయామతిఁ బాపు బంధముల్.
152. ఓం *విశ్వమ్భరా*యై నమః ।
నామ
వివరణ.
విశ్వముయొక్క
సమస్త భారమును భరించు జనని మన అమ్మ.
అశ్వధాటి.
*విశ్వంభరా*!
మదిని విశ్వాసమున్ గొలిపి శశ్వచ్ఛుభంబరయనీ,
విశ్వేశ్వరీ!
కృపను నాశ్వాసవై నిలిచి విశ్వంబునన్ నిలిపితే,
విశ్వప్రసిద్ధమగు
విశ్వేశు గాధలను శశ్వత్ ప్రభన్ గొలువనీ,
విశ్వాత్మ
నీవె కద, విశ్వాస మొప్ప కృతి నశ్వోద్ధతిన్ గొలుపనీ
153. ఓం *ధరాధారా*యై నమః ।
నామ
వివరణ.
ధర్కు
ఆధారమయిన తల్లి.
కం. జగమేలు
*ధరాధారా! *
నిగమాంత
సువేద్య! మదిని నిన్ను నిలుపనీ.
మొగమాటమేల
కావగ
నగుమోమున
మదిని నిలిచి నను గావగదే.
154. ఓం *నిరాధారా*యై నమః ।
నామ
వివరణ.
ఆధారము
లేని స్వావలంబ మన జనని.
సీ. ఆధార
మీవే *నిరాధార!*
మాకున్, సు రాధీశ్వరీ! రమ్ము! హరిణ నేత్రి!
మేధావులున్
నిన్ బ్రమోదంబుతో నెంచి, ప్రార్థింతురధ్యాత్మ! ప్రకృతివంచు,
ఖేదంబుఁ
బాపన్ ప్రమాదంబులన్ బాప మాదైవమైనిల్చి మమ్ముఁ గనెడి
నీదౌ
కృపన్ గాంచ బోధన్ మదిన్ గొల్పు దీవేకృపాసాంద్ర భావనమున,
తే.గీ.
నీదు
కృపనెంచగానౌనె మోదమునను
బాధలను
బాపి కాపాడు భవ్య తేజ!
శ్రీధరుండును
నిన్ గొల్చు చిత్తమలర,
నో
దయానిధీ! నా మదినుండుమమ్మ.
155. ఓం *అధికస్వరా*యై నమః ।
నామ
వివరణ.
స్వరమునకు
మించిన అధిక స్వర మన అమ్మఽమ్మను స్వరరూపమున
వర్ణింపశక్యము
కాదు.
కం. అధికస్వర
మోంకారం
*బధికస్వర*!
యదియు నీవె యరయగ సృష్టిన్,
మధురంబగు
ప్రణవస్వర
సుధనంబుగ
మదిని నిలుము,
శోభిల
నేనున్.
శ్లో.
రాకా కుహూరమావాస్యా పూర్ణిమాఽనుమతిర్ద్యుతిః ।
సినీవాలీ శివాఽవశ్యా వైశ్వదేవీ పిశంగిలా ॥ 22 ॥
156. ఓం *రాకా*యై నమః ।
నామ
వివరణ.
పూర్ణిమ
చంద్రుడు మన అమ్మయే.
కం. *రాకా!* నిన్నే నమ్మితి,
రా
కావగ నన్నునిపుడె, రమ్యా! కృతికిన్
శ్రీకారముగా
నిలుము శు
భాకారవు
కావ్యమునకు భాస్వన్మణివై.
157. ఓం *కుహ్వే* నమః ।
నామ
వివరణ.
అమావాస్య
రోజున దేవత మన అమ్మ.
చం. వినుత
కుహూరవంబగుచు వీనుల విందుగ నుందువో *కుహూ!!*
ఘనతరమౌ
మహోంకృతికి కమ్మగ నిల్చు ప్రతిధ్వనిప్రభన్
మనములలోన
నిల్చి మము మన్ననఁ గాంచు నమాస దేవి! యే
మని
నిను సన్నుతింపనగు? హాయిగ నా యెద నుంచెదన్ సదా.
158. ఓం *అమావాస్యా*యై నమః ।
నామ
వివరణ.
అమావాస్య
అమ్మయే.
సీ. భయము
గొల్పెడి యమావాస్యాంధకారాననలమటించుచునుండ
ననుపమముగ
మానస
వీధిలో మహనీయమౌ *యమావాస్య! * మాతగ నిల్చి భయము వాపి,
తేజోమయంబుగా దీపించు
నిన్ గొల్చి నా జీవితమున ఘనముగ నిలుతు,
ప్రార్థింతు
నిన్ మదిన్ భాసింపుమంచును ప్రఖ్యాతినే గొల్ప పద్యములకు
తే.గీ.
నీవమావాస్యవయియున్న
నిండు జాబి
లివిగ
నిజముగ నా మదిన్ గవన గతిని
శాశ్వతంబుగా
వెలిగెడి సత్య రూప!
వందనంబులు
చేసెద నందుకొనుము.
159. ఓం *పూర్ణిమా*యై నమః ।
నామ
వివరణ.
పూర్ణిమ
అమ్మయే.
కం. నిలుతువు
మది పూర్ణిమగా!
కొలుతును
నిను నీవు చూపు కూర్మిని కనుచున్,
నిలుపుము
ప్రజలను *బూర్ణిమ! *
సలలితపదపద్యములను
చక్కగఁ మనుచున్.
160. ఓం *అనుమత్యై* నమః
నామ
వివరణ.
ప్రేరణఁ
గొలిపి సాధన కొఱకు అనుమతినిచ్చు తల్లి,
కం. అనుమతినిమ్ము
రచింపగ
*ననుమతి! * నీ పయిన కవిత ననుపమరీతిన్
వినయముతో
వినిపించెద
ఘనతరముగ
నిన్ను నేను కాదనకమ్మా.
161. ఓం *ద్యుత*యే నమః ।
నామ
వివరణ.
అమ్మ
కాంతి స్వరూపిణి.
చం. అమిత
భవాంధకారమున నద్భుతమౌ ద్యుతి వీవెగా *ద్యుతీ!*
యమలిన
సాధనాపటిమ నందగఁ జేయ కృపార్ణవంబనన్
బ్రమదముతోడ
వెల్గెదవు భవ్యముగా వెలుగొంద నా మదిన్,
సుమధుర
భావపూర్ణమగు సూనృత సత్పద జాల మీవెగా.
162. ఓం *సినీవాల్యై* నమః ।
నామ
వివరణ.
చంద్రకళ
కానవచ్చెడి అమావాస్య ముందురోజు, బహుళచతుర్ధశి. అమ్మయే.
కం. భవబంధాంధపు
నా మది
ని
వసించుచు వెలుగులీను నిర్మల తేజా!
నివసించు
*సినీవాలీ! *
కవితామృతమై
వెలుగుము కారుణ్యముతో.
ఓం *శివా* యై నమః
తే.గీ.
నీ
శివాకారమున్ జూచి నేను పొంగి
కవిత
లొలికింతునా *శివా!* ప్రవరముగను,
చెంతనే
యుండి వ్రాయించు చింత తీర్చు.
వందనంబులు
చేసెదనందుకొనుము.
163. ఓం *అవశ్యా*యై నమః ।
నామ
వివరణ.
ఎట్టి
వారికినీ వశము కాని అవశ్య మన అమ్మ.
తే.గీ.
వశ్యవయినట్లు
తోచు నవశ్యవీవు,
వశ్యమగుదును
నీకు *నవశ్య* నిజము,
దృశ్యమగునవి
భ్రమలే యదృశ్యవీవె
శాశ్వతమ్మగు
శక్తివి, సదయగనుమ.
ఓం
*వశ్యా*యై నమః.
తే.గీ.
*వశ్య! * సన్మార్గమును నా కవశ్యమిడుము
పశ్యమానవై కృపఁగను పరవశింతు,
నీకు పుణ్యంబు నన్ గన్న నిరుపమాన!
వందనంబులు చేసెద నందుకొనుము.
164. ఓం *వైశ్వదేవ్యై* నమః ।
నామ
వివరణ.
విశ్వదేవతల
రూపము అమ్మయే.
తే.గీ.
*వైశ్వదేవీ! * ప్రభా పూర్ణ! విశ్వమునను
నీవె
సృష్టించి నాశన మీవె చేసి
మరలసృష్టించుటేలను?
మర్మమెఱుగ
నమ్మ
తెలుపుము నాకుననంత విభవ!
165. ఓం *పిశఙ్గిలా*యై నమః ।
నామ
వివరణ.
మృదువగు
శరీరముతో ప్రకాశించు జనని.
కం. పుత్తడివో
యిత్తడివో
లత్తుకవో
కన *పిశఙ్గిలా! * నీవరయన్,
క్రొత్తగనుందువు
సతతము
మత్తనువున
నీవు జనని!
మహిమాన్వితవై.
శ్లో.
పిప్పలా చ విశాలాక్షీ రక్షోఘ్నీ వృష్టికారిణీ ।
దుష్టవిద్రావిణీ దేవీ సర్వోపద్రవనాశినీ ॥ 23 ॥
166. ఓం *పిప్పలా*యై నమః ।
నామ
వివరణ.
త్రిమూర్తి
స్వరూపమగు (అశ్వత్థ)పిప్పల(రావి) వృక్షము అమ్మయే.
తే.గీ.
కన్న
తల్లిగ *పిప్పలా*!
కాతువీవు
మన్ననముతోడ
తోడుండి మనుజులనిల
చిన్ననాడీవె
నన్ జేరి మన్ననముగ
శక్తి
నిచ్చియు నేటికిన్ జయద వయితి.
167. ఓం *విశాలాక్ష్యై* నమః ।
నామ
వివరణ.
సువిశాల
నేత్ర సంభాస మన అమ్మ.
తే.గీ.
చింత
లేదమ్మ నేను నీ చెంతనున్న
నో
*విశాలాక్షి! * నామది నుండుమమ్మ,
నీ
విశాలనేత్రప్రభ నిత్యము మది
నింపుకొందును
కృపతోడ నీవె కనుమ.
168. ఓం *రక్షోఘ్న్యై* నమః ।
నామ
వివరణ.
రాక్షసులను
స్ంహరించు జనని మన అమ్మ.
కం. *రక్షోఘ్నీ! * నా మదిలో
రక్షోగణమే
మెదలు పరంబును గననీ
వక్షీణ
దయామతి! నన్
రక్షింపుము
వీటి నుండి ప్రాణ ప్రదవై.
169. ఓం *వృష్టికారిణ్యై* నమః ।
నామ
వివరణ.
వర్షమునకు
కారణమగునది మన అమ్మయే.
కం. సృష్టించితి
వీసృష్టిని
వృష్టిని
కల్పించి నావు
పృథ్విని
పంటల్
తుష్టుగపండఁగఁ
జేయగ,
నిష్టముతో
*వృష్టి
కారిణీ! *నినుఁగొలుతన్.
170. ఓం *దుష్టవిద్రావిణ్యై* నమః
నామ
వివరణ.
చెడ్డవారిని
తరిమి కొట్టు జనని మన అమ్మ.
తే.గీ.
*దుష్ట విద్రావిణీ!* నాదు దురిత గతిని
నీవె
పాపుమా రక్షింప నీరజాక్షి!
దుష్ట
సంహారిణీ!
కృపన్ దోచి మదిని,
కాచి
రక్షింపుమమ్మరో కరుణఁ జూపి.
ఓం
*దేవ్యై నమః.
తే.గీ.
దేవలోకంబు
గొలిపెడి *దేవి!* నిన్ను
భావనంబున
సేవింతు భక్తితోడ,
నీవె
నాకింక రక్షణ, నిరుపమాన!
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *దుష్టవిద్రావిణీదేవ్యై* నమః
తే.గీ.
*దుష్టవిద్రావిణీదేవి*! శిష్ట రక్ష!
మానసంబున నీవుండి మహిమఁ జూపి
దుష్టచింతనలెడఁబాపి శిష్టభావ
పూర్ణునిగ నన్నుఁ జేయుచుఁ బ్రోవుమమ్మ!
171. ఓం *సర్వోపద్రవనాశిన్యై* నమః ।
నామ
వివరణ.
సమస్తమగు
ఉపద్రవములను నశింపఁజేయు జనని.
శా. *సర్వోపద్రవ నాశినీ!* కనుమిటన్ జ్ఞానార్జనా దృష్టితో
సర్వంబీవ
యటంచు నిన్నె గనుచో సర్వత్ర నా కిత్తరిన్
సర్వోపద్రవరాశి
యడ్డమగుటన్, సాధింప లేకుంటినే,
సర్వోపద్రవముల్
విడన్ గనుమ, భాషా యోష! నిన్ గొల్చెదన్.
శ్లో.
శారదా శరసంధానా సర్వశస్త్రస్వరూపిణీ ।
యుద్ధమధ్యస్థితా దేవీ సర్వభూతప్రభంజనీ ॥ 24 ॥
172. ఓం *శారదా*యై నమః ।
నామ
వివరణ.
జ్ఞానమును
ఇచ్చు తల్లి మన అమ్మ.
తే.గీ.
*శారదా*! మాత!
నిన్ గొల్తు చక్కగాను,
చక్కనైనట్టి
పదములన్ సరగుననిడి
నిన్ను
వర్ణింపనీయుమా నేర్పు మీర,
వందనంబులు
వాణి! నీవందుకొనుము.
173. ఓం *శరసన్ధానా*యై నమః ।
నామ
వివరణ.
శరములను
సంధించు తల్లి మన అమ్మ.
తే.గీ.
చూడు
మో *శరసంధాన!* చుట్టిముట్టి
యాత్మలోనున్న
శత్రువులందరినిఁక
శరముఁ
బట్టి యడంచుమా, సంస్తుతముగ,
నిన్ను
దర్శింపనీయుమా నిక్కముగను.
174. ఓం *సర్వశస్త్రస్వరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
సమస్తమగు
శస్త్రముల స్వరూపమూ అమ్మయే.
తే.గీ.
*సర్వ శస్త్ర
స్వరూపిణీ!
* చంద్రవదన!
శత్రుషట్కమున్,
బాపుమా! సన్నుతముగ,
నిన్ను
దర్శింపఁగలిగెడి నేర్పునిమ్మ!
నిన్ను
చేరంగనగు నాకు నిక్కముగను.
175. ఓం *యుద్ధమధ్యస్థితా*యై నమః ।
నామ
వివరణ.
యుద్ధము
మధ్యలో ఉండు జనని మన అమ్మ.
తే.గీ.
*యుద్ధమధ్యస్థితా!* యాత్మశుద్ధినొసఁగు
మాత్మలోయుద్ధరంగాన
నలసి యున్న
నన్నుకాపాడుమమ్మరో!
మన్ననమున
నోపలేనింక
నీవె నా కాపువమ్మ.
ఓం
*దేవ్యై* నమః.
తే.గీ.
*దేవి!
* నిన్
గొల్చెదన్ నాకు దీవనలిడు,
భక్తి
భావంబు మనసులో ప్రబలనిమ్ము,
యుక్తినే
గొల్పి భువిపైననుండనిమ్ము,
వందనంబులు
చేసెదనందుకునుము.
ఓం *యుద్ధమధ్యస్థితాదేవ్యై*
నమః ।
తే.గీ.
*యుద్ధమధ్యస్థితాదేవి*! యుక్తినిమ్మ,
నిన్ను మనమున నిరతంబు నిలుపనిమ్మ,
యాత్మలో యుద్ధమాపుమా యహము పాపి
నీవె నిజమని బోధించి నిలుము మదిని.
176. ఓం *సర్వభూతప్రభఞ్జన్యై* నమః ।
నామ
వివరణ.
అన్ని
భూతములను మిక్కిలి నశింపఁజేయు తల్లి మన అమ్మ.
తే.గీ.
*సర్వభూత ప్రభంజనీ! * సదయ నీవు
భూత
తతినుండి కావుమా, ఖ్యాతిగ నను,
నిన్నె
నిత్యమున్ గొలుచుచునున్నవాఁడ,
నీవెనాలోన
నుప్పొంగు భావమమ్మ
శ్లో.
అయుద్ధా యుద్ధరూపా చ శాంతా శాంతిస్వరూపిణీ ।
గంగా సరస్వతీవేణీ యమునా
నర్మదాపగా ॥ 25 ॥
177. ఓం *అయుద్ధా*యై నమః ।
నామ
వివరణ.
యుద్ధ
రహిత మన అమ్మ.
తే.గీ.
యుద్ధబాహ్యా!
*యయుద్ధా! మహోపకార
మగును
యుద్ధముల్ నిలిపిన ననుపమముగ
శాంతి
సౌభాగ్యదాయినీ సన్నుతింతు
నాత్మలన్
యుద్ధయోచనలాపుమమ్మ.
178. ఓం *యుద్ధరూపా*యై నమః ।
నామ
వివరణ.
యుద్ధరూపము
అమ్మయే.
తే.గీ.
*యుద్ధరూపా*!
దురాచారబద్ధులిలను
శాంతి
మార్గమున్ విడనాడి చంపుకొనుటె
మార్గముగఁ
జేసియుండిరి, మాపుమమ్మ!
ధర్మబాహ్యులన్
దురితులన్, దండనమున.
179. ఓం *శాన్తాయై* నమః ।
నామ
వివరణ.
శాంతమనే
స్వభావము అమ్మయే.
తే.గీ.
శాన్తి
యొక్కటె ప్రగతికి చక్కనయిన
మార్గమగుటను
*శాన్త!*
సన్మార్గమందు
నడువనెంచితి
శాన్తినే నడుపుమమ్మ.
నాదు
మదిలోన నీవుండి నయ నిధాన.
180. ఓం *శాన్తిస్వరూపిణ్యై* నమః
నామ
వివరణ.
శాంతికి
రూపము అమ్మయే.
తే.గీ.
నిఖిల
*శాన్తిస్వరూపిణీ!*
నీవె యుండి
పాపు
మీవే యశాన్తిని పన్నిదముగ
నీదు
భక్తులు నిన్ గొల్త్రు నిత్యముగను
శాన్తి
సౌభాగ్య వర్ధనన్, సదయ గనుమ.
181. ఓం *గఙ్గా*యై నమః ।
నామ
వివరణ.
గంగామాత
అమ్మయే.
కం. *గంగా*!
దేవీ!
నిను గని
పొంగునటుల
పాపముడిపి ముక్తిదవగుమా,
బెంగలలోకమునందున
నెంగిలిపడు
బ్రతుకదేల నేర్పడచెపుమా.
182. ఓం *సరస్వత్యై* నమః ।
నామ
వివరణ.
సరస్వతీ
మాత అమ్మయే.
ఉ. జ్ఞాన
సుధాస్రవంతిగ ముఖంబుల వెల్గెడి యో *సరస్వతీ*!
ధీనిధులైన
పెద్దలు మదిన్ నినుఁ గొల్చెడి భాగ్యవంతులై
జ్ఞానముఁ
గొల్పు భక్తిని, ప్రకాశము చేయుచు సజ్జనాళిలో
మానిత
మూర్తులౌదురిట మన్ననలందుచు నీదు సత్కృపన్.
183. ఓం *వేణ్యై* నమః ।
నామ
వివరణ.
కృష్ణవేణి
అమ్మయే.
కం. *వేణీ!*
నాలో నీవే
జ్ఞానముగా
నురకలిడుచు కవితా రీతిన్
మౌనముగా
ప్రవహింతువు,
నేనున్
నిన్ననుసరించి నిలుచుదునమ్మా.
184. ఓం *యమునా*యై నమః ।
నామ
వివరణ.
యమునా
స్వరూపము అమ్మయే.
కం. *యమునా!* జననిగఁ బ్రజలను
సముచితముగ
కాచుచున్న చక్కని తల్లీ!
ప్రమదముతోడ
భజింతును
సముదంచిత
కవన ధార జయదా! యిమ్మా.
185. ఓం *నర్మదా*యై నమః ।
నామ
వివరణ.
నర్మదా
స్వరూపము అమ్మయే.
తే.గీ.
*నర్మదా!*
దయఁ జూపి నన్ నడుపుమమ్మ,
నర్మగర్భంపు
సత్కల్పనా కవిత్వ
ధారలందించి
పలికించు తరళ నయన!
వందనంబులు
చేసెద నందుకొమ్మ.
186. ఓం
*అపగా*యై నమః.
నామ
వివరణ.
నీరుగా
ప్రవహించు గంగామాత అమ్మయే.
తే.గీ.
*అపగ!*
జ్ఞానామృతంబు నాకందఁజేసి
యపగగా
లోన వెల్గు నిన్నరయ నిమ్ము,
ప్రపవు
ముక్తిదాహార్తుల కుపకరించు
జ్ఞానజలము
నందించుచు కాచెదవుగ.
శ్లో.
సముద్రవసనావాసా బ్రహ్మాండశ్రేణిమేఖలా ।(శ్రోణి)
పంచవక్త్రా దశభుజా శుద్ధస్ఫటికసన్నిభా ॥ 26 ॥
187. ఓం *సముద్రవసనావాసా*యై నమః ।
నామ
వివరణ.
సముద్రమనెడి
వస్త్రమునే ఆవాసముగా కలిగిన తల్లి.
కం. అసమానవు!
ధీ జలధిని
వసనముగా
కల *సముద్రవసనావాసా!*
వసుధను
నీ సేవకునిగ
రసరమ్య
కవిత్వ ఖనిగ ప్రబలింపుము నన్.
188. ఓం *బ్రహ్మాణ్డశ్రేణిమేఖలా*యై నమః ।
నామ
వివరణ.
విశ్వశ్రేణిని
మొలత్రాడుగా కలిగిన జనని.
కం. బ్రహ్మజ్ఞానాసక్తుల్
*బ్రహ్మాణ్డశ్రేణిమేఖలా!*
నినుఁ గనినన్
బ్రహ్మజ్ఞానము
కలుగును,
బ్రహ్మజ్ఞానంబు
నాకుఁ బట్టుగ నిమ్మా.
189. ఓం *పఞ్చవక్త్రా*యై నమః ।
నామ
వివరణ.
విశాలమయిన
ఐదు ముఖములు కలిగిన జనని.
పంచచామరము.
విశాలపంచవక్త్రవమ్మ!
విశ్వశాంతిఁ గొల్పుమా.
విశిష్ట!
*పఞ్చవక్త్ర!*
నీకు ప్రీతినంజలించెదన్,
ప్రశాంత
చిద్విరాజమాన భవ్య భావన ప్రభల్
ప్రశస్తిగానొసంగుమా, నిరంతరంబు
గొల్చెదన్.
190. ఓం *దశభుజా*యై నమః ।
నామ
వివరణ.
పది
భుజములు కలిగిన తల్లి మన అమ్మ.
కం. దశదిశలన్
భుజములుగా
*దశభుజ!* నీవొప్పుచుండి ధరియించితె యీ
నశియించు
దేహమందున
నశియింపని
నీవు కలిగి నన్ గృపఁ గనితే.
191. ఓం *శుద్ధస్ఫటికసన్నిభా*యై నమః
నామ
వివరణ.
స్వచ్ఛమయిన
పటిక్వలె శుద్ధమయినది మన అమ్మ.
కం. ఆశలు
చెలరేగుచు నా
శ్రీశునిపై
ధ్యాసఁ దప్పఁజేయుచునుండెన్,
శ్రీ
శక్తీ! కావగ రా
వా!
*శుద్ధస్పటిక సన్నిభా!* ననుఁ బ్రోవన్
శ్లో.
రక్తా కృష్ణా సితా పీతా సర్వవర్ణా నిరీశ్వరీ ।
కాళికా చక్రికా దేవీ సత్యా తు వటుకాస్థితా ॥ 27 ॥
192. ఓం *రక్తా*యై నమః ।
నామ
వివరణ.
భక్తులయెడ
అనురక్తి కలిగిన జనని. రక్తముగ మనలో నుండు జనని. ఎఱుపు
వర్ణముతో
ప్రకాశించు తల్లి.
కం. *రక్తా!* భక్తిగ ని న్నను
రక్తుఁడనై
కొలుతునమ్మ! రమ్య గుణాఢ్యా!
భక్తుల
కల్పకమీవే,
భుక్తిని
ముక్తిని నొసగుచుఁ బ్రోవుము జనులన్.
193. ఓం *కృష్ణా*యై నమః ।
నామ
వివరణ.
నలుపు
రంగుతో ప్రకాశించు జనని.
తే.గీ.
కృష్ణ
నామంబు జపియింపఁ గీడు తొలఁగు,
కృష్ణ
రూపంబు గాంచినన్ దృప్తి కలుగు,
*కృష్ణ!* నీవు దీవించ సత్కృతియె కలిగి
విష్ణు
సాయుజ్యమొదవును విదితముగను.
194. ఓం *సితా*యై నమః ।
నామ
వివరణ.
తెల్లని
వర్ణముతో ప్రకాశించు జనని.
తే.గీ.
అంబుజాసనవు
*సిత!*నీ వమర మదిని
కోరికలు
కడఁదేరెడునేరికైన,
సిత
మహద్జ్ఞాన సముపేత! భూతలాన
ననఘవిజ్ఞానమందించుమతులితముగ.
195. ఓం *పీతా*యై నమః ।
నామ
వివరణ.
బంగారు
రంగుతో ప్రకాశించు జనని.
తే.గీ.
*పీత!*
నీ వర్ణమే నాకు ఖ్యాతి గొలుపు,
కాంతినొప్పెడి
ముక్తిపై భ్రాంతిఁ గొలుపు,,
శాంతచిత్తంబె
పుత్తడి, చక్కనైన
క్రాంతిమార్గంబు
చూపించు ఘనతఁగొలుపు.
196. ఓం *సర్వవర్ణా*యై నమః ।
నామ
వివరణ.
అన్ని
వర్ణములూ అమ్మయే.
తే.గీ.
*సర్వవర్ణా!*
శుభాకార! సగుణ సాక్షి!
సర్వ
వర్ణంబులైన ప్రశాంతరూప!
నిన్ను
సేవింప శుభదవై నన్నుఁ గాచి
ముక్తి
సన్మార్గమునుఁజేర్పఁ బూనుదువుగ,
197. ఓం *నిరీశ్వర్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
నిరీశ్వరి. అమ్మయే ఈశ్వర స్వరూపము.
తే.గీ.
ఈశ్వరివి
నీవె, యీశ్వరుఁడేలనీకు,
నో
*నిరీశ్వరీ!*సృష్టినే
జ్ఞాన
మతిని
సృష్టి
చేసెడి తల్లివి దృష్టి పెట్టి,
నన్ను
నడిపింపుమమ్మరో! సన్నుతముగ.
198. ఓం *కాలికా*యై నమః ।
నామ
వివరణ.
భయంకరమగు
కాలికా స్వరూపిణి అమ్మయే.
తే.గీ.
కాలికాదేవివీవు,
సత్ కావ్య రచనఁ
జేయఁ
జేయుము నాచేతఁ జేవతోడ,
దుష్టభావాళిఁ
బాపి నీ త్రోవలోన
నడుపుమా
నన్ను *కాళికా!* విడువకమ్మ.
199. ఓం *చక్రికా*యై నమః ।
నామ
వివరణ.
శ్రీచక్రమున
నుండు జనని. చక్రధారిణి మన అమ్మ, చక్రస్థుఁడగువానికి సంబంధించినది
మన
జనని చక్రిక.
తే.గీ.
మహిత
శ్రీచక్ర మందుండి మన్నన నిల
వెలుగు
శ్రీచక్రికా! నిన్నుఁ గొలుతునమ్మ,
నా
మనోభావనల్ గాంచి నన్ను గాచు
నిన్ను
ప్రార్థింతు, చేకొను నిరుపమముగ.
ఓం *దేవ్యై* నమః ।
నామ
వివరణ.
దేవత్వముతో
నొప్పారు జనని మన అమ్మ.
కం. *దేవీ!* నీ ప్రాభవమును
భావించగఁ
జాల నేను, భద్రతఁ గొలుపన్
నీవన్నను
నాకిష్టము,
నీవే
నను గావుమమ్మ
నిత్యంబిలపై.
ఓం *చక్రికాదేవ్యై* నమః ।
తే.గీ.
*చక్రికాదేవి*! నాలోని వక్రబుద్ధి
నీవు కల్పించినది కాదు, నిన్ను గనక
వక్రతనుబొందె, పాపుమీ వక్ర బుద్ధి.
నీవె సక్రమముగ మదిన్ నిలుము జనని!
200. ఓం *సత్యా*యై నమః
నామ
వివరణ.
సత్యము
యొక్క స్వరూపిణి మన అమ్మ.
కం. *సత్యా!* నిన్ గొలిచెద నౌ
న్నత్యంబును
గొలుపుమమ్మ, నన్నిలఁ గనుచున్
నిత్యము
నే నివసించెద,
నిత్యత్వముఁ
గొలుపు నాకు నిర్మల రూపా!
201. ఓం *వ(బ)టుకా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
బ్రహ్మచారిణి నిరంతరము బ్రహ్మమున చరించుచు ఆమెయే బ్రహ్మముగా సృష్టి
మూలమయిన
జనని.
కం. *వ(బ)టుకా! * యెప్పుడదెచ్చట
నెటునేర్చితొబ్రహ్మచర్య
మేవిధి నాకున్
పటువుగ
నేర్పుదొ?, కావలె
నిటలాక్షుఁడు
మెచ్చ నేర్తు నీకృప యున్నన్.
202. ఓం *స్థితా*యై నమః ।
నామ
వివరణ.
సృష్టిల్
ఏదయినా ఉన్నదనుచు ఉన్నచో అది అమ్మయే. కావున అమ్మ స్థిత.
తే.గీ.
స్థిరత లేదమ్మ
మనసున కరసి నీవు
స్థిరతఁ
గలిగించి మీవైపుచేర్చుకొనుము,
*స్థిత*! మనంబందు నీవున్న శ్రుతులవేల?
పరమదొక్కటే
చాలును పంచవదన.
శ్లో.
తరుణీ వారుణీ నారీ జ్యేష్ఠాదేవీ సురేశ్వరీ ।
విశ్వంభరాధరా కర్త్రీ గళార్గళవిభంజనీ ॥ 28 ॥
203. ఓం *తరుణ్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
నిత్య యౌవన.
తే.గీ.
తరుణమిదె
ననుఁగావగ *తరుణి! * కృపను
పరమనోహర
మార్గాన వరలఁజేసి
నిరుపమానందసామ్రాజ్య
నేతగ నను
చేయుమోయమ్మ
కృపఁ జూపి చిద్విభాస.
204. ఓం *వారుణ్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
వరుణ స్వరూపిణి,వారుణి అమ్మయే.
తే.గీ.
*వారుణీ!*మాత! నాయందు వరలుమమ్మ,
భక్తిసుధనాకుదయనిచ్చి
ముక్తి కనెడి
మార్గమందున
నడపుమామహితముగను.
నిన్ను
సేవింతునమ్మ నేన్ నెమ్మితోడ.
205. ఓం *నార్యై* నమః ।
నామ
వివరణ.
సృష్టికి
మూల ప్రకృతి అయిన స్త్రీ అమ్మయే. శత్రు భజన చేయునపుడు వింటి నారి
శక్తియు అమ్మయే.
కం. *నారీ! * నీవే దారిగఁ
గోరుచు
నిను జేరితమ్మ, కూర్మిని నాకున్
వారిజనాభుని
జూపుము
వారికి
నే నంజలింతు భక్తిగనిపుడున్.
206. ఓం
*జ్యేష్ఠాదేవ్యై* నమః ।
నామ
వివరణ.
జ్యేష్ఠాదేవి
అమ్మయే.
తే,గీ,
వినుము
మొరను *జ్యేష్ఠా దేవి* విశ్వసించి
కలుగు కష్టంబులన్
గని కనికరించు,
పాపుమీ
కష్టముల్ నీవు ప్రాపువగుచు.
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *జ్యేష్ఠాయై* నమః ।
నామ
వివరణ. సృష్టికే జ్యేష్ఠురాలు అమ్మ.
తే.గీ.
జ్యేష్ఠగా
నీవు నాలోని
చిలిపి
దౌష్ట్య
భావజాలంబు
తుడిచి స్వభావ సిద్ధ
ధర్మ
సన్మార్గ గామిగా దయను చేసి
కాచి
రక్షించుమా *జ్యేష్ఠ! * కరుణతోడ.
ఓం *దేవ్యై* నమః.
నామ
వివరణ.
కం. *దేవీ!* దీవింపుము నన్
భావనలో
నిలువుమమ్మ వరలఁగఁ జేయన్,
సేవానిరతినికొలుపుము
సేవించెద
నమ్మ నిన్ను, శ్రితజన పోషా!
207. ఓం *సురేశ్వర్యై* నమః ।
నామ
వివరణ.
దేవతలకు
అధిపతి అమ్మయే
కం. సర్వాత్మ!
*సురేశ్వరి!* మా
సర్వేశ్వరి!
సర్వ జగతి సన్మయముగ, సత్
పర్వముగా
నడిపించుమ,
గర్వాంధము
వాపి ప్రజను కాయుము జననీ!
208. ఓం *విశ్వమ్భరా*యై నమః ।
నామ
వివరణ.
సృష్ఠి
మొత్తమును భరించు తల్లి అమ్మయే.
తే.గీ.
విపుల
*విశ్వమ్భరా*దేవి! వినుత కీర్తి!
గాంచి
యున్నట్టి నిను కృపన్ గాంచనిమ్ము,
ముక్తిసాధన
మార్గంబు రక్తినొసగి
భక్తితోపాటు
ముక్తిని వరల నిమ్ము.
209. ఓం *ధరా*యై నమః ।
నామ
వివరణ.
సృష్టి
మొత్తమును ధరించు జనని అమ్మయే.
తే.గీ.
విను
*ధరా! * నాదు మొరలను వీనులార,
కనుమ
మదిలోని వేదనన్ గరుణతోడ,
మనగఁ
జేయుము నీ దరిన్ మన్నన గన,
ప్రణతులందుము
చేసెద భక్తితోడ.
210. ఓం *కర్త్ర్యై* నమః
నామ
వివరణ.
సమస్త
సృష్టి కార్యమునకు కర్త అమ్మయే. శత్రిభంజక ఖడ్గము అమ్మయే.
తే.గీ.
కార్యకర్తవు
నీవెగా *కర్త్రి! * యరయ
కర్మఫలములననుభవమర్మమెఱుగ
కర్మ
మాచేత చేయించు కర్త్రివి కని
కర్మఫలములు
బాపుమా మర్మదూర!
211. ఓం *గలార్గలవిభఞ్జన్యై* నమః ।
నామ
వివరణ.
సమస్యలను
ఛేదించు అమ్మ. శివుని గలమునవిషప్రభావమును ఆపినది మన అమ్మయే.
తే.గీ.
మొర
విను *గలార్గలవిభఞ్జని! * రయమునను
నన్ను
కాపాడగారమ్ము మన్ననమున
శివుని
కంఠాన గరళమున్ జేవచూపి
మ్రింగుటాపి
జగాలకు మేలు కనవె?
శ్లో.
సంధ్యారాత్రిర్దివాజ్యోత్స్నా కలాకాష్ఠా నిమేషికా ।
ఉర్వీ కాత్యాయనీ శుభ్రా సంసారార్ణవతారిణీ ॥ 29 ॥
212. ఓం *సన్ధ్యా*యై నమః ।
నామ
వివరణ.
త్రిసంధ్యలూ
అమ్మయే. మానవుని జీవితమున సంధ్యలన్నియు అమ్మయే.
కం. *సంధ్యా! * కాలము గతమగు,
మాంద్యమునెడఁ
బాపి బుద్ధిమంతునిగా నన్
బంద్యంబనకునికిక
ప్రాక్
స్సంధ్యగ
మేల్గొలుపుమమ్మ మేదినిపైనన్.
213. ఓం *రాత్ర్యై* నమః ।
నామ
వివరణ.
రాత్రి
స్వరూపము అమ్మయే.
తే.గీ.
*రాత్రి! * యజ్ఞానతిమిరమే రాత్రి కనఁగ,
రాత్రి
వేళల మము ప్రోవ రాత్రివయితె?
యాత్మ
సుజ్ఞాన తేజంబునమరఁజేసి
జ్ఞాన
సంపత్తితో ముక్తి కాంతనిడుమ.
214. ఓం *దివా*యై నమః ।
నామ
వివరణ.
పగలు
అమ్మ రూపమే.
తే.గీ.
ఓ
దివా!
నీదు తేజమే యొప్పగ మది
వెలుగుగా
నిమ్ము వాగ్ఝరిన్ వేల్పువగుచు,
మాయ
తిమిరంబు నీ కృపన్ మాయఁజేసి
వ్రాయగానిమ్ము
సత్కృతుల్ వాసిగాను.
215. ఓం *జ్యోత్స్నా*యై నమః ।
నామ
వివరణ.
వెన్నెల
అమ్మయే.
కం. చల్లగ
వెలిగెడి *జ్యోత్స్నా!*
యుల్లంబున
నీవె కలుగ నోంకృతివగుచున్
మల్లెల
సౌరభములతో
కల్లలు
లేనట్టి కవిత కల్పింతునుగా.
216. ఓం *కలా*యై నమః ।
నామ
వివరణ.
చంద్రవంక
అమ్మయే. అమ్మ కళలస్వరూపమే.
కం. కలకాలము
నిలిచెడి సత్
కలవై
ప్రభవించుమ *కల!* కావ్యాకృతిగా
సులలిత
పదచయమున మన
సులనే
గొనునటులను భువిజులుగని మెచ్చన్.,
217. ఓం *కాష్ఠా*యై నమః ।
నామ
వివరణ.
కాలమున
కాష్ఠ పరిమితి అమ్మయే.
తే.గీ.
కాష్ట
భాగంబు నా కృతిన్ గలిగి నీవె
యున్న
శేషంబు పూరింతు మన్ననముగ,
*కాష్ట!* నినుఁ
గొల్తు నటులుండు గౌరవమిడ,
నీదు
ప్రేమకు జయమమ్మ, నిర్వివాద!
218. ఓం *నిమేషికా*యై నమః ।
నామ
వివరణ.
రెప్పపాటు
కాలము అమ్మయే.
పంచచామరము.
*నిమేషికా!* సతంబు నేను, నిన్నుఁ గొల్తు సమ్మతిన్,
సమంచితప్రభన్
వెలింగి చక్కగాను నా మదిన్
ప్రమోదమందఁ
జేయుచున్ నిరంతరంబు భక్తితో
నమస్కరింతునమ్మ నీకు, నన్ను తీర్చి దిద్దుమా.
219. ఓం *ఉర్వ్యై* నమః ।
నామ
వివరణ.
విశాలమయిన
భూభాగము అమ్మయే.
కం. *ఉర్వీ!* నీ దయ కలిగిన
సర్వంబును
సాధ్యమగునసామాన్యముగన్,
గర్వంబణచుము,
నన్నున్
బర్వంబులలోన
ముంచి వర్ధిలనిమ్మా!.
220. ఓం *కాత్యాయన్యై* నమః
నామ
వివరణ.
కాత్యాయన
మహర్షి కుమార్తె అయిన కాత్యాయని అమ్మయే.
కం. నిత్యానందకరీ! మా
*కాత్యాయని!*
నిన్ను నేను గణియింతు మదిన్,
నిత్యంబు
నాత్మతేజము
నత్యుత్తమమంచునెంచి,
యలరగ నిమ్మా.
221. ఓం *శుభ్రా*యై నమః ।
నామ
వివరణ.
పవిత్రత
అనునది అమ్మయే.
తే.గీ.
*శుభ్ర!*
సత్ పూజ్య! నిన్ను నా శుద్ధ మతిని
నిలిపి
కొలిచెద నెమ్మితో నిష్కలంక!
కనెద
పరమాత్మ శుభ్రతన్, కన్నులలయ,
మన్ననముననీవుండుమా
మదిని కృపను.
222. ఓం *సంసారార్ణవతారిణ్యై* నమః ।
నామ
వివరణ.
సంసార
సాగరమును దాటించు జనని అమ్మయే.
కం. *సంసారార్ణవ తారిణి! *
హంసవు
మదిలోన నీవహమ్మన నీవే,
హింసా
దూరునిచేసి, ప్ర
శంసార్హునిగా
నొనర్చి చక్కగ కనుమా.
శ్లో.
కపిలా కీలికాఽశోకా మల్లికానవమల్లికా । [ మల్లికానవమాలికా ]
దేవికా నందికా శాంతా భంజికా భయభంజికా ॥ 30 ॥
223. ఓం *కపిలా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
కపిలవర్ణ శోభిత.
కం. *కపిలా!*
నాలో
నిలుచుచు
విపరీతములున్న
నణచు వేల్పువు జననీ!
యపవిత్రుల
దరి చేరక
సుపవిత్రునిగ
నను నిలిపి శోభిలనిమ్మా.
224. ఓం *కీలికా*యై నమః ।
నామ
వివరణ.
అన్నిటికీ
కీలకమయిన అక్షము అమ్మయే.
కం. కీలకమగు
వేళలలో
*కీలక!*నీవుండి నీదు కేలునొసగుచున్,
జాలిని
కావుమ నన్నున్,
నాలోనున్నాత్మవీవె
నా జనయిత్రీ!
225. ఓం *అశోకా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
శోకమనునది లేని జనని.
కం. శోకరహిత*వశోక! * యశోకునిగను
నన్ను
నిరతంబు చేయుమా నిన్నుఁ గొలుతు,
దైవమానందరూపుడై
భావనమున
వెలుగునట్టుల
చేయుమా వేల్పువగుచు.
226. ఓం *మల్లికానవమల్లి(మాలి)కా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
మల్లిక, మల్లెలమాలను ధరించు జనని.
తే.గీ.
*మల్లికా నవమల్లి(మాలి)కా!* మదిని కలిగి
మధుర
భావాళికీవె సన్మార్గమగుచు
ప్రేరణంబును
గొలిపి సంప్రీతితోడ
జీవనము
సాగఁ జేయుమా! చిత్స్వరూప!
ఓం *మల్లి(మాలి)కా* యై
నమః ।
నామ వివరణ.
తే.గీ.
*మల్లి(మాలి)కా!* సౌరభంబు హృన్మందిరమున
నీవు వసియించుటన్ గల్గు నిత్యపూజ్య
భావనాకాశమందీవు భద్రగతిని
యుండి వెరియింపుమానందమొప్పుగ నిఁక.
ఓం *నవమల్లి(మాలి)కా* యై
నమః ।
నామ వివరణ.
అప్పుడే వికసించిన మల్లికా మాలిక మన జనని.
ఉ. ఓ *నవ మల్లి(మాలి)కా! * ఘన మహోన్నత భావ మనోజ్ఞ గీతికా!
జ్ఞాన విశేషసౌరభము కల్గగఁ జేయుచునెల్లవేళలన్
భానుని తేజమై మదిని వర్ధిలు నీకు నమస్కరించెదన్,
మానక ప్రేరణన్ గొలిపి మాధవసేవకు దారిఁ జూపుమా.
227. ఓం
*దేవికాయై* నమః.
నామ
వివరణ.
అమ్మ
దేవీ స్వరూపిణి.
తే.గీ.
*దేవికా!* జ్ఞాన సంపూర్ణ దీప్తిఁ గొలుప
నాత్మలోనుండుమోయమ్మ,
హాయిగాను
చెలగి
జీవాత్మ
పరమాత్మఁ
జేర్చుటకును
నీవె
మార్గంబుగా లోన నిలువుమమ్మ.
228. ఓం *నన్దికా*యై నమః ।
నామ
వివరణ.
సంతోషమును
కలిగించు కుమార్తె రూపిణి మన అమ్మ.
తే.గీ.
*నందికా!
* నీవు
నా కావ్య నందికవయి
బోధఁ
గొలుపుచునుండుము పూజ్యురాల!
గడచు
జీవిత సారమే కావ్యమమ్మ,
కృతిని
వెలిగెడి నా పుణ్య సుతవు నీవు.
229. ఓం *శాన్తా*యై నమః ।
నామ
వివరణ.
శాంతము
యొక్క రూపము అమ్మయే.
కం. *శాన్తా! * నీవే మదిలో
శాంతిగ
వసియింపుమమ్మ, సన్నుతవగుచున్,
భ్రాంతిని
పోకార్పుచు నా
చింతలు
తొలగింపుమమ్మ! సేవింతు నినున్.
230. ఓం *భఞ్జికా*యై నమః ।
నామ
వివరణ.
దౌష్ట్యములను
భంజించు జనని అమ్మ.
తే.గీ.
*భఞ్జికా! * వ్యర్థ భావనా భంజికవయి
సార్థకంబగు
భావాళిఁ జక్కనిమ్ము,
నీవె
నాలోని వెలుగువై నిరతముండి
నన్నుఁగాపాడుచుండుమా
నందినివయి.
231. ఓం *భయభఞ్జికా*యై నమః
నామ
వివరణ.
భయమును
పారద్రోలు జనని అమ్మ.
కం. *భయభఞ్జికా!* మనంబున
భయమును
పోకార్పుమమ్మ! భద్రద వగుచున్,
జయ
కారణమగుమీ య
క్షయ
ధైర్యము నిడుచు నన్నుఁ గావుము కృపతోన్.
శ్లో.
కౌశికీ వైదికీ దేవీ సౌరీ రూపాధికాఽతిభా ।
దిగ్వస్త్రా నవవస్త్రా చ కన్యకా కమలోద్భవా ॥ 31 ॥
232. ఓం *కౌశిక్యై* నమః ।
నామ
వివరణ.
పార్వతీకేశ
సంభవ కౌశికి అమ్మయే.
సుగంధివృత్తము.
పార్వతీశిరోజజాత!
పద్మనేత్ర *కౌశికీ! *
గర్వభంజనంబు
చేసి కావుమా! ననున్ సదా,
నిర్వికార
నిష్కళంక! నీ కృపా కటాక్షమే
సర్వసిద్ధి
సత్ఫలంబుఁ జక్కగా నొసంగునే.
233. ఓం *వైదిక్యై* నమః ।
నామ
వివరణ.
వైదిక
సాంప్రదాయ స్వరూపిణి వైదికి మన అమ్మయే.
తే.గీ.
దివ్య
రూపిణి! వైదికీ! దేవి! కనుమ.
చిత్తమందున
నినుగాంచి మత్తు వీడి
సత్తు
చిత్తులన్ లోఁ గని శాంతితోడ
మసలుకొందును,
నిన్ను నే మదిని గనుచు.
ఓం *దేవ్యై* నమః.
నామ
వివరణ.
దేవీ
స్వరూపిణి అమ్మయే.
తే.గీ.
కృపను
గాంచుమా *దేవి*!
నన్ క్షితిని వెలుగఁ
జేయ,
నినుఁ గొల్తునోయమ్మ! శ్రేయములిడ!
నీవు
లేకున్న దిక్కేది? నీరజాక్షి!
వందనంబులు
చేసెద నందుకొనుము.
కం. దేవీ నీ శుభ నామము
భావింతును మనమునందు భవ్యఫలదవై
దీవించుము నిరుపమముగ
జీవము నీవౌచు నిలుము శ్రీమన్ మాతా!
ఓం *వైదికీదేవ్యై*
నమః ।
నామ వివరణ.
వైదిక సాంప్రదాయ స్వరూపిణిఅయిన దేవి వైదికీదేవి మన అమ్మయే.
తే.గీ.
దివ్య రూపిణి! *వైదికీదేవి*! కనుమ.
చిత్తమందున నినుగాంచి మత్తు వీడి
సత్తు చిత్తులన్ లోఁ గని శాంతితోడ
మసలుకొందును, నిన్ను నే మదిని గనుచు.
234. ఓం
*సౌర్యై* నమః.
నామ
వివరణ.
సూర్యుని
యొక్క స్వరూపము అమ్మయే.
తే.గీ.
*సౌరి! * సూర్యప్రతాపంబు శాంతిలఁ గని
లోకులను
గను, నిన్ గొల్తు శ్రీకరముగ,
నీవె
మా ప్రాణమోయమ్మ! నీలవేణి!
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం
*శౌర్యై* నమః.
నామ వివరణ.
పరాక్రమము యొక్క స్వరూపము అమ్మయే.
తే.గీ.
సౌర తేజంబునొప్పెడి సౌరివమ్మ.
నాదు హృదయంబునన్ వెల్గు నయ నిధాన!
*శౌరి!* నీ తేజమున్ జూడఁ జాలనమ్మ,
జ్ఞాన నేత్రంబునిమ్ము నే కనెద నిన్ను.
ఓం *గౌర్యై* నమః ।
నామ వివరణ.
గౌర వ్ర్ణముతో ప్రకాశించు జనని మన అమ్మ.
తే.గీ.
*గౌరి!*
నీ దివ్య రూపమున్ గనగనిమ్ము
భవ్యమైనట్టి నీపేరు పలకనిమ్ము,
చల్లనైనట్టి నీ దృష్టి సరిగ బరిపి
రక్షణమునిమ్ము భువిపైన క్రాలనిమ్ము.
235. ఓం *రూపాధికా*యై నమః ।
నామ
వివరణ.
అధికమయిన
రూపము కలిగిన జనని అమ్మ.
తే.గీ.
మహిత
*రూపాధికా!
* నీదు
మహిమ నెన్న
నాకసాధ్యంబు,
నీవె సుజ్ఞానమిచ్చి
వ్రాయఁ
జేయుము నిన్ గూర్చివాసిగొల్ప,
అందుకొనుమమ్మ
నీవు నా వందనములు.
236. ఓం *అతిభాసే* నమః ।
నామ
వివరణ.
మిక్కిలి
ప్రకాశించు తల్లి మన అమ్మ.
కం. *అతిభాసా! * నీకెవ్వరు
క్షితిపై
గలరమ్మ సాటి? క్షేమప్రద వో
స్తుతమతి!
నీ యౌదార్యము
నుతియింపగఁ
జాలనమ్మ! నోములపంటా!
237. ఓం *దిగ్వస్త్రా*యై నమః ।
నామ
వివరణ.
దిగంతములవరకూ
వ్యాపించి దిక్కులే వస్త్రములుగా కలిగిన తల్లి.
తే.గీ.
నీవు
వ్యాపించి యంతటన్ నేర్పు మీర
భక్తులన్
గాచు *దిగ్వస్త్ర!* ప్రణతులమ్మ.
నా
మనంబున వెలుగుచు క్షేమమిడుచు
సన్నుతంబుగ
కాచెడి కన్నతల్లి!
238. ఓం *నవవస్త్రా*యై నమః ।
నామ
వివరణ.
నిత్య
నూతన వస్త్ర ధారణి అమ్మ.
కం. *నవవస్త్రా!* సతతంబును
నవవస్త్రములీయఁ
జాల నవ వస్త్రము లీ
కవనంబులె,
కృపతోఁ గొను,
ప్రవిమలభావప్రభలను
వరలింతు నినున్.
239. ఓం *కన్యకా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
నిత్య కన్యకా స్వరూపిణి.
ఉ. సాగర
కన్యకామణివి సంస్తుత *కన్యక!* సన్నుతప్రభా
వాగమృతంబు
నీవొసగి, పద్యకవిత్వము పండఁ జేసి, నా
యోగమె
మార్చినావు, వరయోగసమృ ద్ధిని గొల్పు నిన్ను
నే
నేగతి
నిర్వచించెద నహీన దయానిధి! నిన్ నుతించెదన్.
240. ఓం *కమలోద్భవాయై* నమః ।
నామ
వివరణ.
కమలమునుండి
జనించిన తల్లి అమ్మ.
తోటక
వృత్తము.
*కమలోద్భవ!* నీ కృప కల్గినచో
ప్రముదంచిత
కావ్యము వ్రాయనగున్,
సుమకోమల
చిద్వర శోభలతోఁ
గమనీయ
కవిత్వము కల్పితమౌన్.
శ్లో.
శ్రీస్సౌమ్యలక్షణాఽతీతదుర్గా సూత్రప్రబోధికా ।
శ్రద్ధా మేధా కృతిః ప్రజ్ఞా ధారణా కాంతిరేవ చ ॥ 32 ॥
241. ఓం *శ్రీస్సౌమ్యలక్షణా*యై నమః
నామ
వివరణ.
మృదు స్వభావము కల
తల్లి మన అమ్మ.
తే.గీ.
వినుత
*శ్రీ
స్సౌమ్య లక్షణా! * వినుము మొరను,
సౌమ్య
సత్వస్వభావంబు చాలినంత
యొసగియుంటివి,
నీ కృపన్ మసలుచుంటి
నీవె
నాలోననుండుటన్ నీరజాక్షి!
ఓం *శ్రీ*యై నమః ॥
నామ వివరణ.
మంగళప్రదమయిన శ్రీకారముగా ఉన్న తల్లి అమ్మ.
కం. *శ్రీ! * దేవీ! వందనముల్,
వేద ప్రభవీవె కనగ విశ్వాత్మా! స
మ్మోదంబున నన్ గనుమా,
బాధలు వారించి, భవ్య పథము నొసగుమా.
ఓం *సౌమ్యలక్షణా*యై నమః ॥
నామ వివరణ.
సౌమ్య స్వభావగుణ సంపన్న మన జనని.
తే.గీ.
*సౌమ్య లక్షణా!*
శ్రీమత్ప్రశాంతరూప!
నాకు సౌన్య స్వభావంబు శ్రీకరముగ
నీవొసంగుచు కృపఁగని నిలిపినావు,
వందనంబులు చేసెద నందుకొనుము.
242. ఓం *అతీతదుర్గా*యై నమః ।
నామ
వివరణ.
ఎవరికినీ
అధిగమింప శక్యము కాని దుర్గమమయిన తల్లి మన అమ్మ.
తే.గీ.
దీప్తి
వీవమ్మ జగతి *నతీత
దుర్గ! *
దుర్గమంబగు
దైవత్వ మార్గమందు
నన్ను
నడిపింపఁ బూనిన సన్నుతాత్మ!
వందనంబులు
చేసెద నందుకొనుము.
243. ఓం *సూత్రప్రబోధికా*యై నమః ।
నామ
వివరణ.
వేద
సూత్రములను బోధించు జనని.
తే.గీ.
వినుత
*సూత్రప్రబోధికా! * వేదసూత్ర
సారమీవేను
నిజమిది, సత్ప్రబోధ
నీదు
కృపచేతఁ గల్గును, మోదమునను
వందనంబులు
చేసెద నందుకొనుము.
244. ఓం *శ్రద్ధా*యై నమః ।
నామ
వివరణ.
మనకు
కలిగెడి శ్రద్ధ అనునది అమ్మ స్వరూపమే.
కం. *శ్రద్ధా! * సన్నుత లక్ష్మీ!
శ్రద్ధగ
నినుఁ గొలుచు శక్తి చక్కగనిమ్మా,
శ్రద్ధారూపవుకద, య
శ్రద్ధను
విడఁజేసి నాకు
శ్రద్ధనొసగుమా.
245. ఓం *మేధా*యై నమః ।
నామ
వివరణ.
మనకు
కలిగెడి మేధా శక్తి అమ్మయే.
కం. *మేధా! మేధా రూపవు,
సాధనమున
మేధ పెఱుగు చక్కగ నీవే
మోదముతో నొసగుచు,
నా
బాధలనెడబాపి
శ్రద్ధ వరలగనిమ్మా.
246. ఓం *కృత*యే నమః ।
నామ
వివరణ.
కూర్పబడిన
సృష్టి అమ్మయే.
కం. కృతి
వీవే *కృతి! * సన్నుత
గతివీవే,
నాకు చూడ, కంజదళాక్షీ!
నుతకృతులను
వెలయించగ
మతిలోనీవుండుమమ్మ
మార్గము చూపన్.
247. ఓం *ప్రజ్ఞా*యై నమః ।
నామ
వివరణ.
నైపుణ్యము
అనెడిది అమ్మయొక్క శక్తియే.
కం. ప్రజ్ఞా
రూపవు *ప్రజ్ఞా!*
యజ్ఞానము
పారద్రోలి యనుపమరీతిన్
బ్రజ్ఞను
గొలుపుమ నాకున్,
సుజ్ఞేయము
సేసెద నిను సుకృతిని జగతిన్.
248. ఓం
*ధారణా*యై నమః ।
నామ
వివరణ.
మనకు
కలిగెడి ధారణ అనెడి శక్తి అమ్మయే.
తే.గీ.
ధారణా
రూపవౌ నీదు తత్వమరయ
ధారణాశక్తి
ప్రబలును తప్పక భువి,
*ధారణా!* ధారణాశక్తి దయనొసంగి,
నిన్ను
నుతియింపఁ జేయుమా నిరుపమముగ.
249. ఓం *కాన్త*యే నమః ।
నామ
వివరణ.
వెలుగు
అనెడిది ఏది కలదో అది అమ్మయే.
తే.గీ.
*కాన్తి!* నీరూపరేఖలన్ గాంతు మదిని
వర్ణనంబును
జేయఁగ భక్తితోడ,
శాంతిసౌభాగ్యదాయినీ!
జయ నిధాన!
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
శ్రుతిః స్మృతిర్ధృతిర్ధన్యా భూతిరిష్టిర్మనీషిణీ ।
విరక్తిర్వ్యాపినీ మాయా సర్వమాయాప్రభంజనీ ॥ 33 ॥
250. ఓం *శ్రుత*యే నమః ।
నామ
వివరణ.
వేదస్వరూపమేది
కలదో అది అమ్మయే.
కం. శ్రుతి
రూప! *శ్రుతీ! * నీవిక
మతిలో
నిలుమమ్మ నాకు, మన్ననమున నిన్
నుతియింతునెల్లవేళల
నతులితమగు
పద్యములను, హాయిగ చదువన్.
251. ఓం *స్మృతయే* నమః
నామ
వివరణ.
జ్ఞాపకము
అనెడిది ఏది కలదో అది అమ్మయే.
తే.గీ.
*స్మృతి!*
వివర్ధన చేయుమా స్మృతిని నాకు,
నీ
మహత్వంపు స్మృతులతో నీదు చరిత
కవిత
గా వ్రాసి నీకిత్తు కాన్కగాను,
కావ్య
కన్యగా నిను గాంతు ఘనతరముగ.
252. ఓం *ధృత*యే నమః ।
నామ
వివరణ.
ధైర్యమను
శక్తి ఏది కలదో అది అమ్మయే.
తే.గీ.
*ధృతి!
* మతిన్
గాంచెదన్ నీదు దీప్తి నరసి,
క్షితిజులన్
ముక్తి మార్గాన కేలుపట్టి
నడుపుదున్
నీవు తోడున్నఁ, దడయకమ్మ
నాదు
సంకల్పమున్ గూర్చి నన్ను నడుపు.
253. ఓం *ధన్యా*యై నమః ।
నామ
వివరణ.
తాను
అనుకొనినట్లు సృష్టి చేయుతలో కృతకృత్య అయిన అమ్మ ధన్య.
తే.గీ.
ధన్యునిగఁ
జేయు మో *ధన్య! * మాన్య చరిత!
గణ్యముగ
నిన్నుఁ జెప్పి నే గణుతిఁ గనుదు,
పుణ్యముండును
మది నుండి ప్రోవుమమ్మ
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *శ్రుతిః స్మృతిర్ధృతిర్ధన్యా*యై నమః.
ఆ.వె.
శ్రుతిని, స్మృతిని ధృతిని మతిలోన నిలుపుమా
నిత్య ఉండునట్లు, నీవు భార
తీ!
*శ్రుతిః స్మృతిర్ధృతిర్ధన్య*! నన్ గావుమా!
వదలఁబోకు నాదు మదిని నిలుమ.
254. ఓం *భూత*యే నమః ।
నామ
వివరణ.
సమస్త
సంపదలకు కారణమయిన తల్లి భూతి.
తే.గీ.
*భూతి*! నీ పవిత్రత
నాకు పొగడ తరమ?
నీ
విభూతియె సృష్టిలో
నిలుచు
సతము,
నీవు
నాలోననున్నచో నేను కూడ
పూత
చరితుడనగుదును, పూర్తిగాను.
255. ఓం *ఇష్ట్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
యాగ స్వరూపిణి.
తే.గీ.
*ఇష్టి! * యజ్ఞస్వరూపిణీ! దృష్టి పెట్టి
యాత్మలోయజ్ఞ
సాధనమమరఁ జేసి
నిన్ను
దర్శింతునమ్మరో నన్నుఁ గాచు,
ముక్తి
మార్గంబు నీవెగా పుణ్య చరిత!
256. ఓం *మనీషిణ్యై* నమః ।
నామ
వివరణ.
జ్ఞానమునిచ్చు
తల్లి మన అమ్మ.
తే.గీ.
ఓ
*మనీషిణీ!* గణియించి నీ మనీషఁ
దెల్ప
భాషయే చాలదనల్పమగుట
నద్భుతంబునసాధ్యమో
యనుపమాన!
వందనంబులు
చేసెద నందుకొనుము.
257. ఓం *విరక్త్యై* నమః ।
నామ
వివరణ.
నిర్లిప్తముగా
ఉండు జనని మన అమ్మ.
తే.గీ.
ఓ
*విరక్తీ! * మహాభక్తి నొప్పిదముగ
నిన్ను
గొల్చెడి మాకేల నెన్న రక్తి?
నిజము
నీపైన రక్తినే నిన్నుఁ గనుచు
ముక్తినొందెడి
భాగ్యమ్ము పొందగలము
258. ఓం *వ్యాపిన్యై* నమః ।
నామ
వివరణ.
అంతటనూ
వ్యాపించియుండు తల్లి మన అమ్మ.
తే.గీ.
*వ్యాపినీ! * నీవు వ్యాపింతువన్నియెడల,
నాదు
మదిలోన వ్యాపించి నన్ను నడుప
నీకసాధ్యంబు
కాదుగా, నీరజాక్షి!
చేయుమట్టులఁ
జేసి నన్ జేదుకొనుము.
259. ఓం *మాయా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
మాయాస్వరూపిణి. మాయ అమ్మ యొక్క శక్తియే.
తే.గీ. *మాయ! * నీ సృష్టియే చూడ మాయ, నిజము.
నీవదేలను
మాయలో నిత్యమిటుల
మమ్ము
మ భ్యపెట్టుట తల్లి? సమ్మతించి
మాయ
తెర తీసి మమ్మేలుమా! మదంబ!
260. ఓం *సర్వమాయాప్రభఞ్జన్యై* నమః ।
నామ
వివరణ.
సమస్తమయిన
మాయనూ నశింపఁ జేయు తల్లి అమ్మ.
తే.గీ.
సర్వ
*మాయా
ప్రభఞ్జనీ*! గర్వమణచి
మాయ
యునికినే మాపెడి మాయవీవు,
మాయలోపడి
నేనునున్ మ్రగ్గుచుంటి,
మాయనుండి
నన్ బ్రోవుమా మన్ననముగ.
శ్లో.
మాహేంద్రీ మంత్రిణీ సింహీ చేంద్రజాలస్వరూపిణీ ।
అవస్థాత్రయనిర్ముక్తా గుణత్రయవివర్జితా ॥ 34 ॥
261. ఓం *మాహేన్ద్ర్యై* నమః
నామ
వివరణ.
మహేంద్రునికన్నను
గొప్ప తల్లి మహేంద్రి.
తే.గీ. వినుము *మాహేన్ద్రి! * నాదగు విన్నపమ్ము,
నీవె
సర్వమ్ము సృష్టిలో నేర్పు మీర
నన్ను
రక్షింప తగదొకో? మన్ననమున,
కన్నులన్
బెట్టి చూడుమాపన్న రక్ష!
262. ఓం *మన్త్రిణ్యై* నమః ।
నామ
వివరణ.
ఆమె
సమస్తమునకు మంత్రి.
తే.గీ.
*మన్త్రిణీ!* సృష్టి నడిపించు మంత్రివీవు,
నన్ను
నడిపించు వేళలో నాకు ముక్తిఁ
గొలుపు
మార్గాన నడిపించఁ గోరితి నిను,
నీదు
సాన్నిధ్యమున్ గొల్పి యాదుకొమ్ము.
263. ఓం *సింహ్యై* నమః ।
నామ
వివరణ.
ఆడుసింహము
అమ్మయే.
తే.గీ.
*సింహి*! నాలోని పశువును సంహరించు.
కలుగుషట్ఛ్ఛత్రులన్
జంపి వెలుగు నింపు
నాదు
మదిలోన, నచ్చట మోదమునను
నీవె
వసియింపు మమ్మరో నీరజాక్షి!
264. ఓం *ఇన్ద్రజాలస్వరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
ఇంద్రజాలము
యొక్క స్వరూపము అమ్మయే.
తే.గీ.
*ఇంద్రజాలస్వరూపిణీ!* యింద్రియముల
కేను
లొంగుచునుంటి, నహీనశక్తి
మనసునకునిమ్ము,
గెలిచెద ఘనతరముగ,
నింద్రియంబులన్,
నినుఁ గొల్తు నిందువదన!
తే.గీ. చంచలత్వంబుతో మది చెలగు *నిన్ద్ర
జాలరూపిణీ!* మాపు చాంచల్య
గుణము,
నీదు
పదపద్మములపైన నాదు చిత్త
మమరి
యుంచునట్లుగఁ జేయుమా మదంబ!
265. ఓం *అవస్థాత్రయనిర్ముక్తా*యై నమః ।
నామ
వివరణ.
జాగ్రత్స్వప్నసుషుప్తావస్థలనుండి
బయట పడవేయు తల్లి మన అమ్మయే.
కం. జయమోయమ్మ
*యవస్థా
త్రయ నిర్ముక్తా!* సుబోధితంబగుమమ్మా!
ప్రియముగ
భక్తి నొసంగుమ,
నయమార్గమునందు
గొలుతు నా జనని నినున్.
266. ఓం *గుణత్రయవివర్జితా*యై నమః ।
నామ
వివరణ.
సత్వరజస్తమోగుణములను
పూర్తిగా వర్జించిన తల్లి మన అమ్మ.
కం. కోరెద
సత్వగుణంబును
చేరగవాఛించి
నిన్ను శ్రీకరముగ నో
స్మేర
ముఖాంభోజ! మహో
దార!
*గుణత్రయవివర్జితా!* కృప గనుమా.
శ్లో.
ఈషణాత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితా ।
యోగిధ్యానాంతగమ్యా చ యోగధ్యానపరాయణా ॥ 35 ॥
267. ఓం
*ఈషణాత్రయనిర్ముక్తా*యై నమః.
నామ
వివరణ.
దారేషణ,
పుత్రేషణ, ధనేషణ, అను ఈషణత్రయమునుండిపూర్తిగా
విముక్తి పొందియున్న
తల్లి
మన అమ్మ
తే.గీ.
*ఈషణాత్రయ నిర్ముక్త! * భాష
చాల
దమ్మ
నిన్ను వర్ణించగా నమరవినుత!
నన్ను
నీషణత్రితయంబు నలిపివేసె
నోర్వ
లేనమ్మ కావు నన్నుర్విపైన.
268. ఓం
*సర్వరోగవివర్జితా* యై నమః.
నామ
వివరణ.
సమస్త
రోగములనూ విడిచిన తల్లి మన జనని.
తే.గీ.
*సర్వ
రోగ వివర్జితా! *యుర్విపైన
నున్నవారికి
రోగములుండి తీరు,
నీవె
కాపాడవలయు మాకీవె శరణు,
రోగబారిని
పడకుండ ప్రోవుమమ్మ.
ఓం ఈషణాత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితాయై నమః.
నామ వివరణ.
దారేషణ, పుత్రేషణ, ధనేషణ, అను ఈషణత్రయమునుండిపూర్తిగా విముక్తి పొందియున్న
తల్లి మన అమ్మ, సమస్త రోగములనూ విడిచిన తల్లి మన జనని.
స్వయంకల్పిత రోగవివర్జ వృత్తము.
గణములు …. స జ య
త భ ర. యతి..11వ అక్షరము.. ప్రాస కలదు.
సతి!
యీషణాత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితా!
క్షితిపై ధనాదుల నాశింపన్ కీడు ప్రాప్తమగున్ గదా,
స్తుతియింతు నిన్ త్రయనిర్ముక్తిన్ సుప్రదా కలిగించుమా
నుతమార్గమందు మదంబా నిన్నున్ స్తుతింపగఁ జేయుమా.
269. ఓం *యోగిధ్యానాన్తగమ్యా*యై నమః ।
నామ
వివరణ.
యోగులకు
ధ్యానాంతమున గమ్యముగా ఉన్న తల్లి మన జనని.
కం. మా
గతి యోగము మార్చును,
యోగంబున
ధ్యానమొప్పియుండుననుచునే
యోగులు
గాంచెదరమ్మా!
*యోగి
ధ్యానాన్త గమ్య! * యొసగుము
సిద్ధిన్.
270. ఓం *యోగధ్యానపరాయణా*యై నమః ।
నామ
వివరణ.
యోగము,
ధ్యానము, పరాయణముగా కల జనని మన అమ్మ.
కం. *యోగధ్యానపరాయణ!*
వేగమె
నా యోగమగుచు. ప్రీతిని గనుమా
రాగల
కాలమునందున
యోగమె
సన్ముక్తిదముగ నుంచుమ జననీ!
శ్లో.
త్రయీశిఖా విశేషజ్ఞా వేదాంతజ్ఞానరూపిణీ ।
భారతీ కమలా భాషా పద్మా పద్మవతీ కృతిః ॥ 36 ॥
271. ఓం *త్రయీశిఖా*యై నమః ।
నామ
వివరణ.
మూడు
వేదములందూనిపుణత కలిగిన తల్లి మన అమ్మ.
కం. ప్రాకటముగ
వేదత్రయ
మేకరణి
గ్రహింపనౌ మహేశ్వరి? నీవే
నాకిట
చక్కగఁ దెల్పుట
శ్రీకరము
*త్రయీ శిఖా!*
విశేషజ్ఞ!
నతుల్.
272. ఓం *విశేషజ్ఞా*యై నమః ।
నామ
వివరణ.
సృష్టికి
సంబంధించిన విశేషమయిన జ్ఞానము కలిగిన అమ్మ.
కం. లోకవిశేషజ్ఞానము
శ్రీకరముగను గలిగిన *విశేషజ్ఞా!* నన్
నీ కరుణను కాపాడుమ,
నీకున్ దాసుఁడను నేను
నీరజ నేత్రా!
తే.గీ. శ్రీ *విశేషజ్ఞ*
నిన్ను నా చిత్తమందు
శాశ్వతంబుగ నిలుపగ చక్కనైన
సాధనాశక్తి నిమ్మని సాగిలపడి
మ్రొక్కుచుంటిని, వరమిమ్ము చక్కనమ్మ!
కం. ప్రాకటముగ వేదత్రయ
మేకరణి గ్రహింపనౌ మహేశ్వరి? నీవే
నాకిట చక్కగఁ దెల్పుట
శ్రీకరము త్రయీ శిఖా! *విశేషజ్ఞ!* నతుల్.
ఓం *త్రయీశిఖావిశేషజ్ఞా*యై నమః ।
నామ వివరణ.
మూడు వేదములందూనిపుణత కలిగిన తల్లి మన అమ్మ.
కం. ప్రాకటముగ వేదత్రయ
మేకరణి గ్రహింపనౌ మహేశ్వరి? నీవే
నాకిట చక్కగఁ దెల్పుట
శ్రీకరము *త్రయీ శిఖా విశేషజ్ఞ!* నతుల్.
273. ఓం *వేదాన్తజ్ఞానరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
వేదాంత
జ్ఞానమే రూపముగా ఉన్న తల్లి మన అమ్మ.
కం బాధలనెడఁ
బాపుము భువి,
సాదరముగ
చూడుమమ్మ! సన్నుత జననీ!
మోదమునఁ
గావ నన్నున్
*వేదాంత జ్ఞాన
రూపిణీ!
* నినుఁ
గొలుతున్.
274. ఓం *భారత్యై* నమః
నామ
వివరణ.
మిక్కిలి
ప్రకాశవంతమయిన తల్లి మన అమ్మ. అక్షర జ్ఞానప్రదాయిని మన అమ్మ.
తే.గీ.
*భారతీ!*
నీదు పదములే పట్టుకొమ్మ,
వాక్సుధామయ
మూర్తుల భాగ్యమవియె,
పట్టి
సేవింతు నీ పద పంకజములు,
నాదు
జిహ్వాగ్రవర్తినీ! యాదుకొనుము.
275. ఓం *కమలా*యై నమః ।
నామ
వివరణ.
కమలమువలె
మనోజ్ఞాముగా ప్రకాశించు జనని మన అమ్మ.
తే.గీ. *కమల!* సుకుమార సుందర కల్పవల్లి!
నాదు
మదిలోన వెల్గుమా! మోదమునను,
జ్ఞాన
సూర్యప్రకాశమే కలదు నీకు,
పొంగిపోవుచునుండిట
రంగుగాను.
276. ఓం *భాషా*యై నమః ।
నామ
వివరణ.
భాష
యొక్క స్వరూపము అమ్మయే.
తే.గీ. వినుత! భాషా!
మదంబా! సవినయముగను
నిన్ను
సేవింతు నోయమ్మ, నెమ్మనమున
వరలఁజేయు
మా భాషను భద్రతనిడి,
వందనంబులు
చేసెద నందుకొనుము.
277. ఓం *పద్మా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
కమలోద్భవి.
కం. సేవింతును
నిను *పద్మా!*
భావించుచు
మానసమున భక్తిగ నెలమిన్,
నీవే
మానస హంసగ
భావిని
నడిపించుమమ్మ, భద్రత
నిడుచున్.
278. ఓం *పద్మవత్యై* నమః ।
నామ
వివరణ.
కమలాసన
మన అమ్మ.
తే.గీ.
తీరమును
జేర్చు *పద్మవతీ!* నమామి,.
హృదయ
పద్మమ్ముపైన నీవేర్పడంగ
వాసముండుము
నాలోని ధ్యాసనెఱిగి,
వందనములు పద్మాసనా! యందుకొనుము.
279. ఓం *కృతయే* నమః ।
నామ
వివరణ.
క్రియాఫలమయిన
కృతి అమ్మయే.
తే.గీ.
సత్
*కృతీ!*
నీవు నాలోని సత్యమగుచు
నాదు
కృతులందు వసియించు మోదమునను,
కృతికి
సత్కృతి నీవుసంస్తుతిగ నిండ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
గౌతమీ గోమతీ గౌరీ ఈశానా హంసవాహినీ ।
(వాహనీ)
నారాయణీ ప్రభాధారా జాహ్నవీ శంకరాత్మజా ॥ 37 ॥
280. ఓం *గౌతమ్యై* నమః ।
నామ
వివరణ.
గౌతముని
కుమార్తె మన అమ్మ.
తే.గీ.
*గౌతమీ!*
పుణ్యరాశివి! కవుల కృతుల
నాట్యమాడెడు
తల్లివి, నయ నిధాన!
నీవె
నాలోని కవితవై నిరతమిటులె
కవిత
రూపాన ప్రవహించు గౌరవముగ.
281. ఓం *గోమత్యై* నమః ।
నామ
వివరణ.
గోమతీ
నది మన అమ్మయే.
తే.గీ.
*గోమతీ!
* నిన్నుకొలిచి,
నే కోరుచుంటి
భరతభూమిపై
ప్రవహించి పచ్చదనము
సతతమున్
గొల్పుచుండుమా, సత్కవిత్వ
ధారలట్టుల
నుర్విపై, తప్పదమ్మ.
282. ఓం *గౌర్యై* నమః ।
నామ
వివరణ.
గౌర
వర్ణముతో విరాజిల్లు జనని మన అమ్మయే.
తే.గీ.
వినుత!
*గౌరీ!*
శుభాకార! వెలయుము మది,
ఘనత
గాంచెద నీవున్న కవిగ నేను,
సత్
కవిత్వము మరుమల్లె సౌరభములు
నీకె
యందింతుమదిలోన నీవె కలుగ.
283. ఓం *ఈశానా*యై నమః ।
నామ
వివరణ.
ఈశ్వరుని
సతీమణి మన అమ్మయే.
తే.గీ.
వినుతి
గాంచితి *వీశాన*!
విశ్వనాథు
దేహభాగముగా
నుండి దీప్తిదవయి,
లోకపాలనఁ
జేయుచున్ శ్లోకరూపి
ణీ!
చిదానందమిమ్మమ్మ, నిన్నుఁ గొలుతు.
284. ఓం *హంసవాహిన్యై* నమః
నామ
వివరణ.
హంసను
వాహనముగా కలిగిన తల్లి మన అమ్మ.
తే.గీ.
*హంసవాహినీ*!
నాలోన హంస కలదు
దానినేవాహనమ్ముగా
దయను గొనుమ,
జ్ఞానమున
హంసతేజమున్ గనగనిమ్ము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
285. ఓం
*నారాయణీ ప్రభాధారా*యై నమః
నామ
వివరణ.
నరులకు
ఆశ్రయమిచ్చే నారాయణి మన అమ్మ. నారాయణుని కాంతి ప్రవాహమే అమ్మ.
కం. జ్ఞానప్రద!
శ్రీనారా
యణీ ప్రభాధార! నిలువు మమ్మా మదిలో,
నీ
నామమె ప్రభఁ గొలుపును,
నా
మదిలో నుండి సతము, నా జనయిత్రీ!
ఓం *నారాయణ్యై*
నమః ।
నామ వివరణ.
నరులకు ఆశ్రయమిచ్చే నారాయణి మన అమ్మ.
తే.గీ.
వినుత *నారాయణీ! * నిన్ను విశ్వసింతు,
ప్రనుత సత్కావ్యములు గొల్పు ప్రాభవమును
నాకుఁ గలిగింపుమమ్మరో లోకమునను
వందనంబులు చేసెద నందుకొనుము.
ఓం *ప్రభాధారా*యై నమః ।
నామ వివరణ.
నారాయణుని కాంతి ప్రవాహమే అమ్మ.
తే.గీ.
నుత!
*ప్రభాధార!* నీకు సన్నుతులు జనని!
ప్రభను ధారగా కురిపించు పద్యములను
వ్రాయగాఁ జేసి కీర్తివై ప్రబలుమమ్మ.
వందనంబులు చేసెద నందుకొనుము.
286. ఓం *జాహ్నవ్యై* నమః ।
నామ
వివరణ.
జాహ్నవీ
నది అమ్మయొక్క రూపమే.
తే.గీ.
*జాహ్నవీ!* నిన్ను
నుతియింత్రు సత్ కవులిల
జీవకోటిని
బ్రతుకంగ చేయుదీవు,
దేవలోకముగా
భువి నీవె చేయ
వర్ధనంబగు
చుండెనో భక్త వినుత!
287. ఓం *శఙ్కరాత్మజా*యై నమః ।
నామ
వివరణ.
శంకరుని
యొక్క ఆత్మజ అమ్మ.
తే.గీ.
*శఙ్కరాత్మజా! * నాలోని
జంకుఁ బాపి,
పంకజాక్షుని
సేవలోఁ బరగనిమ్ము,
నేను
భక్తితోఁ బూజించి నిన్ను గనుదు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
చిత్రఘణ్టా సునందా శ్రీర్మానవీ మనుసంభవా ।
స్తంభినీ క్షోభిణీ మారీ భ్రామిణీ శత్రుమారిణీ ॥ 38 ॥
288. ఓం *చిత్రఘణ్టా*యై నమః ।
నామ
వివరణ.
ఈ
తల్లి శిరమున ఘంటాకారంలో ఉన్న చంద్రుని ధరించిన కారణంగా చంద్రఘంటగా ప్రసిద్ధమయింది. ‘‘ప్రసాదం తనుతే మహ్యం చన్ర్డఘణ్టేతి విశ్రుతా’’సుందరమయిన మెడ కలిగిన తల్లి మన అమ్మ.
తే.గీ.
*చిత్రఘణ్టా!* సునందాఖ్య!
చిత్స్వరూప
మీవె
నాలోన, నిజమిది, భావమెఱిఁగి,
నాదు
హృదయాన నిల్చి నన్నాదుకొనుము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
289. ఓం *సునన్దా*యై నమః ।
నామ
వివరణ.
ఆనందము
కలిగించు కుమార్తె రూపముననుండునది అమ్మయే.
తే.గీ.
మనసుకానందమును
గూర్చు మా *సునన్ద!*
మానసంబున
నీవున్న మధుర కవిత
లద్భుతంబుగా
ప్రభవించు ననుపమగతి,
నిలిచి
నామదిన్, రక్షించు నిలకడగను.
ఓం *చిత్రఘణ్టా సునందా*యై నమః ।
నామ వివరణ.
సుందరమయిన మెడ కలిగిన తల్లి మన అమ్మ. ఆనందము కలిగించు కుమార్తె
రూపముననుండునది అమ్మయే.
తే.గీ.
*చిత్రఘణ్టాసునందా*ఖ్య! చిత్స్వరూప
మీవె నాలోన, నిజమిది, భావమెఱిఁగి,
నాదు హృదయాన నిల్చి నన్నాదుకొనుము,
వందనంబులు చేసెద నందుకొనుము.
290. ఓం *శ్రి*యై నమః ।
నామ
వివరణ.
మంగళస్వరూపిణి
మన అమ్మ సర్వ సంపత్ప్రద.
తే.గీ.
*శ్రీ!* దయానిధీ! మదిలో వసించరమ్ము,
స్వపర
భేదంబునే పాపి సన్నుతిఁ గను,
శ్రిత
జనానీక సత్పోష శ్రీ ప్రకాశ!
వందనంబులు
చేసెద నందుకొనుము.
291. ఓం *మానవ్యై* నమః ।
నామ
వివరణ.
మానవత్వము
కలిగిన మానవి మన అమ్మ.
తే.గీ. మనుజ!
*మానవీ!*
కృపఁ గను మంగళాంగి!
మానవత్వము
నశియించె మనుజులందు,
నీవు
శిక్షించు ధూర్తులన్, నిత్య భాస!
వందనంబులు
చేసెద నందుకొనుము.,
292. ఓం *మనుసమ్భవా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
మనువునుండి సంభవించిన తల్లి.
కం. *మనుసమ్భవ*! నా
ప్రార్థన
వినుమమ్మ!
దయా సముద్ర! వినిపింతును నేన్
క్షణమొక
యుగముగ గడుపుచు
మనఁజాలను
నీవు లేక మదిలో జననీ!
293. ఓం *స్తమ్భిన్యై* నమః
నామ
వివరణ.
స్థంభించి
యుండు జనని మన అమ్మ.
తే.గీ.
*స్తమ్భినీ!*
నిలు మదిలోన స్తంభమట్లు
సంబరంబుగ
నిను గొల్తు సన్నుతపద!
పద్యకవితలన్
బ్రభవించు, పరవసింతు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
294. ఓం *క్షోభిణ్యై* నమః ।
నామ
వివరణ.
క్షోభను
కలుగఁజేయు తల్లి అమ్మ.
తే.గీ. *క్షోభిణీ!*
మదినున్ననా
క్షోభఁబాపు
క్షోభ
వాసిన నీదగు శోభ నిలుచు,
శోభ
నిలిచిన కొలుచుట సులభమగును,
వందనంబులు
చేసెద నందుకొనుము.
295. ఓం *మార్యై* నమః ।
నామ
వివరణ.
అసుర
సంహారము చేయు తల్లి మన అమ్మ.
తే.గీ.
అసుర
సంహారిణీ *మారి! * మసలుదు రిల
రాక్షసాంశులా
యనదగు భ్రష్టులరెరె
మంచివారిని
హింసించు వంచితులగు
వారి
సంహారమొనరించు వీరమాత!
296. ఓం *భ్రామిణ్యై* నమః ।
నామ
వివరణ.
భ్రమణము
కలుగఁ జేయు జనని.
తే.గీ.
*భ్రామిణీ!* సృష్టి చేయును బ్రహ్మ నీవు
తనదు
ముఖమునఁ గల్గుటన్ దర్పమలర,
సృష్టి
చేయించు నీపైన దృష్టి పెట్టి
కవితలల్లెదనా
నీదు కరుణనొంది.
297. ఓం *శత్రుమారిణ్యై* నమః ।
నామ
వివరణ.
శత్రువులను
సంహరించు జనని అమ్మ.
తే.గీ. *శత్రు
మారిణీ! * నీ ప్రియ పుత్రుఁడఁ, గని
శత్రు
రహితునిగాఁ జేసి సదయ నిలుపు
మన్యమైనట్టివానిపై
యాశ లుడుపు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
మోహినీ ద్వేషిణీ వీరా అఘోరా రుద్రరూపిణీ ।
రుద్రైకాదశినీ పుణ్యా కల్యాణీ లాభకారిణీ ॥ 39 ॥
298. ఓం *మోహిన్యై* నమః ।
నామ
వివరణ.
మోహమును
కలుగజేయు తల్లి మన అమ్మ.
తే.గీ.
*మోహినీ!* జగత్ సృష్టిలో మోహమేల
కల్పనంబాయె?
నిజమును కనగలేము
మోహవిభ్రాంతిచేఁ,
గాన,
మోహముడిపి,
లోకమును
వెల్గఁ జేయుమా శ్రీకరముగ.
299. ఓం *ద్వేషిణ్యై* నమః ।
నామ
వివరణ.
ద్వేషమునకు
మూలమయిన తల్లి మన అమ్మ.
తే.గీ. *ద్వేషిణీ*! దుర్జనులపైన ద్వేషమూని
నాశనంబొనరింపుము
నయ నిధాన!
ద్వేష
శూన్యునిగా నన్ను తీర్చిదిద్ది
కాచి
రక్షించు మోయమ్మ! కన్నతల్లి!
300. ఓం *వీరా*యై నమః ।
నామ
వివరణ.
పరాక్రమము
కలిగిన వీరా మన అమ్మ.
తే.గీ. భీతినే పాపు *వీరా! * ప్రపూత చరిత!
ఖ్యాతిగా
మదిలోపలఁ గలిగియుండి
వీర
సంస్కారములు కొల్పి ప్రీతిఁ గనుమ
వందనంబులు
చేసెద నందుకునుము.
301.. ఓం *అఘోరా*యై నమః ।
నామ
వివరణ.
ఏమాత్రము
ఘోరముగా ఉండని జనని అఘోరా మన అమ్మ.
తే.గీ.
ఘోర
దూర! నన్ గాంచు *మఘోర* కృపను,
ఘోర
కృత్యముల్ చేసినఁ గూల్చుమమ్మ,
సార
హీన మీ సంసార భారమరయ,
ఘోర
భవబంధముల్ బాపి కూర్మిఁ గనుము.
302. ఓం *రుద్రరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
రుద్రుని
యొక్క రూపమున ఉండు జనని మన అమ్మ.
తే.గీ.
*రుద్ర
రూపిణీ!* నాలోని రౌద్రమీవె
శాంతముగఁ
జేసి, నిల్పితి చక్కగ నను
క్షుద్రులన్
బరిమార్చుమా రుద్రరూప!
వందనంబులు
చేసెద నందుకొనుము.
303. ఓం *రుద్రైకాదశిన్యై* నమః
నామ
వివరణ.
ఏకాదశ
రుద్రులూ మన అమ్మయే.
కం. *రుద్రైకాదశినీ!* నన్
భద్రంబుగ
కావుమమ్మ, భయదూర! కృపన్,
సద్రచనలు
చేయించుమ,
ముద్రితమవ
నీ ప్రశస్తి, పూజింతు నినున్.
304. ఓం *పుణ్యా*యై నమః.
నామ
వివరణ.
పుణ్యకార్యములను
ప్రశంసించు పుణ్యాత్మురాలు మన అమ్మ.
కం. *పుణ్యా!* కొలిచెద
నిన్నున్
గణ్యంబుగ
శుభకరముగ
గౌరవమొప్పన్,
బుణ్యాత్ములకెల్లప్పుడు
సన్యాయము
నడుపుమమ్మ సంస్తుతి గనగన్.
305. ఓం *కల్యాణ్యై* నమః.
నామ
వివరణ.
మంగళప్రదమయిన
తల్లి మన అమ్మ.
కం. *కల్యాణీ!* భూజనులిక
కల్యాణప్రదముగ
నిను గణియించుచు, సా
కల్యంబుగ
సత్ఫలితము
లౌల్యంబును
వీడి గనుత, లక్ష్యముతోడన్.
306. ఓం *లాభకారిణ్యై* నమః.
నామ
వివరణ.
లాభములకు
కారణభూతురాలు మన అమ్మ.
తే.గీ.
*లాభకారిణీ*!
నినుఁగొల్చి లాభములను
పొందు
గావుత జనపాళి భువిని సతము,
నేను
నిన్ గొల్తు నిత్యంబు నీవె నాదు
చిత్తపద్మమ్ముపైనుండి
చేదుకొమ్ము
శ్లో.
దేవదుర్గా మహాదుర్గా స్వప్నదుర్గాఽష్టభైరవీ ।
సూర్యచంద్రాగ్ని నేత్రా(రూపా) చ గ్రహనక్షత్రరూపిణీ ॥ 40 ॥
307. ఓం *దేవదుర్గా*యై నమః.
నామ
వివరణ.
నిద్రలో
ఉన్న దుర్గామాత మన అమ్మ.
తే.గీ.
*దేవదుర్గా! * సదానంద
దివ్యతేజ!
భావమందున
నిత్యమున్ ప్రబలుమమ్మ,
జీవకోటిని
కాపాడు శ్రీద! కృపను!
నన్ను
కాపాడు కృపఁజూపి సన్నుతముగ.
308. ఓం *మహాదుర్గా*యై నమః.
నామ
వివరణ.
మిక్కిలి
దుర్గమమయిన జనని మన అమ్మ.
తే.గీ.
ఓ
*మహాదుర్గ!* నా
మదినొప్పియుండి
నీదు
తేజంబునే గొల్పి మేదురముగ
భక్తిభావంబునే
గొల్పి శక్తి నిచ్చి
నన్ను
కాపాడు చుండుమా సన్నుతముగ.
309. ఓం *స్వప్నదుర్గా*యై నమః.
నామ
వివరణ.
కలలో
కూడా దుర్గమమయిన జనని మన అమ్మ.
తే.గీ.
*స్వప్నదుర్గా! * మహా
సాధ్వి! సన్నుతింతు
స్వప్నమందైన
కనిపించి సదయఁ గనుమ,
నీదు
రూపంబు కనినంత మేదురమగు
కవనసుధలొల్కు,
నెరవేరు కామితములు.
310. ఓం *అష్టభైరవ్యై* నమః.
నామ
వివరణ.
అష్టభైరవులూ
మన అమ్మయే.
తే.గీ.
*అష్టభైరవీ! * తీర్చు
నా కష్టములను,
కష్టములనుండియున్
నేను దృష్టి నిలిపి
నిన్నె
కొలిచెదనోయమ్మ నీరజాక్షి!
భక్తి
భావంబు విడనీకు భవ్య చరిత.
311. ఓం *సూర్యచన్ద్రాగ్ని(నేత్రా)
రూపా*యై నమః.
నామ
వివరణ.
సూర్యుఁడు,
చంద్రుఁడు, అగ్ని ఈ తల్లియొక్క రూపమే, ఈ తల్లియొక్క నేత్రములే.
తే.గీ.
*సూర్యచంద్రాగ్ని(నేత్రా)
రూపా! * వసుంధరపయి
సూర్యచంద్రాగ్ని
రూపిణీ! చొక్కి మదిని
వెలుగుచుండుము
నాలోన వేల్పువగుచు
వందనంబులు
చేసెద నందుకొనుము.
312. ఓం *గ్రహనక్షత్రరూపిణ్యై* నమః.
నామ
వివరణ.
గ్రహముల
నక్షత్రముల రూపములు మన అమ్మయే
తే.గీ.
ఓ
దయానిథీ! కొల్తు నిన్నొప్పిదముగ
నీదు
కృపఁ జూపి వసియించు నాదుమనము
న
*గ్రహ
నక్షత్ర రూపిణీ! * నన్నుఁ
గావ.
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
బిందునాదకళాతీతా బిందునాదకళాత్మికా ।
దశవాయుజయాకారా కలాషోడశసంయుతా ॥ 41 ॥
313. ఓం *బిన్దునాదకలాతీతా*యై నమః
నామ
వివరణ.
బిందుస్థానమునకు,
నాదమునకు, కళలకు అతీతమయిన తల్లి మన అమ్మ.
తే.గీ.
కనెద *బిన్దుకలాతీత! * కాంచనిమ్ము
నీదు
సద్రూప సంస్కృతుల్ సందడిగను,
కనిన
సత్కల్పనాశక్తి కవితకబ్బు
వందనంబులు
చేసెద నందుకొనుము.
314. ఓం *బిన్దునాదకలాత్మికా*యై నమః
నామ
వివరణ.
బిందువు,
నాదము, కళలకు ఆత్మ అమ్మయే.
తే.గీ.
*బిన్దునాదకలాత్మికా!
* విన్దుఁ
గొలుపు
మెందునున్నను
కనులకు సుందరమగు
నాదమైయొప్పి
చెవులకు మోదమునను
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *బిందునాదకళాతీతా బిందునాదకళాత్మికా* యై నమః.
నామ వివరణ.
బిందుస్థానమునకు, నాదమునకు, కళలకు అతీతమయిన తల్లి మన అమ్మ.
బిందువు, నాదము, కళలకు ఆత్మ అమ్మయే.
స్వయం కల్పిత బిందునాద కళావృత్తము.
గణములు. ర
స మ జ
జ గ….యతి 9వ అక్షరము. ప్రాస కలదు.
*బిందునాదకళాతీతా బిందునాదకళాత్మికా !*
మందగించెడి నా బుద్ధిన్ మాత! నీ కృప కాచునే,
సుందరంబగు నీరూపున్ చూచినంస్పృహ కల్గెడున్
బిందునాదకలన్నాకున్ విందుచేయుము శాంభవీ!
315. ఓం *దశవాయుజయా(జయోం)కారా*యై నమః.
నామ
వివరణ.
పంచ
వాయువులు
1. ప్రాణము
హృదయముననుండియు నాసికముండియు వెలువడును
2. అపానము
పొత్తికడుపునకు దిగువనుండి మలమూత్రాదుల వెడలింపజేయును
3. వ్యానము
శరీరము నందంతటను వ్యాపించి యుండును
4. ఉదానము
కంఠమునుండి మాటలాడ వీలుగలుగ చేయును
5. సమానము
అన్నాశయమున జఠరాగ్నికి సమీపమున యుండును
పంచ
ఉపవాయువులు
1. నాగము
వాక్కు నందుండునది
2. కూర్మము
కంటిరెప్ప లందుండునది
3. కృకరము
నేత్రము లందుండునది
4. దేవదత్తము
కంఠద్వారమున నుండునది
5. ధనంజయము
హృదయముననుండునది..
ఈ
దశ వాయువులను జయించిన ఓంకార స్వరూపిణి మన అమ్మ.
కం. *దశవాయుజయా(జ
యోం)కారా! *
నిశితముగా
నిన్నెఱింగి నీ కృపఁ గొనగా
సశరీరులు
యత్నింతురు,
దశమార్చుదువంచు
నిన్ను, ధన్యులు వారల్.
316. ఓం *కలాషోడశసంయుతా*యై నమః.
నామ
వివరణ.
పదునారు
కలలతో పూర్తిగా నిండియున్న తల్లి మన అమ్మ
పదునారు
కళలతో కూడియున్న జనని.
ఉ. వీడని
భక్తితత్వమును విస్తృతిగా మది గొల్పు మో *కలా
షోడశ సంయుతా!* మహిత
శోభన సద్వర భాసమానవై
నీడగ
నిల్చి నాకు వరణీయ మహత్వ కవిత్వ తత్వమున్
తోడనె
నేర్పుమమ్మ, వినుతుల్, జననీ! గణియించి మ్రొక్కెదన్.
శ్లో.
కాశ్యపీ కమలాదేవీ నాదచక్రనివాసినీ ।
మృడాధారా స్థిరా గుహ్యా దేవికా చక్రరూపిణీ ॥ 42 ॥
317. ఓం *కాశ్యప్యై* నమః.
నామ
వివరణ.
కాశ్యపి అనగా భూమి. భూమాత
మన అమ్మయే.
తే.గీ.
*కాశ్యపీ! * భక్తి
ముక్తులఁ గలుగఁ జేయు
నిన్ను కనుఁగొని
నీ శక్తి నెన్న తరమ?
మన్ననను
నినున్ గొల్తు నే సన్నుతముగ
నన్ను
దీవించు మమ్మరో! కన్నతల్లి!
318. ఓం *కమలాదేవ్యై* నమః.
నామ
వివరణ.
కమలమువలె కోమలమగు దేవియైన
కమలాదేవి అమ్మయే.
కం. *కమలాదేవీ!*నా మది
విమలంబది
నిన్ను దాల్చుఁ బ్రీతిగ నీవే
సుమధుర
భావములీయగ
సముదంచిత
రీతి రమ్ము సంస్తుతమతివై.
ఓం *కమలా*యై
నమః.
నామ వివరణ.
కమలము హృదయకమలము అమ్మయే.
కం. *కమలా!
* దేవీ! నా మది
విమలంబది నిన్ను దాల్చుఁ బ్రీతిగ నీవే
సుమధుర భావములీయగ
సముదంచిత రీతి రమ్ము సంస్తుతమతివై.
ఓం * దేవ్యై* నమః.
కం. కమలా! *దేవీ!*నా మది
విమలంబది నిన్ను దాల్చుఁ బ్రీతిగ నీవే
సుమధుర భావములీయగ
సముదంచిత రీతి రమ్ము సంస్తుతమతివై.
319. ఓం *నాదచక్రనివాసిన్యై* నమః.
నామ
వివరణ.
ఓంకార
నాదభరిత శ్రీచక్రమున నివసించు జనని
తే.గీ.
*నాదచక్ర నివాసినీ! * మేదుర
గతి
నా
దరిని నిల్చి వెల్గుమా, బోధ గొలుప,
శ్రీదవౌ
నిన్నుఁ గనియెద నాద చక్ర
మందు
భక్తితో, వర్ణింతు సుందరముగ.
320. ఓం *మృడాధారా*యై నమః.
నామ
వివరణ.
పరమేశ్వరునకు
ఆధారభూతమయిన జనని.
శివునకు
ఆధారమయిన తల్లి మన అమ్మయే.
తే.గీ. ఓ *మృడాధార!* నివసించుమొప్పిదముగ
నాదు
మదిలోన మృడునితో మేదురగతి,
ఖేదమును
బాపి కృపను నన్నాదుకొనుము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
321. ఓం *స్థిరా*యై నమః.
నామ
వివరణ.
సర్వకాల
సర్వావస్థలయ్ందును స్థిరముగా ఉండు జనని.
స్థిరముగా
ఎన్నటికీ ఉండు జనని మన అమ్మ.
కం. స్థిరముగ
నామది నుండుము
వరమై
సతతంబు
నీవు
వర్ధిలఁజేయన్
గరుణను
నన్నున్, జననీ
*స్థిరా!* చిదానంద
తేజ! శ్రీకరమగుచున్.
322. ఓం *గుహ్యా*యై నమః.
నామ
వివరణ.
రహస్యమయిన
గూఢమయిన తల్లి మన అమ్మ.
తే. *గుహ్య!*
నా యహంబును బాపి కూర్మితోడ
నిన్ను వర్ణించనిమ్మమ్మ!
నిత్యమిటుల,
నైహికంబులనిత్యముల్,
మోహబాహ్య
మోక్షపథమిచ్చు
నీపదములను కనగ.
323. ఓం
దేవికాయై నమః.
నామ
వివరణ.
అమ్మ
దేవికా రూపిణి.
తే.గీ.
*దేవికా! * నిన్ను
గొల్వనీ దీక్షఁబూని
శ్రీ
వదాన్యుల బోధనల్ భావమందు
నిలిపి,
నినుచూడ నేర్వనీ, నిరుపమముగ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
324. ఓం *చక్రరూపిణ్యై* నమః.
నామ
వివరణ.
శ్రీచక్ర
రూపమున వెలుగొందుచుండు తల్లి మన అమ్మ.
తే.గీ.
*చక్రరూపిణీ!
* సంసార
చక్రముపయి
తిరుగు
చుండుచు విసిగితి, పరమ పథము
నిన్ను
కోరితి నొసగుమాపన్న రక్ష
వౌచు
నాయమ్మ! నిన్ గొల్చి వేచియుంటి.
శ్లో.
అవిద్యా శార్వరీ భుంజా జంభాసురనిబర్హిణీ ।
శ్రీకాయా శ్రీకలా శుభ్రా కర్మనిర్మూలకారిణీ ॥ 43 ॥
325. ఓం *అవిద్యా*యై నమః.
నామ
వివరణ.
అజ్ఞానము
వెనుకనున్న శక్తి మన అమ్మయే.
తే.గీ.
కను
*మవిద్యా!*పరా
దేవి!
కరుణతోడ,
వినుము
నామొరలన్నియు వీనులార,
కనగనిమ్మమ్మ
నిన్ను నా కనులతోడ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
326. ఓం *శార్వర్యై* నమః.
నామ
వివరణ.
రాత్రి
స్వరూపము అమ్మయే.
తే.గీ.
*శార్వరీ! * రాత్రివేళలో
జయనిధాన!
నిన్నుఁ
గొలిచెద నిద్రలోఁ గన్నతల్లి!
మాయఁ
జేయక మనసులో మధురమయిన
వెలుగు
నింపుము నిన్ గాంతు కలలనైన.
327. ఓం *భుఞ్జా*యై నమః.
నామ వివరణ.
సకల సుఖములను అనుభవించిన జనని మన అమ్మ.
కం. *భుఞ్జా!* నీ
శుభతేజము
భఙ్జించును
పాతకములు భక్తిని పలుకన్,
రఙ్జింపఁ
జేయుమా మది
కఞ్జాతా!
కరుణఁ జూపి కావుము నన్నున్.
328. ఓం *జమ్భాసురనిబర్హిణ్యై* నమః.
నామ
వివరణ.
ఇంద్ర
రూపంలో ఉన్న జంభాసురుని సంహరించిన తల్లి.
కం. నా
జన్మాంతము నిన్నే
రాజిల్లగఁ గోరి
కొలుతు రాజీవాక్షీ!
పూజింపనుంటి,
నిన్ గన
నీ! *జమ్భాసురనిబర్హిణీ!*
కృపఁ
గనుమా.
329. ఓం *శ్రీకాయా*యై నమః.
నామ
వివరణ.
సంపదయే
దేహముగా జన్మించిన జనని.
కం. *శ్రీకాయా! * నినుఁ
దలచుచు
శ్రీకారము
చుట్టినాడ చిత్రకవితకున్,
నీ
కారుణ్యమునను నను
లోకులు
గుర్తించిరమ్మ, శ్లోకాధిష్ఠా!
330. ఓం *శ్రీకలా*యై నమః.
నామ
వివరణ.
పవిత్రమయిన
కలారూపమమ్మయే.
తే.గీ.
*శ్రీకళా! * నీదు
కళలెన్న శ్రీకరములు,
నిండుకళలతో
నామది నుండుమమ్మ!
పండువెన్నెలగా
కృతుల్ పండఁ జేయ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
331. ఓం *శుభ్రా*యై నమః.
నామ
వివరణ.
అన్నివిధములా
పవిత్రమయిన జనని.
కం. *శుభ్రా! * శోభన
రూపా!
విభ్రాంతిని
పొందె శివుఁడు వీక్షించి నినున్,
విభ్రాజిత
సత్కృతియగు
శుభ్రవు
నిన్ గొలుతుఁ గృతిని సుందర రూపా!
332. ఓం *కర్మనిర్మూలకారిణ్యై* నమః.
నామ
వివరణ.
సంచిత
కర్మలు నిర్మూలింపనడుటకు కారణభూతురాలు మన అమ్మ.
తే.గీ.
*కర్మ
నిర్మూల కారిణీ! * కనుదు
నిన్ను,
కర్మ
నిర్మూలనార్థిని, కనగనిమ్ము,
ధర్మసంస్థాపనార్థినీ! దయను మదిని
నిలిచి
కవితాకృతిన్ వెల్గు నిరుపమముగ.
శ్లో.
ఆదిలక్ష్మీర్గుణాధారా పంచబ్రహ్మాత్మికా పరా ।
శ్రుతిర్బ్రహ్మముఖావాసా సర్వసంపత్తిరూపిణీ ॥ 44 ॥
333. ఓం *ఆదిలక్ష్మ్యై* నమః.
నామ
వివరణ.
ప్రప్రథమ
లక్ష్మీమాత మన అమ్మయే.
తే.గీ.
ఆదిలక్ష్మీ! మహాదేవి!
యమర వినుత!
మోదమున
నాదు మదిలోన పూజ్యముగను
నిలిచి,
భాసింపఁ జేయుమా, నిర్వికల్ప,
వందనంబులు
చేసెద నందుకొనుము.
334. ఓం *గుణాధారా*యై నమః.
నామ
వివరణ.
సమస్త
గుణములకూ ఆధారము మన అమ్మయే.
తే.గీ.
వర
*గుణాధార! * భక్తి
సంభరిత మతిని
నిన్ను
సేవింపనుంటినో కన్నతల్లి!
నన్ను
గృపఁ జూడుమోయమ్మ, మన్ననమున,
వందనంబులు
చేసెద నందుకొనుము.
335. ఓం *పఞ్చబ్రహ్మాత్మికా*యై నమః .
నామ
వివరణ.
బ్రహ్మ,
విష్ణు, ఈశ్వర, సదాశివ, రుద్ర, అను పంచబ్రహ్మలను తనలో కలిగిన జ్నని.
కం. శ్రీ
*పఞ్చబ్రహ్మాత్మిక! *
దీపింపుము
నాదు మదిని దీనశరణ్యా!
యే
పాప ఫలమొ పుట్టితి
నే
పాపిగ,
కావుమమ్మ నీవే కృపతో.
336. ఓం *పరా*యై నమః.
నామ
వివరణ.
అన్నిటికీ
పైనుండు పరాదేవత మన అమ్మ.
తే.గీ.
ఓ
*పరా! * శక్తి
వీవమ్మ! నాపయి దయ
చూపి
పరమును గొల్పుమా, సుగుణపోష
వగుచు
నన్నేలుమ, శుభదవయిన జనని!
వందనంబులు
చేసెద నందుకొనుము.
337. ఓం *శ్రుత*యే నమః.
నామ
వివరణ.
వేదములు
అమ్మయే.
తే.గీ.
*శ్రుతి! * మహోదార
గుణపూర్ణ! శుభము నీకు,
గతివి
నీవమ్మ నాకు సద్గతిని గొలిపి
బ్రతుకు
పండించుమమ్మరో! భవ్యముగను,
వందనంబులు
చేసెద నందుకొనుము.
338. ఓం *బ్రహ్మముఖావాసా*యై నమః.
నామ
వివరణ.
బ్రహ్మ
ముఖమునే ఆవాసముగా కలిగిన తల్లి.
తే.గీ.
వినుత
*బ్రహ్మ
ముఖావాస! * వినుము మొరలు,
పద్య
ధారలలో నీవు వరలుమమ్మ
పద్యనైవేద్యమందుమా,
భక్తసులభ!
వందనంబులు
చేసెద నందుకొనుము.
339. ఓం *సర్వసమ్పత్తిరూపిణ్యై* నమః.
నామ
వివరణ.
సమస్త,అయిన సంపదలూ స్వరూపముగా కలిగిన తల్లి.
తే.గీ.
*సర్వసమ్పత్తి రూపిణీ!* నిర్వికల్ప!
సర్వసంపదలన్
గొల్పి సదయ గనుమ
భూమిపైనున్న
జనులను,మ్రొక్కుదు నిను,
వందనంబులందించెదనందుకొనుము.
శ్లో.
మృతసఞ్జీవనీ మైత్రీ కామినీ కామవర్జితా ।
నిర్వాణమార్గదా దేవీ హమ్సినీ కాశికా క్షమా ॥ 45 ॥
340. ఓం *మృతసఞ్జీవిన్యై* నమః.
నామ
వివరణ.
మృత్యువునకు
సంజీవిని అమ్మ.
తే.గీ.
అతులిత
మృత సఞ్జీవినీ! యమరవినుత!
మృతియె
భవమెన్న, గొలుతు నమృత పథంబు
నందు
నన్ నిల్పుమా సతీ! సుందరముగ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
341. ఓం *మైత్ర్యై* నమః.
నామ
వివరణ.
అమ్మ
స్నేహ స్వరూపిణి.
కం. నినుఁ
గొలిచెద నో *మైత్రీ! *
ఘనముగ
నీవున్న చాలు గౌరవమొప్పన్
మనమున,
సంబరమొందుదు,
గుణపోషవు,
కరుణఁ గనుమ, కూరిమి తోడన్.
342. ఓం *కామిన్యై* నమః.
నామ
వివరణ.
కోరికల
స్వరూపము అమ్మయే.
తే.గీ.
*కామినీ! * నీవు
నాలోని కామములను
తుడిచి
ముక్తిని గొలుపుమా తోయజాక్ష!
క్షేమమీవేను కరుణించు
కీర్తి సాంద్ర!
వందనంబులు
చేసెద నందుకొనుము.
343. ఓం *కామవర్జితా*యై నమః.
నామ
వివరణ.
కోరికలను
విడనాడిన తల్లి అమ్మ.
తే.గీ.
*కామవర్జితా*! ముక్తిపై
కామమునిడి,
నిన్ను
దర్శింపనిమ్మమ్మ, సన్నుతముగ,
సొమ్ములేలను
నిలుమ నా నెమ్మనమున.
వందనంబులు
చేసెద నందుకొనుము.
344. ఓం *నిర్వాణ మార్గదా దేవ్యై*
నమః.
నామ
వివరణ.
మోక్షమార్గమును
ప్రసాదించు తల్లి.
తే.గీ.
దివ్య!
*నిర్వాణ మార్గదా దేవి! * నిన్ను
మదిని
నిలిపిన నిర్వాణ మార్గమమరు,
నిన్ను
మించిన దైవమున్ నేను గనను,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *నిర్వాణమార్గదా*యై
నమః.
తే.గీ.
వినుత *నిర్వాణ మార్గదా!
* వేల్పువీవె
నన్ను రక్షింపనున్నట్టి నయనిధాన!
మహిత నిర్వాణ మార్గమును మహిమనొసగు
మమ్మరో నిల్చి మనమున నెమ్మితోడ.
ఓం *దేవ్యై* నమః.
తే.గీ.
దివ్య! నిర్వాణ మార్గదా! *దేవి!
* నిన్ను
మదిని నిలిపిన నిర్వాణ మార్గమమరు,
నిన్ను మించిన దైవమున్ నేను గనను,
వందనంబులు చేసెద నందుకొనుము.
ఓం *నిర్వాణమార్గదాదేవ్యై* నమః.
తే.గీ.
దివ్య *నిర్వాణ మార్గదాదేవి*! నీవె
నన్ను రక్షింపనున్నట్టి నయనిధాన!
మహిత నిర్వాణ మార్గమును మహిమనొసఁగు
మమ్మరో నిల్చి మనమున నెమ్మితోడ.
345. ఓం *హంసిన్యై* నమః .
నామ
వివరణ.
ఆడ
హంస స్థితిలోనుండు జనని.
తే.గీ.
*హంసినీ! * కన
నాలోని హంసవీవె,
రాజహంసగ
మది నిల్చి రక్షణనిడి
ముక్తి
సన్మార్గమున్ గొల్పు పొలుపుగాను,
వందనంబులు
చేసెదనందుకొనుము.
346. ఓం *కాశికా*యై నమః.
నామ
వివరణ.
ప్రకాశించు
తల్లి మన అమ్మ
తే.గీ.
జనని!
*కాశికా! * నినుఁ
గొల్వఁ జాలనమ్మ!
కాశికాపురి
ప్రభ్విణీ!
కరుణఁ
గనుచు
మమ్ము
రక్షించుచుంటివి మాననీయ!
వందనంబులు
చేసెద నందుకొనుము.
347. ఓం *క్షమా*యై నమః.
నామ
వివరణ.
అమ్మ
సహన స్వరూపిణి.
తే.గీ.
ఓ
*క్షమా! * గుణోద్ధామ! నా రక్ష నీవె,
నాదు
మదిలోన క్షమవయి యాదుకొనుము,
బాధలను
బాపి లోకానఁ బరగనిమ్ము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
సపర్యా గుణినీ భిన్నా నిర్గుణా ఖండితాఽశుభా ।
స్వామినీ వేదినీ శక్యా శాంబరీ చక్రధారిణీ ॥ 46 ॥
348. ఓం *సపర్యా*యై నమః.
నామ
వివరణ.
నిరతమూ
సాధకుల సపర్యలనందుకొను జనని.
కం. వినుత
*సపర్యా!* ప్రణతులు,
గొనుమా
నాదగు సపర్య,కూర్మిని జననీ!
మనమున
నీవుండినను సు
గుణములు
వర్ధిల్లునమ్మ గొప్పగ మదిలో.
349. ఓం *గుణిన్యై* నమః.
నామ
వివరణ.
సద్గుణ
నిధానము అమ్మ.
కం. *గుణినీ! * నా
భక్తిని మది
గణియింపుము,
కృపను గనుచు కరుణామయివై.
ప్రణతులు
చేసెద నమ్మా!
గుణగణనాభాస!
నిన్ను గూరిమిఁ గొలుతున్.
350. ఓం *భిన్నా*యై నమః.
నామ
వివరణ.
భిన్న
స్వరూపిణి అమ్మ.
కం. *భిన్నా! * నాబ్రతుకే
వి
చ్ఛిన్నంబగు,
కనవొ నీవు? చిత్రము గనెదో?
యున్నానని
రావమ్మా!
మన్ననతో
నీవు నాకు మంచిని కొలుపన్.
351. ఓం *నిర్గుణా*యై నమః.
నామ
వివరణ.
అమ్మ
గుణరహిత.
తే.గీ.
*నిర్గుణా! * జగదీశ్వరీ!
నిరుపమాన
సద్గుణంబులు
నాకిమ్ము సదయ హృదయ!
నిన్ను
వర్ణింప యత్నింతు నిరుపమాన!
వందనంబులు
చేసెద నందుకొనుము.
352. ఓం *అఖణ్డితా*యై నమః.
నామ
వివరణ.
ఖండింప
నలవికాని శక్తి సమన్విత అమ్మ.
తే.గీ.
దయను
గనుమో *యఖణ్డితా! * నయ
నిధాన
మీవె
నాలోన భాసించు జీవనముగ,
ఖండితంబుగ
చెప్పుమఖండిత! నిజ
శక్తి
నెన్నుచు తెలియగా, ముక్తినీయ.
353. ఓం *శుభా*యై నమః.
నామ
వివరణ.
అమ్మ
శుభముల స్వరూపిణి.
తే.గీ.
నుత
*శుభా! * నాదు
మదిలోన నతులితగతి
నుండి
వర్ధిల్లఁజేయుమా పండువగుచు,
శుభద
సత్కావ్య కల్పనా విభవమిచ్చి
నిన్ను
వర్ణింపఁ జేయుమా! మన్ననమున.
354. ఓం *స్వామిన్యై* నమః.
నామ
వివరణ.
అమ్మ
యజమాన స్వరూపిణి.
తే.గీ.
*స్వామినీ! * నీవె
జగతికి స్వామివమ్మ,
నిన్నె
పూజింతుఁ గృపఁ గను కన్నతల్లి!
జన్మ
సార్ధక్యమగుటకై జయనిధాన!
వందనంబులు
చేసెద నందుకొనుము.
355. ఓం *వేదిన్యై* నమః.
నామ
వివరణ.
విదితమగు
జనని వేదినీమాత మన అమ్మ.
తే.గీ.
*వేదినీ! * కన
జగతి యవేద్య మీవె
లేనినాడౌను,
నిజమమ్మ! ధీనిధాన!
వేద్యవగుమమ్మ
నాకు సువేద్య! కృపను.
వందనంబులు
చేసెద నందుకొనుము.
356. ఓం *శక్యా*యై నమః.
నామ
వివరణ.
సాధకులకు
శక్యమగు జనని.
కం. *శక్యా!* నిను
మదినిలుపుట
శక్యంబా?
కాదు మాకు, సద్గుణమతికిన్
శక్యంబగు,,
నాకదియును
శక్యంబగునట్లు
చేసి చక్కగ గనుమా.
357. ఓం *శామ్బర్యై* నమః.
నామ
వివరణ.
అమ్మ
మాయా స్వరూపిణి. కనుకట్టు అమ్మయే.
తే.గీ.
*శామ్బరీ! * మాయలోఁ
జిక్కి
జయ
నిధాన!
నిన్నుఁ
గొలుచుట మరచితిన్,
నేర్పు
మీర,
మాయ
తొలగించి, జ్ఞాన సంబంధమయిన
విద్యనందించు
నాకు నో విశ్వజనని!
358. ఓం *చక్రధారిణ్యై* నమః.
నామ
వివరణ.
చక్రమును
ధరించిన జనని.
తే.గీ.
చక్రధారిణీ!* యీ కాలచక్రమునను
నలిగిపోవుచు
నుంటిని నన్ను కాచి
రక్షణము
గొల్పుమమ్మరో! రాజిత పద!
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
దండినీ ముండినీ వ్యాఘ్రీ శిఖినీ సోమసంహతిః ।
చింతామణిశ్చిదానందా పంచబాణప్రబోధినీ ॥ 47 ॥
359. ఓం *దణ్డిన్యై* నమః.
నామ
వివరణ.
దోషులను
దండించు తల్లి మన అమ్మ.
తే.గీ.
*దణ్డినీ!* దేవి!
నీవు నా దణ్డనున్న
దండిగా
కవితాసుధల్ తరలివచ్చి
చేరునాకృతులందున
నేరుగాను,
దండిగా
నాకు నీకృపనుండనిమ్ము.
360. ఓం *ముణ్డిన్యై* నమః.
నామ
వివరణ.
పుర్రెలమాల
ధరించిన తల్లి.
తే.గీ.
*ముణ్డినీ! * రక్షవై
నాకునుండు నిన్ను
నెట్లు
వర్ణింప గలనమ్మ? యిందు వదన!
మండనంబుగ
కవితలోనుండుమమ్మ.
వందనంబులు
చేసెదనందుకొనుము.
361. ఓం *వ్యాఘ్ర్యై* నమః.
నామ
వివరణ.
అమ్మ
ఆడపులి.
తే.గీ.
*వ్యాఘ్రి! * దుర్గుణ
మృగములు ప్రబలు చుండె
నమ్మరో
నామదిన్, చంపుమమ్మ, నీవు
నన్ను
రక్షించుచుండుమా మన్ననమున,
వందనంబులు
చేసెదనందుకొనుము.
362. ఓం *శిఖిన్యై* నమః.
నామ
వివరణ.
అమ్మ
ఆడనెమలి
తే.గీ.
*శిఖిని! * నాకిమ్ము
సర్వతోముఖజయంబు,
లసదృశమ్ముగ,
నిన్ గొల్తు ననుపమాన!
దీప్తమౌనట్టి
సద్గుణవ్యాప్తిఁ గొల్పి
నిరతమున్
నన్ను రక్షించు నీరజాక్షి.
363. ఓం
*సోమ
సంహత్యై*
నమః.
నామ
వివరణ.
అనేకచంద్రుల
సమూహము అమ్మ. అంతటి చల్లని తల్లి.
తే.గీ.
*సోమ
సంహతీ!*కృపతోడ చూడు నన్ను,
చల్లగా
కావ నాలోన నెల్లవేళ
లందు
నీవుండి, కృపఁ జూపు,మమ్మ దయను,
వందనంబులు
చేసెద నందుకొనుము౭.
ఓం *సోమహన్త*యే
నమః.
తే.గీ.
*సోమహన్త!
* గుణోపేత శుభ చరిత్ర
వీవు, నిన్ గొల్తు భక్తితో నెంచి, నాదు
మనసులో సోములుండిరి, మరువకమ్మ
కూల్చి వారిని, కావు నన్ కువలయాక్షి.
364. ఓం *చిన్తామణ్యై* నమః.
నామ
వివరణ.
అనుకొన్నదంతయూ
ప్రసాదించు తల్లి మన అమ్మ.
కం. *చిన్తామణీ!*మదంబా!
సాన్తము
తోడుండి నడుపు చక్కగ నన్నున్,
చిన్తావంశజుడను,
ని
శ్చిన్తగ
నీ వలననుంటి, చేదుకొనుమిలన్
365. ఓం *చిదానన్దా*యై నమః.
నామ
వివరణ.
నిరంతర
చిదానందస్వరూపిణి మన అమ్మ.
తే.గీ.
ఓ
*చిదానన్ద!* తేజా!
సముద్ధరింప
జగతి
కానంద దీప్తులు చక్కగాను
పంచుచున్నట్టి
నిన్ను నే నంచితముగ
కొలిచెదన్
మదిలోపలన్ గొలువు
తీరు.
ఓం *చిన్తామణిచిదానన్దా*యై
నమః.
నామ వివరణ.
అనుకొన్నదంతయూ ప్రసాదించు నిరంతర చిదానందస్వరూపిణి మన అమ్మ.
స్వయంకల్పిత చింతితానంద వృత్తము.
గణములు. త
స త స
య….
యతి 9వ అక్షరము. ప్రాస కలదు.
*చిన్తామణిచిదానన్దా* శివ నుతా! మదమ్బా!
చిన్తా కులజుడన్ నేనీ క్షితిని రామకృష్ణన్,
శాన్తిన్ గనగ లేకుంటిన్, సరగునన్ భవానీ!
చిన్తల్ విడును నీవున్నన్ క్షితిని గావు నన్నున్.
366.. ఓం *పఞ్చబాణప్రబోధిన్యై* నమః.
నామ
వివరణ.
పరమేశ్వరునకు
పంచబాణప్రబోధిని మన అమ్మ.
తే.గీ.
*పఞ్చబాణప్రబోధినీ! * సఙ్చితముల
నెటులనెడబాపుదో
నీవహీన గతిని,
శివునిమెప్పించి
పొందిన చిత్ప్రభాస!
నన్ను
రక్షింప వేడుచు నిన్నుఁ గొలుతు.
శ్లో.
బాణశ్రేణిస్సహస్రాక్షీ సహస్రభుజపాదుకా ।
సంధ్యావలిస్త్రిసంధ్యాఖ్యా బ్రహ్మాండమణిభూషణా ॥ 48 ॥
367. ఓం *బాణశ్రేణ*యే నమః.
నామ
వివరణ.
బాణముల
వరుసను కలిగియున్న జనని మన అమ్మ
కం. *బాణశ్రేణీ! * దురితుల
క్షోణిన్
బడఁ జేయుమమ్మ కూర్మిని నన్నున్
వాణీ
భక్తుఁడనంచును,
ప్రాణంబుగ
చూచుకొనుము, బ్రతిమాలెద నిన్.
368. ఓం *సహస్రాక్ష్యై* నమః.
నామ
వివరణ.
వేయి
కన్నులు కల తల్లి మన అమ్మ.
కం. సురవినుత
*సహస్రాక్షీ*!
ధరలోనన్
సుగుణ తతిని తప్పక కనుమా,
నిరతము
నీ సేవలలో
పరమార్థము
గొనుదునమ్మ! పావన చరితా!
369. ఓం *సహస్రభుజపాదుకా*యై నమః.
నామ
వివరణ.
వేయిభుజములూ
పాదములూ కలిగిన తల్లి మన అమ్మ.
కం. సకలము
*సహస్రభుజపా
దుక! * నీవే,
కద మదంబ! తోయజ ముఖి! నా
కిక
నీవే తోడగుచున్
సకలము
సరి చూడుమమ్మ! చక్కగ జననీ!
370. ఓం *సన్ధ్యావలయే* నమః.
నామ
వివరణ.
నడుమ
భాగమున ముడుతలు కలిగిన జనని.
కం. *సన్ధ్యావలి! * గొలుతు
నుభయ
సన్ధ్యలలో
మదిని నిన్ను చక్కగఁ గనుచున్,
నిన్ద్యమగు
భావనుడుపుము,
సంధ్యాసమయంబులందుఁ
జక్కగఁ గనుమా.
371. ఓం *త్రిసన్ధ్యాఖ్యా*యై నమః.
నామ
వివరణ.
ఉదయ,
మధ్యాహ్న, సాయం సంధ్యా స్వరూపిణి అమ్మ.
తే.గీ.
ఘన
*త్రిసన్ధ్యాఖ్య!
* నీద్యుతిఁ
గనగనిమ్ము,
పాగడగా
నేర నిన్నెంచి పూర్తిగాను,
సంధ్యవేళల
నిన్నెంచి ప్రస్తుతింతు,
వందనంబులుచేసెదనందుకొనుము.
372. ఓం *బ్రహ్మాణ్డమణిభూషణా*యై నమః.
నామ
వివరణ.
బ్రహ్మాండము
అనెడి మణిని అలంకారముగా కలిగిన తల్లి.
తే.గీ.
అలరు *బ్రహ్మాణ్డమణిభూషణా! * మనమున
వెలయఁజేయుము
బ్రహ్మాండ విశ్వవినుత
పద్యజాలమున్
నానుండి భవ్యముగను,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
వాసవీ వారుణీసేనా కులికా మంత్రరంజనీ ।
జితప్రాణస్వరూపా చ కాంతా కామ్యవరప్రదా ॥ 49 ॥
373. ఓం *వాసవ్యై* నమః.
నామ
వివరణ.
ఇంద్రుని
యొక్క శక్తి స్వరూపిణి అమ్మ.
తే.గీ.
*వాసవీ! * ఘన
నుత భాస! భాగ్యమగుచు
నామనంబున
కొలువుండి ప్రేమ మీర
సద్గుణంబులఁ
గొల్పుమా సరస మతిని,
వందనంబులు
చేసెద నందుకొనుము.
374. ఓం *వారుణీసేనా*యై నమః.
నామ
వివరణ.
పడమటదిక్కున
భయంకరమైన సైన్యమును కలిగియున్న్ అజనని మన అమ్మ.
తే.గీ.
*వారుణీసేన! * దుష్టులన్
బ్రబలనీక
నీవు
వారించుమమ్మరో! భావనలను
దుష్టదూషితముల్
బాపు నిష్టతోడ,
వందనంబులు
చేసెదనందుకొనుము.
375. ఓం *కులికా*యై నమః.
నామ
వివరణ.
ఉత్తమ
కులీన అమ్మ.
కం. *కులికా!* చింతావంశజ
కలిదూరుఁడ
రామకృష్ణ కవినమ్మా నా
యిలవేల్పువీవె,
కనుచున్
వెలయింపుము
భక్తి కవిత వెల్లువకాగన్.
376. ఓం *మన్త్రరఞ్జన్యై* నమః .
నామ
వివరణ.
మంత్రముచే
రంజించు తల్లి మన అమ్మ.
తే.గీ.
*మన్త్రరఞ్జనీ! * నీ నామ మంత్రములను
మనసునందున
భావించి మనన జేసి
నీకునర్పింతునమ్మ!
గణించి నిన్ను,
వందనంబులు
చేసెద నందుకొనుము.
377. ఓం *జితప్రాణస్వరూపా*యై నమః.
నామ
వివరణ.
జయించఁబడిన
ప్రాణ స్వరూపము కలది అమ్మ.
కం. పరమాత్మవె
నీవమ్మా!
కరుణామయివమ్మ
మమ్ము కాపాడుమిలన్,
నిరతము
నిన్నే గొలిచెద
వర
*జితప్రాణస్వరూప!* వందనమమ్మా!
378. ఓం *కాన్తా*యై నమః.
నామ
వివరణ.
తేజస్స్వరూపిణి
మనఅమ్మ.
కం. అన్తా
నిన్నే కొలుతురు,
*కాన్తా!* మనసార,
శుభము కాదనకిమ్మా,
సన్తోష
మొసగు తల్లివి,
సాన్తము
నను కావుమమ్మ సజ్జన భాసా!
379. ఓం *కామ్యవరప్రదా*యై నమః.
నామ
వివరణ.
కోరిన
కోరికలను ప్రసాదించు జనని మన అమ్మ.
తే.గీ.
గౌరవంబుగ
నిను మదిన్ గలయఁ జూచి
యాత్మలో
సేవ చేయగ నాశపడుదు,
కనుచు *కామ్యవరప్రదా!* కనికరించు,,
వందనంబులు
చేసెద నందుకొనుమ.
శ్లో.
మంత్రబ్రాహ్మణవిద్యార్థా నాదరూపా హవిష్మతీ ।
ఆథర్వణిః శ్రుతిః శూన్యా కల్పనావర్జితా సతీ ॥ 50 ॥
380. ఓం *మన్త్రబ్రాహ్మణవిద్యార్థా*యై నమః.
నామ
వివరణ.
బ్రహ్మ
మంత్రాభ్యాసము చేయు తల్లి.
కం. *మన్త్రబ్రాహ్మణవిద్యా
ర్థా*న్త్రములన్ బిగియఁ బట్టి ప్రఖ్యాతిగ నీ
మన్త్రంబులు
చదువు ఘనుల
కున్త్రాసము
కలుగనీకు, కొలిచెద నిన్నున్. (అంత్రములు=ప్రేగులు)
381. ఓం *నాదరూపా*యై నమః.
నామ
వివరణ.
ఓంకార
నాద స్వరూపిణి అమ్మ.
తే.గీ.
*నాదరూపా! * మహాదేవి! బోధఁ
గొలుపు
మాత్మలోనుండి
నాకిల నతులితముగ.
నాదరూపాత్మ
నేను నీ కాదరమున
వందనంబులు
చేసెద నందుకొనుము.
382. ఓం *హవిష్మత్యై* నమః.
నామ
వివరణ.
హోమగుండమునవేయు
హవిస్సులు అమ్మయే.
తే.గీ.
విను
*హవిష్మతీ! * కృపతోడ
వీనులార,
పద్యపాదమ్ములన్
హవిర్భాగముగను
నీకు
నర్పించుటెఱుఁగను, నీవె కనుచు
స్వీకరింపుము
పద్యాల చిత్ర గతులు.
383. ఓం *ఆథర్వణ్యై* నమః.
నామ
వివరణ.
అధర్వణ
వేదము అమ్మయే.
తే.గీ.
మహిత
*యాథర్వణీ! * నీవు
మహిమ తోడ
పద్య
రూపాన ప్రభవించు, పరవశింతు,
వెలుగ
పద్యమధర్వణ వేద సరణి
నందఁ
జేసెద నీ కృపనంది నీకు.
384. ఓం *శృత*యే నమః.
నామ
వివరణ.
అమ్మ
వేదముల రూపమే.
తే.గీ.
*శ్రుతి! * యనుశ్రుతంబుగ
వెల్గు చుండె జగతి,
శ్రుతులు,
నీరూపమగుటచే నతులితముగ,
కృత
మహాపుణ్య ఫలముచే శ్రుతులు దొరుకు
ప్రభవమొందెడి
పద్యముల్ వరలు శ్రుతియె
ఓం *ఆథర్వణిః శ్రుతయే* నమః.
తే.గీ.
నిరుప*యాధర్వణిఃశ్రుతీ!
* నిన్నుఁ గొలుతు
వేద విజ్ఞానమే లేని సాధకుఁడను,
నీవె నాకు వేదంబులు నిజము తల్లి!
వందనంబులు చేసెద నందుకొనుము.
385. ఓం *శూన్యా*యై నమః.
నామ
వివరణ.
ఆరంభము
ముగింపు లేని శూన్య మన జనని.
తే.గీ.
*శూన్య! * లోకంబు
శూన్యమే, చూడకున్న
నిన్ను
మనసార మదిలోన మన్ననమున,
మాన్య!
హృదయంబులో చేరు, ధన్యునగుదు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
386. ఓం *కల్పనావర్జితా*యై నమః. ॥ ౩౮౦ ॥
నామ
వివరణ.
కల్పననుండి
వర్జింపబడిన అకల్ప మన అమ్మ.
తే.గీ.
*కల్పనావర్జితా! * స్వ
సంకల్పమదియె
సృష్టి
జరుగఁగఁ జేయునే, దృష్టి పెట్టి
కల్పనంబును
చేయవు, కమల నయన!
వందనంబులు
చేసెద నందుకొనుము.
387. ఓం *సత్యై* నమః.
నామ
వివరణ.
సదీదేవి
మన అమ్మయే.
తే.గీ.
*సతి! * పరాశక్తి
నాలోన సన్నుతముగ
నిత్యమున్
వెల్గు చుంటివి, భృత్యులెల్ల
సేవలందింపఁ
గొనుటకై, సేవ్య పాద
పద్మములు
నీవె పద్య సంభాస! నతులు.
శ్లో.
సత్తాజాతిః ప్రమాఽమేయాఽప్రమితిః ప్రాణదా గతిః ।
అవర్ణా పంచవర్ణా చ సర్వదా భువనేశ్వరీ ॥ 51 ॥
388. ఓం *సత్తాజాత*యే నమః.
నామ
వివరణ.
గొప్పబ్రహ్మ
కుటుంబమునకు చెందిన జనని మన అమ్మ.
తే.గీ.
నతులు
వినుత *సత్తాజాత! * గతిని
మార్చి,
నన్ను
సన్మార్గమున నిల్పి, మన్ననమున
కన్నతల్లివై
రక్షింపు కరుణఁ జూపి,
వందనంబులు
చేసెద నందుకొనుము.
389. ఓం *ప్రమా*యై నమః.
నామ
వివరణ.
భక్తులను
అంచనా వేయగలిగిన తల్లి మన అమ్మ.
తే.గీ.
ఓ
*ప్రమా! * మాత!
భక్తుల నొనరఁ గనుచు,
వారి
శక్తిని మతినెంచి ప్రణవ తేజ
మందఁ
జేయుచు శుభదవై ముందు నడుపు
నిన్ను
మతినెంచి చూచెద సన్నుతముగ.
390. ఓం *అమేయా*యై నమః ।
నామ
వివరణ.
ఎటువంటి
సరిహద్దులూ లేని జనని.
తే.గీ.
కను
*మమేయా! * మహిత
భక్త కామ్యదవయి,
కని
యమేయమౌ నినుఁ గను కామితమును
తీర్చు
మాత్మ సువర్చవై తీరుగాను,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *మేయా*యై
నమః.
తే.గీ.
భక్తులకు మేయవీవమ్మ, భవ్య*మేయ!
*
భక్తసులభవు కావునన్ భజన చేతు
భక్తి గొలుపుచు మదిలోన వరలుమమ్మ,
వందనంబులు చేసెద నందుకొనుము.
391. ఓం *అప్రమిత*యే నమః.
నామ
వివరణ.
ప్రమితమేమాత్రమూ
కాని జనని మన అమ్మ.
తే.గీ.
ప్రమిత
మన్నది లేని *యప్రమితి! * నతులు,
వేద
సంభాసితా నీదు వెలుగు తీరు
కనగ
నప్రమితమ్ముగా, ప్రణుతులమ్మ!
వందనంబును
చేసెద నందుకొనుము.
ఓం *ప్రమితయే* నమః
తే.గీ.
వేద మూలసూత్రములచే విదితమగుచు,
*ప్రమితి!
* నా నుతులంది, నా భ్రమలు పాపు
మమ్మరో! నీదు మది కడుఁ గమ్మనమ్మ,
వందనంబులు చేసెద నందుకొనుము.
392. ఓం *ప్రాణదా*యై నమః.
నామ
వివరణ.
ప్రాణములను
ప్రసాదించు జనని.
తే.గీ.
*ప్రాణదా! * నీవె
నాకున్న ప్రాణమమ్మ!
ప్రణవ తేజంబె
ప్రాణమై ప్రబలు లోన,
జీవమేబ్రహ్మమైక్యమై
చెలగునట్లు
చేయుమమ్మరో నీకృపన్
జిత్తమలర.
393. ఓం *గత*యే నమః.
నామ
వివరణ.
గమ్యమయిన
తల్లి మన అమ్మయే.
తే.గీ.
*గతి! * శుభాకార
వీవమ్మ కరుణ తోడ
గతివగుచు
నాకు ముక్తిని
కలుగఁ
జేయు
మమ్మ!
పూజింతు నిన్ను నే నెమ్మితోడ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
394. ఓం *అపర్ణా*యై నమః.
నామ
వివరణ.
పార్వతీ
మాత మన అమ్మయే.
తే.గీ. అక్షయంబగు శివదీక్ష నలరి నీవు
పర్ణమైనను
గొనని యపర్ణవమ్మ,
కను
*మపర్ణ! * నన్
సతతంబుఁ గరుణతోడ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
395. ఓం *పఞ్చవర్ణా*యై నమః.
నామ
వివరణ.
నమశ్శివాయ
అను ఐదు వర్ణముల స్వరూపము అమ్మయే. విస్తారమై యొప్పు వర్ణ
సముదాయము
అమ్మయే.
తే.గీ.
*పఞ్చవర్ణా! * సువిదిత
ప్రపంచమైన
భవుని
పఞ్చాక్షరిన్ గల్గు వర్ణములవి
నీవె
గణియింప, నిజమిది నీరజాక్షి!
వందనంబులు
చేసెద నందుకొనుము.
396. ఓం *సర్వదా*యై నమః. ॥ ౩౯౦ ॥
నామ
వివరణ.
సమస్తమునూ
ప్రసాదించు జనని అమ్మయే.
తే.గీ.
సర్వమిచ్చెడి
*సర్వదా! * సవినయముగ
నిన్నుఁ
గొలిచెడి భక్తులే సన్నుతులిల,
ముక్తి
నీవెయై యొసగెడి శక్తివమ్మ
నిన్ను
కోరగానేల నాపన్న రక్ష!
397. ఓం *భువనేశ్వర్యై* నమః.
నామ
వివరణ.
చతుర్దశ
భువనములకూ ప్రభ్విణి మన అమ్మయే.
తే.గీ.
మహిత
*భువనేశ్వరీ! * జయ
మార్గ మీవె,
నాదు
దేహంబె భువనము, మోదమొసగు
నీవె
యీశ్వరి విచ్చటన్, నిన్నుఁ గొలుతు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
త్రైలోక్యమోహినీ విద్యా సర్వభర్త్రీ క్షరాఽక్షరా ।
హిరణ్యవర్ణా హరిణీ సర్వోపద్రవనాశినీ ॥ 52 ॥
398. ఓం *త్రైలోక్యమోహిన్యై* నమః.
నామ
వివరణ.
మూడులోకములకూ
మోహమును కలుగఁజేయు తల్లి.
తే.గీ.
తలప *త్రైలోక్యమోహినీ! * దారి నీవె
ముక్తిపై
మోహినైయుంటి భుక్తితోడ
ముక్తినొసగుము,
నినుఁ గొల్చి పూజ చేసి
వందంబులు
చేసెద నందుకొనుము.
399. ఓం *విద్యా*యై నమః.
నామ
వివరణ.
విద్యా
స్వరూపిణి అమ్మ.
తే.గీ.
మహిత
*విద్యా! * శుభాకార!
స్పృహను గొలిపి
పద్య
విద్యవై నాలోన ప్రబలు నీవు
ముక్తి
గొలిపెడి విద్య నాసక్తి నిమ్ము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
400. ఓం *సర్వభర్త్ర్యై* నమః.
నామ
వివరణ.
సమస్తమును
భరించు జనని అమ్మ.
తే.గీ.
*సర్వభర్త్రీ! * సదాచార!
సర్వ మీవె,
చూచి
పూరించు తల్లివి,
వేచితి
నిట,
భుక్తి
ముక్తుల నిచ్చు నిన్ బూజ చేయ,
వందనంబులం
జేసెదనందుకొనుము.
401. ఓం
*క్షరా*యై నమః.
నామ
వివరణ.
నశింపఁజేయగల
తల్లి మన అమ్మ.
తే.గీ.
సతి!
*క్షరా! * సుధాసింధు!
నిన్ నుతులు సేయ
నాదు
శక్తి చాలదుకదా!
మోదమలర
మదిని
భావించు నా భక్తి, మన్ననమున,
వందనంబులు
చేసెద నందుకొనుమ.
402. ఓం *అక్షరా*యై నమః.
నామ
వివరణ.
నాశ
రహిత అమ్మ.
తే.గీ.
క్షరము
కానట్టి తల్లి*వక్షర! * మదంబ!
స్థిరముగా
నీవు నా మదిన్ వరలుమమ్మ!
నిన్ను
సేవించి కృతినౌదు మన్ననమున,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం*క్షరాక్షరా*యై
నమః.
నామ వివరణ.
నశింపఁజేయగల నాశ రహిత అమ్మ.
తే.గీ.
ఓ *క్షరాక్షరా!
* మదిలోన నుండుమమ్మ!
క్షరముగానున్న దేహాన కరుణ తోడ
నక్షరంబుగ వెలుగుదువమ్మ నీవు
వందనంబులు జేసెద నందుకొనుము.
403. ఓం *హిరణ్యవర్ణా*యై నమః.
నామ
వివరణ.
స్వర్ణ
స్వరూపిణి అమ్మ.
తే.గీ.
అనుపమ
*హిరణ్యవర్ణా! * ప్రియంబు
తోడ
నీవు
మాలోన వెలుగుచు నేర్పు మీర
భవ్య
సంస్కారమనియెడి స్వర్ణమిచ్చి,
నిలుపుచుంటివి
నీలోనఁ గలుపుకొనగ.
404 ఓం *హరిణ్యై* నమః.
నామ
వివరణ.
దుఃఖహారి
మన అమ్మ.
తే.గీ.
*హరిణి! * మా
బాధలన్ బాపు నిరుపమవని
నిన్ను
సేవించుచుంటి నాపన్న రక్ష!
నాదు
బాధలన్ హరియించి యాదుకొనుము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
405. ఓం *సర్వోపద్రవనాశిన్యై* నమః.
నామ
వివరణ.
సమస్తమయిన
ఉపద్రవములను హరించు తల్లి.
కం. *సర్వోపద్రవ నాశిని! *
గర్వాంధ
తమమ్ము బాపు కరుణామూర్తీ!
నిర్వక్ర
ముక్తి మార్గము
నుర్విన్
దయ చేయుమమ్మరో! నినుఁ
గొలుతున్.
శ్లో.
కైవల్యపదవీరేఖా సోమమండలసంస్థితా ।
సూర్యమండలమధ్యస్థా వహ్నిమండలసంస్థితా ॥ 53 ॥
406. ఓం *కైవల్యపదవీరేఖా*యై నమః.
నామ
వివరణ.
మోక్షమార్గము
మన జనని.
స్వయం కల్పిత కాంతిపుంజ వృత్తము.
గణములు….
త స మ
య జ గ…..
యతి 9వ అక్షరము.
*కైవల్యపదవీరేఖా! * కాంతిరేఖా!
మనోహరీ!
భావంబునను
నీవేగా ప్రాణమై కాంతి చిందుదే,
జీవాత్మవయి
నీవే
నా
చిత్తమందున్ వెలుంగుదే,
దేవీ!
గొలుపుమా నీదౌ దీప్తి నాలో, నమోస్తు తే.
407. ఓం *సోమమణ్డల సంస్థితా*యై నమః.
నామ
వివరణ.
చంద్ర
మండలమున ఉండు తల్లి.
తే.గీ. *సోమ
మండలసంస్థిస్థ! * శుభదవీవు,
చల్లనైనట్టి
చంద్రికల్ సదయనీవు
నాదు
కవితలన్ వెలయించు నాదు జనని!
నీ
కృపన్బ్రజ నేలుమా నిరతమీవు.
408. ఓం
*సూర్యమణ్డల మధ్యస్థా*యై నమః.
నామ
వివరణ.
సూర్యమండల
మధ్యప్రదేశమున ఉండు జనని.
తే.గీ. *సూర్యమణ్డల మధ్యస్థ! * శోభలొలుకు
దివ్య
కవితా మహాద్యుతిన్ భవ్యముగను
నాకుఁ
దయచేయుమమ్మరో! ప్రాకటముగ
వందనంబులందించెద
నందుకొనుము.
ఓం *సూర్యమణ్డలసంస్థితా*యై
నమః ॥ ౪౦౦ ॥
నామ వివరణ.
సూర్యమండలమున ఉండు తల్లి మన అమ్మ.
తే.గీ.
*సూర్యమణ్డలసంస్థితా!
* శుభ నిధాన!
లోక కల్యాణకాంతులన్ బ్రాకటముగ
మాకునందింపఁ జేరితే శ్రీకరముగ
వందనంబులు చేసెద నందుకొనుము.
ఓం *సోమమణ్డలమధ్యస్థా*యై
నమః.
నామ వివరణ.
తే.గీ. *సోమ మణ్డల మధ్యస్థ!
* శుభ నిధాన!
చల్లనైనట్టి వెన్నెల నుల్లమలర
నాకు దయచేసి, కవితలోన వెలిగి యిట
పాఠకుల మతికెక్కుమా భవ్యముగను.
409. ఓం *వహ్నిమణ్డలసంస్థితా*యై నమః.
నామ
వివరణ.
అగ్నిమండల
మధ్యమున ఉండు జనని మన అమ్మ.
తే.గీ. *వహ్నిమణ్డలసంస్థితా!
* యాహ్నికముల
నంతరాత్మలో
జరుగనీ శాంతినలర
కర్మబంధముల్
విడఁజేసి ధర్మవర్త
నంబు
కలిగించు కృపతోడ నయ నిధాన!
శ్లో.
వాయుమండలమధ్యస్థా వ్యోమమండలసంస్థితా ।
చక్రికా చక్రమధ్యస్థా చక్రమార్గప్రవర్తినీ ॥ 54 ॥
410. ఓం *వాయుమణ్డలమధ్యస్థా*యై నమః.
నామ
వివరణ.
వాయుమండల
మధ్యమున ఉండు జనని లక్ష్మీదేవి.
తే.గీ. *వాయుమణ్డలమధ్యస్థ!
* పాయక
నను
నాత్మలోనుండి
వెలుగుమా, యహరహంబు,
ప్రాణవాయువై
జగతికి ప్రభను పెంచు,
వందనంబులందించెద
నందుకొనుము.
411. ఓం *వ్యోమమణ్డలసంస్థితా*యై నమః.
నామ
వివరణ.
ఆకాశమండలమున
ఉండు తల్లి మన అమ్మ.
తే.గీ. *వ్యోమ
మండల సంస్థితా*!వ్యోమమదియు
కలిగె
నాలోన నీ వట వెలుగుమమ్మ,
కవితవై
ప్రభవించి యాకాసమంత
జ్ఞానసంపత్తి
నొసగుమా కమల నయన!
412. ఓం *చక్రికా*యై నమః.
నామ
వివరణ.
దివ్యమయిన
చక్రము కలిగిన తల్లి, శ్రీచక్రస్వరూపిణి అమ్మ.
తే.గీ. *చక్రికా! * గనుమమ్మ
సంసార చక్ర
మధ్యమున
నేను నలుగుచు మహితవయిన
నిన్ను
సేవింప లేకుంటి సన్నుతముగ,
నన్ను
గాపాడుమా కృపన్ మిన్నగాను.
413. ఓం *చక్రమధ్యస్థా*యై నమః.
నామ
వివరణ.
శ్రీచక్ర
మధ్యభాగమున ఉండు జనని.
తే.గీ. చక్రమధ్యస్థ! యీ కాల
చక్రమునను
నలుగు
సామాన్య జనులకు వెలుగుఁ జూపి
నీవె
కాపాడుమమ్మరో భావగమ్య!
వందనంబులందించెద
నందుకొనుము.
414. ఓం *చక్రమార్గప్రవర్తిన్యై* నమః.
నామ
వివరణ.
శరీర
చక్రముల మధ్య ప్రయాణించు తల్లి.
కం. *చక్రమార్గ ప్రవర్తినీ! * వక్రగతిని
నిలిపి, నాలోన
కృపతోడ నిలువుమమ్మ,
నిత్యమాత్మన్
బ్రకాశించు సత్యమీవు,
వందనంబులందించెద
నందుకొనుము.
శ్లో.
కోకిలాకులచక్రేశా పక్షతిః పంక్తిపావనీ ।
సర్వసిద్ధాంతమార్గస్థా షడ్వర్ణావరవర్జితా ॥ 55 ॥
415. ఓం *కోకిలాకులా*యై నమః.
నామ
వివరణ.
చక్కని
గత్రము తోపాడెడి కోకిలసమూహము అమ్మయే
తే.గీ. *కోకిలాకులా! * నీవిలఁ
బ్రాకటముగ
కోకిలలతోడ
నిండి యేకాకులకిల
నూరటన్
గూర్తువమ్మరో ధీరురాల!
వందనంబులు
చేసెద నందుకొనుము.
416. ఓం *చక్రేశా*యై నమః.
నామ
వివరణ.
శ్రీచక్రాధిదేవత
అమ్మయే.
తే.గీ.
వినుత
*చక్రేశ*
నీ కృపన్ విశ్వసింతు,
కాలచక్రాల
క్రింద నన్ గరగనీక
కాచి
రక్షింపుమోయమ్మ కరుణ చూపి,
వందనంబులం
జేసెద నందుకొనుము.
ఓం *కోకిలాకులచక్రేశా*యై నమః.
నామ వివరణ.
సృష్టిలోకోకిలకులానికి ప్రభ్విణి మన అమ్మ.
తే.గీ. *కోకిలాకుల చక్రేశ!
* కోకిల కుల
మహిత చక్రేశవీవు, సమస్త సృష్టి
కోకిలారావములతోడ కూడియుండి
నిత్యము వసంత శోభతో నెగడనిమ్ము,
417. ఓం *పక్షత*యే నమః .
నామ
వివరణ.
చంద్రునిహేతువుగా
మనము గ్రహించు ఉభయపక్షములూ అమ్మయే.
తే.గీ.
*పక్షతీ! * మాసములలోని పక్షములుగ
నీవె
వెల్గుచు మాలోన నీ వెలుగులు
పంచుచుంటివి
నిన్ను వర్ణించ తరమ?
వందనంబులం
జేసెద నందుకొనుము.
418. ఓం *పఙ్క్తిపావనా*యై నమః.
నామ
వివరణ.
ప్రపంచమును
శుద్ధి చేయు తల్లి అమ్మ.
తే.గీ. *పఙ్క్తి పావనీ! * నా
పద్యపంక్తులనిల
పావనముచేసి
యలరించు పావనివిగ
నిన్ను
వర్ణింప జాలను నేను జనని!
వందనంబులం
జేసెద నందుకొనుము.
419. . ఓం *సర్వసిద్ధాన్తమార్గస్థా*యై నమః.
నామ
వివరణ.
అన్ని
సిద్ధాంత మార్గములందునూ ఉండు జనని.
తే.గీ. *సర్వ
సిద్ధాంత మార్గస్థ! * యుర్విపయిన
సర్వ
సిద్ధాంతమార్గాలఁ జక్కగ నిను
మేము
గ్రహియించి మనెదము మేలుగాను,
వందనంబులం
జేసెద నందుకొనుము.
420. ఓం *షడ్వర్ణా*యై నమః.
నామ
వివరణ.
షడ్వర్ణములూ
అమ్మయే.
తే.గీ.
కనగ
షడ్వర్ణములు నీవె కామితదవు!
వినుము
*షడ్వర్ణ!
* నేఁ
జేయు విన్నపములు,
శత్రు
షడ్వర్గమును బాపి చక్కగ నను
నాదుకొమ్మమ్మ,
నన్నింక చేదుకొనుమ.
421. ఓం *వరవర్జితా*యై నమః.
నామ
వివరణ.
తనకు
ఎటువంటివరములూ అవసరము లేక విడిచియున్న తల్లి.
తే.గీ.
ప్ర
*వరవర్షితా! * వర్షించు
ప్రవరులకిల
సర్వ
సంపదల్, శుభములున్ సతతమీవు,
జ్ఞానసంపన్నులై
జనుల్ ధీనిధులుగ
వెలుగఁ
జేయుమా నీకృపన్, విశ్వవేద్య!
ఓం *షడ్వర్ణా వర వర్జితా*యై నమః.
నామ వివరణ.
శా. *షడ్వర్ణా వర వర్జితా!*
శుభ నిధీ! సద్భాగ్యదా! సత్ ప్రదా!
యీడ్వంజాలను దేహమన్ శకట మీవే కాచి రక్షింప నీ
షడ్వర్గంబుగనున్న శత్రువుల నాశంబొందగాఁ జేయుమా,
షడ్వర్గోద్ధతి లేనిచో కనెద నిన్ సంస్కార యుక్తుండనై.
శ్లో.
శతరుద్రహరా హంత్రీ సర్వసంహారకారిణీ ।
పురుషా పౌరుషీ తుష్టిస్సర్వతంత్రప్రసూతికా ॥ 56 ॥
422. ఓం *శతరుద్రా*యై నమః.
నామ
వివరణ.
శతరుద్ర
స్వరూపిణి అమ్మ.
కం. *శత
రుద్రా! * నినుఁ గొలిచెద
నతి
భక్తిని శుభనుతవని హాయిగ మదిలో,
క్షితిపై
సదయులు వెలుగుత,
మతిమాలిన
చేష్టులింక మాయంగ వలెన్.
423. ఓం
*హరా*యై నమః.
నామ
వివరణ.
పాపములను
హరించు లోకమాత మన అమ్మ.
తే.గీ.
హరణ
చేయుమపాపముల్ *హర*!
మదంబ!
నిన్ను
నిరతంబు మదినిల్పి మన్ననమున
కొలుచు
పుత్రుండనోయమ్మ! నిలుపుము
నను,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *శతరుద్రహరా*యై నమః.
నామ వివరణ.
శతసంఖ్యాకరుద్ర శక్తితో కూడిన హరస్వరూపిణి అమ్మ. బాణములతాకిడికి కలిగిన బాధను
హరించు తల్లి మన అమ్మ.
కం. *శతరుద్రహరా!
* దేవీ!
మతిలో నిలుమమ్మ నీవు మాన్యతఁ గొలుపన్
క్షితిఁ గెల్తు, నీవె కలిగిన
నుతియించఁగఁ జాల నే మనోజ్ఞ సునామా!
424. ఓం *హన్త్ర్యై* నమః.
నామ
వివరణ.
దుష్ట
సంహారము చేయు జనని అమ్మ.
కం. *హన్త్రీ! * కృపఁగను
నన్నున్,
మన్త్రార్థము
లెఱుగ నేను, మాన్యా! కృపతో
మన్త్రార్థంబులఁ
దెలిపి కు
తన్త్రంబులనుండి
కావుదయతో నీవే.
425. ఓం *సర్వసంహారకారిణ్యై* నమః.
నామ
వివరణ.
సమస్త
సంహారమునకు మూలకారణము అమ్మయే.
తే.గీ.
*సర్వ
సంహార కారిణీ!* గర్వమణచి
నన్ను
రక్షింపుమా భువిన్ మిన్నగాను,
సర్వమున్నీవె,
దుష్టులన్ సంహరించి
కావుమా
శిష్టులన్ నీవు కరుణఁ జూపి.
426. ఓం *పురుషా*యై నమః.
నామ
వివరణ.
అతిపురాతనమయినది
మన అమ్మ.
కం. పురుషాహంకృతిఁ
బాపుచు
పురుషులకున్
జ్ఞానమిచ్చు పుణ్యద!
జననీ!
*పురుషా! * కొలిచెద
నిన్నున్
గరుణను
మతి నుండుమమ్మ కావగనెపుడున్.
427. ఓం *పౌరుష్యై* నమః.
నామ
వివరణ.
పౌరుష
లక్షణము అమ్మయే.
తే.గీ. *పౌరుషీ! * నీకు
నున్నట్టి పౌరుషంబె
నాకునున్
గొల్పి నిలుపుమా శ్రీకరముగ,
జీవి
పౌరుష హీనుడన్ భావ మదియె
తలపగాలేను
నను నీవె నిలుపుమమ్మ.
428. ఓం *తుష్ట*యే నమః .
నామ
వివరణ.
నిత్యమూ
సంతోషముగా తృప్తిగా ఉండు జనని.
తే.గీ. తుష్ఠి నాత్మకుఁ గొల్పెడి *తుష్ఠి!
* నీవె
తుష్ఠి
రూపాన మదినుండి తుష్ఠినొంద
సంతసంబిక
నేముండు? సాంత మీవె
ప్రేమతోడుత
మదినుండి ప్రీతిఁ గనుము.
429. ఓం *సర్వతన్త్రప్రసూతికా*యై నమః.
నామ
వివరణ.
అన్ని
తంత్రములకూ జనని అమ్మ.
తే.గీ. *సర్వ
తన్త్ర ప్రసూతికా!* సాక్షివీవె
సర్వతంత్రంబులకునెల్ల,
సాధ్వి! నీవె
సర్వతంత్రంబులును
నాకు , సత్వ రూప!
వందనంబులం
జేసెద నందుకొనుము.
శ్లో.
అర్ధనారీశ్వరీ దేవీ సర్వవిద్యాప్రదాయినీ ।
భార్గవీ యాజుషీవిద్యా సర్వోపనిషదాస్థితా ॥ 57 ॥ [ భుజుషీవిద్యా ]
430. ఓం *అర్ధనారిశ్వర్యై* నమః.
నామ
వివరణ.
అమ్మ
అర్థనారీశ్వరి.
తే.గీ. *అర్థ
నారీశ్వరీ! * జన్మ సార్థకమగు
నీవు
శివునితో నాలోన నిండి యున్న,
తల్లిదండ్రులయిన
మిమ్ము తలచుకొనుచు
సేవలన్
జేసి తరియింతు శ్రీకరముగ.
ఓం *దేవ్యై* నమః.
కం. *దేవీ!* నీ
పద సన్నిధి
భావించిన
చాలునమ్మ భక్తి మనమునన్
శ్రావించునమృతమటులను,
జీవించెద
మిము దలచుచు స్థిరమతినిడుమా.
ఓం *అర్ధనారిశ్వరీదేవ్యై* నమః.
తే.గీ. *అర్థ నారీశ్వరీదేవి!
* సార్థకమగు
నాదు జన్మంబు, నీవున్న నా మనమున,
నీవు శివునితో నాలోన నిండి యున్న,
సేవలన్ జేసి తరియింతు శ్రీకరముగ.
431. ఓం *సర్వవిద్యాప్రదాయి*న్యై నమః.
నామ
వివరణ.
సమస్త
విద్యలనూ ప్రసాదించు జనని.
తే.గీ. *సర్వ
విద్యాప్రదాయినీ! * సకల విద్య
లుర్విపైనుండియున్
నిన్ను గర్వపడుచు
చూడఁ
జేసెడి విద్యయే చూడ విద్య
వందనంబులం
జేసెద నందుకొనుము.
432. ఓం *భార్గవ్యై* నమః.
నామ
వివరణ. భృగుమహర్షికుమార్తె మన అమ్మ.
తే.గీ. *భార్గవీ! * కృపఁ
జూడుమా! భర్గురాణి!
మార్గమీవౌచు
ముక్తి సన్మార్గమిడుము.
ముక్తి
నీయగలేని నా భక్తి యేల
భక్తి
నెన్నుచు నాకింక ముక్తినిమ్ము.
433. ఓం *యాజుషీవిద్యా*యై నమః. (భూజుషీ
విద్యా)
నామ
వివరణ.
యజ్ఞవిద్యాస్వరూపిణి
అమ్మ.
తే.గీ. వినుమ *యాజుషీవిద్యా!* ప్రవణవు
నీవు
కావునన్
మది యజ్ఞాదికంబులకును
తావలము
చేసి మదిలోన తనియు మీవు
వందనంబులు
చేసెదనందుకొనుము.
ఓం
*భూజుషీ
విద్యా*యై నమః.
నామ
వివరణ.
భూమిని
సంరక్షించుకొను విద్యనెరిం గిన జనని
తే.గీ. వినుత *భూజుషీవిద్యా!*ప్రవీణ
వీవు
భూమినే
మది కాపాడు పూర్ణ రూప!
రక్షణమ్మిమ్ము
నాదు నిరీక్షనరసె,
వందనంబులు
చేసెదనందుకొనుము.
434. ఓం *సర్వోపనిషదాస్థితా*యై నమః.
నామ
వివరణ.
సమస్త
ఉపనిషత్తులలోఉన్న తల్లి మన అమ్మ.
కం. భాషలలో
వెలిగెడి మా
తా!
*సర్వోపనిషదాస్థితా!* జయమమ్మా!
నీసరి
లేరిల తెలుఁగను
బాసను
కావంగ జనని! వరలగనిమ్మా.
శ్లో.
వ్యోమకేశాఽఖిలప్రాణా పంచకోశవిలక్షణా ।
పంచకోశాత్మికా ప్రత్యక్పంచబ్రహ్మాత్మికా శివా ॥ 58 ॥
435. ఓం
*వ్యోమకేశా*యై నమః
నామ
వివరణ.
ఆకాశమే
కేశపాశముగా కలిగిన జనని మన అమ్మ.
తే.గీ.
*వ్యోమకేశ! * సదాచార
ధీ మనోజ్ఞ!
శ్రీమతీమణులైనట్టి
స్త్రీలకీవు
రక్ష
గొలుపగ నుండు పరీక్ష మాని,
వారి
యబలతఁ బాపుమా! వారిజాక్షి!
436. ఓం *అఖిలప్రాణా*యై నమః.
నామ
వివరణ.
సమస్త
ప్రాణికోటియు అమ్మయే.
కం. విను
మొర *లఖిల
ప్రాణా!*
కనుమా
భూజనుల వెతలు, కాదనకమ్మా,
విని
కావనెవ్వరుండిరి?
గుణగణ్యవు
నీవె కాక కువలయమందున్.
437. ఓం *పఞ్చకోశవిలక్షణా*యై నమః.
నామ
వివరణ.
ప్రాణమయాది
పంచకోశములప్రభావముఏమాత్రమూ
లేని విలక్షణ అమ్మ.
తే.గీ. *పఞ్చ
కోశ విలక్షణా! * పరవశింతు
సఞ్చితంబులఁ
బాపినన్ సదయ నీవు,
పఞ్చఁబోకుము
కష్టముల్, భక్తి నొసగి,
నిన్ను
పూజించ నిమ్మింక నేర్పు మీర.
438. ఓం *పఞ్చకోశాత్మికా*యై నమః .
నామ
వివరణ.
శరీరమున
ఐదుకోశములందును ఉండు తల్లి మన అమ్మ.
తే.గీ. *పఞ్చకోశాత్మికా! * యీ
ప్రపంచమంత
పఞ్చకోశాత్మ
రూపె భావిఞ్చి చూడ,
పఞ్చ
కోశప్రదీప్తుల నెఞ్చి చూచి
కావుమో
మాత సతతము కరుణతోడ.
439. ఓం *ప్రతీచే* నమః. (ప్రత్యక్)
నామ వివరణ.
అదృశ్యముగా అన్నిటనూ ఉండు జనని.
తే.గీ. శ్రీ *ప్రతీచి* దినకరుఁడు చేరి నిన్ను
హాయిఁ
గొలుపుచు నుండు సాయంత్ర వేళ,
ప్రాక్ ప్రతీచీల మధ్యను పడి వసించు
మమ్ము
కాపాడుమని చెప్పు మంగళాంగి!
440. ఓం *పఞ్చబ్రహ్మాత్మికా*యై నమః.
నామ
వివరణ.
పంచబ్రహ్మలయొక్క
ఆత్మగా ఉన్న తల్లి.
కం. సకలవు
*పఞ్చబ్రహ్మా
త్మికా!*
నినుఁ గొలుతును పరిణతి నిడుమ, జ్ఞానం
బకళంక!
యొసగి కావుము,
ముకుళిత
హస్తములతోడ ముందుగఁ గొలుతున్.
441. ఓం *శివా*యై నమః.
నామ
వివరణ.
శుభములకు
ఆలవాలమగు జనని.
తే.గీ.
శ్రీ
*శివా!* దైవసన్నిధిన్
జేరఁ జేసి
ముక్తి
మార్గంబుఁ గొలుపుమా భక్తులకును,
ధ్యాసతో
నిన్నుఁ గొలిచెద తల్లివీవె
కావ
నుంటివటంచును గమలనయన!
ఓం *పఞ్చబ్రహ్మాత్మికాశివా*యై
నమః.
కం. సకలవు *పఞ్చబ్రహ్మా
త్మికా శివ! కొలుతును పరిణతి నిడుమ, జ్ఞానం
బకళంక! యొసగి కావుము,
ముకుళిత హస్తములతోడ ముందుగఁ గొలుతున్.
శ్లో.
జగజ్జరాజనిత్రీ చ పంచకర్మప్రసూతికా ।
వాగ్దేవ్యాభరణాకారా సర్వకామ్యస్థితాస్థితిః ॥ 59 ॥
442. ఓం *జగతే* నమః.
నామ
వివరణ.
సృష్టి
స్వరూపిణి అమ్మ.
తే.గీ.
*జగతి!* కావగనెంచుమీజగతిని
కృప,
నాదు
దేహమే జగతిగా నమ్మి సతము
నిన్ను
లోపలన్ గననెంతు సన్నుతముగ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
443.ఓం *జరాజనిత్ర్యై* నమః.
నామ
వివరణ.
వృద్ధురాలయిన
జగజ్జనని.
తే.గీ.
ఓ
*జరాజనిత్రీ!* నిన్
మహోపకారి
వందురందరున్
నిజమైన ననితర గతి
నా
మనంబున నిలువుమా నమ్మకముగ.
వందనంబులు
చేసెదనందుకొనుము.
ఓం *జగజ్జరాజనిత్ర్యై* నమః
తే.గీ. లోకములు కొల్పి వాటి నేలుచు *జగజ్జ
రాజనిత్రీ! * మముంగూడ రమ్య గతిని
యేలుచుంటివి, నా మది నేలుమమ్మ,
హృదయ పద్మాన వసియించు హృద్యముగను.
444. ఓం *పఞ్చకర్మప్రసూతికా*యై నమః.
నామ
వివరణ.
సృష్ట్యాది
పంచ కర్మలను కల్పించిన తల్లి
తే.గీ. *పఞ్చకర్మప్రసూతికా*
పంచ విహిత
కర్మలన్
జేయఁ జేయుచున్ కర్మభువిని
వరలునట్లుగఁ
జేయుమా యురుతరముగ,
వందనంబులు
చేసెదనందుకొంఉము.
445. ఓం *వాగ్దేవ్యై* నమః.
నామ
వివరణ.
వాక్కునకు
దేవత అమ్మ.
తే.గీ.
చక్కనైనట్టి యమృతంపు
వాక్కులిచ్చి,
చిత్రకవితా
మహాశక్తి చేతికిచ్చి,
నన్ను
కాచు *వాగ్దేవి! * నిన్
సన్నుతింతు
వందనంబులు
చేసెద నందుకొనుము.
446. ఓం *ఆభరణాకారా*యై నమః.
నామ
వివరణ.
ాలంకారములతో
ప్రకాశించు జనని అమ్మ.
కం. *ఆభరణాకారా! * యీ
లోభికి
యాభరణ మీవె, లోకము నన్నున్
లోభిగ
ననుకొన వచ్చును
లోభని,
నిన్ వదలనట్టి లోభిని తల్లీ!
447. ఓం *సర్వకామ్యస్థితా*యై నమః.
నామ
వివరణ.
సమస్తమయిన
కోరికలయందూ కలిగిన జనని.
తే.గీ.
*సర్వ
కామ్యస్థితా!* స్థిత! సర్వ కామ్య
ద
వయి తీర్చుము, నా లోన దయను నిలిచి
యాత్మతేజంబువగుమమ్మ,
యహరహంబు
గొలుచుచుందును
భక్తితో కోర్కె తీర.
448.ఓం *స్థిత*యే
(స్థిత్యై) నమః .
నామ
వివరణ.
స్థిరముగా
ఎల్లప్పుడూ ఉండు జనని అమ్మ.
తే.గీ.
హృదయ
కమల సంస్థితవమ్మ కదలక
నిలు
ప్రాణమై
యున్న ఓ *స్థితా!* భక్తిఁ
గొలుతు
నిన్ను
కవితామృతముతోడ మన్ననమున
వందనంబులు
చేసెద నందుకొనుము.మున
శ్లో.
అష్టాదశచతుష్షష్ఠిపీఠికా విద్యయా యుతా ।
కాలికాకర్షణశ్యామా యక్షిణీ కిన్నరేశ్వరీ ॥ 60 ॥
449. ఓం *అష్టాదశచతుఃషష్టి-పీఠికా*యై నమః.
నామ
వివరణ.
స్వయంకల్పిత మృదయపీఠికా వృత్తము.
గణములు.
… త స ర జ న త ర. యతి…12వ అక్షరము.,, ప్రాస నియమము
కలదు.
*అష్టాదశ చతుష్షష్టి పీఠికా!*
యనుపమ
విజ్ఞాన పేటికా!
కష్టంబులనుపోవంగఁ
జేయుమా, కమలదళాక్షీ, నితాంతమున్,
సృష్టిన్ జనుల
రక్షింతు వీవెగా శ్రితజనమందార! సన్నుతుల్,
నష్టంబులనుపోఁగొట్టి,
కావుమా, ననుగను తల్లీ! ప్రశాంతిగా.
450. ఓం
*విద్యయాయుతా*యై నమః ।
నామ
వివరణ.
అన్ని
విద్యలూ తానే అయియున్న తల్లి.
తే.గీ.
*విద్యయాయుతా!
* నీకు
నైవేద్యమగుత
నాదు
సద్గుణ ఫలములు మోదమలర,
నిన్నుఁ
దెలిపెడి విద్యను మన్ననమున
నేర్చుకొందును
నేర్పుమా నేర్పు మీర.
ఓం *అష్టాదశచతుష్షష్ఠిపీఠికా విద్యయా యుతా*యై నమః.
నామ వివరణ. అష్టాదశపీఠములుగా చతుష్షష్టిపీఠములుగా విద్యా సమన్వితయై
యొప్పుచున్న జనని.
స్వయంకల్పిత వృత్తము.
గణములు. స
భ య జ
త ర. యతి. 11వ అక్షరము.
ప్రాస నియాము కలదు.
*విదితాష్టాదశచతుష్షష్ఠి పీఠికా విద్యయా యుతా!*
సదయన్ గాంచుమిక నన్నున్ ప్రశాంతిగానుండఁ జేయుమా,
హృదయంబందునవసించంగహృద్యమౌ పద్యముల్ సుధీ!
సుధలంజిందగరచింతున్విశుద్ధ!నీపై శుభాకృతీ!
451. ఓం *కాలికా*యై నమః.
నామ
వివరణ.
కాలస్వరూపిణియు
కాలికా స్వరూపిణియు అయియున్న తల్లి.
తే.గీ.
కాల
రూపిణీ! *కాలికా! * కనగనిమ్ము
నిన్ను
నామదిన్ నిలుపుచు నిత్యముగను,
నిన్ను
బంధ చిత్రములలో సన్నుతింప
శక్తినీయుమా
మాయమ్మ, భక్తిఁ గొలిపి.
452. ఓం *కర్షణ్యై* నమః.
నామ
వివరణ.
జగత్తులో
ఆకర్షణీయమయిన జనని.
కం. మహితా!
*కర్షణ!* మొరవిను,
సహనము
కలిగించు నాకు చక్కగ నిను నే
నహరహమును
ప్రార్థించన్
స్పృహతోడ
సభక్తికముగ, చిద్వర తేజా!
ఓం *ఆకర్షణ్యై నమః.
నామ వివరణ.
జగత్తులో ఆకర్షణీయమయిన జనని.
కం. ఆకర్షణీ!
* మనోజ్ఞా!
నీకిల నెవరమ్మ సాటి? నిర్భర కరుణా!
శ్రీకరముగ నినుఁ గొల్తును,
ప్రాకటముగ కావుమమ్మ! వందనమమ్మా!
453. ఓం *శ్యామా*యై నమః.
నామ
వివరణ.
శ్యామల
వర్ణ ప్రకాశిని మన జనని.
కం. *శ్యామా!* శ్రీమజ్జగదభి
రామా!
సన్నామ! వినగ రమ్మా మొరలన్,
నామానసమున
నిండుమ,
నీమంబుగఁ
గొలుతునమ్మ నిన్నున్ జననీ!
454 ఓం *యక్షిణ్యై* నమః.
నామ
వివరణ.
అమ్మ
యక్షురాలు.
తే.గీ.
*యక్షిణీ! * జగదీశ్వరీ!
రక్ష నీవు
సృష్టికంతటికిన్,
నన్ను సృజన చేసి
రక్షణమునీయకుండినన్
దక్షులెవరు
నన్ను
కాపాడుటకిలను, కన్నతల్లి!
455. ఓం *కిన్నరేశ్వర్యై* నమః.
నామ
వివరణ.
కిన్నరులకు
దేవత మన అమ్మ.
తే.గీ.
*కిన్నరేశ్వరీ! * పాహిమాం
కృపను గనుమ,
కనులతో
నిన్ను గనలేక కలగుచుంటి
నిన్ను
నా మదిన్ గృపతోడ నున్న గాని,
కన్నులారగ
నిన్ను నే గాంచనిమ్మ.
శ్లో.
కేతకీ మల్లికాఽశోకా వారాహీ ధరణీ ధ్రువా ।
నారసింహీ మహోగ్రాస్యా భక్తానామార్తినాశినీ ॥ 61 ॥
456. ఓం *కేతక్యై* నమః.
నామ
వివరణ.
మొగలి
పుష్పము ఇష్టమయిన తల్లి అమ్మయే.
తే.గీ.
*కేతకీ!* నను
గాంచెడి మాతృమూర్తి!,
పుష్ప
సుకుమార! శుభకరీ! పూవుబోడి!
జ్ఞానపుష్పంబువై
సుధన్ కరుణనొసగి
నన్ను
కరుణించి కావుమా సన్నుతముగ.
457. ఓం *మల్లికా*యై నమః.
నామ
వివరణ.
మల్లిక
అమ్మయే.
తే.గీ.
*మల్లికా!* వర
పద్యముల్ వెల్లువగను
వ్రాయునట్టులఁ
గరుణతోఁ జేయుమమ్మ!
పద్య
సాహస్రమున్ నీకు భక్తి నీయఁ
జేయు
మోయమ్మ, నాకు, నేఁ జేయఁ జాల.
458. ఓం *అశోకా*యై నమః.
నామ
వివరణ.
అశోకము
అమ్మయే. అమ్మ దుఃఖ రహిత.
తే.గీ.
ఓ
*యశోకా!* కృపన్ నాకు శ్రేయమొదవు
చిత్రబంధకవిత్వంబు
నాత్రముగను
వ్రాయఁ
జేయుమా నాలోని మాయఁ బాపి
వందనంబులు
చేసెద నందుకొనుము.
459. ఓం *వారాహ్యై* నమః. ॥ ౪౫౦ ॥
నామ
వివరణ.
వెష్ణువు
యొక్క వరాహ అవతారము అమ్మయే.
కం. *వారాహీ*!
శుభకరముగ
ధీరోదాత్తత్వ
మసమ ధీశక్తియు సు
స్మేరాంభోజ
ముఖంబును
గోరకనే
యొసగుదువుగ, కొలిచెద నిన్నున్.
460.ఓం *ధరణ్యై* నమః ।
నామ
వివరణ.
భూమి
అమ్మయొక్క స్వరూపమే.
కం. *ధరణీ! * నను
గడవరకును
ధరియించెడి
తల్లివమ్మ! తప్పక నిన్నున్
వర
నుత కవితామృతముగ
వరలించుచు
వ్రాయనిమ్ము, వరగుణ గణ్యా!
461. ఓం *ధ్రువా*యై నమః.
నామ
వివరణ.
స్థిరముగా
ఉండు జనని అమ్మ.
కం. ధ్రువముగ
నను నిలిపెడి యో
*ధ్రువా! * మదంబవు
ప్రశాంతితో మనఁజేయన్
భవమును
వీడఁగఁ జేయన్
నివసింపుము
నాదు మదిని నిర్భరశాంతీ!
462. ఓం *నారసింహ్యై* నమః.
నామ
వివరణ.
నరహరి
స్వరూపము అమ్మయే.
తే.గీ.
*నారసింహీ! * ననున్ గను భారమనక,
కోరనమ్మరో
చిల్లరకోరికలను,
కోరుదును
నిన్ను మదిలోన కొలువు తీర
మనుచు,
చాలది తీర్చుమా! యనుపమముగ.
463. ఓం *మహోగ్రాస్యా*యై నమః.
నామ
వివరణ.
గొప్ప
భయంకరమయిన ముఖము కలతల్లి అమ్మ.
కం. గమనించు
*మహోగ్రాస్యా! *
శ్రమజీవుల
శ్రమను దోచి క్రాలెడు వారిన్
సమముగ
న్యాయము కూర్చుము,
భ్రమలను
పోకార్పి నాకు భద్రతనిమ్మా.
464. ఓం *భక్తానామార్తినాశిన్యై* నమః
నామ
వివరణ.
భక్తులయొక్క
బాధలను నశింపఁజేయు తల్లి మన అమ్మ.
కం. శ్రీమన్మంగల
రూపిణి!
క్షేమంబును
గొలుపు జనని, శ్రీకర! *భక్తా
నామార్తి నాశినీ!*
నను
ప్రేమను
వరలింపుమమ్మ ప్రీతిని కొలుతున్
శ్లో.
అంతర్బలా స్థిరా లక్ష్మీర్జరామరణనాశినీ ।
శ్రీరంజితా మహాకాయా సోమసూర్యాగ్నిలోచనా ॥ 62 ॥
465. ఓం *అన్తర్బలా*యై నమః.
నామ
వివరణ.
జీవులలో
ఉండు శక్తి అమ్మయే. మానసికముగా మిక్కిలి బలముగా ఉండు జనని.
తే.గీ.
లక్ష్య
సాధన *మన్తర్బలా!* యొసంగి,
సాక్ష్యముగ
నిల్చి మదిలోన సన్నుతముగ,
మోక్షమార్గంబె
నీవయి పూజ్యముగను
వెలుగుమోయమ్మ!
కవితవై వెలుగునిమ్మ!
466. ఓం *స్థిరా*యై నమః.
నామ
వివరణ.
అస్థిరత్వము
అన్నదే లేని శాస్వతమయిన స్థిరమయిన తల్లి అమ్మ.
తే.గీ.
శ్రీ
*స్థిరా! * నాదు
మదికింత స్థిరము నొసగి,
నిన్ను
నేకాగ్ర చిత్తునై నెనరుతోడఁ
గొలుచువానిగాఁ
జేయుమా, పలువిధముల
పద్యములలోన,
చెప్పించు హృద్యముగను.
467 ఓం *లక్ష్మ్యై* నమః.
నామ
వివరణ. ఽన్నియు మంచిలక్షణములే కలిగిన జనని అమ్మ.
కం. *లక్ష్మీ! * దైవాంశములన్
సూక్ష్మార్థగ్రాహిగ
ననుఁ జూచుటకొఱకై
సూక్ష్మార్థ
గ్రహణ మెటులొ
సూక్ష్మంబుగఁ
దెలుపుమమ్మ సురుచిర వాఙ్మీ!
468. ఓం *జరామరణనాశిన్యై* నమః.
నామ
వివరణ.
సాధకులకు
జరామరణములు లేకుండా ముక్తిని ప్రసాదించు కరుణా స్వరూపిణి అమ్మ.
కం. నీవే
సర్వ జగమ్మని
నీవే
జీవంబటంచు నీపైనను స
ద్భావనఁ
గలుగన్ జేయుము
నీవె
*జరామరణ
నాశినీ! * నినుఁ గొలుతున్.
469. ఓం *శ్రీరఞ్జితా*యై నమః. ॥ ౪౬౦ ॥
నామ
వివరణ.
సంపదలందు
ప్రకాశించు తల్లి మన అమ్మ.
కం. *శ్రీరఞ్జితా! * సుగుణనుత!
భారము
నీదమ్మ భక్త పాలన పరవై
నేరము
చేయగనీయక
వారించుచు
గావుమమ్మ, ప్రార్థింతు నినున్.
470. ఓం *మహాకాయా*యై నమః.
నామ
వివరణ.
గొప్ప
శరీరము కలది అమ్మ.
కం. వినిపింతు
*మహా
కాయా! *
వినుమా
నా పద్యములను వీనులలరగా
కనిపింపుము
నా కంటికి
మనఁ
జేయుము
నీ
దరినిక మన్నన తోడన్.
471. ఓం *సోమసూర్యాగ్నిలోచనా*యై నమః.
నామ
వివరణ.
సూర్యచంద్రాగ్నులనే
నేత్రములుగా కలిగిన జనని అమ్మ.
తే.గీ.
*సోమ
సూర్యాగ్ని లోచనా!* శుభ
నిధాన!
నీ
మనమ్మున మననిమ్ము నెమ్మి తోడ,
దివ్య
తేజస్స్వరూపివై దీనులమది
వెలుఁగుమోయమ్మ
వారికిన్ గొలుపు శాంతి.
శ్లో.
అదితిర్దేవమాతా చ అష్టపుత్రాఽష్టయోగినీ ।
అష్టప్రకృతిరష్టాష్టవిభ్రాజద్వికృతాకృతిః ॥ 63 ॥
472. ఓం *అదిత*యే నమః.
నామ
వివరణ.
ఆదిత్యులకు
జనని మన అమ్మ.
తే.గీ.
దేవతామాత
*యదితీ! * మదిన్
వసించి
ప్రోవుమమ్మరో
దుర్గతుల్ పొలయకుండ,
నీవు
కలవేని మదిలోన భావసుధలు
కూర్చునానందమున్,
సదా, కూర్మితోడ.
473. ఓం *దేవమాత్రే* నమః.
నామ
వివరణ.
దేవతలకు
జనని అమ్మ.
తే.గీ.
*దేవమాతా! * గుణోపేత!
దీప్తిఁ గొలుప
ధీనిధానంబుగా
మదిన్ దేలుమమ్మ,
వా ఙ్మహాతేజమున్ గొల్పి వరలనిమ్మ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
474. ఓం *అష్టపుత్రా*యై నమః.
నామ
వివరణ.
అష్ట
పుత్రులకు జనని అయిన దేవకీమాత అమ్మయే.
తే.గీ.
*అష్ట
పుత్రా! * మహా సాధ్వి! యమర వినుత!
కష్టములు
పాపి కావుమా కరుణఁ జూపి
యిష్ట
కామ్యార్థ సిద్ధి కేనిరవు కాగ
మదిని
నీవుండి కొల్పుమా మాననీయ!
475. ఓం *అష్టయోగిన్యై* నమః.
నామ
వివరణ.
అణిమాది
అష్ట యోగముల స్వరూపిణి అమ్మ.
తే.గీ.
*అష్ట
యోగినీ! * తొలగించు మష్టకష్ట
ములను మానవ
జాతికిఁ, గలుగఁ జేయు
మష్ట
సిద్ధులన్ సాధననలరునపుడు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
476 ఓం *అష్టప్రకృత్యై* నమః.
నామ
వివరణ.
శ్లో. భూమిరాపోఅనలో
వాయుః ఖం మనోబుద్ధిరేవచ |
అహంకార
ఇతీయంమే భిన్నా ప్రకృతి రష్టదా || (7-14)
ఈ
విధముగా గీతలో భగవానుడు చెప్పినట్లుగా అష్ట ప్రకృతులుకలవు. అవి అమ్మయే.
తే.
గీ.
అష్ట
ప్రకృతుల రూప మీ *వష్ట
ప్రకృతి! *
సృష్టి
కాధారమీవేను, దృష్టి పెట్టి
భ్రష్టు
పట్టగ నీయక బ్రతుకునిచ్చి
ప్రజలఁ
గాపాడగా కోరి భక్తిఁ గొలుతు.
477. ఓం *అష్టాష్టవిభ్రాజద్వికృతాకృత*యే నమః.
నామ
వివరణ.
ఎనిమిదెనిమిదుల(64)
కళలలో ప్రకాశించు జనని అమ్మ.
స్వయంకల్పిత విభ్రాజిదాకృతి వృత్తము
గణములు. త మ స జ గగ.
…యతి.
9వ
అక్షరము.
*అష్టాష్టవిభ్రాజద్వికృతాకృతీ! * నుతింతున్,
దృష్టింసదా
నీపైనిడి, తృప్తిగా వసింతున్,
కష్టంబులన్
వారించు ప్రకాశ మిమ్ము నాకున్,
స్రష్టాకృతీ!
నీవే నను సాకుమా, మదంబా!
శ్లో.
దుర్భిక్షధ్వంసినీ దేవీ సీతా సత్యా చ రుక్మిణీ ।
ఖ్యాతిజా భార్గవీ దేవీ దేవయోనిస్తపస్వినీ ॥ 64 ॥
478. ఓం *దుర్భిక్షధ్వంసిన్యై* నమః.
నామ
వివరణ.
కరువుకాటకములను
నశింపఁజేయు తల్లి.
కం. అర్భకులైరిల
పేదలు
దుర్భిక్షము
వలన బ్రతుకు తోచదు గడుపన్,
దుర్భర
జీవులనెన్నుమ
*దుర్భిక్షధ్వంసిని! * కృపతో బ్రతుకిమ్మా.
ఓం *దేవ్యై* నమః
కం. దేవీ! దేవ వరిష్ఠా!
దేవాంశగ నిలిచితీవు
దేహము లోనన్,
ధీవాగ్భాసవు
నీవే
సేవించెద
నమ్మ నిలుము చిత్తములోనన్.
479. ఓం *సీతా*యై నమః.
నామ
వివరణ.
సీతాదేవి
అమ్మయే.
కం. *సీతా! * సుగుణోపేతా!
ఖ్యాతిగ
మదిలోన నిలిచి
కమ్మని
కవితల్
భాతిని
గొలుపగ వ్రాయుము,
నీ
తనయుఁడనమ్మ నేను, నిను సేవింతున్.
480. ఓం *సత్యా*యై నమః.
నామ
వివరణ.
సత్యమనగా
అది అమ్మయొక్క స్వరూపమే. కావుననే అమ్మ సత్య. సత్యభామ అమ్మయొక్క
స్వరూపమే.
కం. *సత్యా! * సమ్య
గ్భావౌ
న్నత్యా!
మది నిలిచి నీవు నను నడుపుమిలన్
నిత్యము
నిను సేవింతును
స్తుత్యముగా
మదిని నిలుము శోభిలఁ జేయన్.
481. ఓం *రుక్మిణ్యై* నమః.
నామ
వివరణ.
రుక్మిణీదేవి
అమ్మయే.
తే.గీ.
రుక్మిణీ!
కృష్ణు నర్థించి ప్రోవుమనుము,
నీవు
నా చిత్తమందుండి నేర్పుమీర
పద్యపాదంబులై
యుండి హృద్యముగను
కృష్ణు
సంసేనా ధృతిన్ గీర్తిఁ గనుము.
482. ఓం *ఖ్యాతిజా*యై నమః.
నామ
వివరణ.
కీర్తితో
జన్మించిన తల్లి అమ్మ.
తే.గీ. *ఖ్యాతిజా! * నీదు
విదిత విఖ్యాతినెఱిగి
పద్య
పుష్పార్చనలు చేసి ప్రబలనిమ్ము,
నిండు
తేజంబుతో మదినుండుమమ్మ.
వందనంబులు
చేసెదనందుకొనుము.
483. ఓం *భార్గవ్యై* నమః.
నామ
వివరణ.
భృగువుయొక్క
కుమార్తె భర్గవి అమ్మయే.
తే.గీ.
*భార్గవీ! * పుణ్య
ఫలమీవు వరలఁజేయు
మమ్మ
నీవుండి మదిలోన మహిమ తలర,
నడుపుమమ్మరో
బాధలనుడుపుమమ్మ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *దేవ్యై* నమః
కం. *దేవీ! * దేహమె
కనగా
దేవాలయమందునీవు
తీరుగనున్నన్
జీవికి
సంతోషంబగు,
నీవాడను
కృపను నిలుపు నిన్నున్ గొలుతున్.
484. ఓం *దేవయోన్యై* నమః.
నామ
వివరణ.
దేవతలకు
జన్మనిచ్చిన తల్లి అమ్మ.
తే.గీ.
దేవతలకీవు
తల్లివో *దేవయోని! *
మానవాళిని
కావుమా మహిమ చూపి,
భావసంపదఁ
గలిగించి భవ్య గతిని,
నిన్ను
కీర్తింపనీయు మాపన్న రక్ష!
485. ఓం *తపస్విన్యై* నమః.
నామ
వివరణ.
తపస్సు
చేయు తల్లి మన అమ్మ.
తే.గీ.
ఓ
*తపస్వినీ! * సాధించె
నొప్పిదముగ
శివుని,
పార్వతి తపమునన్, జీవకోటి
దైవమును
బొందఁ దపియించు భావి కొఱకు
నేను
గొల్చెద నిన్ను గణించుమమ్మ.
శ్లో.
శాకంభరీ మహాశోణా గరుడోపరిసంస్థితా ।
సింహగా వ్యాఘ్రగా దేవీ వాయుగా చ మహాద్రిగా ॥ 65 ॥
486. ఓం *శాకమ్భర్యై* నమః.
నామ
వివరణ.
భూదేవతలనాపత్సమయమున
జలాదులను ప్రసాదించి, పాడిపంటలననుగ్రహించిన
తల్లి
శాకంభరీమాత
మన అమ్మయే.
కం. *శాకమ్బరీ! * కృపామయి,
నీకర్చన
జేసి మదిని నిలిపెద నిన్నున్,
శ్రీకరముగ నిలు
నా మది,
రాకాశశివీవు,
కన వరంబటులున్నన్.!
487. ఓం *మహాశోణా*యై నమః.
నామ
వివరణ.
ముదురు
ఎరుపురంగులో ప్రకాశించు జనని మన అమ్మ.
తే.గీ.
ఓ
*మహాశోణ! * పరమాత్మ
నొప్పిదముగ
చూడగాఁ
జేయుమమ్మరో శోభిలగను,
శోణితములోన
నీవుండి చూడు నన్ను.
వందనంబును చేసెద
నందుకొనుము.
488 ఓం *గరుడోపరిసంస్థితా*యై నమః.
నామ
వివరణ.
గరుడునిపై
కూర్చొని యుండు జనని.
కం. నిరుపమముగ
శ్రీ *గరుడో
పరిసంస్థిత! *
నాదు మదిని ప్రబలుము జననీ!
పరమార్థ
మీవె తెలుపుచు
కరుణను
నడిపించుమమ్మ! కాదనకమ్మా.
489. ఓం *సింహగా*యై నమః .
నామ
వివరణ.
సింహములను
గమింపఁ జేయు జనని అమ్మ.
తే.గీ.
*సింహగా! * నాదు
చిత్తము సింహమటుల
చెలగిపోవుచునుండెను
చెప్పినటుల
వినదు
నీవే కృపన్
దానిపీచమడచి
వినగఁ
జేయుమా మాయమ్మ! ప్రీతి తోడ.
490. ఓం *వ్యాఘ్రగా*యై నమః.
నామ
వివరణ.
వ్యాఘ్రములను
గమింపఁ జేయు జనని అమ్మ.
తే.గీ.
*వ్యాఘ్రగా!
* వ్యాఘ్ర
షట్ఛత్రు వర్గము నను
బాధపెట్టుచునుండెను
పరమ పథము
సాధ్యమెట్లగునమ్మరో?
సంహరించి
వ్యాఘ్రచయమును,
నన్ గాచి వరలనిమ్ము.
ఓం * దేవ్యై* నమః.
తే.గీ.
సింహగావ్యాఘ్రగా!
*దేవి! * చిత్తమందు
నీవు
స్థిరముగా నుండుమా నేను గొలుతు,
నిన్ను
గొలిచిన శుభములు నన్నుఁ జేరు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *సింహగా వ్యాఘ్రగా దేవ్యై* నమః.
తే.గీ.
*సింహగావ్యాఘ్రగాదేవి!
* చిత్తమందు
నీవు స్థిరముగా నుండుమా నేను గొలుతు,
నిన్ను గొలిచిన శుభములు నన్నుఁ జేరు,
వందనంబులు చేసెద నందుకొనుము.
491. ఓం *వాయుగా*యై నమః.
నామ
వివరణ.
వాయువును
గమింపఁ జేయు జనని మన అమ్మ.
తే.గీ.
*వాయుగా! * నాదు కవితలు వాయువేగ
మునను
పరుగిడఁ జేయుము, మనము పెట్టి,
నిన్ను
దర్శింప నపుడగున్ మన్ననమున.
వందనంబులు
చేసెద నందుకొనుము.
492. ఓం *మహాద్రిగా*యై నమః.
నామ
వివరణ.
గొప్ప
అర్వతముపై కూర్చొనియుండుతల్లి మన అమ్మ.
తే.గీ.
ఓ
*మహాద్రిగా! * నిలుము నీవోర్పు తోడ,
ఘన
మహాద్రినిఁ బోలుచు కవితలందు,
నీవు
నిలిచిన చాలును నేను నిలుతు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
అకారాదిక్షకారాంతా సర్వవిద్యాధిదేవతా ।
మంత్రవ్యాఖ్యాననిపుణా జ్యోతిశ్శాస్త్రైకలోచనా ॥ 66 ॥
493. ఓం *అకారాదిక్షకారాన్తసర్వవిద్యాధిదేవతా*యై నమః.
నామ
వివరణ.
అకారము
మొదలు క్షకారము వరకు ఉన్న సమస్తవిద్యలకు దేవత మన అమ్మ.
స్వయంకల్పిత అక్షయ వృత్తము.
గణములు. య ర ర య జ ర గ…యతి. 12వ అక్షరము…ప్రాస
కలదు.
*అకారాదిక్షకారాన్తసర్వవిద్యాధిదేవతా*
భవానీ!
ప్రకాశంబున్
వికాసంబు గొప్పగా వర్ధిలంగఁ జేయుమీవే,
యకారాది
క్షకారంత సర్వమీవై కవిత్వమై వెలుంగన్
ప్రకాశించున్
బ్రబోధించు దైవమున్, భాసిలంగఁ జేయునమ్మా!
494. ఓం *మంత్రవ్యాఖ్యాననిపుణా*యై నమః.
నామ
వివరణ.
వేదమంత్రములకు
వ్యాఖ్యానము చేయు నిపుణురాలు అమ్మ.
తే.గీ.
*మంత్ర
వ్యాఖ్యాన నిపుణా!
* సమస్త
సృష్టి
మంత్రములలోనఁ
దెలియనౌ మహితముగను,
తెలియఁజేయుము
మది నుండి వెలుగఁ జేయ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
495. ఓం *జ్యోతిశ్శాస్త్రైకలోచనా*యై నమః.
నామ
వివరణ.
జ్యోతిశ్శాస్త్రమే
కన్నులుగా కలిగిన జనని.
కం.
సులలిత! *జ్యోతిశ్శాస్త్రై
కలోచనా! * శాస్త్రమెఱుఁగ, కావుము నీవే
నిలువవు
గ్రహముల నడకల్
ఫలితము
నీ కృపయె కనగ పద్మదళాక్షీ!
శ్లో.
ఇడాపింగళికామధ్యాసుషుమ్నా గ్రంథిభేదినీ ।
కాలచక్రాశ్రయోపేతా కాలచక్రస్వరూపిణీ ॥ 67 ॥
496. ఓం *ఇడాపిఙ్గలికా*యై నమః.
నామ
వివరణ.
ఇడ,
పింగళ నాడీరూపిణి అమ్మ.
తే.గీ. ఓ
*యిడా
పిఙ్గలిక! * కనుమో శుభాంగి
వరసుషుమ్నాడి
నీవెంటఁ బరగునమ్మ,
దాని
సత్ప్రేరకము నీవె జ్ఞానదముగ
వందనంబులు
చేసెద నందుకొనుము.
497. ఓం *మధ్యసుషుమ్నా*యై నమః.
నామ
వివరణ.
భ్రూ
మధ్యముననుండు సుషుమ్నాడి అమ్మయే.
తే.గీ. మహిత *మధ్య
సుషుమ్నా! *సమస్థమీవె,
మేలు
కొనిన సుషుమ్నాడి మేలు జరుగు,
మేలుకొలిపెద
వీవేను మేల్తరముగ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *ఇడాపింగళికామధ్యాసుషుమ్నా*యై నమః.
కం.
సులలిత పదా! *యిడాపిం
గలికామధ్యాసుషుమ్న! * కరుణించు ననున్,
గొలిచెద నిను నే పరిపరి
నిలు కవితకుఁ బ్రాణమగుచు, నిను సేవింతున్.
498. ఓం *గ్రన్థిభేదిన్యై* నమః.
నామ
వివరణ.
గ్రంథులను
భేదించు తల్లి మన అమ్మ.
తే.గీ.
*గ్రన్థి భేదినీ!* నీవె
యుద్గ్రంథములను
వెలయఁ
జేయఁగఁ దగుదువు, కలిగి మదిని,
నిన్ను
వెలయించు కవితలన్ నిండుమమ్మ,
వందనంబులు
చేసెదనందుకొనుము.
499. ఓం *కాలచక్రాశ్రయోపేతా*యై నమః. ॥
నామ
వివరణ.
కాలచక్రముతో
పాటు ఆశ్రయించి ఉండు జనని మన అమ్మ.
తే.గీ.
*కాలచక్రాశ్రయోపేత! *,మేలమేల?
కదలి
చనుచుండె కాలము, వదలకమ్ము
నన్ను,
పుత్రుఁడన్ నడిపించు నయ నిధాన,
వందనంబులు
చేసెద నందుకొనుము.
500. ఓం *కాలచక్రస్వరూపిణ్యై* నమః.
నామ
వివరణ.
కాలమను
చక్రము అమ్మయొక్క స్వరూపమే.
తే.గీ.
*కాల
చక్రస్వరూపిణీ! * జాలిచూపి
నన్ను
నడిపించుమమ్మరో మిన్నగాను,
కాలమున్
వ్యర్థపరచక కరుణఁ జూపి,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
వైశారదీ మతిశ్శ్రేష్ఠా వరిష్ఠా సర్వదీపికా ।
వైనాయకీ వరారోహా శ్రోణివేలా బహిర్వలిః ॥ 68 ॥
501. ఓం *వైశారాద్యై* నమః.
నామ
వివరణ.
ప్రతీ
విషయమునా అమ్మ విశారద.
తే.గీ.
ప్రనుత
*వైశారదీ!* నీకు
ప్రణతులమ్మ!
నే
విశారదుడను గాను, నీదు కృపనె
వ్రాయుచుంటిని
నీవిట్లు వ్రాయఁ జేయ
పద్య
దైవమున్ మదినెంచి పరవశింతు.
502. ఓం *మతిశ్రేష్ఠా*యై నమః.
నామ
వివరణ.
అత్యంత
ఘనతరమగు తెలివితేటలు కలిగిన జనని అమ్మ.
తే.గీ.
విను
*మతిశ్రేష్ఠ! * విశ్వమున్
వెలుఁగఁ జేయు
శక్తిఁ
గలిగిన దానవు,
చక్కగాను
నన్ను
కూడ మతిన్ నిల్పి సన్నుతముగ
నాదుకొమ్మమ్మ,
నన్నింక చేదుకొనుమ.
503. ఓం *వరిష్ఠా*యై నమః.
నామ
వివరణ.
ఉత్తమమైన
తల్లి మన అమ్మ.
కం. కనుమ
*వరిష్ఠా! * నన్నున్
వినుమమ్మా!
నాదు మనవి విశ్రుతముగ. నిన్
ఘనముగ
వర్ణన చేయుదు
నను
నడుపుమ మదిని నిలిచి నయమార్గమునన్.
504. ఓం *సర్వదీపికా*యై నమః.
నామ
వివరణ.
సమస్తమునకూ
వెలుగునిచ్చు తల్లి మన అమ్మ.
తే.గీ. *సర్వ
దీపికా! * నాలోని గర్వమడచు,
నీదు
సంసేవనము చేయ నిలిచియుంటి
సర్వదీపికవీవందు
నుర్వి కనగ,
పద్యముల్
వ్రాసి నీపైన పరవశింతు.
505. ఓం
*వైనాయిక్యై*
నమః.
నామ
వివరణ.
వినాయకునిలోని
శక్తి అమ్మయే.
తే.గీ.
వినుత
*వైనాయకీ! * నుతుల్,
విఘ్నములను
గలుగనీయక
కావుమా కమల నయన,
వెలుగుమమ్మరొ
నాలోన విశ్వమెఱుఁగ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
506. ఓం *వరారోహా*యై నమః.
నామ
వివరణ.
శ్రేష్టముగా
శరణమగు జనని మన అమ్మ.
తే.గీ.
నుత
*వరారోహ! * నీకు
సన్నుతు లు జనని!
ఘనతరంబగు
వరములు
మనగనిచ్చి,
వినుతులందగ
చేయు నీ ప్రేమనెన్న
నాకుఁ
దరమగునా? కాదు, నీకుఁ దెలియు,
507. ఓం *శ్రోణివేలా*యై నమః.
నామ
వివరణ.
వేదములచే
పరివేష్టింపబడిన జనని మన అమ్మ.
తే.గీ.
*శ్రోణివేలా! * జగత్పాల!
చూడవేల?
నాదు
శ్రోణిలో ప్రవహించి మోదమలర
శుభదవై
నిలు మాయమ్మ సుందర పద!
వందనంబులు
చేసెద నందుకొనుము.
508. ఓం *బహిర్వల్యై* నమః.
నామ
వివరణ.
బాహ్యమగు
శక్తి అమ్మయే.
తే.గీ.
నుత
*బహిర్వలీ! * వరలింపు
మతులితముగ,
నన్నునో
దేవి శుభదవై మన్ననమున,
శాస్త్ర
విజ్ఞాన సమవృద్ధి చక్కగ నిడి,
ముక్తి
మార్గంబు చూపుమా పూర్తిగాను.
శ్లో.
జంభినీ జృంభిణీ జంభకారిణీ గణకారికా ।
శరణీ చక్రికాఽనంతా సర్వవ్యాధిచికిత్సకీ ॥ 69 ॥
509. ఓం *జమ్భిన్యై* నమః. ॥ ౫౦౦ ॥
నామ
వివరణ.
గంభీరమయిన
తల్లి మన అమ్మ.
తే.గీ.
*జమ్బినీ! * మాతృదేవీ!
నిజంబు నీవె
సృష్టిలోగల
యందంబు చిత్ప్రభాస!
నిజము
నీవేను,
కల
కల్ల నిజము కాదు.
వందనంబులు
చేసెద నందుకొనుము.
510. ఓం *జృమ్భిణ్యై* నమః.
నామ
వివరణ.
ప్రపంచమంతటా
విజృంభించియున్న తల్లి మన అమ్మ.
తే.గీ. *జృమ్భిణీ! * యెల్లెడల నుండి చెలగుదువుగ,
నాదు
మది నుండి కావగ లేదొ మనసు?
తనయులను
గాచు దయ కల తల్లివీవు.
వందనంబులు
చేసెద నందుకొనుము.
511. ఓం *జృమ్భకారిణ్యై* నమః ।
నామ
వివరణ.
సృష్టి
జృంభణకు కారణభూతురాలు అమ్మయే.
తే,గీ. *జృమ్భకారిణీ!* నా మదిఁ జేరి నీవు
విరియఁ
జేయుము నా యెద విరిని కూడ
నీదు
కృపఁ జూప వికసించు మోదమలర
వందనంబులు
చేసెద నందుకొనుము.
512. ఓం *గణకారికా*యై నమః ।
నామ
వివరణ.
గణేశ
నిర్మాణ కారకురాలు మన అమ్మ.
తే.గీ.
దివ్య
*గణకారికా! * నీవు భవ్యముగను
గణపతిని
చేసి లోకముల్ కాచినావు,
గణ
లసత్కృప నాయెడన్ గలుగఁ జేయ!
వందనంబులు
చేసెద నందుకొనుము.
513. ఓం *శరణ్యై* నమః ।
నామ
వివరణ.
శరములు
కలిగిన తల్లి మన అమ్మ.
తే.గీ.
*శరణి! * నీ పాద పద్మముల్ శరణమంటి
శరములను
పట్టి చంపుమా శత్రువులను,
నన్నురక్షించుమా
కృపన్ గన్నతల్లి,
వందనంబులు
చేసెద నందుకొనుము.
514. ఓం *చక్రికాయై* నమః ।
నామ
వివరణ.
దివ్య
చక్రాయుధము కల తల్లి.
తే.గీ.
*చక్రికా! * నన్ను నీ కాల చక్రమందు
నలిగి
పోనీకు, నిన్ను నే నమ్మియుంటి,
వక్రగతిఁ
బాపి వరలనీ వసుధ నన్ను,
వందనంబులు
చేసెద నందుకొనుము.
515. ఓం *అనన్తా*యై నమః ।
నామ
వివరణ.
అంతమే
లేనిది మన అమ్మ.
తే.గీ.
ఓ
*యనంత! * నా యెదలోన నుండుమమ్మ,
వ్యధలనెడబాప
వర భక్తి సుధలు కురిసి
యాదుకోవమ్మ
నన్ను నీవమర వినుత!
వందనంబులు
చేసెద నందుకొనుము.
516. ఓం *సర్వవ్యాధిచికిత్సకా*యే నమః ।
నామ
వివరణ.
అన్ని
రోగములకూ వైద్యము అమ్మయే
కం. *సర్వవ్యాధిచికిత్సిక! *
యుర్విని
కాపాడు నీ వహోయన భక్తుల్,
సర్వము
నీవే యనుచును
గర్వముగా
చెప్పుకొందు కాదనకమ్మా.
శ్లో.
దేవకీ దేవసంకాశా వారిధిః కరుణాకరా ।
శర్వరీ సర్వసంపన్నా సర్వపాపప్రభంజనీ ॥ 70 ॥
517. ఓం *దేవక్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
దేవకియే.
తే.గీ. *దేవకీ! * నీవు శ్రీకృష్ణు దీప్తిని గని
మురిసిపోతివి,
మేమెట్లు మురియవలయు?
చూపుమనిచెప్పు
మాకును దీపితమవ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
518. ఓం *దేవసఙ్కాశా*యై నమః ।
నామ
వివరణ.
దేవతలతో
సరిపోలు జనని అమ్మ.
తే.గీ.
*దేవ
సఙ్కాశ! * పరిపూర్ణ దివ్య తేజ!
భావజగతిని
నింపు నీ ప్రభలతోడ,
వ్రాయఁ
జేయుమా పద్యముల్ వాసి జూపి,
వందనంబులు
చేసెద నందుకొనుము.
519. ఓం *వారిధయే* నమః.
నామ
వివరణ.
అమ్మ
ఒక మహా సముద్రమే.
తే.గీ.
*వారిధి! * గను మింక నను నవారిత గతి,
నాదు
మదిలోని వ్యధ బాప నీదు రూపు
సుధను
గురిపింప నిలుపుము మధుర గతిని,.
వందనంబులు
చేసెద నందుకొనుము.
520. ఓం *కరుణాకరా*యై నమః ।
నామ
వివరణ.
దయకు
నిలయము అమ్మ.
ఉ. ఓ
*కరుణాకరా! * జయ మహోజ్వల తేజమ! నీకు సన్నుతుల్,
శ్రీకరమై
వెలుంగుమిల చిత్తమునందున నన్నుఁగావగా
నీ
కరుణాకటాక్షములె నిండుగ భక్తిని గొల్పి నిత్యమున్
శ్రీకరవైన
నిన్ గొలువఁ జేయును, నీకు నమస్కరించెదన్.
521. ఓం *శర్వర్యై* నమః ।
నామ
వివరణ.
చీకటులనెడబాపు
తల్లి మన అమ్మ.
తే.గీ.
*శర్వరీ! * చీకటిన్ బాపి,
సర్వ
మీవె
యనెడి
భావంబుఁ గలిగించి, యుర్విపైన
నన్ను
మనఁ జేయు మమ్మరో సన్నుతముగ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
522. ఓం *సర్వసమ్పన్నా*యై నమః ।
నామ
వివరణ.
సమస్తమయినటువంటి
సంపన్నురాలు అమ్మ.
తే.గీ.
*సర్వసమ్పన్న! * నీ కృపన్ సర్వ సంప
దలను
బొందనీ కృపఁ జూపి, ధాత్రిపైన,
నీవె
సంపదల్ నాకునో నీరజాక్షి!
వందనంబులు
చేసెద నందుకొనుము.
523. ఓం *సర్వపాపప్రభఞ్జన్యై* నమః ।
నామ
వివరణ.
సమస్త
పాపములనూ పారద్రోలు తల్లి మన
అమ్మ.
తే.గీ.
*సర్వ
పాప ప్రభఞ్జనీ! * గర్వహారి!
పాప
పంకిలమై యుంటి ప్రతిభఁ జూపి
పాపములు
వాపి నన్నిలన్ బరగనిమ్ము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
ఏకమాత్రా ద్విమాత్రా చ త్రిమాత్రా చ తథాఽపరా ।
అర్ధమాత్రా పరా సూక్ష్మా సూక్ష్మార్థాఽర్థపరాఽపరా ॥ 71 ॥
524. ఓం *ఏకమాత్రా*యై నమః ।
నామ
వివరణ.
ఓం
కారములో ఒకమాత్ర అమ్మ.
తే.గీ.
ఏకమాత్రా!
నమస్తేస్తు, లోకజనని!
శోక
నాశినీ! నాకు నస్తోక ఫలద
వై
కటాక్షింప నాలోనఁ బరగుమమ్మ.
వందనంబులు చేసెద నందుకొనుము.
525. ఓం *ద్విమాత్రా*యై నమః ।
నామ
వివరణ.
ఓం
కారములో రెండఅవ మాత్ర అమ్మ.
తే.గీ. ఓ *ద్విమాత్రా! * లసద్ గాత్ర!
యో
పవిత్ర!
క్షేత్ర
మీ దేహ మమ్మరో! ధాత్రి నిట్టి
క్షేత్రమున
వెల్గు దీవెగా, కీర్తిఁ గొలుప,
వందనంబులు
చేసెద నందుకొనుము.
526. ఓం *త్రిమాత్రా*యై నమః ।
నామ
వివరణ.
ఓం
కారములో మూడవ మాత్ర అమ్మ.
పంచ
చామర.
*త్రిమాత్ర! *
నీవె
కావకున్న దిక్కు నాకు లేదుగా,
ప్రమాణ
మీవె మానసాన ప్రస్ఫుటంబు నిత్యమున్,
ప్రమోదమందఁజేయుమమ్మ,
భక్తితో నుతించెదన్,
నమామి
తే పరాత్పరా! యనంత భక్తినిమ్మిలన్.
527. ఓం *అపరా*యై నమః ।
నామ
వివరణ.
పర
కాని అపర మన అమ్మ.తురీయస్థితినుండు జనని మన అమ్మ.
తోటకము.
*అపరా! * నినుఁ గొల్చెద నాత్మను, నీ
కృపనే
గననిమ్మిక తృప్తిగ నన్
విపరీతపు
బుద్ధులు వీడునటుల్
నెపమెన్నక
చేయుమ, నిన్ గొలుతన్.
528. ఓం *అర్ధమాత్రా*యై నమః ।
నామ
వివరణ.
ఓం
కారంలో అర్థమాత్ర అనుస్వారము అమ్మ.
తే.గీ.
అర్థ
మాత్రవు నీవుగా నా శివుండె
యర్థమాత్రయై
నిండెను
సార్థకమయె
పృథ్వి
నా జన్మ నిన్ చూచి, వెలిగెనమ్మ,,
*నర్థమాత్రా! * మదిన్ నిలుమమ్మసతము.
529. ఓం *పరా*యై నమః.
నామ
వివరణ.
పరాశక్తిస్వరూపిణి
అమ్మ.
పంచ
చామర.
ప్రపా! *పరా! * నమోస్తుతే, శుభప్రదా! నమోస్తుతే
ప్రపంచమంతనిండియున్
గృపన్ సతంబు చూడవా
యుపాయమేమి
నిన్ను నిల్ప నో యపార ధీనిధీ!
తపించితిన్
నినున్ గనన్ సదా! యనుగ్రహింపుమా.
530. ఓం *సూక్ష్మా*యై నమః ।
నామ
వివరణ.
సూక్ష్మరూపము
కలిగిన తల్లి మన అమ్మ.
తే.గీ.
వినుతిఁ
జేసెద *సూక్ష్మా! * సవినయముగను,
సూక్ష్మ
దృష్టిని నాకిమ్ము చూతు నిన్ను
నన్నిటన్,
గని పొంగుదు, ననవరతము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
531. ఓం
*సూక్ష్మార్థార్థ పరాZపరా*!యైనమః.
నామ
వివరణ.
సూక్ష్మాతి
సూక్ష్మమయిన అర్థమున్ అర్థపరముగాఉండు అపర మన జనని.
శా. *సూక్ష్మార్థార్థ పరాZపరా*
శుభకరీ!
శోభిల్ల నన్ జేయుమా,
లక్ష్మీ
ప్రాప్తిని కల్గజేయుమ కృపన్, లక్ష్యంబుతో ప్రేమగా,
సూక్ష్మార్థంబులు
గాన నేర్వను సతీ! శోభిల్లు నామాళికిన్,
సూక్ష్మోద్భాసిత
సూర్య కోటి కిరణా! చూపించు సన్ మార్గమున్.
ఓం *సూక్ష్మార్థార్థా*యై నమః ।
నామ వివరణ.
సూష్మార్థములో అర్థము అమ్మ.
కం. *సూక్ష్మార్థార్థా! * ప్రణతులు,
లక్ష్మీ! హరివల్లభా! సలక్షణముగ నన్
లక్ష్మీప్రదునిగ నిలుపుమ,
లక్ష్మీపతి మెచ్చునట్లు శ్లాఘించెద నిన్.
ఓం *పరా*యై నమః.
తే.గీ.
ఓ *పరా! * నీ మహత్వమ్మునొప్పిదముగ
పలుకగా శక్తి లేదమ్మ, వాగధీశ్వ
రీ మహత్ కృప కలిగించు ప్రీతి తోడ,
వందనంబులు చేసెద నందుకొనుము.
ఓం *అపరా*యై నమః ।
తే.గీ.
ధన్యుఁడ*నపరా*! నిన్ను నా తలపులందు
నిలుప యత్నించుచుండుటన్, నీరజాక్షి!
నిలుపఁ గలిగినన్ నీవుండి నిత్య శుభము
లందఁ జేయుచు నుందువు, సుందరముగ.
ఓం *సూక్ష్మార్థార్థపరా*యై నమః ।
కం. శ్రీదా! *సూక్ష్మార్థార్థప
రా!* దయఁ జూడగ నను నిఁక రమ్ము
కృపాబ్ధీ!
నా దారిని సూచించుము,
నీ దారికి చేర్చుకొనుము, నిను సేవింపన్.
శ్లో.
ఏకవీరా విశేషాఖ్యా షష్ఠీదేవీ మనస్వినీ ।
నైష్కర్మ్యా నిష్కలాలోకా జ్ఞానకర్మాధికా గుణా ॥ 72 ॥
532. ఓం *ఏకవీరా*యై నమః ।
నామ
వివరణ.
ఏకైక
వీర వనిత మన అమ్మ.
తే.గీ. *ఏకవీరా! * మహోదార! నాకు నీవె,
రక్షణము
గొల్పనుంటివి, రమ్య తేజ!
రాక్షసాంతకీ!
శుభముఖీ! మోక్షమిమ్ము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
533. ఓం
*విశేషాఖ్యా*యై
నమః
నామ
వివరణ.
ప్రత్యేక
కార్యకలాపములు కల తల్లి మన అమ్మ.
తే.గీ.
విశ్వ
రూపా! *విశేషాఖ్య! * వినుతి వినుము,
శాశ్వతంబగు
సత్ కీర్తిఁ జక్కగ నిడఁ
జక్కగా
నిను వర్ణింప కవితనిమ్ము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
534. ఓం *షష్ఠిదేవ్యై* నమః ।
నామ
వివరణ.
ఆరు
రూపాలు కలిగిన మహాలక్ష్మి మన అమ్మ.
కం. ప్రణతులు
*షష్ఠీ
దేవీ! *
క్షణమైనను
విడవకు, ననుఁ గన రాకున్నన్
గుణమే
మారగ వచ్చును
మణిమయ
పీఠంబు మనము, మనుమట నీవున్.
ఓం *దేవ్యై* నమః.
కం. *దేవీ! * కొలిచెద నిను నే
భావించుచు
మనము నందు భవ్యంబుగ, నా
సేవలు
గొనగా రమ్మా!
దీవింపుమ
నన్ను నీవు తేజము గొల్పన్.
535. ఓం *మనస్విన్యై* నమః ।
నామ
వివరణ.
ప్రతీ
ఒక్కరి మనసునా ఉండు జనని మన అమ్మ.
తే.గీ.
ఓ
*మనస్వినీ! * నాభక్తి నొల్లవేని
యుల్లమంతయు
కృంగుదున్ గల్ల కాదు,
చల్లనైనట్టి
తల్లివి యుల్లమరసి
స్వీకరింపుము
నా భక్తి చిత్తమలర.
536. ఓం *నైష్కర్మ్యా*యై నమః ।
నామ
వివరణ.
ఏ
కర్మయూ చేయనటువంటి జనని అమ్మ.
కం. నిష్కర్మవు
నీవమ్మా!
*నైష్కర్మ్యా! * కాంచుమెలమి నను
బ్రోవుమిలన్,
నిష్కామ
కర్మఁ జేయఁగఁ
బుష్కలమగు
భక్తినిమ్ము, పూజింతును నిన్.
537. ఓం *నిష్కలాలోకా*యై నమః ।
నామ
వివరణ.
ఏ
దోషమూ కానరాని తల్లి మన అమ్మ.
తే.గీ. *నిష్కలాలోక! * సంపూర్ణ
నిర్వికార!
దోష
రహితా! గుణోపేత! తోచు మీవు
నాదు
మదిలోనఁ గన నిమ్ము నతులు నీకు,
ముక్తి
మార్గంబు జూపెడి పూజ్యవీవు.
538. ఓం *జ్ఞానకర్మాధికా*యై నమః ।
నామ
వివరణ.
జ్ఞానము
చేత గ్రహింపఁ దగిన జనని మన అమ్మ.
తే.గీ.
*జ్ఞాన
కర్మాధికా! * శుభాకార ధార
గా
ప్రవర పద్యములనిమ్ము కల్పవల్లి!
చేరనౌనట్లు
నిన్ గొల్తు శ్రీకరముగ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
539. ఓం *గుణా*యై నమః.
నామ
వివరణ.
సకలసద్గుణవర్ణ
సమామ్నాయము అమ్మ.
తే.గీ.
గుణవి
భాసవు, కన *గుణా! * ప్రణుతిఁ గొనుము
సద్గుణంబుల
నిమ్మిలన్ సరసిజాక్షి!
నిన్ను
సేవించు భాగ్యంబు నీవె యిమ్ము.
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
సబంధ్వానందసందోహా వ్యోమాకారాఽనిరూపితా ।
గద్యపద్యాత్మికా వాణీ సర్వాలంకారసంయుతా ॥ 73 ॥
540. ఓం
*సబంధ్వానందసందోహా*
యైనమః
నామ
వివరణ.
బంధువులతో
ఆనంద సందోహ మన అమ్మ.
సీ.
శ్రీకర
ప్రభ వెల్గు చిద్రూపిణీ! *సబం
ధ్వానందసందోహ*!
హాయినిమ్ము,
జీవాత్మ
పరమాత్మ చెంతనే యుండెను, చేరంగనిమ్మందు జీవముక్తి,
నైహికంబంతయున్
మోహంబునే గొల్పు ముక్తినొసగఁబోదు పూవుబోడి!
యనుపమ!
ముక్తిద! నినునమ్మి యుంటిని, ముక్తిని పొందెడి శక్తినిమ్ము,
తే.గీ.
ముక్తినీయంగ
నీకన్నఁ బూజ్యులెవరు?
భక్తిఁ గొలిచెద నిను నేను, భక్త సులభ!
బంధురానంద
సందోహ!
వరలుమీవు
నాదు
మదిలోన నిరతమున్ నయనిధాన.
ఓం *బన్ధురానన్దసన్దోహా*యై నమః ।
తే.గీ.
*బన్ధురానన్ద సన్దోహ*! భ్రమలు వాపి,
నీ పదాంభోజ సేవలన్ నిరతముగను
జేయ నీయుమా! కొలిచెదఁ జేతులెత్తి,
వందనంబులు చేసెద నందుకొనుము.
541. ఓం *వ్యోమాకారా*యై నమః ।
నామ
వివరణ.
ఆకాశ
స్వరూపిణి అమ్మ.
కం. *వ్యోమాకారా*! నాలో
వ్యోమము
నీవే కనంగ నో పద్మాక్షీ!
శ్రీమంతంబగు
తలపులె
నా
మది కలిగించుమమ్మ! నయమున గొలుతున్.
542. ఓం *అనిరూపితా*యై నమః ।
నామ
వివరణ.
నిరూపించుటకు
సాధ్యము కాని తల్లి మన అమ్మ.
కం.
*అనిరూపిత*!
నీ స్మరణమె
కనిపింపఁగఁ
జేయు నిన్ను ఘనముగ మదిలో
వినుమమ్మ
నాదు వినతిని
కనిపింపుము
మనసుపొంగ, కాదనకమ్మా.
ఓం *నిరూపితా*యై నమః ।
నామ వివరణ.
సాధకులచే నిరూపిత యగు జనని మన అమ్మ.
పంచ చామరము.
*నిరూపితా*! నమోస్తు తే, గణింపునన్ను నీ మదిన్,
పరాత్పరీ! జగంబులోని భవ్య భావ రూపునన్
నిరంతరంబు నిర్వికార నిష్కలంక భావముల్
వరంబుగా నొసంగుమమ్మ! వందనంబులమ్మరో!
543. ఓం *గద్యపద్యాత్మికా వాణ్యై*
నమః.
నామ
వివరణ.
గద్యపద్య
స్వరూపమున గల వాంగ్మయమే అమ్మ.
తే.గీ. ,
*గద్య
పద్యాత్మికా వాణి*! వేద్య వీవు
నాదు
కవితలన్ వెలిగెడి నవ్య తేజ!
నిన్ను
వర్ణింపఁగన్ జాలనిర్వికార!
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *గద్యపద్యాత్మవాణ్యై*
నమః ।
తే.గీ. *గద్య పద్యాత్మ వాణీ! సువేద్య వీవు
నాదు కవితలన్ వెలిగెడి నవ్య తేజ!
నిన్ను వర్ణింపఁగన్ జాలనిర్వికార!
వందనంబులు చేసెద నందుకొనుము.
ఓం *గద్యపద్యాత్మికా*యై నమః
తే.గీ.
*గద్యపద్యాత్మికా*! నిన్నుఁ గవితలందు
వర్ణనము చేయఁ గోరినన్ వశము కాదు
నీదు సత్ కృప లేనిచో నిర్వికార!
వందనంబులు చేసెదనందుకొనుము.
ఓం గద్య పద్యాత్మాయై నమః.
తే.గీ.
*గద్యపద్యాత్మ*!నిన్ను నే గవితలందు
వర్ణనము చేయఁ గోరినన్ వశము కాదు
నీదు సత్ కృప లేనిచో నిర్వికార!
వందనంబులు చేసెదనందుకొనుము.
ఓం *వాణ్యై* నమః.
కం. *వాణీ! * పుస్తక పాణీ!
వీణాహస్తా! మనోజ్ణ్య విశ్వంభర నిన్
రాణిగపొందిన బ్రహ్మయు
జ్ఞానిగనయి సృష్టి చేయు ఘనతరముగ తాన్.
544. ఓం *సర్వాలఙ్కారసంయుతా*యై నమః ।
నామ
వివరణ.
సమస్తమయిన
అలంకారములతో కూడుకొని అందగించు జనయిత్రి మన అమ్మ.
కం. సర్వార్థ
సిద్ధిఁ గొలిపెడి
సర్వేశ్వరి!
ప్రణతులమ్మ! సదయను నాకున్
గర్వము
నణచుము, విలసత్
*సర్వాలంకారసంయుతా*, జయమమ్మా!
శ్లో.
సాధుబంధపదన్యాసా సర్వౌకో ఘటికావలిః ।
షట్కర్మా కర్కశాకారా సర్వకర్మవివర్జితా ॥ 74 ॥
545. ఓం *సాధుబన్ధపదన్యాసా*యై నమః ।
నామ
వివరణ.
మంచివారితో
ఉండి మంచిగా నడిపించు తల్లి మన అమ్మ.
కం. గణ్యవుగ,
*సాధు
బంధ ప
దన్యాసా! * ప్రణుతులమ్మ! ధరపైనను సా
ద్గుణ్యంబగు
నా జన్మము,
పుణ్యాత్ములె
నిను గొలుతురు, పూజ్యులు వారల్.
546. ఓం *సర్వౌకసే* నమః ।
నామ
వివరణ.
అన్నిటికీ
నిలయమైన తల్లి మన అమ్మ.
తే.గీ.
వినుత
*సర్వౌక! * నీకు నా ప్రణతులమ్మ!
సృష్టి
మొత్తము నీ యిల్లు , దృష్టి పెట్టి
నిన్ను
మదిలోన భావింతు నిరుపమాన
వందనంబులు
చేసెద నందుకొనుము.
547.ఓం *ఘటికావలయే* నమః ।
నామ
వివరణ.
కాల
ప్రమాణమయిన ఘడియల యొక్క వరుస మన అమ్మ.
కం. *ఘటికావలీ! * సమయమే
కటకటగా
నుండె నాకు చక్కగ
నీపై
పటుతర
పద్యము వ్రాయగ,
నెటులైనను
వ్రాయఁజేయు మిత్తరి తల్లీ!
548. ఓం
*షట్కర్మిణ్యై* నమః.
నామ
వివరణ.
నేర్చుకొనుట,
బోధించుట, త్యాగము చేయుట, అభ్యర్థించుట, ఇచ్చుట, తీసుకొనుట, అను
ఆరు
కర్మల స్వరూపము అమ్మయే.
తే.గీ.
వినుత (*షట్కర్మిణీ*!
దయన్) *షట్కర్మ*! నీ దయన్ వెలుగు మదిని,
ఘనతరంబగు
నీ ప్రభన్ గనఁగఁ జేసి,
పద్యములు
వ్రాసి నన్నిలన్ బరగనిమ్ము.
,వందనంబులు
చేసెద నందుకొనుము.
549. ఓం *కర్కశాకారా*యై నమః.
నామ
వివరణ.
కఠినమయిన
ఆకారము కలిగిన తల్లి మన అమ్మ.
తే.గీ.
ఖలుల
పాలిట *కర్కశాకార! * నిన్ను
తలచు
సుజనులు శాంతితో వెలుగుదురిల,
కర్కశత్వము
కలవారి కర్మవీవు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
550. ఓం *సర్వకర్మవివర్జితా*యై నమః ।
నామ
వివరణ.
అన్ని
కర్మలను విడిచిపెట్టిన జనని మన అమ్మ.
తే.గీ.
*సర్వ
కర్మవివర్జితా*! ధర్మ పథము
నందు
నన్నుంచుమోయమ్మ సుందరముగ,
డెందమున
నుండి యానంద మందఁ జేసి,
నీవు
కరుణింపు నన్నిక నీరజాక్షి!
శ్లో.
ఆదిత్యవర్ణా చాపర్ణా కామినీ వరరూపిణీ ।
బ్రహ్మాణీ బ్రహ్మసంతానా వేదవాగీశ్వరీ శివా ॥ 75 ॥
551. ఓం *ఆదిత్య
వర్ణా*యై నమః,
నామ
వివరణ.
సూర్యుని
వంటి వర్ణముతో ప్రకాశించు జనని మన అమ్మ.
తే.గీ.
కనెద
*నాదిత్య వర్ణా*! సుఖంబుగ నిను
మానసంబున
నిను గాంచి జ్ఞానమొంది
పద్యములు
వ్రాసి నీపైన పరవశింతు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
552. ఓం *అపర్ణా*యై నమః ।
నామ
వివరణ.
శివుని
పతిగా పొందగోరి తపస్సు చేసిన అపర్ణ మన అమ్మ.
తే.గీ.
కను
*మపర్ణా*! శుభాకార! ఘనతరముగ
నన్ను
కావ్యాత్మవై నిల్చి సన్నుతమగు
కావ్య
రూపాన ప్రభవిల్లు కరుణ చూపి,
వందనంబులు
చేసెద నందుకొనుము.
553. ఓం *కామిన్యై* నమః ।
నామ
వివరణ.
పతియగు
పరమేశ్వరునకు కామిని మన అమ్మ.
తే.గీ.
*కామినీ*! కృపా సాంద్ర! వికాసమిమ్ము
నాకు,,
మదిలోన నీవుండి శ్రీకరముగ
లోకమందున
వెలుగనీ! లోల నయన!
వందనంబులు
చేసెద నందుకొనుము.
554. ఓం *వరరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
మానవరూపమున
ఉండు జనని మన అమ్మ.
కం. *వర రూపిణీ*! ననున్ గను
పరమేశ్వరి!
దయను గనుమ, భద్రత నిడుమా,
కరుణామయి!
నీదగు శుభ
చరణాబ్జ
పవిత్ర సేవ జయములనిడుగా.
555. ఓం *బ్రహ్మాణ్యై నమః ।
నామ
వివరణ.
బ్రహ్మదేవుని
శక్తి మన అమ్మ.
తే.గీ. శుభద!
బ్రహ్మాణి*! నీవు నాకభయ మిమ్ము,
రక్షగానిల్చి
సతతము ప్రబలనిమ్ము,
చిత్ర
కవితా ప్రభాసవై చేదుకొనుము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
556. ఓం *బ్రహ్మసన్తానా*యై నమః ।
నామ
వివరణ.
బ్రహ్మ
సంతానస్వరూపిణి అమ్మ.
తే.గీ.
జనని!
*బ్రహ్మ
సన్తాన*! నన్ సదయఁ గనుమ,
బ్రహ్మవిజ్ఞాన
సంపదల్ ప్రబలనిమ్ము,
కావ్య
సత్కల్పనాసక్తి కలుగనిమ్ము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
557. ఓం *వేదవాచే* నమః ।
నామ
వివరణ.
వేదవాక్కు
అమ్మయే.
తే.గీ.
*వేదవాక్*! సుస్వరూపమా! మోదమునను
వేదవిజ్ఞానవాక్
సుధావిష్కృతమవ
పద్యములు
వ్రాయ జేయుమా పరవశించి,
వందనంబులు
చేసెద నందుకొనుము.
558. ఓం *ఈశ్వర్యై* నమః ।
నామ
వివరణ.
సకల
లోకములకును ఈశ్వరి మన అమ్మ.
తే.గీ.
*ఈశ్వరీ*! పద మంజరీ
హృద్యముగను
పద్య
పాదములందున ప్రబలుమమ్మ!
నిన్నుఁ
బ్రకటించు పద్యముల్ ప్రబలి యొప్ప,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *శివా*యై నమః .
నామ
వివరణ.
శుభములకు
ఆలవాలమయిన జనని మన అమ్మ.
తే.గీ.
శుభద
వైనట్టి యో *శివా! * శోభఁ గొలిపి
జీవితంబను
కావ్యమున్ జేర్చనిమ్ము,
నీదు
పదసన్నిధికి, జేర్తు మోదమునను.
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
పురాణన్యాయమీమాంసాధర్మశాస్త్రాగమశ్రుతా ।
సద్యోవేదవతీ సర్వా హంసీ విద్యాధిదేవతా ॥ 76 ॥
559 ఓం *పురాణన్యాయమీమాంసా*యై నమః ।
నామ
వివరణ.
పురాణము,
న్యాయము, మీమాంస, అనునవి అమ్మయే.
తే.గీ.
క్ష్మా
తలంబున వెలిగెడి ఘన *పురాణ,
న్యాయ మీమాంస*! నీ పరమాకృతి
గన
సాధ్యమగునేమొ
స్వాధ్యాయ సజ్జనులకు
నాత్మవై
నాకు చూపించుమమరవినుత!.
560. ఓం *ధర్మశాస్త్రాగమశ్రుతా*యై నమః ।
నామ
వివరణ.
ధర్మశాస్త్ర,
ఆగమములలో వినిపించు జనని.
తే.గీ.
*ధర్మశాస్త్రాగమ శ్రుతా*! ధర్మ పరుల
గాచి
రక్షించు సత్కృపన్, గమలనయన!
ధర్మశాస్త్రాగమ
శ్రుతుల్ తలప నీవె,
వందనంబులు
చేసెద నందుకొనుము
ఓం *పురాణన్యాయమీమాంసాధర్మశాస్త్రాగమశ్రుతా*యై నమః.
నామ వివరణ.
పురాణము, న్యాయము, మీమాంస, ధర్మశాస్త్ర, ఆగమములలో వినిపించు జనని.
స్వయంకల్పిత న్యాయమీమాంస వృత్తము.
గణములు….య ర మ
య జ గ….యతి..9వ క్షరము….ప్రాస నియమ్ము కలదు.
పరంబున్గొల్పుమా నాకున్ బ్రాభవంబున్ గనంగ నిన్
పరంధామా! జయంబిమ్మా, భక్తితోఁ గొల్చెదన్ నినున్
పురాణాదుల్ గనన్ నీవే ముద్దుగా నేర్పుమా లస
*త్పురాణన్యాయమీమాంసాధర్మశాస్త్రాగమశ్రుతా! *
561. ఓం *సద్యోవేదవత్యై* నమః
నామ
వివరణ.
పుట్టుకతోనే
వేద స్వరూపిణి అమ్మ.
కం ధీవర్యులు
గొలిచెడి
*స
ద్యోవేదవతీ! * మదంబ! యుపమింప నినున్
లేవేవియు,
నీవేననుఁ
గావగ
తగియుంటివమ్మ, కరుణను గనుమా.
562. ఓం *సర్వా*యై నమః .
నామ
వివరణ.
సమస్తమునూ
అమ్మయే.
తే.గీ.
కొలిచెదన్
నిను *సర్వా*! యకుంఠితమగు
పద్య
ధారలన్ నీవె తద్విద్యవగుచు
ప్రభవమొందుచు
నుంటివి పద్యములుగ,
వందనంబులు
చేసెద నందుకొనుము
563. ఓం *హంస్యై* నమః ।
నామ
వివరణ.
ఆడహంస
అమ్మ.
కం. *హంసీ*! నినుఁ గననిమ్మిక
హింసాదులు
మాని ని న్నహీన పదాళిన్
కంసారి
మెచ్చునట్టు, ప్ర
శంసావహముగ
రచించి
సతి!
నీకిత్తున్.
564. ఓం *విద్యాధిదేవతా*యై నమః ।
నామ
వివరణ.
విద్యలన్నిటికినీ
అధిదేవత మన అమ్మయే.
కం. *విద్యాధిదేవతా*! నై
వేద్యంబుగ
చేసి నాదు వివిధ రచనలన్
సద్యః
ఫలమిడఁ గొనుమిక
హృద్యంబుగ
వరము నొసగు మీశ్వరి! కృపతో.
శ్లో.
విశ్వేశ్వరీ జగద్ధాత్రీ విశ్వనిర్మాణకారిణీ ।
వైదికీ వేదరూపా చ కాలికా కాలరూపిణీ ॥ 77 ॥
565. ఓం *విశ్వేశ్వర్యై* నమః ।
నామ
వివరణ.
సృష్టికే
ఈశ్వరి మన అమ్మ.
కం. *విశ్వేశ్వరి*! నీ దయతో
శాశ్వత
సన్ముక్తి గనుదు, సంతసమున నే
నశ్వరమీ
జననంబను
విశ్వాసము
గొలుపుమమ్మ, ప్రీతిగ నాకున్.
566. ఓం *జగద్ధాత్ర్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
విశ్వ జనని.
తే.గీ.
నుత
*జగద్ధాత్రి*! గాయత్రి! యతులిత!
నిను
గోచరంబగు
జగతి నగోచరమగు
ధాత్రిగా
వినిపించెదన్ ధర్మముగనె,
వందనంబులు
చేసెద నందుకొనుము
567. ఓం *విశ్వనిర్మాణకారిణ్యై* నమః ।
నామ
వివరణ.
సకలసృష్టికీ
కారణము మన అమ్మ.
తే.గీ.
*విశ్వ
నిర్మాణకారిణీ*! శాశ్వతమగు
నీదు
పాదముల్ బట్టనీ నిరుపమాన
శాశ్వతత్వంబు
నినుఁ జేరి చక్కగ గొన,
వందనంబులు
చేసెద నందుకొనుము
568. ఓం *వైదిక్యై* నమః.
నామ
వివరణ.
వేద
స్వరూపిణి మన అమ్మ.
తే.గీ.
వేద
రూపమా! *వైదికీ*! విదితమగుము
వేదవేదాంతసారమీవే
కనంగ,
మోదమున
నిన్ను గొలిచెదన్
మున్నుగానె,
వందనంబులు
చేసెద నందుకొనుము
569. ఓం *వేదరూపా*యై నమః ।
నామ
వివరణ.
వేదమే
రూపముగా కలిగిన జనని మన అమ్మ.
తే.గీ.
*వేద
రూపా*! మదంబా! నివేశమగుదు
నధిక
భక్తితో, హృత్పీఠమమరఁ గొలిపి,
ప్రేమతోనుండుమచ్చట
విశ్వ జనని!
వందనంబులు
చేసెద నందుకొనుము
570. ఓం *కాలికా*యై నమః ।
నామ
వివరణ.
కాలస్వరూపిణి
కాలిక మన అమ్మయే.
తే.గీ.
*కాలికా*! మాతవీవమ్మ! కన్న
తల్లి!
యేలుచుందువు
భక్తులన్, మేలు కొలిపి,
యేలుమమ్మరో
నన్నును, జాలిఁ జూపి,
వందనంబులు
చేసెద నందుకొనుము
571. ఓం *కాలరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
నల్లని
దేహకాంతితో విరాజిల్లు జనని మన అమ్మయే.
తే.గీ.
*కాల
రూపిణీ*! యీ కలి కాలమందు
చాలకుంటిని
దురితుల శక్తి కెదురు
నిలువ,
కాపాడుమమ్మరో నీలవేణి,
వందనంబులు
చేసెద నందుకొనుము
శ్లో.
నారాయణీ మహాదేవీ సర్వతత్త్వప్రవర్తినీ ।
హిరణ్యవర్ణరూపా చ హిరణ్యపదసంభవా ॥ 78 ॥
572. ఓం *నారాయణ్యై* నమః ।
నామ
వివరణ.
నారాయణునందలి
శక్తి నారాయణి మన అమ్మయే.
తే.గీ.
మహిత
నారాయణీ నామ మహిమ చాలు
మమ్ము
రక్షించునందురు మంచివారు,
నిజము,
*నారాయణీ*! మదిన్ నిశ్చితముగ
మెదలునట్లుగ
చేయుమా ముదముతోడ.
573. ఓం *మహాదేవ్యై* నమః ।
నామ
వివరణ.
గొప్పదయిన
దేవత మన అమ్మయే.
తే.గీ.
ఘనత
నీ మహాదేవియే కలుగఁ జేసె
నందురో
*మహాదేవి*! నిన్ సందడిగొను
సుందరంబగు
చిత్తులౌ సుకవులెలమి,
నిజముగానిది
నిజమమ్మ సుజన భాస!
574. ఓం *సర్వతత్వప్రవర్తిన్యై* నమః ।
నామ
వివరణ.
సమస్తమయిన
తత్త్వములయందూ ప్రవర్తించు జనని అమ్మ.
తే.గీ.
*సర్వ
తత్వప్రవర్తినీ*! సరస హృదయ!
సన్నుతించెద
నిన్ను నే సాదరముగఁ,
గన్నుదోయికి
కనిపించు
కరుణ
జూపి,
వందనంబులు
చేసెద నందుకొనుము
575. ఓం *హిరణ్యవర్ణరూపా*యై నమః ।
నామ
వివరణ.
బంగారు
వర్ణము గల జనని మన అమ్మ.
తే.గీ.
ప్రాణ
మీవమ్మ నిజము *హిరణ్యవర్ణ
రూప*!
సుజ్ఞాన
తేజమే రూపుకాగ
జ్ఞాన
రూపివై మదినుండి కనగనిమ్ము,
వందనంబులు
చేసెద నందుకొనుము
576. ఓం *హిరణ్యపదసంభవా*యై నమః ।
నామ
వివరణ.
బంగారు
పాదములనుండి సంభవించిన జనని మన అమ్మ.
కం. సుమతుల
మధ్యను మెలఁగుచు
కుమతులకున్
దూరమయినఁ గోరిన రీతిన్
బ్రముదముతో
నిను జేరెద
మమిత
*హిరణ్య
పద సంభవా*!నిజమిదియే.
శ్లో.
కైవల్యపదవీ పుణ్యా కైవల్యజ్ఞానలక్షితా ।
బ్రహ్మసంపత్తిరూపా చ బ్రహ్మసంపత్తికారిణీ ॥ 79 ॥
577. ఓం *కైవల్యపదవ్యై* నమః ।
నామ
వివరణ.
మోక్షపదము
అమ్మయే.
తే.గీ.
వినుత
*కైవల్య
పదవీ*! కవిత్వతత్వ
మెఱిగి
చదివినన్ గైవల్యమే లభించు
కవియనన్
బ్రహ్మ సృష్టించు కవిత నీవు
మాకు
కైవల్యమొసఁగెడి మాతవీవె.
578. ఓం *పుణ్యా*యై నమః.
నామ
వివరణ.
శుభస్వరూపమే
అమ్మ.
కం. *పుణ్యా*! శుంభత్ ప్రతిభా
గణ్యా!
శుభ కల్పనాగ్రగణ్యా! జయహో!
పుణ్యాత్మామృత
మూర్తుల్
గణ్యంబుగ
నిన్నుఁ గొలిచి ఘనతఁ గనుదురే.
579. ఓం *కైవల్యజ్ఞానలక్షితా*యై నమః ।
నామ
వివరణ.
ముక్తిపొందు
జ్ఞానమునే లక్ష్యముగా కలిగిన జనని మన అమ్మ.
కం. భావించెద
నిను మదిలో
సేవించెద
చిత్తముననె శ్రీకరముగ, స
ద్భావనలొసగుము, విలసత్
*కైవల్యజ్ఞాన లక్షితా*! నినుఁ గొలుతున్.
580. ఓం *బ్రహ్మసమ్పత్తిరూపా*యై నమః ।
నామ
వివరణ.
బ్రహ్మయొక్క
సంపదల రూపమే అమ్మ.
తే.గీ.
*బ్రహ్మసంపత్తి రూపా*! నివాసముండు
నాదు
హృత్పంకజముపైన మేదురముగ,
నీదు
తేజంబె కవితగా నిలుచునమ్మ!
వందనంబులు
చేసెద నందుకొనుము
581. ఓం *బ్రహ్మసమ్పత్తికారిణ్యై* నమః ।
నామ
వివరణ.
బ్రహ్మ
సంపదలకు కారణభూతురాలు అమ్మయే.
తే.గీ.
*బ్రహ్మ
సమ్పత్తి కారిణీ*! భ్రమలు వాపి,
బ్రహ్మ
జిజ్ఞాసఁ గలిగించి వరలఁ జేసి
యిహపరంబులనొసగుమా, మహిమఁ
జూపి,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
వారుణీ వారుణారాధ్యా సర్వకర్మప్రవర్తినీ ।
ఏకాక్షరపరాఽఽయుక్తా సర్వదారిద్ర్యభంజినీ ॥ 80 ॥
582. ఓం *వారుణ్యై* నమః ।
నామ
వివరణ.
వరుణుని
శక్తి మన అమ్మయే.
మత్తకోకిల.
వారుణీ
పదపంకలంబులు పట్టి కొల్చెడివారికిన్
వారుణీ
కృపనొందగానగు, భవ్య సద్గతి నందురో
*వారుణీ*! కృప జూడుమా నను పద్యపుష్ప సమార్చనన్
తీరుగా
నొనరింతునమ్మరొ! దీవనల్ గన ముక్తికై.
583. ఓం *వారుణారాధ్యా*యై నమః ।
నామ
వివరణ.
వరుణ
కుమారునిచే పూజింపఁబడు తల్లి మన అమ్మ.
తే.గీ.
వారుణారాధ్య!
కష్టని వారణమును
కోరి
చేయుము
నీపద
వారిజముల
పట్టి
విడువను కష్టముల్ నెట్టువరకు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
584. ఓం *సర్వకర్మప్రవర్తిన్యై* నమః ।
నామ
వివరణ.
సమస్తమగు
కర్మలయందూ ప్రవర్తించు జనని మన అమ్మ.
తే.గీ.
*సర్వ
కర్మప్రవర్తినీ*! సత్ ప్రభాస!!
నీదు
పుత్రుండనమ్మరో నేను, కనవొ?
నీదు
సత్ కృప లేనిచో నీడ లేదు,
నీవు
నాలోన నుండుమా నిత్యముగను.
585. ఓం
*ఏకాక్షరపరా* యై నమః.
నామ
వివరణ.
ఓం
అను అక్షరమే పరముగా ఉన్న తల్లి.
కం. శ్రీ
*యేకాక్షర పర*!
సు
శ్రేయస్కర
కార్యములను జేయించుచు, నీ
మాయను
బాపుము జననీ!
ధీయుత
నిను కొలుతు సతము దీవింపుము నన్
586. ఓం *ఆయుక్తా*యై
నమః.
నామ
వివరణ.
వర్ణమాలలో
కూడియున్న తల్లి.
తే.గీ.
నన్నుఁ
గాంచు *మాయుక్త*! ఘనంబుగాను,
నిన్నుఁ
గొల్చు విధంబుగా నిండు మదిని,
నిన్నుఁ
గాక యింకెవరిని నేను గొల్తు?
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *యుక్తా*యై నమః ।
కం. యుక్తాయుక్తము లెఱుగను
*యుక్తా*! కోపించకుండ నోర్పుగ గనుమా,
శక్తిప్రదవై నాకున్
ముక్తిని గను మార్గము గని పూర్తిగ నిడుమా.
587. ఓం *సర్వదారిద్ర్యభఞ్జిన్యై* నమః ।
నామ
వివరణ.
సమస్త
దరిద్రములను భంజింపచేయు తల్లి.
తే.గీ. *సర్వదారిద్ర్య భఞ్జినీ*!
శాంత
రూప!
భావ
దారిద్ర్యమున్ బాపి భక్తితోడ
వరలునట్లుగాఁ
జేయుమా పాపనాశ!
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
పాశాంకుశాన్వితా దివ్యా వీణావ్యాఖ్యాక్షసూత్రభృత్ ।
ఏకమూర్తిస్త్రయీమూర్తిర్మధుకైటభభంజినీ ॥ 81 ॥
588. ఓం *పాశాఙ్కుశాన్వితా*యై నమః.
నామ
వివరణ.
త్రాడు,
ముళ్ళకర్రతో కూడుకొనియున్న తల్లి.
తే.గీ.
దివ్య
*పాశాఙ్కుశాన్వితా*!.దేవదేవి!
కర్మపాశంబు
లెడఁబాపి ధర్మపథము
నందు
నన్నుంచుమా తల్లి! సుందరముగ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
589. ఓం *దివ్యా*యై నమః ।
నామ
వివరణ.
గొప్పదయిన
జనని దివ్యా మన అమ్మ.
కం. *దివ్యా*! నేఁ గొలిచెద నిను
భవ్యంబగు
మార్గమందు భక్తిగ నెపుడున్,
సవ్యంబుగ
నడిపించుమ
దివ్యజ్ఞానప్రదా!
సుధీవరలక్ష్మీ!
590. ఓం *వీణావ్యాఖ్యాక్షసూత్రభృతే* నమః ।
నామ
వివరణ.
వీణ,
పుస్తకము, అక్షమాల, చేతియందు కలిగియున్న తల్లి మన అమ్మ.
కం. కాణాచివమ్మ
విద్యకు
*వీణావ్యాఖ్యాక్షసూత్రభృత్*!
జయశీలీ!
క్షోణిని
గల పండితులన్
రాణింపగఁ
జేయుమమ్మ ప్రార్థింతు నినున్
591. ఓం *ఏకమూర్త్యై* నమః ।
నామ
వివరణ.
బ్రహ్మము
అను ఒక రూపము కలిగిన జనని మన అమ్మ.
తే.గీ.
*ఏకమూర్తీ*! లసత్ కీర్తినే గడింప
వచ్చు
నీ కృప కల్గినన్ కచ్చితముగ,
సృష్టికర్త
గణింపగ నేకమూర్తి
యని
గ్రహింపగనగునమ్మ యనితరముగ!
592. ఓం *త్రయీమూర్త్యై* నమః ।
నామ
వివరణ.
త్రిమూర్తుల
స్వరూపము అమ్మయే.
తే.గీ.
శుభ!
*త్రయీమూర్తి*! సృష్టికే శోభఁ గొలుప
నాదిమధ్యాంతములనంగ
నమరియున్న
నిన్ను
సేవింతునోయమ్మ! నేర్పు మీర,
వందనంబులు
చేసెద నందుకొనుము.
593. ఓం *మధుకైటభభఞ్జన్యై* నమః ।
నామ
వివరణ.
మధుకైటభ
రాక్షస సంహారిణి మన అమ్మ.
తోటకము.
*మధుకైటభభఞ్జని*! మంచిగ నన్
మృదు
భావసమృద్ధుగ మేలుఁ గనన్
బదిలంబుగ
చేయుమ, వందనముల్
పదివేలొనరించెద
వర్ధిలనీ
శ్లో.
సాంఖ్యా సాంఖ్యవతీ జ్వాలా జ్వలంతీ కామరూపిణీ ।
జాగ్రతీ సర్వసంపత్తిస్సుషుప్తా స్వేష్టదాయినీ ॥ 82 ॥
594. ఓం *సాఙ్ఖ్యా*యై నమః ।
నామ
వివరణ.
సంఖ్యా
స్వరూపిణి అమ్మ.
కం. కొలిచెద
నిను నే *సాఙ్ఖ్యా*!
నిలుమమ్మరొ
నాదు మదిని, నేర్పు తనరగా
కలుషిత
భావ విదారవు,
సలిపెద
నే నతులు నీకుఁ జల్లగఁ గనుమా.,
595. ఓం *సాఙ్ఖ్యవత్యై* నమః ।
నామ
వివరణ.
సంఖ్యలతో
వర్ణించబడిన జనని అమ్మ.
తే.గీ.
ధీర
గుణధామ! *సాఙ్ఖ్యవతీ*! మదంబ!
భారమంతయు
నీదేను పాపకార్య
దూరునిగ
నన్ను జేయుమా, మేరు ధీర!
వందనంబులు
చేసెద నందుక్నుము.
596. ఓం *జ్వాలా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
జ్వాలా స్వరూపిణి.
కం.
సురనుత మహితా! *జ్వాలా*!
పరమార్థము
నిన్ను గనుచు పరము గనుటయే,
వరలుచు
జ్వాలగ నాలో
కరుణామయి!
యుంటివమ్మ! కావగ నన్నున్.
597. ఓం *జ్వలన్త్యై* నమః ।
నామ
వివరణ.
జ్వలించు
జనని మన అమ్మ.
తే.గీ.
ఓ
*జ్వలన్తీ*! దయామూర్తి! హుతవహవుగ,
నీదు
విజ్ఞానమే జ్వాల వేద మాత!
జ్ఞాన
సుజ్వాల నా లోనఁ గలుగఁజేసి
నడుపుమమ్మరో
నన్నిల వడివడిగను.
598. ఓం *కామరూపిణ్యై* నమః .
నామ
వివరణ.
ఇష్టము
వచ్చిన రూపమున ఉండు తల్లి మన అమ్మ.
తే.గీ.
*కామరూపిణీ*! తొలగించు కర్మ ఫలము,
వినుత
కామేశ్వరున్ జూపఁ బ్రీతిఁ గనెద,
నీదు
మదిలోన గొలువైన నీహృదీశు
తోడ
నీవుండు నామదిన్ దోడువగుచు..
599. ఓం *జాగ్రత్యై* నమః ।
నామ
వివరణ.
నిరంతర
జాగ్రదవస్తలో ఉండు జనని అమ్మ.
తే.గీ.
జాగృతిన్
గొల్పు *జాగ్రతీ*! జన్మనెత్తి
జాగ్రతయెలేక
చెడిపోవు
జనులలోన
నన్ను
చేరనీకమ్మరో, సన్నుత పద,
వందనంబులు
చేసెద నందుకొనుము.
600. ఓం *సర్వసమ్పత్త్యై* నమః ।
నామ
వివరణ.
సమస్త
సంపదల స్వరూపమమ్మ.
తే.గీ.
*సర్వసమ్పత్తి*! నీ కృపన్
జక్కనైన
సర్వసంపత్ప్రభల్
నీవె, సదయ నొప్పి
నీవు మదిలోన
నిల్చినన్ నీరజాక్షి!
వందనంబులు
చేసెద నందుకొనుము.
601.
ఓం *సుషుప్తా*యై నమః ।
నామ
వివరణ.
సుషుప్తావస్థయందుండు
జనని అమ్మ.
తే.గీ. ఓ *సుషుప్తా*! సుషుప్తిని యొప్పిదముగ
తరిమి జాగ్రత్ ప్రభన్ గొల్పి దయను గనుము,
స్వప్నదురవస్థ వలదమ్మ, సన్నుతాత్మ!
వందనంబులు చేసెద నందుకొనుము.
602. ఓం *స్వేష్టదాయిన్యై* నమః ।
నామ
వివరణ.
సాధకుల
ఇష్టములను ప్రసాదించు జనని అమ్మ.
తే.గీ.
*స్వేష్టదాయినీ*!
యొసఁగుమా స్వేష్టఫలము,
స్వప్నమందై
న గాంచెద చక్కగ నిను,
స్వప్నమున్
గొల్పి కననిమ్ము చక్కగ నిను.
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
కపాలినీ మహాదంష్ట్రా భ్రుకుటీ కుటిలాననా ।
సర్వావాసా సువాసా చ బృహత్యష్టిశ్చ శక్వరీ ॥ 83 ॥
603. ఓం *కపాలిన్యై* నమః ।
నామ
వివరణ.
కపాలమాల
ధరించిన తల్లి.
తే.గీ.
ఓ
*కపాలినీ*! దీక్షగనొప్పిదముగ
నిన్ను
గాంచిన చాలును నిత్య శుభద!
మంచియే
కల్గు, మాయమౌ సంచితములు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
604. ఓం *మహాదంష్ట్రా*యై నమః ।
నామ
వివరణ.
భయంకర
కోరలు కలిగిన జనని అమ్మ.
తే.గీ.
ఓ
*మహాదంష్ట్ర*! దుష్టులనోపఁబోక
పట్టి
శిక్షించు, చేయిని పట్టి నడుపు
మమ్మరో
మంచివారిని, మహిత గతిని,
వందనంబులు
చేసెద నందుకొనుము.
605. ఓం *భ్రుకుటీకుటిలాననా*యై నమః ।
నామ
వివరణ.
వంగిన
దట్టమయిన కనుబొమలు కలిగిన తల్లి.
కం. *భ్రుకుటీకుటిలానన*!న
న్నెటులోర్చితివో
కదమ్మ? యీశ్వరు కృపచే
జటిలపు
దుష్క్రుతులడగెను,
పటుతరమగు
భక్తి కలిగె ప్రబలగ ధరపై.
606. ఓం *సర్వావాసా*యై నమః ।
నామ
వివరణ.
అన్నింటిలోను
నివసించు తల్లి.
కం. *సర్వావాసా*! సృష్టిని
సర్వేశ్వరు
దేహముననె సగమై యున్నన్
సర్వము
నీవేనడుపుచు
సర్వేశ్వరు
కీర్తిఁబెంచఁజాలితివమ్మా!
607. ఓం *సువాసా*యై నమః ।
నామ
వివరణ.
మంచి
వ్య్సక్తులతో నివసించు జనని.
తే.గీ.
కను
నను సువాస! ప్రేమతో, వినుతముగను,
కన
సువాసనా ఫలములు
జనులకొదవు,
నిన్ను
నిత్యంబు సేవింప నిమ్ము శుభము.
వందనంబులు
చేసెద నందుకొనుము.
608. ఓం *బృహత్యై* నమః.
నామ
వివరణ.
స్థూల
రూపము గల జనని మన అమ్మ.
తే.గీ.
సుజన
సంస్తుత *బృహతీ*! వసుంధరపయి
పలుబృహత్కార్యముల్చేసి,
భవ్యు లఖిల
లోక
సంస్తుతులగుదురు శ్రీకరముగ
నేనునున్
జేయనుంటిని, చేయనిమ్ము.
609. ఓం *అష్ట*యే నమః ।
నామ
వివరణ.
ఎనిమిది
రూపములు కల తల్లి మన అమ్మ.
కం. *అష్టా*! నినుఁ గొలిచెద నే
నష్టవిధంబులుగ
నొప్పు ననతీతములున్
దుష్టంబులు
ననుపమమగు
కష్టంబులు,
పాపి నన్నుఁ గావుము తల్లీ!
610. ఓం *శక్వర్యై* నమః ।
నామ
వివరణ.
శక్వరీవృత్తము
అమ్మయే.
తే.గీ.
*శక్వరీ*! శుభ మంజీర నిక్వణములు
నీదు
పాదోద్భవంబయి యాదుకొనును
చెవులఁబడినంతనే
మమున్ చిద్వరముగ,
వినెడి
భాగ్యంబు కలిగించు విశ్వ జనని.
శ్లో.
ఛందోగణప్రతిష్ఠా చ కల్మాషీ కరుణాత్మికా ।
చక్షుష్మతీ మహాఘోషా ఖడ్గచర్మధరాఽశనిః ॥ 84 ॥
611. ఓం *ఛన్దోగణప్రతిష్ఠా*యై నమః ।
నామ
వివరణ.
ఛందముయొక్క
గణముల యొక్క ప్రతిష్ఠ అమ్మయే.
కం. పరమార్థము గనఁజేసెడి
నిరుపమ
ఛందోగణములు నిరవద్యముగా
వరలగఁ
జేయుము కృపతో
స్థిరముగ,
*ఛన్దోగణప్రతిష్ఠా*! కొలుతున్.
612. ఓం *కల్మాష్యై* నమః ।
నామ
వివరణ.
నల్లని
వర్ణముతో ప్రకాశించు జనని. కల్మషహారిణి అమ్మ.
కం. కల్మష
భావము లడఁచెడి
*కల్మాషీ*! కావుమమ్మ కలికాలమునన్
గల్మషభావములవియే
కల్మిగనయి
చెరచు నన్నుఁ, గనుమోజననీ!
613. ఓం *కరుణాత్మికా*యై నమః ।
నామ
వివరణ.
దయతో
జాలితో కూడిన మనసు ఉన్న తల్లి.
కం. *కరుణాత్మికా*! మదంబా!
నిరుపమమే
నీదు కరుణ, నిశ్చల భక్తిన్
వరముగ
నొసగిన తల్లివి
పరమాత్ముని
చేరఁ జేసి, వర్ధిలఁ గనుమా.
614. ఓం *చక్షుష్మత్యై* నమః ।
నామ
వివరణ.
చక్కని
దృష్టి ఉన్న జనని.
కం. *చక్షుష్మతీ*! నమస్తే,
యక్షయశుభ
సంహతినిడి యనుపమ రీతిన్
రక్షించుము
భరతాంబను
శిక్షించుచు
దుష్ట తతిని, శీఘ్రమె జననీ!
615. ఓం *మహాఘోషా*యై నమః ।
నామ
వివరణ.
గొప్ప
వేదఘోషతో పులకరించు జనని.
కం. వేద
వర *మహాఘోషా*!
సాదరముగఁ
బిలిచిన నిను సదయను నన్నున్
మోదముతోఁ
గాపాడుచు
మేదుర
యానందమిచ్చి మేల్గూర్చెదవే.
616. ఓం *ఖడ్గచర్మధరా*యై నమః ।
నామ
వివరణ.
కత్తి
డాలు ధరించిన జనని.
మత్తకోకిల.
కావుమా
కృపఁ జూపి నన్నిక *ఖడ్గచర్మధరా*! సదా
సేవఁ
జేయఁగఁ జేయుమా నిను చింతలన్నియు వీడ, దుర్
భావఖండనఁ
జేసి, మంచిని వర్ధిలన్ గని, ముక్తినే
నీవొసంగుము,
నిన్నుఁ గొల్చెద నిత్యమున్, వర భక్తితో.
617. ఓం *అశన*యే నమః ।
నామ
వివరణ.
ఇంద్రుని
వజ్రాయుధము అమ్మ.
కం. *అశనా*! యాకలిఁ దీర్చుము
కృశియించుచుపోక
మున్నె క్షితిజనులకు, నిన్
వశమా
పొగడఁగ నాకున్?
మశకీకృత
రాక్షస గణ! మముఁ గావుమిలన్.
శ్లో.
శిల్పవైచిత్ర్యవిద్యోతా సర్వతోభద్రవాసినీ ।
అచింత్యలక్షణాకారా సూత్రభాష్యనిబంధనా ॥ 85 ॥
618. ఓం *శిల్పవైచిత్ర్యవిద్యోతా*యై నమః .
నామ
వివరణ.
శిల్పములయొక్క
వైచిత్రిని బాగుగానెరిగిన జనని అమ్మ.
తే.గీ.
*శిల్ప
వైచిత్ర్య విద్యోత*! చిన్నవయిన
కోర్కెలేలను
కోర నిన్? గోరుకొందు
శిల్ప
వైచిత్రి కవితలో, కొల్పుమమ్మ!
కొల్పఁ
జాలిన నిన్ను నే కొలుతునమ్మ!
619. ఓం *సర్వతోభద్రవాసిన్యై* నమః ।
నామ
వివరణ.
అన్నివిధములా
సురక్షితముగా నివసించు తల్లి.
తే.గీ. *సర్వతోభద్ర వాసినీ*! సన్నుతింతు
సర్వతోభద్రయై
యుర్వి, సత్ప్రదముగ
నిత్యముండఁగఁ
జేయుమా నీవు జనని!
వందనంబులు
చేసెద నందుకొనుము.
620. ఓం
*అచింత్యలక్షణాకారా*యై
నమః.
నామ
వివరణ.
ఆలోచించుటకైనను
అలవికాని లక్షణాకారములు ఉన్న తల్లి.
కం. ననుఁ
గావుమ సురవినుతా!
యనవధి*కాచింత్యలక్షణాకారా*! నీ
ఘనతర
లక్షణమెన్నెద
ననుపమముగ
నీవు నేనె యనుభావనతో.
621. ఓం *సూత్రభాష్యనిబన్ధనా*యై నమః ।
నామ
వివరణ.
వేదసూత్రములకువివరణ
వ్రాయు నియమములు అమ్మయే.
తే.గీ.
*సూత్రభాష్యనిబన్ధనా*! పాత్రతనిడి,
వేద
సూత్రభాష్యములను విశదపరచి
వేద
వేదాంత వేదార్థ విత్తమీవె
యంచు
గ్రహియింపఁ జేయుమా, మంచినెంచి.
శ్లో.
సర్వవేదార్థసంపత్తిస్సర్వశాస్త్రార్థమాతృకా ।
అకారాదిక్షకారాంత సర్వవర్ణకృతస్థలా ॥ 86 ॥
622. ఓం *సర్వవేదార్థసమ్పత్త*యే నమః ।
నామ
వివరణ.
సకలవేదార్థమే
సంపదగా ఉన్న జనని.
తే.గీ.
*సర్వ
వేదాన్త సమ్పత్తి*! గర్వమణచి
సర్వవేదాన్త
సమ్పత్తి నుర్వి నాకుఁ
గొలుపుమోయమ్మ!
కృపఁ జూపి గొప్పగాను,
వందనంబులు
చేసెద నందుకొనుము.
623. ఓం *సర్వశాస్త్రార్థమాతృకా*యై నమః ।
నామ
వివరణ.
సమస్త
శాస్త్రార్థములకు మూలము అమ్మయే.
తే.గీ.,
*సర్వశాస్త్రార్థమాతృకా*! సత్ప్రభాస!
జీవ
శక్తివి నీవమ్మ శ్రీకరమగు
కావ్య
శాస్త్రంబులందునన్ గమలవదన!
వందనంబులు
చేసెద నందుకొనుము.
624. ఓం *అకారాది క్షకారాన్త సర్వవర్ణాకృతస్థలాయై* నమః ।
నామ
వివరణ. ఽకారము మొదలు క్షకారము వరకు ఉన్న అన్ని వర్ణములకు అమ్మయే
స్వరూపము.
స్వయంకల్పిత సువర్ణవృత్తము.
గణములు. భ మ య జ త ర. యతి.
11వ
అక్షరము. ప్రాస నియమము
కలదు.
స్వర్ణ
*వకారాది క్షకారాన్త సర్వవర్ణాకృతస్థలా*!
స్వర్ణ
సముద్భాసా! మదాంధంబు చక్కగా త్రించుమమ్మరో!
కర్ణ
సుపర్వంబైన నీ నామ గానముంజేయఁ జేసి, సౌ
పర్ణ
మనోజ్ఞంబైన కావ్యంబువై వెలుంగన్ గదే సుధీ!
శ్లో.
సర్వలక్ష్మీస్సదానందా సారవిద్యా సదాశివా ।
సర్వజ్ఞా సర్వశక్తిశ్చ ఖేచరీరూపగోచ్ఛ్రితా ॥ 87 ॥
625. ఓం *సర్వలక్ష్మ్యై* నమః ।
నామ
వివరణ.
మంగళప్రదమయినగుణములు
అన్నియు అమ్మయే.
తే.గీ. *సర్వలక్షీ*! వరానేక సకల సుగుణ
ములను
నాకొసగుమ నీవు, సులలితముగ,
ముక్తి
సామ్యాజ్య కాంక్షతో ముందునుంటి,
వందనంబులు
చేసెద నందుకొనుము.
626. ఓం *సదానన్దా*యై నమః ।
నామ
వివరణ.
ఎల్లప్పుడూ
ఆనందముగా ఉండు జనని.
తే.గీ.
నుత
*సదానన్ద*! నీవు సన్నుతముగ నిక
క్షితి
సదానందునిగ నన్ను యతులితముగ
వరలఁజేయుమా
కృపతోడ భక్తిఁ గొలుతు,,
వందనంబులు
చేసెద నందుకొనుము.
627. ఓం *సారవిద్యా*యై నమః ।
నామ
వివరణ.
జ్ఞానసారవంతమయిన
విద్య అమ్మయే.
తే.గీ.
*సార
విద్యా*! సదాచార! శాశ్వతమగు
సార
విద్యను నేర్పుమా సజ్జనులకు,
కోరి
సేవింపనిమ్ము నిన్ గోర్కె తీర,
వందనంబులు
చేసెద నందుకొనుము.
628. ఓం *సదాశివా*యై నమః .
నామ
వివరణ.
ఎల్లప్పుడూ
మంగళకరముగనుండుజనని.
పంచ
చామరము.
*సదాశివా*! నమోస్తు తే,
ప్రశస్త వేదవిద్యలన్
ముదంబుతోడ
వెల్గు నిన్ను పూజ్య! గాంచనిమ్మిలన్,
మదాదులన్
విడంగఁ జేసి మమ్ము గావు నీకు నే
ముదంబుతోడ
నంజలింతు
ముక్తినొందఁ
గోరుచున్.
629. ఓం *సర్వజ్ఞా*యై నమః ।
నామ
వివరణ.
అన్నియు
తెలిసిన జనని.
కం. *సర్వజ్ఞా*! కనవేలను?
పర్వంబుగ
నిన్నుజూచి పరవశునగుచున్
గర్వము
ఖర్వముకాగా
సర్వేశ్వరి!
నీకృపగొని శాంతిని గనుదున్.
630. ఓం *సర్వశక్త్యై* నమః ।
నామ
వివరణ.
అన్ని
శక్తులు అమ్మయే.
తే.గీ. *సర్వ శక్తీ*! కృపామూర్తి! నిర్వికార!
సర్వ
శక్తులు నాకేల? సంతసమున
నిన్ను
జూచుచునుండనీ, నిత్యమిలను
వందనంబులు
చేసెదనందుకొనుము.
631. ఓం *ఖేచరీరూపగా*యై నమః ।
నామ
వివరణ.
ఆకాశమునసంచరించు
జీవకోటి రూపమున ఉండు జనని.
తే.గీ.
*ఖేచరీ
రూపగా*! నే సుఖింపనెంచి
భావనను
నీదు పాదముల్ పట్టినాడ,
నిత్య
సుఖమది ముక్తియే, నిరుపమాన
ముక్తి
సామ్రాజ్యమిమ్ము, విముక్తిఁ గనెద.
632. ఓం *ఉచ్ఛ్రితా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
చాలా గొప్పది.
తే.గీ.
*ఉచ్ఛ్రితా*! యంజలించెద నుత్సుకతను,
నీకు
శ్రితజన పాలినీ! శ్రీకరముగ,
నీదు
సత్కృపన్గొననిమ్ము నిరుపమాన!
ముక్తి
సామ్రాజ్యమందనీ, భక్తిఁ గొనెద.
శ్లో.
అణిమాదిగుణోపేతా పరా కాష్ఠా పరా గతిః ।
హంసయుక్తవిమానస్థా హంసారూఢా శశిప్రభా ॥ 88 ॥
633. ఓం *అణిమాదిగుణోపేతా*యై నమః ।
నామ
వివరణ.
అణిమా
మున్నగు గుణములతో కూడిన జనని.
కం. *అణిమాదిగుణోపేతా! *
మణిమాణిక్యములవేల?
మహనీయంబై
గణియింప
దగిన ముక్తియె
మణిగా
నా కొసగుమమ్మ! మాన్య సుచరితా!
634. ఓం *పరాకాష్ఠా*యై నమః ।
నామ
వివరణ.
ఏ
విషయమయిననూ పరాకాష్టస్థాయిల్ అమ్మయే.
తే.గీ.
వర
పరాకాష్ఠకున్ జేర్చి భక్తిలోన
నను
*బరాకాష్ఠ*! కావుమా, మనఁగఁ
జేయ!
నిన్ను
నమ్మితి, నాకింక నీవ దిక్కు
వమ్మ,
సన్నుత శుభములనిమ్ము కృపను.
ఓం *పరా*యై నమః.
తే.గీ.
వర పరాకాష్ఠకున్ జేర్చి భక్తిలోన
నను *బరాకాష్ఠ*! కావుమా, మనఁగఁ జేయ!
నిన్ను నమ్మితి, నాకింక నీవ దిక్కు
వమ్మ, సన్నుత శుభములనిమ్ము కృపను.
ఓం *కాష్టా*యై నమః.
తే.గీ.
వర పరాకాష్ఠకున్ జేర్చి భక్తిలోన
నను *బరాకాష్ఠ*! కావుమా, మనఁగఁ జేయ!
నిన్ను నమ్మితి, నాకింక నీవ దిక్కు
వమ్మ, సన్నుత శుభములనిమ్ము కృపను.
635. ఓం *పరాగతయే* నమః ।
నామ
వివరణ.
పరమునకు
చేర్చు గతి అమ్మయే.
పంచచామరము.
*పరాగతీ*! నిరంతరంబు భక్తి నిన్ను గొల్వనీ,
స్మరించుచున్
నినున్ మదిన్ బ్రశాంతి గాంచగన్ భువిన్
పరంబుగాంచు
మార్గమందు భవ్యమౌ కవిత్వమున్
పరాత్పరీ!
గ్రహింపుమంచు భక్తితో నొసంగనీ.
636. ఓం *హంసయుక్త విమానస్థా*యై నమః ।
నామ
వివరణ.
హంసవాహనముపై
సంచరించు జనని.
తే.గీ.
*హంసయుక్త విమానస్థ*! హంస నేనె,
యధిగమించుము
నేనను హంసనీవు
సాగిపొమ్మల
సృష్టిని సాగ జేయ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
637. ఓం *హంసారూఢా*యై నమః ।
నామ
వివరణ.
ఆత్మహంసనధిరోహించు
జనని.
శా.
ఆనందామృత వర్షిణీ! శుభద! *హంసారూఢ*! నిన్ మ్రొక్కెదన్,
దీనోద్ధారణ చేయుమా, జయద! నే దీనుండ, నన్ బ్రోవుమా,
నీ నా భేదము
కల్గుటన్ విడిచితిన్ నీపైన ధ్యాసంబు, నే
యానన్ బెట్టితి వెల్గుమింక, మతి హంసారూఢవై నా యెదన్.
638. ఓం *శశిప్రభా*యై నమః.
నామ
వివరణ.
చంద్రకాంతితో
వెలుగొందియుండు జనని.
పంచచామరము.
శివాత్మవై
రహించుదే *శశిప్రభా*! నితాంతమున్
భవుండు
నిన్శరీరమందు భాగమిచ్చి
నిల్పగా
భవాని! నీ శశిప్రభాప్రభావమందె శంకరుం
డవద్యమైన ప్రేమమీది, హాయిగా సుఖించుడీ.
శ్లో.
భవానీ వాసనాశక్తిరాకృతిస్థాఖిలాఽఖిలా ।
తంత్రహేతుర్విచిత్రాంగీ వ్యోమగంగావినోదినీ ॥ 89 ॥
639. ఓం *భవాన్యై* నమః ।
నామ
వివరణ.
భవుని
యిల్లాలు మన అమ్మ.
తే.గీ.
ఓ *భవానీ*! యిహం బేలకో సృజించి
యుంటి ననుకొనవేమి? నీ వంటి దేవి
పరము మాత్రమే సృజియించి పరగుటొప్పు.
చింతచేయుమా యొకమారు వింతఁ
గొలుపు.
640. ఓం *వాసనాశక్త్యై* నమః ।
నామ
వివరణ.
పుట్టుకతో
శక్తిమంతురాలు అమ్మ.
తే.గీ. *వాసనాశక్తి*!
గతజన్మ వాసనలను
బాయుటన్నదెట్లౌను? నీ బాధ్యతనుచు
కర్మఫలపాశజాలంబు గాల్చి, ముక్తి
నిచ్చు మార్గాన నడుపుమా మెచ్చునటుల!
641. ఓం *ఆకృస్థా*యై నమః ।
నామ
వివరణ.
ఆకారముతో
ఉన్న జనని అమ్మ.
తే.గీ. దేవి! *యాకృస్థ*! నాలోని దీప్తివీవె,
ప్రీతి సద్గుణులెల్ల విఖ్యాతముగను
నన్ను నెన్నుట నాలోని నిన్ను గనియె,
వందనంబులు నీకునో వందిత పద!
642. ఓం *ఖిలా*యై నమః ।
నామ
వివరణ.
ఖిలమగు
జీవకోటి అమ్మయే.
తే.గీ.
*ఖిల*! దురాచారముల్ మాపి ఖిలవయితివొ?
వెలయఁ జేయుచు సుజనులన్ వేల్పువయితొ?
నన్ను కాపాడఁ గలిగినన్ నాకు తెలియు,
వందనంబులు చేసితి నందుకొమ్మ.
643. ఓం *అఖిలా*యై నమః ।
నామ
వివరణ.
అఖిలమగు
దైవశక్తి అమ్మయే.
కం. *అఖిలా*! నిజమరసినచో
నఖిలాత్మవు నీవు, జనని! యనుపమ గుణ! నీ
ముఖపద్మమునందున నా
కఖిలాత్మునిఁ
గనఁగఁ జేయుమమ్మా! ప్రణతుల్.
644. ఓం *తన్త్రహేతవే* నమః ।
నామ
వివరణ.
అరువదినాలుగు
తంత్రములకు కారణమగు తల్లి.
తే.గీ.
*తంత్రహేతు*! యీ ఖలుల దుస్తంత్రములను
మాయగాఁ జేయు శక్తివి, మహిమఁ జూపి
దుష్టులన్ మాపివేయుమా తోయజాక్షి!
వందనంబులు చేసెద నందుకొనుము.
645. ఓం *విచిత్రాఙ్గ్యై*యై నమః ।
నామ
వివరణ.
విచిత్ర
అద్భుత అంగములు కలిగిన జనని.
తే.గీ.
విను
*విచిత్రాఙ్గి*! యిలపైన ఘనతరముగ
కన
విచిత్రములున్నవి, కాని, నీవె
చిత్ర
సత్ప్రభనొప్పు విచిత్రవమ్మ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
646. ఓం *వ్యోమగఙ్గావినోదిన్యై* నమః ।
నామ
వివరణ. ాఅకాశగంగతో వినోదించు తల్లి.
తే.గీ.
*వ్యోమగఙ్గావినోదినీ*! యో మదంబ!
భావనాకాశ
గంగవై ప్రతిభఁ గొలిపి
యమృత
ధారగా వర్షించు మతులితముగ
కావ్యసామ్రాజ్యమందునఁ
గవనఝరిని,.
శ్లో.
వర్షా చ వార్షికా చైవ ఋగ్యజుస్సామరూపిణీ ।
మహానదీనదీపుణ్యాఽగణ్యపుణ్యగుణక్రియా ॥ 90 ॥
647. ఓం *వర్షా*యై నమః.
నామ
వివరణ.
జలవృష్టి
అమ్మయే.
కం. *వర్షా*! కావ్య పొలమునన్
వర్షింపుము
కవన సుధను, పరగగ నమృతో
త్కర్షగ,
శుభదగ ననుపమ
హర్షము
కలిగించు ఫలమహర్నిశలు భువిన్.
648. ఓం *వార్షికా*యై నమః ।
నామ
వివరణ.
సాధకులపై
కరుణను వర్షించు తల్లి.
తే.గీ. *వార్షికా*! భక్తపాళిపై వర్షముగను
ప్రేమఁ
గురిపింతువమ్మరో ప్రీతి తోడ,
నేను
నీ భక్తుఁడన్ గదా, జ్ఞానవృష్టి
లోన
నన్ ముంచు, నీవు నాలోననుండి.
649. ఓం *ఋగ్యజుస్సామరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
వేదత్రయ స్వరూపిణి.
తే.గీ.
*ఋగ్యజుస్సామరూపిణీ*! కృపను గనుచు
ఋగ్యజుస్సామ
సారమున్
యోగ్యతనిడి
నాకునెఱుగగఁ
జేయుమా నయ నిధాన!
వందనంబులు
చేసెద నందుకొనుము.
650. ఓం *మహానద్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
ఒక మహానది.
తే.గీ.
ఓ
*మహానదీ*! నుత పరమోత్తమమగు
కావ్యధారవై
ప్రవహించు ఘనతరముగ,
వర
లసత్కావ్య కల్పనన్ నిరుపమముగ
దైవదర్శనభాగ్య
మున్ దయను గొలుపు.
651. ఓం *నదీపుణ్యా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
పుణ్యప్రదమయిన నది.
తే.గీ.
వర
*నదీపుణ్య*! పుణ్యవై వరలు నదివి,
యాత్మలోతులన్
బ్రవహించుమమ్మ నీవు,
దైవధర్శన
భాగ్యమున్ దయను గొలుపు.
వందనంబులు
చేసెద నందుకొనుము.
652. ఓం *అగణ్యపుణ్యగుణక్రియా*యై నమః ।
నామ
వివరణ.
గణింపలేనంతటిపుణ్యప్రదమయన
గుణక్రియలతో నొప్పునది అమ్మ.
ఆ.వె.
పుడమిలో
*నగణ్య
పుణ్యగుణక్రియా*!
కొలుతునమ్మ
నిన్నుఁ గూర్మితోడ,,
ప్రోవుమా
యగణ్య పుణ్యగుణక్రియల్
నాకుఁ
గలుగఁ జేసి లోకమునను.
శ్లో.
సమాధిగతలభ్యార్థా శ్రోతవ్యా స్వప్రియా ఘృణా ।
నామాక్షరపరా దేవీ ఉపసర్గనఖాంచితా ॥ 91 ॥
653. ఓం *సమాధిగతలభ్యార్థా*యై నమః ।
నామ
వివరణ.
సమాధిస్థితిలో
లభ్యమయిన అర్థము కల తల్లి.
కం. ప్రణతులు
చేయుచు మదిలో
గణుతించెద
నిను *సమాధిగతలభ్యార్థా*!
క్షణమయిన
వ్యర్థ పరచక
ప్రణవామృత
మమర నిమ్మ, పావనమగుదున్.
ఓం *సమాధిగత లభ్యా*యై నమః.
కం. ప్రణతులు చేయుచు మదిలో
గణుతించెద నిను *సమాధిగతలభ్యా* ర్థా!
క్షణమయిన వ్యర్థ పరచక
ప్రణవామృత మమర నిమ్మ, పావనమగుదున్.
ఓం *అర్థా*యై నమః.
కం. ప్రణతులు చేయుచు మదిలో
గణుతించెద నిను సమాధిగతల*భ్యా ర్థా*!
క్షణమయిన వ్యర్థ పరచక
ప్రణవామృత మమర నిమ్మ, పావనమగుదున్.
654. ఓం *శ్రోతవ్యా*యై నమః ।
నామ
వివరణ.
వినవలసిన
ఘనతగల తల్లి.
కం. *శ్రోతవ్యా*! నీ చరితము
పాతకములఁ
బాపునమ్మ!
పరమాత్మ
కృపన్
ఖ్యాతిగ
నొసగును తల్లీ!
నీ
తలపే నాకు ధనము, నిను సేవింతున్.
655. ఓం *స్వప్రియా*యై నమః ।
నామ
వివరణ.
తనను
తాను యిష్టపడు తల్లి.
తే.గీ.
*స్వప్రియా*! కవిగణ నుత సుప్రకాశ!
యప్రియంబులు
విడఁ జేసి హాయిఁ గొలుపు,
మప్రయత్న
కవిత్వము నమరఁ జేసి
సుప్రతిష్టను
గొలిపితే శుభద! నాకు.
656. ఓం *ఘృణా*యై నమః ।
నామ
వివరణ.
కనికరమునకు
పూర్ణ స్వరూపమగు జనని.
కం. కనికరము
చూపుమ, *ఘృణా*!
యనయమును సపర్యఁ
జేసి యనితరముగ నిన్
గొని
మదిలో నిలుపునటుల
క్షణమున
నొనరింపుమమ్మ కాదనకమ్మా!
ఓం *అఘృణా*యై నమః.
నామ వివరణ.
రోత ఎరుగని జనని.
కం. కనికరము చూపు*మఘృణా*!
యనయమును సపర్యఁ జేసి యనితరముగ నిన్
గొని మదిలో నిలుపునటుల
క్షణమున నొనరింపుమమ్మ! కాదనకమ్మా!
657. ఓం *నామాక్షరపరా(దా) *యై నమః ।
నామ
వివరణ.
తన
నామాక్షరములవలన తెలియబడు గొప్పకంటే ఇంకనూ ఎత్తుగనే యున్న జనని.
తే.గీ.
వినుత
*నామాక్షర పరా(దా) *! రవి ప్రకాశ
ప్రవర
నామాక్షరము లీవె శ్రవణపేయ
మమ్మరో
వ్రాసి పలికినన్ గమ్మదనము
నెమ్మి
నొనరి మదికి శాంతి నిమ్మునొసఁగు.
ఓం దేవ్యై నమః.
కం. *దేవీ*! మదిలో నిను నే
భావించిన
యంతలోనె పలికెదవమ్మా!
నీవుంటివమ్మ
నా మదిఁ
బ్రోవఁగ
నను నిత్యమిలను, పుణ్యఫలదవై.
658. ఓం *ఉపసర్గనఖాఞ్చితా*యై నమః.
నామ
వివరణ.
వ్యాకరణ
స్వరూపిణి.
గోరులకాంతితో
ఒప్పుచున్న జనని.
ఆ.వె.
సదయ
గనుమిఁక *నుప
సర్గనఖాఞ్చితా*!
భాషలోఁ
గల గుణ దోషములను
గుర్తుపట్టలేను,
కూర్మిని సరిచేసి
కావ్యములను
గొనుము, కల్పవల్లి!
శ్లో.
నిపాతోరుద్వయీజంఘా మాతృకా మంత్రరూపిణీ ।
ఆసీనా చ శయానా చ తిష్ఠంతీ ధావనాధికా ॥ 92 ॥
659. ఓం
*నిపాతోరుద్వయీజంఘా*యై నమః
నామ
వివరణ.
శక్తియుత
ఊరుద్వయ జంఘాన్విత శుభావహ మన జనని.
మాలిని.
శ్రుత
మహిత *నిపాతోరుద్వయీజంఘ*!
దేవీ!
క్షితిని
బ్రజను కావన్ కేలునందించుమమ్మా.
మత
కలహము లేలా? మాన్పరాదో భవానీ!
హితము
గొలుపుమమ్మా! హింసలన్ బాపుమమ్మా.
ఓం *నిపాతోరుద్వ*య్యై నమః ।
తే.గీ.
ఇట గనుమ *నిపాతోరుద్వయీ*! గణించి
నీవు నాచేత వ్రాయించి నేర్పుమీర
వరలు గ్రంథమున్, నీశక్తి ప్రబలె నిందు.
వందనంబులు చేసెదనందుకొనుము.
ఓం *జంఘా* యై
నమః ।
మాలిని.
శ్రుత మహిత నిపాతోరుద్వయీ*జంఘ*! దేవీ!
క్షితిని బ్రజను కావన్ కేలునందించుమమ్మా.
మత కలహము లేలా? మాన్పరాదో భవానీ!
హితముగొలుపుమమ్మా! హింసలన్ బాపుమమ్మా.
660. ఓం *మాతృకా*యై నమః ।
నామ
వివరణ.మూల స్వరూపము అమ్మయే.
ఓం *జఙ్ఘామాతృకా*యై నమః ।
కం. కృపఁ
గను *జఙ్ఘామాత్రుక*!
యపరిమితవిశాల
హృదయ హైందవతేజం
బుపమగ
యగునటు ఘనతకు
సుపవిత్రపు
నాదు కృతిని శోభిలఁ గనుమా
661. ఓం *మన్త్రరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
వేదమంత్రముల
రూపము అమ్మయే.
తే.గీ.
*మన్త్రరూపిణీ*! విననేర
మంత్రములను,
తన్త్రములనేని
యెఱుగను, ధర్మరీతి
నీవు
నాలోననే యుండి నేర్పినావు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
662. ఓం *ఆసీనా*యై నమః ।
నామ
వివరణ.
కూర్చొని
యుండు తల్లి .
కం. *ఆసీన*! హృదయమందున
నాసీనవగుము!
శుభంబు లందించు కృపన్,
ధ్యాసగఁ
గొలిచెదనమ్మా!
శ్వాసను
నినుఁ గనుచునెపుడు, సన్నుత చరితా!
663. ఓం *శయానా*యై నమః ।
నామ
వివరణ.
పడుకొని
యుండు తల్లి.
తే.గీ.
ఓ
*శయానా*! మదిన్ నిల్చి యుండుమమ్మ!
యీశ్వరీ!
నీదునామంబు నెన్ననిమ్మ,
శాశ్వతంబగు
సత్కీర్తి సదయనిమ్మ!
వందనంబులు
చేసెదనందుకొమ్మ.
664. ఓం *తిష్ఠన్త్యై* నమః ।
నామ
వివరణ.
నిలఁబడి
యుండు తల్లి.
కం. *తిష్ఠన్తీ*! నిలబెట్టుము
దుష్ఠుల
దోషములు చూపి దుర్దశ నడపన్
నష్ఠంబు
కలుగ నీయకు
శిష్ఠులకిల,
నిన్ నుతిన్తు, చిన్మయ రూపా!
665. ఓం *ధావనాధికా*యై
నమః.
నామ
వివరణ.
కదలకుండ
ఉండు తల్లి.
తే,గీ. *ధావనాధికా*! నిన్ను నే తలచినపుడు
స్థిరముగా
నాదు మదిలోన చిరునగవుల
తోడఁ
గన్పింతువమ్మరో తోడనుండి,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *భువనాధికా*యై నమః ।
కం. *భువనాధికా*! పరాత్పరి!
కవనాకృతిఁ బ్రభవమంది కననీ నిన్నున్
భువి, నేఁ జక్కగ వ్రాయగ
నివసించుము కవితలోన, నినుఁ గీర్తింతున్!
శ్లో.
లక్ష్యలక్షణయోగాఢ్యా తాద్రూప్యగణనాకృతిః ।
సైకరూపా నైకరూపా సేందురూపా తదాకృతిః ॥ 93 ॥
666. ఓం *లక్ష్యలక్షణయోగాఢ్యా*యై నమః ।
నామ
వివరణ.
లక్ష్యము,
లక్షణము, యోగములతో నొప్పు జనని.సాకార నిరాకార రూపములలో పూజలందు
జనని.
తే.గీ. *లక్ష్య లక్షణ
యోగాఢ్య*! లక్ష్యమీవె
నాకు,
సేవించి కృపఁ గందు నయ నిధాన!
సాక్ష్యముగ
నీవె కవితలన్ సరిగ నుండి
చదువు
వారికానందమై మెదలుమమ్మ.
667. ఓం *తాద్రూప్యై* నమః ।
నామ
వివరణ.
పోలికలుగల
అనేక రూపములతో ఒప్పియుండు జనని.
కం. *తాద్రూపి*! నామనంబున
చిద్రూపముగా
వెలుంగు చిరకాలంబున్,
భద్రద
వగుముండి యటుల,
సద్రచనలు
చేయఁ జేసి సంతోషమిడన్.
668. ఓం
*గణనాకృత్యై*
నమః.
నామ
వివరణ.
కం. *గణనాకృతీ*! శుభాస్పద!
గణుతిన్
గనఁజేయ నాకుఁ గలుగుము మదిలో,
ప్రణవంబుగ
మార్మ్రోగుము,
క్షణమైనను
విడువకమ్మ కాదనకమ్మా!
ఓం *తాద్రూప్యగణనాకృత్యై* నమః.
నామ వివరణ.
అనేకరూపములలో గణింపఁబడుచు పూజింపఁబడు జ్నని.
తే.గీ.
దివ్య! *తాద్రూప్యగణనాకృతీ*! జయమ్ము,
నిన్ను ధ్యానించి తాద్రూప్యమెన్ని గనెద
నమ్మ నీరూప సంపదల్ నెమ్మి నొంది
పొంగఁ జేయఁగ నీవుండు పూజ్య! మదిని.
669. ఓం *ఏకరూపా*యై నమః ।(స +ఏకరూప)
నామ
వివరణ.
నిర్గుణబ్రహ్మైకరూపమున
పూజింపఁబడుజనని అమ్మ
తే.గీ.
*ఏకరూపా*! మహాఙ్గిర! శ్రీకరాంబ!
యే
విధంబున కనిన నీ వేకరూప
వగుటచే
నాదు రూపాన నలరుచున్న
నిన్ను
మదిలోన కొలిచెదన్ నేర్పు మీర.
670. ఓం *నైకరూపా*యై నమః ।
(న + ఏకరూపా)
నామ
వివరణ.
సగుణానేకరూప
పూజిత జనని అమ్మ.
తే.గీ.
*నైకరూపా*! మహా సద్గుణైక రూప!
యొకటిగానుండి
పెక్కింటనొప్పు జనని!
వరలఁ
జేసెదవే మమ్ము పరముఁ గొలిపి,
వందనంబులు
చేసెద నందుకొనుము.
671. ఓం
*ఇన్దు
రూపా*యై నమః. (స + ఇందురూపా)
నామ
వివరణ.
చంద్రునివలె
చక్కని రూపము కలిగిన జనని.
తే.గీ.
*ఇన్దు
రూపా*! కృపావరణేన్దు రూప!
చల్లగావెల్గుమా
మదినెల్లవేళ
లందు
మాయమ్మ మా పూజ లందుమమ్మ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
తే.గీ. *ఇన్దురూపా*! కృపాసాంద్ర మన్ద మతిని,
నీదు
వైభవ మెన్ని యాస్వాదనీయ
కావ్యమున్
వ్రాయనైతిని, భవ్య తేజ!
వ్రాయఁ
జేయుము నాచేత వాసిగాను.
672. ఓం *తస్యై* నమః । (తస్మై + ఆకృతిః….తదాకృతిః.)
నామ
వివరణ.
అంతటా,
అందరిలోను ఉన్నది నీవే అని త్వం నామసార్ధక్యము కలిగిన జనని
తే.గీ.
జనని!
*త్వమ్*! సుధాంభోధి! నీ
సహన మెన్నఁ
జాలనమ్మరో!
నాపైన జాలి చూపి
నాదు
దోషముల్ మన్నించు నయనిధాన
వందనంబులు
చేసెదనందుకొనుము.
కం. *తస్యై*! నినుఁ బిలిచినచో
నస్మన్ మతి భాసమానవై కృప గను నీ
రస్మిన్ కన జాలముగా
యుష్మత్ ప్రతిభా విశేషమొరులకొదవునా?
673. ఓం
*ఆకృత్యై*
నమః.
నామ
వివరణ.
ఆకారముకలిగిన
జనని అమ్మ.
తే.గీ.
*ఆకృతీ*!
నీ సదాకార మాత్మలోన
నిలుపుకొందును
కరుణించి నిలుము తల్లి.
చాలునమ్మరో!
నీవున్న మేలు నాకు
కలుగకెట్లుండు,
మదిలోన వెలుగుమమ్మ.
ఓం *తదాకృత్యై*
నమః ।
నామ వివరణ.
ఆ దేవుని రూపములో ఉన్న జనని.
తే.గీ.
విను *తదాకృతీ*! నామొరన్ వినఁగఁ జేసి,
నాదు మదిలోన నిను నిల్పి మోదమలర,
నిన్నె సేవించుకొందును నిత్యముగను
వందనంబులు చేసెదనందుకొనుము.
శ్లో.
సమాసతద్ధితాకారా విభక్తివచనాత్మికా ।
స్వాహాకారా స్వధాకారా శ్రీపత్యర్ధాంగనందినీ ॥ 94 ॥
674. ఓం *సమాసతద్ధితాకారా*యై నమః ।
నామ
వివరణ.
వ్యాకరణమున
సమాస, తద్ధితముల ఆకారము అమ్మయే.
తే.గీ.
కరుణతో
నన్ను గాంచుమో, వర *సమాస
తద్ధితాకార*!
సతతంబు
నిద్ధరిత్రి
తగ
సమాసములను తద్ధితముల నెఱుఁగ,
కనగ
నాకన్నియున్ నీవె కమల నయన!
675. ఓం *విభక్తివచనాత్మికా*యై నమః ।
నామ
వివరణ.
విభక్తులు
వచనములకు అమ్మయే ఆత్మ.
తే.గీ.
కను
నను *విభక్తి వచనాత్మకా*! మనమున,
తద్విభక్తుల
తత్వమే తలపనయితి,
నిన్ను
మాత్రమే మదిని నే నెన్నుకొంటి
వందనంబులు
చేసెద నందుకొనుము.
676. ఓం *స్వాహాకారా*యై నమః ।
నామ
వివరణ.
హోమాదుల
సమర్పించు సమయమున పలుకు అగ్ని భార్య యగు స్వహా
దేవిసంబోధనకు
సంబంధించిన స్వహాకారము అమ్మయే.
కం. *స్వాహాకారా*! కృతివై
స్వాహాకారాకృతివిగ
వరలుము ధరలో,
మోహాదులఁ
బాపి మదిని
స్నేహముతో
నుండి కనుమ సిద్ధిని గొలుపన్.
677. ఓం *స్వధాకారా*యై నమః ।
నామ
వివరణ.
పితృకార్యములలో
హవిస్సులను అందుకొను అగ్నిహోతృని భార్య అగు దస్వధా అమ్మ ఆకారమే.
తే.గీ. కను,
*స్వధాకార*! నా స్థితిన్
గనుము జనని!
పర!
ధనంబుగ నిన్ను నే బడయఁ గోరి
పర
ధనంబులన్ గోరక వరలఁ గనితి.
నుత!
స్వధాకారవై మదిన్ నుతిగ నిలుమ.
678. ఓం *శ్రీపత్యర్ధాఙ్గనన్దిన్యై* నమః
నామ
వివరణ.
ఆమె శ్రీవత్సలా విష్ణువు యొక్క సగం శరీరాన్ని ఆక్రమించినది.
కం. తాపత్రయమును
బాపుమ
కోపావేశములఁ
బాపి గోవిందునిపై
దీపింపఁ
జేయ మనమున్
*శ్రీపత్యర్థాంగ నందినీ*! నినుఁ గొలుతున్.
శ్లో.
గంభీరా గహనా గుహ్యా యోనిలింగార్ధధారిణీ ।
శేషవాసుకిసంసేవ్యా చపలా వరవర్ణినీ ॥ 95 ॥
679. ఓం *గమ్భీరా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ గంభీరముగా
నుండు లోకమాత.
కం. *గమ్భీరా*! నా కృతికిన్
సమ్భవమగునటులఁ
జేసి చక్కగ నిన్నున్
శుమ్భత్ప్రతిభన్
గొలుచుట
నమ్భోరుహ
నేత్రి! తృప్తి నందుము జననీ!
680. ఓం *గహనా*యై నమః ।
నామ
వివరణ.
లోతైన
స్వభావముకల తల్లి.
కం. *గహనా*! నీ కృపఁ గనుటే
గహనంబగుచుండెనమ్మ!
కాదన గలవా?
యహరహమును
నిన్ గొలుతును,
దహరాకాశమునఁ
గనుచు, దయఁ గనుమమ్మా!
681. ఓం *గుహ్యాయై* నమః ।
నామ
వివరణ.
రహస్యముగా
ఉండు తల్లి.
తే.గీ.
గుహ్యమైనట్టి
నిన్ గాంచఁ గుదరదు మది,
మనసులోనుండు
తోడుగా, మనుము మదిని,
నిన్ను
ధ్యానింతు నేన్ గుహ్య! సన్నుతముగ
వందనంబులు
చేసెద నందుకొనుము.
682. ఓం *యోనిలిఙ్గార్ధధారిణ్యై* నమః ।
నామ
వివరణ.
అర్థనారీశ్వరతత్వము
అమ్మ.
తే.గీ.
*యోని
లిఙ్గార్ధధారిణీ*! ధీ నిధాన!
జ్ఞాన
సమ్పత్ స్వరూపిణీ! కదలి రమ్ము,
వచ్చి
నామదిలోనుండి భక్తిఁగొలిపి
పూజలన్
నీవు గొని నాకుఁ బుణ్యమిమ్ము.
683. ఓం *శేషవాసుకిసంసేవ్యా*యై నమః ।
నామ
వివరణ.
శేషవాసుకిలచే
సేవింపఁబడు జనని.
తే.గీ.
*శేషవాసుకిసంసేవ్య*! చిత్ప్రమేయ!
జీవనాధార!
పోషించుదీవె మమ్ము,
భావమందునన్
బ్రబలుచున్ బ్రోవుము మము,
వందనంబులన్
జేసెద మందుకొనుము.
684. ఓం *చపలా*యై నమః ।
నామ
వివరణ.
చపలత్వము
కల తల్లి.
కం. అపమార్గము
తప్పింపుము
*చపలా*! చాంచల్య చిత్త చపలత్వము నే
నుపమింపఁ
జాలఁ, బాపుమ,
చపలత్వము
మనమునందు సన్నుతులందన్.
685. ఓం *వరవర్ణిన్యై* నమః ।
నామ
వివరణ.
శ్రేష్ఠమగువాటిని
వర్ధిల్లఁజేయు తల్లి.
కం. *వరవర్ణిని*! కృపఁ గను ననుఁ
బరమేశ్వరి!
జయ నిధాన! భాగ్యద వగుచున్
నిరతము
నాలోనుండుమ
కరుణించుచు
కావ నన్ను, కారుణ్య నిధీ!
శ్లో.
కారుణ్యాకారసంపత్తిః కీలకృన్మంత్రకీలికా ।
శక్తిబీజాత్మికా సర్వమంత్రేష్టాఽక్షయకామనా ॥ 96 ॥
686. ఓం *కారుణ్యాకారసమ్పత్త*యే నమః ।
నామ
వివరణ.
కరుణతో
కూడిన ఆకారమే సంపదగా కల తల్లి.
స్వయంకల్పిత కారుణ్యవృత్తము.
గణములు మ ర ర య య … యతి9వ అక్షరము.
ప్రస కలదు.
*కారుణ్యాకారసమ్పత్తి*! కావగా రమ్ము నన్నున్,
నీ
రూపంబున్ సతంబెన్ననిమ్ము నాదైవ మీవే,
ధారాశుద్ధిన్
గృతిన్ గొల్పి, తత్కృతిన్ నీవె కొమ్మా,
శ్రీరమ్యాకార!
నాలోని చింతలన్ బాపుమమ్మా!
687. ఓం *కీలకృతే* నమః ।
నామ
వివరణ.
భక్తులకైహికభ్రాంతులను
దూరము చేయు జనని.
తే.గీ.
*కీలకృత్*! పరాదేవి! యీ
జాలమేల?
మేలు
చేయగ రావేల, నేల రావ?
చాలు
చాలునుపేక్ష నీ ఛాయనిలిపి
నన్ను
కాపాడ రావమ్మ! సన్నుతముగ.
688. ఓం
*మన్త్రకీలకా*యై
నమః.
నామ
వివరణ.
పూజింపఁబడు
కీలకమయిన మంత్రములు కలిగిన తల్లి.
తే.గీ.
*మన్త్ర
కీలికా*! ఖలుల దుస్తన్త్రములను
నీవె
కనిపెట్టి యాపుమా! నిన్నునమ్మి
సుజనులందరిన్
గొలుతురు చూచి నిన్ను,
కావ
రావమ్మ మమ్ములన్ గమల నయన!
689. ఓం *శక్తిబీజాత్మికా*యై నమః ।
నామ
వివరణ.
శక్తికి
సంబంధించిన బీజాక్షరములకాత్మ అమ్మ.
తే.గీ.
*శక్తి
బీజాత్మికా* నీ ప్రసక్తి లేక
సృష్టి
నడవదు, నిరతంబు దృష్టి పెట్టి
కావుమీ
సృష్టినే నీవు ధీవిశాల!
వందనంబులం
జేసెద నందుకొనుము.
690. ఓం *సర్వమంత్రేష్టా*యై నమః ।
నామ
వివరణ.
అన్ని
మంత్రములయెడా ప్రీతి కలది అమ్మ.
తే.గీ.
*సర్వమన్త్రేష్ట*! నీవెగా సర్వమంత్ర
రూపవయియుంటివమ్మరో!
ప్రోవగ మము.
మంత్రసారంబుగా
నీవు మమ్ముఁ జేరు.
వందనంబులు
చేసెదనందుకొనుము.
691. ఓం *అక్షయకామనా*యై నమః ।
నామ
వివరణ.
అక్షయమయిన
కోరికలు కలిగిన జనని.
తే.గీ.
నిరత*మక్షయ
కామనా* నిన్నుఁ గొలుతు,
క్షయము
లేనట్టి దానినే కామితదగ
నాకొసంగుమా
దైవమున్ నమ్మి కొలుతు,
వందనంబులు
చేసెదనందుకొనుము.
శ్లో.
ఆగ్నేయీ పార్థివా ఆప్యా వాయవ్యా వ్యోమకేతనా ।
సత్యజ్ఞానాత్మికాఽఽనందా బ్రాహ్మీ బ్రహ్మ సనాతనీ ॥ 97 ॥
692. ఓం *ఆగ్నేయ్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
అగ్నిస్వరూపిణి.
కం. *ఆగ్నేయీ*! నినుఁ గోరెద
భగ్నము
కానీయకమ్మ భక్త్యనురక్తిన్,
లగ్నంపు
మదినిట నను
ద్విగ్నంబుగ
నిలిపి నిన్ను దీరుగఁ
గొలుతున్
693. ఓం *పార్థివా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
భూదేవి.
తే.గీ.
*పార్థివా*! కరుణింపు నిన్ భక్తిఁ గొలుతు,
పృథ్విపై
జనియించితిన్, వెదకు చుంటి
యెచటనుండి
నే వచ్చితో యచటి కేగ
జన్మసాఫల్యమును
గొల్పు జనని వీవె.
694. ఓం *ఆప్యా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
నీరు రూపము.
తే.గీ.
జలము
నీవౌదు *వాప్య*! ప్రశస్త తేజ!
సృష్టి
మూలమ! జలముచే సృష్టి కలుగు,
నిహము
నందును పరమందు నెన్నిచూడ
ముక్తి
గొలిపెడిదీవె! నిన్ భక్తిఁ గొలుతు
695. ఓం *వాయవ్యా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
వాయువు రూపము.
తే.గీ.
ప్రాణ
శక్తివి *వాయవ్య*! ప్రణవ నాద
ముద్భవించును
మదిలో ననుపమముగను,
నీదు
ప్రేరణన్, గణియింప నేనెఱుంగ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
696. ఓం *వ్యోమకేతనా*యై నమః ।
నామ
వివరణ.
ఆకాశము
రూపము అమ్మయే.
తే.గీ.
*వ్యోమకేతనా*! యాకాశమున్నఁ జగతి
సాగుచుండును
నిజమమ్మ! చక్కగ నినుఁ
గొలిచెదన్
భక్తితోడను గొప్పగాను,
వందనంబులన్
జేసెద నందుకొనుము.
697. ఓం *సత్యజ్ఞానాత్మికానన్దా*యై నమః ।
నామ
వివరణ.
సత్యము
జ్ఞానములతో ఆనందమయయై యుండు జనని.
స్వయంకల్పిత ధ్యానంద వృత్తము.
గణములు…
న
మ త త గ….
యతి 10వ అక్షరము.
ప్రాస
కలదు.
అనుపమా!
*సత్యజ్ఞానాత్మికానన్ధ*! నీ
ఘనతనే
నిత్యమ్మెన్నంగ కాదమ్మరో!
సునిశితంబౌసుజ్ఞానంబుశోభిల్లు
నీ
కు
నిరతంబున్ ప్రేమన్ మ్రొక్కకూర్మిన్ ధరన్.
ఓం *సత్యజ్ఞానాత్మికా*యై నమః.
కం. అకలుష! * సత్యజ్ఞానా
త్మికా*! ననున్ బ్రోవ రమ్ము, స్థిరచిత్తుఁడనై
సకలము నీదౌ చరితము,
ప్రకటించగఁ జేయుమమ్మ వందనమమ్మా.
ఓం *నన్దా*యై నమః
కం. *నందా*! నినుఁ దలచిన నా
నందంబది పొంగు మదిని, నాలో నీవా
నందమ్మయి నిలిచితివిగ,
సందేహము లేదు నేను చక్కని నీవే.
698. ఓం *బ్రాహ్మ్యై* నమః.
నామ
వివరణ.
బ్రహ్మశక్తి
అమ్మయే.
తే.గీ.
వినుత
*బ్రాహ్మీ*! మహాదేవి! విశ్వమాత!
జయనిధానమ!
నినుఁ గొల్తు సదయఁ గనుమ.
నీదు
కృపచేత బ్రహ్మమున్ నేను గనుదు,
వందనంబులు
చేసెదనందుకొనుము.
699. ఓం *బ్రహ్మణే* నమః ।
నామ
వివరణ.
పరబ్రహ్మము
అమ్మయే.
తే.గీ.
*బ్రహ్మ*! విజ్ఞాన తేజమా! భక్తితోడ
నిన్నుఁ
గొలిచెద నమ్మరో నిలుము మదిని,
బ్రహ్మమొక్కటే
కలదుప్రపంచమునను,
వందనంబులు
చేసెదనందుకొనుము.
700. ఓం *సనాతన్యై* నమః ।
నామ
వివరణ.
అతిప్రాచీనురాలు
మన అమ్మ.
తే.గీ.
నిను
*సనాతనా*! గుర్తింప నేనుఁ జాల
వినయ
విశ్వాసములతోడఁ బ్రీతిఁ గొలుతు,
నీదు
కృపఁ జూపి కావుము మోదమునను.
వందనంబులు
జేసెదనందుకొనుము.
శ్లో.
అవిద్యావాసనా మాయాప్రకృతిస్సర్వమోహినీ ।
శక్తిర్ధారణశక్తిశ్చ చిదచిచ్ఛక్తియోగినీ ॥ 98 ॥
701. ఓం *అవిద్యావాసనా*యై
నమః.
నామ
వివరణ.
జ్ఞానాభావము
గోచరించు జనని అమ్మ.
శా. ఆద్యంబీవె
యటంచు గొల్చెద *న
విద్యావాసనా*! మాయ! నిన్,
హృద్యంబైన
మహత్వవిద్యఁ గనగన్, హీనస్థితిన్ దాటగన్,
వేద్యంబై
మనమందు నీవు నిలుమా విఖ్యాతిగా నీశ్వరీ!
విద్యావంతులుగా
మలంచుము ప్రజన్ విశ్వాసమున్ నిల్పుమా.
ఓం *అవిద్యావాసనామాయా*యై నమః ।
నామ వివరణ.
అవిద్యా వాసనలను నశింపఁజేయు జనని అమ్మ.
శా. ఆద్యంబీవె యటంచు గొల్చెద *న విద్యావాసనామాయ*! నిన్,
హృద్యంబైన మహత్వవిద్యఁ గనగన్, హీనస్థితిన్ దాటగన్,
వేద్యంబై మనమందు నీవు నిలుమా విఖ్యాతిగా నీశ్వరీ!
విద్యావంతులుగా మలంచుము ప్రజన్ విశ్వాసమున్ నిల్పుమా.
702. ఓం
*మాయా* యై నమః.
నామ
వివరణ.
మాయాస్వరూపిణియు
అమ్మయే.
తే.గీ.
మాయవీవమ్మ! యోమాయ! మాయఁగొలిపి
మమ్ముతికమకపెట్టుట మహితమగునొ?
మాయ మాందు నిలుపక శ్రేమమలర
నీవు కాపాడుమమ్మరో! నిన్ను కొలుతు.
703. ఓం *ప్రకృత*యే నమః ।
నామ
వివరణ.
సృష్టికి
ఆధారమగు ప్రకృతి అమ్మయే.
కం. *ప్రకృతీ*! నీవే కావగ
సకలంబును
నడుచు చుండె సన్నుతవగు నీ
వకలంక
భక్తినొసఁగినఁ
బ్రకటితమగు
దైవశక్తి, భాసిలఁ జేయున్.
704 ఓం *సర్వమోహిన్యై* నమః ।
నామ
వివరణ.
సమస్థ
స్టిష్టికీ మోహము కలిగించునది అమ్మయే.
తే.గీ.
*సర్వమోహినీ*! మోహాన సకల జనులు
గర్వితులుగను
పాపపు కర్ములుగను
మారుచుండిరి
నీవేను మార్గమమ్మ
లోకమును
గావ సద్గుణ లోల జనని!
705. ఓం *శక్తిర్ధారణశక్త*యే నమః ।
నామ
వివరణ.
శక్తికి
కలిగిన ధారణశక్తి అమ్మయే.
కం. *శక్తిర్ధారణశక్తీ*!
భక్తిగ
నిము కొలుతునమ్మ, వర ధారణ, స
ద్యుక్తిని,కొలుపుము విలస
న్ముక్తికి
మార్గంబు చూపి ప్రోవుము తల్లీ!
శా.
ధ్యేయంబొప్పఁగ రమ్ము నీవిటకు,
*శక్తిర్ధారణాశక్త*! సు
జ్ఞేయంబౌనటు నీమహత్వగరిమన్ చిత్తంబులో నింపుమా
శ్రేయంబున్ గలిగించు సత్కృతిని భాసింపంగ నిన్ జేసెదన్,
న్యాయంబైన సువాంఛితమ్ములిడు నిన్ యాచించుచుంటిన్, సతీ!
ఓం *శక్త్యై*
నమః ।
శా.
ధ్యేయంబొప్పఁగ రమ్ము నీవిటకు,
*శక్తి*ర్ధారణాశక్త! సు
జ్ఞేయంబౌనటు నీమహత్వగరిమన్ చిత్తంబులో నింపుమా
శ్రేయంబున్ గలిగించు సత్కృతిని భాసింపంగ నిన్ జేసెదన్,
న్యాయంబైన సువాంఛితమ్ములిడు నిన్ యాచించుచుంటిన్, సతీ!
ఓం *ధారణశక్త*యే నమః ।
కం. *శక్తిర్ధారణశక్తీ*!
భక్తిగ నిము కొలుతునమ్మ, వర ధారణ, స
ద్యుక్తిని,కొలుపుము విలస
న్ముక్తికి మార్గంబు చూపి ప్రోవుము తల్లీ!
శా.
ధ్యేయంబొప్పఁగ రమ్ము నీవిటకు,
శక్తి*ర్ధారణాశక్త*! సు
జ్ఞేయంబౌనటు నీమహత్వగరిమన్ చిత్తంబులో నింపుమా
శ్రేయంబున్ గలిగించు సత్కృతిని భాసింపంగ నిన్ జేసెదన్,
న్యాయంబైన సువాంఛితమ్ములిడు నిన్ యాచించుచుంటిన్, సతీ!
706. ఓం *చిదచిచ్ఛక్తియోగిన్యై* నమః ।
నామ
వివరణ.
జ్ఞానము
మరియు అజ్ఞానముతో కూడిన యోగ నిపుణురాలు అమ్మ.
తే.గీ. ప్రాణ రూపాన నన్ నిల్పు ప్రణవ రూప
కన్నులకు
నీవు కన్బడు
జ్ఞానతేజ
మ!
*చిదచిచ్ఛక్తి యోగినీ*! మాన్య చరిత!
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
వక్త్రారుణా మహామాయా మరీచిర్మదమర్దినీ ।
విరాట్ స్వాహా స్వధా శుద్ధా నీరూపాస్తిస్సుభక్తిగా ॥ 99 ॥
707. ఓం
*వక్త్రారుణ*యే
నమః
నామ
వివరణ.
ఎర్రని
ముఖముతో ప్రకాశించు తల్లి.
కం. ఓ
*వక్త్రారుణ*! నాకృతి
నీ
వక్త్రారుణ ఛవిఁ గొని, నిత్యము వెలుగన్
నీవే
చేయుము సురుచిర
భావామృతమును
గొలుపుచు, పద్మదళాక్షీ!
ఓం *వక్త్రా*యై నమః ।
తే.గీ.
మహిత *వక్త్రా*! మహోదార! మానక నిను
భక్తి యుక్తుఁడ నై గొల్తు, శక్తి నిమ్ము
నిన్ను సేవించ నాకబ్బు మన్నన భువి,
ముక్తి సాధ్యంబు నాకగున్, శక్తి యొదవ.
ఓం *అరుణా*యై నమః ।
తే.గీ.
కనుము నను *నరుణా*! నీవు గౌరవమును
కలుగఁ జేసెడి మార్గాన కదలఁ జేసి
ముక్తి పొందు విధంబుగా ముందు నడుపు.
వందనంబులు చేసెద నందుకొనుము.
708. ఓం *మహామాయా*యై నమః.
నామ
వివరణ.
గొప్ప
మాయా స్వరూపిణి అమ్మ.
తే.గీ.
శ్రీ
*మహామాయ*! బ్రహ్మమున్ జేరఁ జేసి,
పుణ్యమును
గట్టుకొమ్ము సోముఁడవ సాక్షి
గాను
నేఁ గొల్తు నిన్నుసుజ్ఞానము గొన
వందనంబులు
చేసెద నందుకొనుము.
709. ఓం *మరీచయే* నమః ।
నామ
వివరణ.
అమ్మ
కిరణము.
కం.
వరగుణ *మరీచి*! మహితా!
పరమార్థము
తెలియఁ జేసి వరలగఁ జేయన్
నిరుపమ
నినుఁ గొలిచెద నే
నరయఁ
దెలుపుమమ్మ నాకు నద్భుత రీతిన్.
710. ఓం *మదమర్దిన్యై* నమః ।
నామ
వివరణ.
మదాంధకారమును
రూపుమాపు జనని మన అమ్మ.
కం. *మదమర్దినీ*! జయావహ!
మదమణచి
ననున్నడుపుము మహనీయముగా,
వదలవు
బంధము లకటా
ముదమున
కాపాడుమమ్మ! పూజింతు నినున్.
711.ఓం *విరాజే* నమః ।
నామ
వివరణ.
సర్వోన్నతమయిన
విరాట్ స్వరూపిణి అమ్మ.
తే.గీ. ఓ *విరాట్*! నను నీ గృపనొప్పి
కనుమ
నీ
విరాట్ప్రభ నా మదిన్ నిండనిమ్మ,
ముక్తి
సుకరంబు చేయుమా పుణ్యముండు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
712. ఓం *స్వాహా*యై నమః ।
నామ
వివరణ.
స్వాహాదేవి
అమ్మయే.
కం. *స్వాహా*! నీ శుభ నామమె
మోహంబును
బాపి మాకు ముక్తి నొసగునే,
దేహంబునఁ
గల యగ్నికి
స్వాహా
తోడుండుమమ్మ భక్తిగఁ గొలుతున్.
713. ఓం *స్వధా*యై నమః ।
నామ
వివరణ.
స్వధా
అమ్మయే.
పంచచామరము.
*స్వధా*! ముదావహంబు నీ ప్రశాంత
శుభ్ర తేజమున్
నిదానమొప్పఁగాఁ
గనన్, గణించుమమ్మ, నన్ మదిన్,
విధేయతన్
బ్రసిద్ధిగా కవిత్వమందుఁ గొల్చెదన్,
సుధా
కవిత్వ ధారలన్ బ్రశోభిలన్ రచింపనీ.
714. ఓం *శుద్ధా*యై నమః ।
నామ
వివరణ.
పరమపవిత్రమయినది
అమ్మయే.
తే.గీ.
మహిత
*శుద్ధా*! మహచ్ఛుచిన్ మదిని గొలిపి,
యాత్మశుద్ధితో
యారాధనమ్ము చేయ
నిమ్ము
నిన్నింక నమ్మితినమ్మ! గనుమ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
715. ఓం *నీరూపాస్త*యే నమః ।
నామ
వివరణ.
రూపరహితముగా
ఉండు తల్లి అమ్మయే.
తే.గీ.
అమల
వయిన *నీరూపాస్థ*! యజ్ఞమంద
శుచిని
యొప్పుచునుంటివి, చూడుమమ్మ!
నిరత
యజ్ఞంబు మదిలోన నెరపఁజేసి,
శుచిగ
నామది నుండనీ శుభ్రతేజ!
716. ఓం *సుభక్తిగా*యై నమః ।
నామ
వివరణ.
మంచి
భక్తియుక్తులనిన ప్రీతి కల జనని.
తే.గీ.
వర
*సుభక్తిగా*! నా భక్తి
వరలఁ జేసి
నిన్నుఁ
గొలవగనిమ్మమ్మ, సన్నుతముగ,
సన్నుతించెడి
నిన్ను నే సంస్తుతింతు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
నిరూపితాద్వయీవిద్యా నిత్యానిత్యస్వరూపిణీ ।
వైరాజమార్గసంచారా సర్వసత్పథదర్శినీ ॥ 100 ॥
717. ఓం
*నిరూపితాద్వయీవిద్యా*యై
నమః.
నామ
వివరణ.
జ్ఞానాజ్ఞానవిద్యలకు
నిరూపితమయిన తల్లి
తే.గీ.
ద్వయము
నద్వయము నెఱుగన్ దల్లిరో! *ని
రూపితాద్వయీవిద్య*! నే రూఢిగాను,
నిన్ను
ధ్యానించుటొక్కటే నేర్పితీవు,
కన్న
తల్లివి కరుణించి కనుము నన్ను.
కం. పరమాత్మను మదిని గనుట
కిరవగుము *నిరూపితా ద్వయీవిద్యా*! నీ
కిరణంబులె మది నిలిచిన
కొరతయె యుండదుకదమ్మ కోమలమూర్తీ!
ఓం *నిరూపితాద్వయ్యై*
నమః ।
కం. భాసిలు జ్ఞానాజ్ఞాన ను
తా!
సత్య సుగుణ! *నిరూపితాద్వయి*! నీపై
ధ్యాసను మది నిలుపుచు నే
నాసగఁ గను కోర్కెనిమ్ము, ననుఁ గృపఁ గనుచున్.
ఓం *విద్యా*యై నమః.
కం. *విద్యా*! విద్యారూపా!
సద్యోగము గొలుపు విద్య సదయనొసఁగుమా,
విద్యాహీనుఁడనమ్మా!
బాధ్యత నీదమ్మ నన్ను వరలింపనిలన్.
718. ఓం *నిత్యానిత్యస్వరూపిణ్యై* నమః ॥
నామ
వివరణ.
నిత్యము
అనిత్యము స్వరూపముగా కలది.
కం. సత్యము
కాంచఁగ లేనిది
నిత్యమగును,
కనఁబడున దనిత్యము, నీవే
నిత్యానిత్యములిద్ధర,
*నిత్యానిత్య స్వరూపిణీ*! నినుఁ గొలుతున్.
719. ఓం *వైరాజమార్గసఞ్చారా*యై నమః ।
నామ
వివరణ.
వైరాగ్యమార్గమున
సంచరించు జనని మన అమ్మ.
కం. తరియింపఁ
జాల భవమును
శర
ణో *వైరాజమార్గ సంచారా*! నన్
గరుణను
గావగ నిదియే
తరుణము,
కాపాడుమమ్మ ధన్యుఁడ నగుదున్.
720. ఓం
*సర్వ
సత్పథ దర్శిన్యై* నమః.
నామ
వివరణ.
సమస్త
సన్మార్గదర్శిని అమ్మ.
తే.గీ.
*సర్వ
సత్పథదర్శినీ*!
పర్వమదియె
నిన్ను
దర్శించు వేళయే, నిజము తల్లి!
సత్
పథంబున నన్నుంచి జయము గొలుపు,
వందనంబులు
చేసెదనందుకొనుము.
ఓం *సర్వసత్పథవాసిన్యై*
నమః ।
తే.గీ.
*సర్వ సత్పథవాసినీ*! పర్వమదియె
నిన్ను దర్శించు వేళయే, నిజము తల్లి!
సత్ పథంబున నన్నుంచి జయము గొలుపు,
వందనంబులు చేసెదనందుకొనుము.
శ్లో.
జాలంధరీ మృడానీ చ భవానీ భవభంజనీ ।
త్రైకాలికజ్ఞానతంతుస్త్రికాలజ్ఞానదాయినీ ॥ 101 ॥
721. ఓం *జాలన్ధర్యై*నమః.
నామ
వివరణ.
భ్రాంతికొలుపుజాలమును
ధరించియున్న జనని.
తే.గీ.
కనుమ
*జాలన్ధరీ*! నన్నుఁ గరుణతోడ,
నన్నుఁ
గాపాడి నీపైన
మిన్ననయిన
కావ్యమును
వ్రాయఁ జేయుమా కన్నతల్లి,
వందనంబులు
చేసెద నందుకొనుము.
722. ఓం *మృడాన్యై* నమః ।
నామ
వివరణ.
మృడుని
అర్థాంగి అమ్మ.
తే.గీ.
ఓ
*మృడానీ*! శుభానీకమొందఁ జేసి
మృడుని
గొలువఁగఁ జేయుమా మేల్తరముగ,
మీదు
కృపకేను ముగ్ధుఁడన్, మృదుల సరళ
పదములొప్పగఁ
గవితనే వ్రాయ నిమ్ము.
723. ఓం *భవాన్యై నమః ।
నామ
వివరణ.
భ్వుని
యిల్లాలు మన అమ్మ.
తే.గీ.
ఓ
భవానీ*! భవాధీన! యో మదంబ!
నిన్నుఁ
బ్రార్థించి నిలిచినన్ నిరుపమాన
వాక్సుధారస
ధారలన్ వరలఁ జేసి,
నన్ను
కాపాడుచుందు వాపన్న రక్ష!
724. ఓం *భవభఞ్జన్యై* నమః ।
నామ
వివరణ.
భవబంధములను
భంజింపఁజేయు తల్లిమన అమ్మ.
ఉ. ఓ
*భవ
భఞ్జనీ*! కృతుల నొప్పుగ నీపయి వ్రాయఁజేసి నా
కీ
భవ బంధముల్ తుడిచి, హృద్యముగా వరలంగఁ జేయుమా,
శోభన
రూపవీవుగ, వసుంధర శోభలరూపమౌనటుల్
శ్రీభరితంబుగా,
సతము చేయుచు మమ్ములఁ గావుమమ్మరో!
725. ఓం
*త్రికాలిక జ్ఞాన
తన్తవే* నమః.
నామ
వివరణ.
మూడు
కాలములకు సంబంధించిన జ్ఞానమునొసగు జనని.
తే.గీ.
ధరను
*త్రైకాలికజ్ఞాన తన్తు*! శ్రీ వ
సుంధరన్మేలుగా
నిల్పు సుజనహృదయ!
మేలు
కలిగించుమమ్మరో! కీడుఁ బాపి
వందనంబులు
చేసెదనందుకొనుము.
726. ఓం *త్రికాలజ్ఞానదాయిన్యై* నమః ।
నామ
వివరణ.
మూడు
కలములకు పూజాదికనిర్వహణ జ్ఞానమును కలిగించు తల్లి.
కం. పితృదేవార్చనమిదె
యౌ
ను
త్రిమూర్తులు శివుఁడె కద నినుఁ గలిగి యుండం
గ,
త్రిపదగ వలె శుభమిడు గ
ని
*త్రికాలజ్ఞానదాయినీ*! నినుఁ గొలుతున్.
శ్లో.
నాదాతీతా స్మృతిః ప్రజ్ఞా ధాత్రీరూపా త్రిపుష్కరా ।
పరాజితావిధానజ్ఞా విశేషితగుణాత్మికా ॥ 102 ॥
727. ఓం *నాదాతీతా*యై నమః ।
నామ
వివరణ.
శబ్దమునకందనంత
అతీతమయిన తల్లి.
కం. *నాదాతీతా*! యో(ఓం)మ్మను
నాదముగా
లోన నుండి ననుఁ గావుమిలన్,
లేదెచ్చట
స్థిమితము గన
నీదరి
లభియించునంచు నిన్నే గొలుతున్.
728. ఓం *స్మృతిప్రజ్ఞా*యై నమః I
నామ
వివరణ.
శ్రుతులలో
ఉండు స్మృతికి సంబంహించిన ప్రకృష్ట జ్ఞానము తల్లి.
మందాక్రాంత
వృత్తము.
*స్మృతి
ప్రజ్ఞా*! యతులిత గుణా! చిత్తమున్ వెల్గుమమ్మా,
స్మృతిప్రజ్ఞాభినుతముగ
నామేధనే గొల్పుమమ్మా!
స్తుతంబౌ
నీ యతులితమతిన్ జూప యత్నింపనిమ్మా,
నితాంతంబున్
నిరుపమ గతిన్ నేర్పుతో నుండనిమ్మా.
ఓం *స్మృత్యై*
నమః
మన్దాక్రాన్తవృత్తము.
*స్మృతి*! ప్రజ్ఞా! యతులిత గుణా! చిత్తమున్ వెల్గుమమ్మా,
స్మృతిప్రజ్ఞాభినుతముగ నామేధనే గొల్పుమమ్మా!
స్తుతంబౌ నీ యతులితమతిన్ జూప యత్నింపనిమ్మా,
నితాంతంబున్ నిరుపమ గతిన్ నేర్పుతో నుండనిమ్మా.
ఓం *ప్రజ్ఞా*యై నమః.
మన్దాక్రాన్తవృత్తము.
స్మృతి *ప్రజ్ఞా*! యతులిత గుణా! చిత్తమున్ వెల్గుమమ్మా,
స్మృతిప్రజ్ఞాభినుతముగ నామేధనే గొల్పుమమ్మా!
స్తుతంబౌ నీ యతులితమతిన్ జూప యత్నింపనిమ్మా,
నితాంతంబున్ నిరుపమ గతిన్ నేర్పుతో నుండనిమ్మా.
729. ఓం *ధాత్రీరూపా*యై నమః ।
నామ
వివరణ.
భూదేవీరూపముననుండు
జనని.
కం. *ధాత్రీ రూపా*! నీకున్
బుత్రుఁడ!
ననుఁ గన్నతల్లి! పుణ్యఫలమునన్
బుత్రుఁడనయితిని
నీకున్,
బుత్రోత్సాహంబు
నీకుఁ బొలయింతునుగా.
730. ఓం *త్రిపుష్కరా*యై నమః ।
నామ
వివరణ.
బ్రహ్మ,విష్ణు,మహేశ్వ, మున్నగు అన్ని త్రిపుష్కరములను చూచుకొను తల్లి.
ఉత్సాహ.
ఓ
*త్రి
పుష్కరా*! కొలిచెద నొప్పుగాను నిన్ సదా,
పుత్రుఁడను,
పవిత్ర భావ పూతుడన్, కృతార్థుడన్,
మాతృమూర్తివయిన
నీదు మాన్య దివ్య దీవనల్
ధాత్రి
నాకు వృద్ధిఁ గొలిపి దారిఁ జూపునమ్మరో.
731. ఓం *పరాజితా*యై నమః ।
నామ
వివరణ.
భక్తుల
భక్తికి ఓడిపోవు జనని మన అమ్మ.
తే.గీ.
నిన్ను
వర్ణింపనీయుమా నేర్పుతోఁ, *బ
రాజితా*!
యజిత పరా! నిరంతరంబు
జితవు
భక్తుల చేతిలో, జితవుకావు
దుష్టులకును,
నిజమిదియె, దురితదూర,
732. ఓం *విధానజ్ఞా*యై నమః ।
నామ
వివరణ.
ఏ
పని ఏ విధముగా నెరవేర్చవలెనను విధానమునెరిగిన జనని మన అమ్మ.
కం. భువిని
*విధానజ్ఞా*! నిన్
సవినయముగఁ
నే గొలిచెద సత్కృతులందున్,
గవిగ
నిట నన్ను నీవే
నివసింపగ
నిలిపితివిగ, నేర్పు నొసఁగుచున్.
ఓం *పరాజితావిధానజ్ఞా*యై నమః ।
నామ వివరణ.
భక్తుల భక్తికి ఓడిపోవు జనని మన అమ్మ. ఏ పని ఏ విధముగా నెరవేర్చవలెనను
విధానమునెరిగిన జనని మన అమ్మ.
తే.గీ.
కన పరాజితవీవేనుగా, *పరాజి
తావిధానజ్ఞ*! నిత్య సందర్శనమిడి
నన్ను సద్విధిన్ నడుపుమా, సన్నుతముగ,
వందనంబులు చేసెద నందుకొనుము.
ఓం *పరాజితాయవిధానజ్ఞా*యై నమః ।
కం. భీతిని బాపుమ శుభ సం
ధాతా కనుమా, *పరాజితాయవిధాన
జ్ఞా*! తిమిరహారి! వగుమా
దాతగ సన్ముక్తినిమ్మ, తప్పదు జననీ!
733.ఓం *విశేషితగుణాత్మికా*యై నమః
నామ
వివరణ.
ప్రత్యేకమయిన
శుభగుణములు కలిగిన జనని.
తే.గీ.
కనుచును
*విశేషిత గుణాత్మికా*!
విశేష
గుణములను
గొల్పి నీవె నన్ గొప్పగాను
పొగడఁ
బడునట్లు చేయుచు, పొంగుచుంటి
వమ్మరో
నీవు, నీ మది కమ్మనమ్మ.
శ్లో.
హిరణ్యకేశినీ హేమబ్రహ్మసూత్రవిచక్షణా ।
అసంఖ్యేయపరార్ధాంతస్వరవ్యంజనవైఖరీ ॥ 103 ॥
734. ఓం *హిరణ్యకేశిన్యై* నమః ।
నామ
వివరణ.
స్వర్ణమయ
కేశపాశములు కలతల్లి.
తే.గీ.
ఓ
*హిరణ్య
కేశిని*! మతినొప్పి యుండి,
స్వర్ణ
కేశ ప్రదీప్తిని వర్ణనమునఁ
గావ్యమున
నేను వ్రాసెదన్ గరుణ తోడ
వ్రాయ
జేయుమా బాగుగా, భవ్య మతిని.
735. ఓం *హేమ్నే* నమః ।
నామ
వివరణ.
అమ్మ
బంగారమే.
తే.గీ.
వినుమ,
*హేమ*! పోకార్పుమా! విశ్వసించి
నీదు
భక్తుల బాధలన్, నీరజాక్షి!
సంతసంబుగ
బ్రతుకనీ, యంతిమముగ
భుక్తితోపాటు
వారికి ముక్తి నిమ్ము.
736. ఓం *బ్రహ్మసూత్రవిచక్షణా*యై నమః ।
నామ
వివరణ.
బ్రహ్మసూత్రములను
గూర్చిన పూర్తి
అవగాహనము
కలిగిన జనని అమ్మ.
తే.గీ.
*బ్రహ్మసూత్ర విచక్షణా*! బ్రహ్మసూత్ర
ములను
నాకెఱిగించుమా, సులలితముగ,
శాస్త్ర
విజ్ఞానమున్ గని చక్కగాను
నిన్నె
నే గొల్చి దర్శింతు, నీదు కృపను.
ఓం *హేమ బ్రహ్మసూత్రవిచక్షణా*యై నమః ।
తే.గీ.
విశ్వసింతును నే నిన్ను వినుత *హేమ
బ్రహ్మసూత్రవిచక్షణా*! బ్రహ్మమనుచు,
బ్రహ్మ సూత్రవిచక్షణన్, భక్తిని, కమ
నీయ భావనల్ నాకు నీవీయుమమ్మ.
737. ఓం *అసంఖ్యేయపరార్ధాన్త స్వరవ్యఞ్జనవైఖర్యై* నమః ।
నామ
వివరణ. ఆసంఖ్యాకమయిన వర్ణమాలలకు, హల్లులకు,మరియు అచ్చులకు
పుట్టినిల్లు
అమ్మ.
స్వయంకల్పితవైఖరీ వృత్తము.
గణములు. న య స త త జ గ … యతి 12. ప్రాస నియమము
కలదు.
వసుధ
*నసంఖ్యేయపరార్ధాన్త-స్వరవ్యఞ్జనవైఖరీ*!
యసమ
సభాపూజ్య సుధారాశీ!యనంతాక్షర రూపిణీ!!
విషయ
పరిజ్ఞానమదేదీ దేవి! లేదమ్మ,నిజంబిదే
కసరక
నేర్పించుము నీవే, లోక కామ్యార్థము నీవెగా.
శ్లో.
మధుజిహ్వా మధుమతీ మధుమాసోదయా మధుః ।
మాధవీ చ మహాభాగా మేఘగంభీరనిస్వనా ॥ 104 ॥
738. ఓం *మధుజిహ్వా*యై నమః ।
నామ
వివరణ.
మాధుర్యమునే
కలిగించు నాలుక కలిగిన పలుకులమ్మ అమ్మ.
కం. *మధు జిహ్వా*! నీ పలుకులు
మధువులనొలికించునమ్మ,
మధురాక్షయ సం
పదలనొసంగుచు
కవితా
సుధలను
కురిపించునమ్మ శోభిలఁ జేయన్.
739. ఓం *మధుమత్యై* నమః .
నామ
వివరణ.
తీయనైన
మమనసు కలిగిన జనని అమ్మ.
తే.గీ.
*మధుమతీ*! నీవు మాలోని మధుర భావ
తేనియల్
గ్రోలి భక్తులన్ దేల్చుమమ్మ
కష్టములనుండి,
కాపాడు కన్నతల్లి,
వందనంబులు
చేసెద నందుకొనుము.
740. ఓం *మధుమాసోదయా*యై నమః ।
నామ
వివరణ.
మధుమాసారంభమే
తానయిన జనని అమ్మ.
తే.గీ.
సు
*మధుమాసోదయా*!నన్నుఁ జూడుమమ్మ,
మదిని
మధుమాసమును గొల్పి వ్యధలఁ బాపి,
నిత్యసంతోష
భాగ్యమున్ స్తుత్యముగను
గొల్పుమోయమ్మ!
భక్తిగా కొలిచెద నిను.
741. ఓం మధవే నమః ।
నామ
వివరణ.
మధుస్వభావముతో
ఒప్పు తల్లి.
కం. *మధు*! సన్మధుభావాబ్ధీ!
సుధలను
గురిపించు మధుర సూక్తుల నిధివే,
వ్యధలను
బాపుచు కవితా
సుధలను
గురిపింపుమమ్మ సుగుణోద్భాసీ!
742. ఓం *మాధవ్యై* నమః ।
నామ
వివరణ.
మాధవునికి
సంబంధించిన వనిత మన అమ్మ.
తే.గీ.
*మాధవీ*! ముక్తి సాధన మాననీక
నీవె
తోడుండి చేయించు నిరుపమముగ,
మాధవుని
కృపఁ గొల్పుమా మాకునెపుడు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
743. ఓం *మహాభాగా*యై నమః ।
నామ
వివరణ.
గొప్పభాగ్యము,
గౌరవము కీర్తి కలిగిన జనని అమ్మ.
కం. కృత
పుణ్య *మహాభాగా*!
యతులిత
సద్భాగ్యదవయి యాదుకొనుమిలన్
నుత
భక్తుల స్థితి గతులను
వెతలను
గమనించి నీవు, విధిగా జననీ!
744. ఓం *మేఘగమ్భీరనిస్వనా*యై నమః ।
నామ
వివరణ.
మేఘము
వలె గంభీరముగా ఉండి ధ్వనించు జనని.
తే.గీ.
*మేఘ
గంభీర నిస్వనా*! మేము నిన్ను
మేఘ
గంభీర మగు శబ్ద మేదురముగ
పద్యములు
పాడి నీకు నైవేద్యమునిడి
సంతసింపంగఁ
జేయుమా సన్నుతముగ.
శ్లో.
బ్రహ్మవిష్ణుమహేశాదిజ్ఞాతవ్యార్థవిశేషగా ।
నాభౌ వహ్నిశిఖాకారా లలాటే చంద్రసన్నిభా ॥ 105 ॥
745. ఓం *బ్రహ్మవిష్ణుమహేశాది జ్ఞాతవ్యార్థవిశేషగా*యై నమః ।
నామ
వివరణ.
త్రిమూర్తులకూ
తెలివ్యక్తమగు జ్ఞానము కలిగిన జనని.
స్వయంకల్పిత అర్థవిశేష వృత్తము.
గణములు….. స ర స మ త జ గ …. యతి 12….ప్రాస
నియమము
కలదు
కనగా
*బ్రహ్మ
విష్ణుమహేశాది జ్ఞాతవ్యార్థవిశేషగా*
మననీ
నిన్నిలన్ గనుచున్ శ్రీమన్మార్గంబందు సుఖంబుగా,
జననీ!
సుస్థిరంబుగ నిన్నే ధ్యాసన్ నిత్యంబు గణింపనీ,
క్షణ
మైనన్ నిరర్థక మౌనా శ్రీ కాంతా నీదరినుండగా
746. ఓం *నాభౌవహ్నిశిఖాకారా*యై నమః
నామ
వివరణ.
గర్భమున
నాభిస్థానమున అగ్నిశిఖాపూర్ణమయిన ఆకారము కలిగిన జనని.
కం. నీ
భక్తుఁడ నో జననీ!
నా
భద్రత నీవె చూడ నాకున్ భువిపై!
*నాభౌ
వహ్నిశిఖాకా
రా*!
భద్రత గొలుపుమమ్మ రమ్మా! కృపతో,
747. ఓం *లలాటేచన్ద్రసన్నిభా*యై నమః ।
నామ
వివరణ.
ఫలభాగమున
చంద్రరేఖ కలిగిన తల్లి.
కం. నిలుచుచు
నామదిలో నిఁక
కలతల
నెడఁ బాపి శుభద కావ్యాకృతివై
వెలయుము
నమ్మిక మీర, శు
భ!
*లలాటే
చంద్ర సన్నిభా*! నినుఁ గొలుతున్.
శ్లో.
భ్రూమధ్యే భాస్కరాకారా సర్వతారాకృతిర్హృది ।
కృత్తికాదిభరణ్యంతనక్షత్రేష్ట్యార్చితోదయా ॥ 106 ॥
748. ఓం *భ్రూమధ్యేభాస్కరాకారా*యై నమః ।
నామ
వివరణ.
భ్రూమధ్యమున
సూర్యుని వహించియున్న జనని.
స్వయంకల్పిత భ్రూప్రభా వృత్తము.
గణములు. మ ర ర య య యతి
9వ
అక్షరము. ప్రాస
నియమము కలదు.
*భ్రూమద్యే భాస్కరాకార* పుణ్య గణ్యాంబవీవే,
యేమా
తేజంబు నీ చెంత నిట్టులుండన్ బ్రపూజ్యా!
క్షేమంబే
నీ కృపన్ గల్గు చిత్తమందుండ నీవే.
శ్రీమాన్యా!
నిన్నుఁ బ్రార్థింతు జ్ఞేయమున్ దెల్ప నాకున్.
749. ఓం
*సర్వతారా కృతిర్హృద్యై* నమః.
నామ
వివరణ.
తన
హృదయంలో నక్షత్రాలనుకలిగిన జనని.
తే.గీ. *సర్వతారా కృతిర్హృదీ*! సదయఁ గనుమ,
చిత్త
సుమమును గైకొమ్ము, జీవితమున
ముక్తి
నందఁగఁ జేయుమా, పూజ్యపాద!
వందనంబులు
చేసెద నందుకొనుము.
750. ఓం *కృత్తికాదిభరణ్యన్తనక్షత్రేష్ట్యార్చితోదయా*యై నమః ।
నామ
వివరణ.
కృత్తిక
మొదలు భరణి వరకూ గల నక్షత్రములచే అర్ఇంపఁబడు జనని మన అమ్మ.
స్వయం కల్పిత నక్షత్ర వృత్తము.
గణములు. స జ య య
త ర యతి
11వ
అక్షరము. ప్రాస నియమము కలదు.
వినుతింతునిన్
కృపతోశాంభ వీదేవీ! నీవు కావుమా
నను
*కృత్తికాదిభరణ్యన్తనక్షత్రేష్ట్యాచితోదయా*!
ప్రణతుల్
సదా గొనుమా, నిన్ను వర్ణింతున్ గావ్యమందునన్
మననిమ్ము, నీపదముల్
పూజ్య
మానా!
సేవించుచిద్ధరన్.
శ్లో.
గ్రహవిద్యాత్మికా జ్యోతిర్జ్యోతిర్విన్మతిజీవికా ।
బ్రహ్మాండగర్భిణీ బాలా సప్తావరణదేవతా ॥ 107 ॥
751. ఓం *గ్రహవిద్యాత్మికా*యై నమః ।
నామ
వివరణ.
గ్రహపరిజ్ఞానము
పూర్తిగా కలిగిన జనని మన అమ్మ
కం. *గ్రహవిద్యాత్మిక*! కని శుభ
గ్రహసంచారమును
గొలిపి కరుణను నాచే
యిహపర
సాధకమగునటు
సహిత
లసత్ కావ్య సృష్టి జరిపించు మిలన్.
752. ఓం *జ్యోతిషే* నమః ।
నామ
వివరణ.
కాంతి
యొక్క స్వరూపము అమ్మ.
తే.గీ.
జ్యోతి!
నీ నిజ శక్తిని జూపి నీవు
ఖ్యాతిఁ
గొల్పగ నీపయి కావ్య రచన
చేయఁ
జేయుము నాచేత చిత్రగతుల,
వందనంబులు
చేసెద నందుకొనుము.
753. ఓం
*జ్యోతిర్విన్మత్యై* నమః
నామ
వివరణ.
జ్యోతిశ్శాస్త్రము
తెలిసిన తల్లి.
కం. *జ్యోతిర్విన్మతి*! నాలో
జ్యోతిగ
నీవుండి నడుప శోభిలుచుంటిన్,
ఖ్యాతియు
నీ మూలముననె
యీతనువునకబ్బుచుండె
నిందునిభాస్యా!
754. ఓం
*జీవికా*యై
నమః.
నామ
వివరణ.
జీవులకు
జీవనాధారము మన మ్మయే.
తే.గీ.
జీవికా!
నీవె జీవమై చెలఁగుచుండ
భావినెన్నుచు
చింతించు పనియె లేదు,
నీవె
నేనుగా నుండుటన్ నీవు నేనె.
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *జ్యోతిర్విదే*
నమః ।
జ్యోతిశ్శాస్త్రపరిజ్ఞానము కలిగిన జనని.
తే.గీ.
వినుత *జ్యోతిర్విదా*! మంచి ఘనత గనిన
జ్యోతిరధ్యాత్మశాస్త్రంపు ఖ్యాతి పెంచి
నిలుపు సత్యంబు నిలపైన నిత్యముగను,
వందనంబులు చేసెద నందుకొనుము.
ఓం *మతిజీవికా*యై నమః ।
నామ వివరణ.
కం. *మతి జీవికా* నినుఁ గనుచు
స్తుతి చేసెద, సంతసించి తోచుము మదిలో
నతులిత కవితా మృతముగ
మతిమంతులు మెచ్చ వ్రాయ మహనీయముగా.
755. ఓం *బ్రహ్మాణ్డగర్భిణ్యై* నమః ।
నామ
వివరణ.
బ్రహ్మాండమును
తన గర్భమున కలిగిన తల్లి మన అమ్మ.
తే.గీ.
వినుత
*బ్రహ్మాండ గర్భిణీ*! కనుము నన్ను
నీదు
గర్భస్థమై నేను నెగడు చుంటి,
కనుచు
నన్నేలి, నీలోన కలుపుకొమ్ము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
756. ఓం *బాలా*యై నమః ।
నామ
వివరణ.
భాలారూపమునౌన్న
జగద్రక్షురాలు మన అమ్మ.
కం. *బాలా*! నా గృహమందున
బాలికగా
తిరుగుమమ్మ! పరమానందం
బేలగ
మము, నా దేహమె
శ్రీలన్
గనఁజేయు గృహము, జీవించుమిటన్.
757 ఓం
*సప్తావరణ దేవతా*యై
నమః.
నామ
వివరణ.
శ్రీచక్రముననుండు
సప్తావరణలకు దేవత మన అమ్మ.
1.పృథివి,
2. అప్పు,
3, తేజము,
4. వాయువు,
5. ఆకాశము,
6, అహంకారము,
7.మహత్తత్వము
అను
సప్తావరణలకు దేవత మన అమ్మ.
తే.గీ.
తలచి
*సప్తావరణ దేవతా*! ప్రశాంతి
నీవె
కొల్పుము వెలుగుచున్ నిన్నె కొలుతు,
శాంతి
సౌభాగ్యములనిచ్చు చక్కనమ్మ!
వందనంబులన్
జేసెదనందుకొనుము
ఓం *సప్తావరణదేశా*యై నమః ।
తే.గీ
వినుత *సప్తావరణ దేశ*! విశ్వశాంతి
నీవె కొల్పుము వెలుగుచున్ నీవె యిచట,
శాంతి సౌభాగ్యములనిచ్చు చక్కనమ్మ!
వందనంబులన్ జేసెదనందుకొనుము
శ్లో.
వైరాజోత్తమసామ్రాజ్యా కుమారకుశలోదయా ।
బగళా భ్రమరాంబా చ శివదూతీ శివాత్మికా ॥ 108 ॥
758. ఓం *వైరాజ్యోత్తమసామ్రాజ్యా*యై నమః ।
నామ
వివరణ.
సృష్టి
మొత్తమును పాలించు ఏకైక ఉత్తమ సామ్రాజ్ఞి అమ్మ.
కం. శ్రీ
రాజిత పదపంకజ!
నీ
రమ్య గుణాదికంబు నే వ్రాయుదిటన్,
*వైరాజ్యోత్తమ సమ్రా
జ్యా*! రాజిల్లంగఁ జేసి
చక్కగఁ గనుమా.
759. ఓం *కుమారకుశలోదయా*యై నమః.
నామ
వివరణ. తన కుమారుడయిన కుమారస్వామి కౌశల్యానికి కారణమయిన తల్లి.
తే.గీ.
అనుపమ
*కుమారకుశలోదయా*! నుతింతు
నిన్ను
సద్భక్తితో, నీవె నన్నుఁ గనుమ,
ముక్తి
సామ్రజ్య మొసగుమా పుణ్యఫలద!
వందనంబులు
చేసెద నందుకనుము.
760. ఓం *బగలా*యై నమః ।
నామ
వివరణ.
కొలవలేని
లోకము సృష్టించిన బగలామాత మన అమ్మ.
తే.గీ.
అంతు
లేనట్టి సృష్టి వీ వరయ *బగల*!
సాంత
మీ జన్మ నీదమ్మ, సదయఁ గనుమ,
భ్రాంతులన్
బాపి సత్యంబు భక్తితోడ
నేను
గనునట్లు చేయుమా నీరజాక్షి!
761. ఓం *భ్రమరామ్బా*యై నమః ।
నామ
వివరణ.
భ్రమరాంబ
మన అమ్మయే.
తే.గీ.
పుణ్య
గుణ ధామ! *భ్రమరామ్బ*! పూజ్య పాద!
చిత్తవిభ్రాంతులన్
బాపి జీవితంపు
పరమ
సత్ఫల సాధనన్ బరగఁ జేసి
నన్నుఁ
గాపాడుమోయమ్మ! సన్నుతముగ.
762. ఓం *శివదూత్యై* నమః ।
నామ
వివరణ.
శివుడిని
తన దూతిగా కలిగిన జనని.
కం. *శివదూతీ*! నా మదిలో
శివునిన్
విహరింపఁ జేసి శివకరముగ నా
భవబంధంబులనుడుపుము
కవితామృతమును
గొలుపుచు, గౌరవమొప్పన్.
763. ఓం *శివాత్మికా*యై నమః ।
నామ
వివరణ.
శివునియొక్క
ఆత్మ అమ్మయే.
తే.గీ.
కనికరించు
*శివాత్మికా*! కాదనకుమ!
మనములో
నుండి లోనున్న మలినములను
వీడగాఁ
జేసి నిలుము నా తోడుగాను,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
మేరువింధ్యాదిసంస్థానా కాశ్మీరపురవాసినీ ।
యోగనిద్రా మహానిద్రా వినిద్రా రాక్షసాశ్రితా ॥ 109 ॥
764. ఓం *మేరువిన్ధ్యాదిసంస్థానా*యై నమః ।
నామ
వివరణ.
మేరువు,
వింధ్య వంటి పర్వతములలోనివాసము కలిగి ఉండు జనని.
తే.గీ.
*మేరు
విన్ధ్యాది సంస్థాన*! కోరెద నిను
నాదు
మది నుండి చల్లగా నన్ను గనుమ,
మేరు
వి న్ధ్యాతి సంస్థాన ధీరవమ్మ,
వందనంబులు
జేసెద నందుకొనుము.
765. ఓం *కాశ్మీరపురవాసిన్యై* నమః ।
నామ
వివరణ.
కాశ్మీరపురమున
వాసమున్న తల్లి.
తే.గీ.
నిఖిల!
*కాశ్మీర పుర
వాసినీ*! మదంబ!
సకల
సౌభాగ్య దాయినీ! సతతము మది
నీవు
కొలువుండితీరుమా నీరజాక్షి,
వందనంబులు
చేసెద నందుకొనుము.
766. ఓం *యోగనిద్రా*యై నమః ।
నామ
వివరణ.
యోగనిద్రలో
ఉండు జనని.
తే.గీ.
*యోగనిద్రా*! చిదానంద యోగమునిఁక
నాకుఁ
గలిగింపుమమ్మరో! నయ నిధాన!
పరగు
మాత్మను గణియింప ప్రస్ఫుటముగ,
వందనంబులఁ
జేసెద నందుకొనుము.
767. ఓం *మహానిద్రా*యై నమః ।
నామ
వివరణ.
మహానిద్రాస్వరూపిణి
అమ్మ.
తే.గీ.
నుత
*మహానిద్ర*! నిన్ను సన్నుతులఁ దేల్తు,
యోగ
నిద్రలో నను ముంచి యుంచుమమ్మ,
భోగభాగ్యంబులేలను?
యోగమీవె,
వందనంబులు
చేసెద నందుకొనుము.
768. ఓం *వినిద్రా*యై నమః ।
నామ
వివరణ.
విశేషముగా
మిక్కిలిగా నిద్రించు జనని అమ్మ
తే.గీ.
నుత
*వినిద్రా*!మహాదేవి! క్షితిని
నీవె
చూచి
కాపాడవలయును, శోభ గొల్పి,
నిదురపోయెడి
భక్తులన్ నీవె లేపి
భక్తి
చైతన్యమందించు ముక్తిదవయి.
769. ఓం *రాక్షసాశ్రితా*యై నమః ॥ ౭౬౦ ॥
నామ
వివరణ.
రాక్షసులచే
ఆశ్రయింపబడు జనని.
తే.గీ. *రాక్షసాశ్రితా*!
మదిలోని
రాక్షసమును
బాపి
నాలోన సద్బుద్ధి వరలఁ గొలిపి
రక్షణము
గొల్పి కావుమా! ప్రాణమగుచు.
వందనంబులు
జేసెద నందుకొనుము.
శ్లో.
సువర్ణదా మహాగంగా పంచాఖ్యా పంచసంహతిః ।
సుప్రజాతా సువీరా చ సుపోషా సుపతిశ్శివా ॥ 110 ॥
770. ఓం సువర్ణదాయై నమః ।
నామ
వివరణ.
సువర్ణమును
దయచేయు తల్లి.
పంచచామరము.
*సువర్ణదా*! భవత్ కృపన్, వసుంధరన్
గణింతు నిన్
బ్రవృద్ధినొంది
వెల్గెదన్, నిరంతరంబుఁ గొల్చెదన్,
సువర్ణదివ్య
భాగ్యమొంది సుందర ప్రభాసమౌ
భవత్
ప్రసిద్ధి వ్రాయనుంటి భవ్య కావ్యమీవెగా.
771. ఓం *మహాగఙ్గా*యై నమః ।
నామ
వివరణ.
గొప్ప
గంగా స్వరూపము అమ్మ.
కం. కరుణించు
*మహాగఙ్గా*!
తరణోపాయంబు
నీవ, తప్పక నీవే
స్మరహరుని
చూడఁ జేయుమ!
మరిమరి
నిను గొలుతునమ్మ! మంగళ మూర్తీ!
772. ఓం
*పఞ్చాఖ్యాయై* నమః.
నామ
వివరణ.
పంచభూతాఖ్య
మన అమ్మ.
కం. *పఞ్చాఖ్యా*! నీవే నా
సఞ్చిత
దుష్ఫలములుడిపి, చక్కగఁ గనుమా,
వఞ్చితునగుచుంటిని
స్పం
దిఞ్చుము,
కృపఁ గనుము నన్ను, దీన శరణ్యా!
773. ఓం *పఞ్చసంహత్యై* నమః ।
నామ
వివరణ.
పంచ
మూలక సమాహారము అమ్మ.
తే.గీ.
*పఞ్చసంహతీ*! చేతి నందిఞ్చుమమ్మ,
పఞ్చ
సంఖ్యాక ప్రాణమ్ములెఞ్చ నీవె,
సఞ్చితమ్ములన్
భాపుమా జయనిధాన!
వందనంబులు
జేసెద నందుకొనుము.
774. ఓం *సుప్రజాతా*యై నమః ।
నామ
వివరణ.
గొప్ప
కుటుంబములో జన్మించిన తల్లి.
తే.గీ.
*సుప్రజాత*! మహాదేవి! చూడు
కృపను,
సుప్రతిష్ఠనే
బాపుచు నప్రతిష్ఠఁ
గొలుపు
దుశ్చర్యలన్ బాపి నిలుపు నన్ను,
వందనంబులు
చేసెద నందుకొనుము.
775. ఓం *సువీరా*యై నమః ।
నామ
వివరణ.
గొప్ప
పరాక్రమము కలిగిన తల్లి అమ్మ.
తే.గీ.
కను
*సువీరా*! కృపన్ నన్నుఁ, గావుమమ్మ,,
వినఁగఁ
జేయుము నీ వృత్తమును మదంబ!
ప్రాణమే
నీవుగాఁ గల్గి పరగువాఁడ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
776. ఓం *సుపోషా*యై నమః ।
నామ
వివరణ.
మంచిని
గొప్పగా పోషించు తల్లి అమ అమ్మ.
తే.గీ.
వర!
*సుపోషా*! కృపాంభోధి! ప్రార్థనలను
వినుము,
సత్ కృపతో నన్ను గనుము తల్లి!
నిన్నె
నమ్మితి నమ్మరో నీలవేణి!
వందనంబులు
చేసెద నందుకొనుము.
777. ఓం *సుపత*యే నమః ।
నామ
వివరణ.
మంచి
భర్తను కలిగిన దేవత మన అమ్మ.
కం. *సుపతీ*! నీ సంస్మరణమె
యపమార్గములుడుఁగఁజేయునమ్మా!
నీతో
నుపమింపసాటి
లేరుగ,
సుపవిత్రముగా
రహింపఁ జూడుము జననీ!
ఓం *శివా*యై నమః.
నామ
వివరణ.
శుభములకు
ఆకరమయిన జనని మన అమ్మ.
తే.గీ.
వర
*శివా*! నాదు మదిలోన వరలుమమ్మ!
పరమ
సత్కార్య సంసిద్ధి వరలనిమ్మ,
ధరణి
వరభాగ్య దాయిగాఁ బరగ నిమ్మ,
వందనంబులు
చేసెద నందు కొమ్మ.
శ్లో.
సుగృహా రక్తబీజాంతా హతకందర్పజీవికా ।
సముద్రవ్యోమమధ్యస్థా సమబిందుసమాశ్రయా ॥ 111 ॥
778. ఓం *సుగృహా*యై నమః .
నామ
వివరణ.
దుఃఖము
లేని మంచి గృహము కలిగిన జనని.
తే.గీ.
*సుగృహ*! నివసించు నా మది
నగణితముగ,
నాదు
దేహంబె నీ యిల్లు, మోదమలర
శాశ్వతంబుగ
నీవిటన్ సదయనుండి
ప్రేరణంబును
గలిగించు విశ్వ జనని!
779. ఓం *రక్తబీజాన్తా*యై నమః ।
నామ
వివరణ.
రక్తబీజుని
అంతము చేసిన జనని.
తే.గీ.
*రక్త
బీజాన్త*! నీవు సద్ భక్తిఁగొలుప
నిపుణవందురు
పెద్దలు నిజము చేయ
యుక్తి
చూపుచు నాలోన భక్తిఁ గొలుపు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
780. ఓం *హతకన్దర్పజీవికా*యై నమః ।
నామ
వివరణ.
తనకారణముగా
హతమయిన కందర్పుని జీవితము కలది అమ్మ.
తే.గీ.
సు
*హత
కన్దర్ప జీవికా*! శుభదవగుచు
నాదు
మదిలోననుండి నన్నాదుకొనుము,
విషయ
వాంఛల నెడఁ బాపి విశ్వతేజ
నిన్నుఁ
జూడఁగఁ జేయుమా సన్నుతముగ.
781. ఓం *సముద్రవ్యోమమధ్యస్థా*యై నమః ।
నామ
వివరణ.
సముద్రాకాశముల
మధ్యనుండు జనని.
స్వయం కల్పిత వ్యోమమధ్యస్థ వృత్తము.
గణములు. య ర మ య
…..యతి… 8వ
అక్షరము.
ప్రాస
నియమము
కలదు.
*సముద్ర
వ్యోమ మధ్యస్థా*! నిన్ స్మరింతున్,!
రమాదేవీ!
మదంబా! రక్షించుమమ్మా!
ప్రమాణంబీవె
నాకున్, రాణింపనిమ్మా,
సమస్తంబున్
సృజింపన్ శక్తిప్రదాత్రీ!
782. ఓం *సమబిన్దుసమాశ్రయా*యై నమః ।
నామ
వివరణ.
శ్రీచక్రబిందువున్
నివసించు జనని.
తే.గీ.
శుభద
శ్రీచక్ర రూపిణీ! సుఫలద! మహి
త
*సమబిందు సమాశ్రయా*!
తప్పదమ్మ
నన్ను
కాచుట నీకింక నిరుపమాన.
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *వ్యోమబిన్దుసమాశ్రయా*యై నమః ।
తే.గీ.
*వ్యోమ
బిన్దు సమాశ్రయా* పూర్ణతేజ!
జ్ఞానమై
లోనఁ గలుగు నస్కలితపు విను
త
దహరాకాశ బిందువున్ దయనునిండి
నన్ను
రక్షించుచుండుమా మిన్నగాను.
శ్లో.
సౌభాగ్యరసజీవాతుస్సారాసారవివేకదృక్ ।
త్రివల్యాదిసుపుష్టాంగా భారతీ భరతాశ్రితా ॥ 112 ॥
783 ఓం *సౌభాగ్యరసజీవాతవే* నమః ।
నామ
వివరణ.
అమ్మ
వివిధ రకాల సంపద.
స్వయం కల్పిత సౌభాగ్యద వృత్తము.
గణములు…త
స ర జ జ గ. ఉఅతి..
9వ
అక్షరము.
*సౌభాగ్య రస
జీవాతు*! సంస్తుతుల్ శుభకారిణీ!
నా
భాగ్యమయి నాలోన నవ్వుచున్ విలసిల్లుమా,
శోభావహవు,నాలోని శోభనీవని యెంచెదన్,
నా
భావమున నీవుండి, నాకు తోడుగ నుండుమా.
784. ఓం *సారాసారవివేకదృశే* నమః ।
నామ
వివరణ. సారము అసారము తెలిసిన దృష్టి కలిగిన్ జనని.
కం. *సారాసార వివేక
దృ
శా*!
రససంపూర్ణభాగ్యశాలినివమ్మా!
సారాసార
వివేకము
కోరెదఁ
గలిగింపుమమ్మ! కువలయ వదనా!
785. ఓం *త్రివల్యాదిసుపుష్టాఙ్గా*యై నమః ।
నామ
వివరణ.
నడుము
భాగమున మూడు ముడుతలతో సౌష్టవముతో కూడిన అంగ సౌభాగము కలిగిన
తల్లి.
కం. శ్రీదవు
కృపఁ జూపి *త్రివ
ల్యా ది
సుపుష్టాఙ్గ*!
జనని! హాయిగఁ గనుమా.
లేదిల
నీకిఁకసాటియె,
మోదంబున
గాంచుమమ్మ పూర్ణోద్భాసా!
786. ఓం *భారత్యై* నమః ।
నామ
వివరణ.
ప్రకాశ్ప్రదమయిన
విద్యాస్వరూపిణి యగు భారతి మన అమ్మ.
తే.గీ.
*భారతీ*! మాత వీవమ్మ! చేరవచ్చి
నాదు
హృత్ పీఠవాసివై మోదమలర
జ్ఞాన
సామ్యాజ్యభాతిని గనగఁ జేసి,
ముక్తిమార్గంబు
సుగతిని పొందనిమ్ము.
787. ఓం *భరతాశ్రితా*యై నమః ।
నామ
వివరణ.
భరతునిచేం
ప్రకాశముచే ఆశ్రయించబడిన జనని.
తే.గీ.
వినుత
*భరతాశ్రితా*! నేను వినయమొప్ప
వినుతిఁ
జేసెద నమ్మరో! వినుము జనని!
భరత
మాతను కాపాడు భార మీవె
మోయవలెనమ్మ
తప్పదు శ్రేయమిడగ.
శ్లో.
నాదబ్రహ్మమయీవిద్యా జ్ఞానబ్రహ్మమయీపరా ।
బ్రహ్మనాడీ నిరుక్తిశ్చ బ్రహ్మకైవల్యసాధనమ్ ॥ 113 ॥
788. ఓం *నాదబ్రహ్మమయీవిద్యా*యై నమః .
నామ
వివరణ.
అంతటా
వ్యాపించిన నాదబ్రహ్మస్వరూపిణి అమ్మ.
కం. *నాదబ్రహ్మమయీ వి
ద్యా*! దయతోఁ జూడుమమ్మ! యనుపమ తేజా!
నాదబ్రహ్మమె
మనమున
ఖేదములన్
దుడిచివేయు, కీర్తిని కొలుపున్.
789. ఓం *జ్ఞానబ్రహ్మమయీపరా*యై నమః ।
నామ
వివరణ.
జ్ఞానపూర్ణ
బ్రహ్మము అయిన
పరాశక్తి అమ్మ.
కం. *జ్ఞానబ్రహ్మమయీపర*!
ప్రాణంబుగ
నున్న నీవె బ్రహ్మాండముగా
జ్ఞానబ్రహ్మము
చూపుము
నీ,
నా భేదంబు కనని నిరుపమ తేజా!
790. ఓం
*బ్రహ్మనాడ్యై*నమః.
నామ
వివరణ.
శుషుమ్నాడిలో
అమృతరూపమున ఉండు జనని అమ్మ.
తే.గీ.
*బ్రహ్మనాడి*!
నిరుక్త!
నిన్ భజన చేసి,
బ్రహ్మ
జిజ్ఞాసతో గాంచి బ్రహ్మమునిల
ముక్తి
పొందుట తగునమ్మ పొలుపు మీర
వందనంబులు
చేసెద నందుకొనుము.
791. ఓం
*నిరుక్త్యై*యై
నమః.
నామ
వివరణ.
చెప్పుటకు
అలవికాని తల్లి మన అమ్మ.
తే.గీ.
బ్రహ్మనాడి!
*నిరుక్త*! నిన్ భజన చేసి,
బ్రహ్మ
జిజ్ఞాసతో గాంచి బ్రహ్మమునిల
ముక్తి
పొందుట తగునమ్మ పొలుపు మీర
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *బ్రహ్మనాడినిరుక్తా*యై నమః ।
తే.గీ.
*బ్రహ్మనాడి నిరుక్త*! నిన్ భజన చేసి,
బ్రహ్మ జిజ్ఞాసతో గాంచి బ్రహ్మమునిల
ముక్తి పొందుట తగునమ్మ పొలుపు మీర
వందనంబులు చేసెద నందుకొనుము.
792. ఓం *బ్రహ్మకైవల్యసాధనా*యై నమః ।
నామ
వివరణ.
బ్రహ్మకైవమ్యసాధనమార్గము
మన అమ్మ.
తే.గీ.
*బ్రహ్మకైవల్య సాధనా*! పరగుమమ్మ
నీవు
నాదగు యెదలోన నిత్య మిలను,
భుక్తితోపాటుగా
నాకు ముక్తినిమ్ము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
కాలికేయమహోదారవీర్యవిక్రమరూపిణీ ।
వ(బ)డవా(బా)గ్నిశిఖావక్త్రా మహాకవ(బ)లతర్పణా ॥ 114 ॥
793 ఓం
*కాలికేయ మహోదార
వీర విక్రమ
రూపిణ్యై* నమః
నామ
వివరణ.
కాళికేయ
అను సర్పముయొక్క గొప్ప బలమునకు కారణమయిన తల్లి మన అమ్మ.
స్వయంకల్పిత వీర విక్రమ వృత్తము.
స జ య జ భ ర. యతి11వ అక్షరము. ప్రాస నియమము కలదు.
*విను
కాలికేయమహోదార వీరవిక్రమరూపిణీ*!
ఘనమైన
నీ కృపనే
చెప్పఁగా
తలంతును చెప్పనీ,
క్షణమైన
నీ దయనే పొందగా మదిన్ గనుచుండెదన్,
మననిమ్ము,
నీకృపచే ప్రాణమౌ ననున్ గననిమ్మిలన్.
794. ఓం *వ(బ)డవా(బా)గ్నిశిఖావక్త్రా*యై నమః ।
నామ
వివరణ.
బడబాగ్నిని
తన ముఖశిఖలయమధ్య కలిగియున్న తల్లి.
తే.గీ.
దురితు
లను మాప నీవహో దుస్తరమగు
నుగ్రబడబాగ్నిముఖముతో
నొప్పితివిగ,
కలతఁ
బాపి సుజనులను తలచి కనుమిఁ
క
*వడ(బ)వా(బా)గ్ని
శిఖావక్త్ర*! కరుణతోడ,
795. ఓం *మహాకవ(బ)లతర్పణా*యై నమః ।
నామ
వివరణ.
ప్రళయకాలమున
అన్నిటినీ మ్రింగి తృప్తి చెందు జనని.
కం. మహిమాన్వితవీవౌదువు
*మహాక
వ(బ)లత
ర్పణా*! సమంచితరీతిన్
స్పృహఁ
గొల్పి నిన్నుఁ గొలువఁగ
నిహమున్
బరమబ్బునుగ యహీన నయాఢ్యా!.
శ్లో.
మహాభూతా మహాదర్పా మహాసారా మహాక్రతుః ।
పంచభూతమహాగ్రాసా పంచభూతాధిదేవతా ॥ 115 ॥
796. ఓం *మహాభూతా*యై నమః ।
నామ
వివరణ.
గొప్ప
భూతస్వరూపిణి అమ్మ.
తే.గీ.
సృష్టి
వెల్గు *మహాభూత*! దృష్టిపెట్టి
నిన్నునొకపరి
తలచినన్ మన్ననమున
మాకుశుభములే
కలుగును శ్రీకరముగ,
వందనంబులు
జేసెద నందుకొనుము.
797. ఓం *మహాదర్పా*యై నమః ।
నామ
వివరణ.
మిక్కిలి
గర్వముతో నుండు జనని.
కం. కరుణించు
*మహాదర్పా*!
సరి
పోలరు నీకునెవరు జయమొసగుటలోఁ,
బరమాత్మను
గనఁజేయుము,
పరిపరి
విధములుగ నిన్ను వరలింతు కృతిన్.
798. ఓం *మహాసారా*యై నమః. !
నామ
వివరణ.
గొప్ప
సృష్టి సారము అమ్మయే.
తే.గీ.
ఓ
*మహాసార*! మాలోని క్షేమమీవె,
జీవితములోని
సారమై జీవునకును
మోక్ష
సత్ప్రాప్తినే గొల్పి రక్షణ నిడు,
తల్లివీవమ్మ,
నిన్ మదిన్ దలతునమ్మ,
799. ఓం *మహాక్రతవే* నమః .
నామ
వివరణ.
సృష్టికార్యమనెడి
గొప్ప క్రతువు అమ్మయే.
తే.గీ.
ఓ
*మహాక్రతూ*! జరిపెడి హోమమీవ,
క్రతువుగా
సాగు మాకున్న బ్రతుకు నీవ,
క్రతుఫలంబుగ
మమ్ములన్ గలుపుకొనుమ,
వందనంబులు
చేసెద నందుకొనుమ.
800. ఓం *పఞ్చభూతమహాగ్రాసా*యై నమః ।
నామ
వివరణ.
ప్రళయసమయమున
పంచభూరములను భుజించు శక్తి అమ్మ.
తే.గీ.
*పఞ్చభూతమహాగ్రాస*! ప్రళయ వేళఁ
గాంచి
మమ్ములన్ నీలోనఁ గలుపుకొమ్ము,
సంచితంబులనెడబాపి
జరుపుమిదియె,
వందనంబులు
చేసెద నందుకొనుము.
801. ఓం *పఞ్చభూతాధిదేవతా*యై నమః ।
నామ
వివరణ.
పంచ
భూతములకు అధిదేవత ఆమ్మ.
తే.గీ.
*పఞ్చ
భూతాధిదేవతా*! వరలు మదిని,
పఞ్చ
భూతముల్ సాక్షిగా వరమునిమ్ము,
నిత్యమును
నీవు నాతోడు నిలిచియుండి,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
సర్వప్రమాణా సంపత్తిస్సర్వరోగప్రతిక్రియా ।
బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తా విష్ణువక్షోవిభూషిణీ ॥ 116 ॥
802. ఓం *సర్వప్రమాణాసమ్పత్త*యే నమః ।
నామ
వివరణ.
అన్నింటికీ
ప్రమాణభూతమయిన సంపద అమ్మ.
తే.గీ.
వసుధపైనున్న
మహిత *సర్వప్రమాణ
సమ్పదా*! నినుఁ గొలిచెద, సమధికమగు
సర్వ
సంపదల్ దయనిమ్ము సజ్జనులకు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *సర్వప్రమాణా*య నమః ।
నామ వివరణ.
అన్ని విషయములలోను ప్రమాణమయిన జనని అమ్మ.
తే.గీ.
నీవె సర్వప్రమాణంబు నిరుపమాన!
కొలుతు *సర్వప్రమాణ*! నిన్ గూర్మిఁ గనుమ,
మంచిగా నీవె నాలోన మసలుమమ్మ,
నన్నె సర్వప్రమాణమంచెన్నఁజేయ.
ఓం *సమ్పత్త*యే నమః ।
నామ వివరణ.
సమస్త సంపదలూ అమ్మస్వరూపమే.
తే.గీ.
కనుమ *సంపత్తి*! ప్రజలు నన్ గౌరవించ,
నీదుగౌరవమే యది, నాది కాదు.
మంచి సంపదలన్నియు మదిని నీవె
నింపియుండుటన్ మెత్తురు నిండు మదిని.
803. ఓం *సర్వరోగప్రతిక్రియా*యై నమః ।
నామ
వివరణ.
అన్ని
రోగములకు విరుగుడు అమ్మయే.
తే.గీ.
*సర్వ
రోగప్రతిక్రియా*! గర్వభంగ!
యుర్వి
జనులను రోగమ్ము లుంచకుండె,
నమ్మరో!
కని గావుమా నమ్మకముగ,
వందనంబులు
జేసెద నందుకొనుము.
804. ఓం *బ్రహ్మాణ్డాన్తర్బహిర్వ్యాప్తా*యై నమః ।
నామ
వివరణ.
బ్రహ్మాండమంతటా
వెలుపల లోన వ్యాపింక్ష్హియుండు జనని అమ్మ.
స్వయంకల్పిత బ్రహ్మాండ వృత్తము.
గణములు,
మ ర మ ర జ గ……యతి
9వ
అక్షరము..ప్రాస కలదు
*బ్రహ్మాండాన్తర్భహిర్వ్యాప్తా*! బ్రహ్మాండమీవె సన్నుతా!
బ్రహ్మంబై
నన్ ప్రవర్ధింపన్, భావంబునందునుండుమా,
బ్రహ్మోద్భాసీ!
వరానందా, భక్తిన్ ప్రవృద్ధి చేయుమా,
బ్రాహ్మీ
మూర్తీ! ప్రభాపూర్ణా! భద్రంబు నీవె కొల్పుమా
805. ఓం *విష్ణువక్షోవిభూషిణ్యై* నమః ।
నామ
వివరణ.
విష్ణువుయొక్క
వక్షస్థలముపై అలంకారమయినది మన అమ్మ.
తే.గీ.
*విష్ణు
వక్షోవిభూషిణీ*! విమల చరిత!
నాదు
దేహమే గృహసీమ నయనిధాన!
నాదు
గృహసీమలో నీవు నవ్య సుగతి
నుండుమమ్మరో!
నామది నిండుగాను,
శ్లో.
శాంకరీ విధివక్త్రస్థా ప్రవరా వరహేతుకీ ।
హేమమాలా, శిఖామాలా త్రిశిఖా పంచలోచనా ॥ 117 ॥ [ పంచమోచనా ]
806. ఓం *శాఙ్కర్యై* నమః ।
నామ
వివరణ.
శంకరిని
పత్ని మన అమ్మ.
కం. *శాఙ్కరి*! దుర్జన లోక భ
యఙ్కరి!
నిను గొలుతునిట మహత్వముఁ గొలుపన్,
జఙ్కను
నే నినుఁ గోరగ
నఙ్కితమయి
యుంటి నే మహన్నుత చరితా!
807. ఓం *నిధివక్త్రస్థా*యై నమః ।
నామ
వివరణ.
బ్రహ్మముఖమున
గలతల్లి మ్న అమ్మ.
కం. *నిధివక్త్రస్థ*! శుభావహ!
మధురంబగు
నీదు నామ మాధుర్యమునన్
సుధయెంతనిండి
యుండెనొ?
స్వధనంబది
తలప నాకు సరస గుణాఢ్యా!
808. ఓం *ప్రవరా*యై నమః ।
నామ
వివరణ.
మిక్కిలి
ప్రవరులలో ప్రవర మన అమ్మ.
కం. *ప్రవరా*! నాపై దయతోఁ
బ్రవరునిగా
నిలుపు నన్ను, వర్ధిలఁ జేయన్,
భవబంధములను
బాపుము,
నివసింపుము
మదిని నీవు నిర్భర కృపతో.
809. ఓం *వరహేతుక్యై* నమః .
నామ
వివరణ.
అన్ని
వరములకు కారణమగు జనని,
తే.గీ.
మహిత
*వరహేతుకి*! మదంబ!
విహిత కార్య
మగ్నునై
నిన్ను గననైతి, మదిని నీవు
వేరుగా
నన్నుఁ దలపక విశ్వసించు,
మదినె
వర్ధిల్లు మోయమ్మ మహితముగను.
810. ఓం
*హేమమాలా*యై నమః ।
నామ
వివరణ.
బంగారు
హారమును ధరించిన తల్లి.
తే.గీ. *హేమమాలా*! దయా శీల! హృద్విశాల!
క్షేమమీవేను మాకిలన్, శ్రీ నిధాన!
నా మనంబునన్ నీవున్న నాకునదియె
చాలునోయమ్మ! లోటుండ దేలుదీవె.
811. ఓం *శిఖామాలా* యై నమః ।
నామ
వివరణ.
పుర్రెల్
మాలధరించిన జనని.
తే.గీ. వర *శిఖామాల*! కనకుమా భరమటంచు
నన్నుఁ గాయుట నీకు, నా కన్నతల్లి!
మన్ననముతోడ మదిలోన నిన్నె కనెద
నాకుఁ గన్పింపు మమ్మరో నయ నిధాన!
812. ఓం *త్రిశిఖా* యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
వేదత్రయ స్వరూపిణి.
కం.
వందనమో *త్రిశిఖా*! కన
మందును నిను కరుణ తోడ ననుపమ రీతిన్,
సుందరసుకుమార హృదయ
మందిరవీవమ్మ, వరలుమా మదిలోనన్.
813. ఓం *పఞ్చలోచనా* [పంచమోచనా ] యై నమః ।
నామ
వివరణ.
ఐదు
కన్నులు క్ల తల్లి.
తే.గీ. *పఞ్చలోచనా*! [పంచమోచనా ] ప్రార్థింతు, వఞ్చకులను
జీల్చి చెండాడుమా, భువిఁ జేటు వారు,
నీవె పరమార్థమెంచుచు నిత్య శుభద
మైన సత్కార్య సంపత్తి నరసి యిమ్ము.
శ్లో. సర్వాగమసదాచారమర్యాదా యాతుభంజనీ ।
పుణ్యశ్లోకప్రబంధాఢ్యా సర్వాంతర్యామిరూపిణీ ॥ 118 ॥
814. ఓం *సర్వాగమసదాచారమర్యాదా*యై నమః ।
నామ
వివరణ.
సమస్త
వేదములలో గల ఆచారములను పాటించు జనని అమ్మ.
స్వయం కల్పిత సదాచార వృత్తము.
గణములు…… స స
భ
య
య
గ ….యతి
10వ అక్షరము. ప్రాస కలదు.
జయమిమ్మిక *సర్వాగమ సదాచార మర్యాదా*!
భయమున్ విడి నిన్ గొల్చెద భవానీ! శుభాకారా!
నయమార్గము వీడన్ నిను నయోద్భాస, మాయమ్మా!
ప్రియమౌ వర ముక్తిన్ గొలిపి ప్రోవంగదా మాతా!
815. ఓం *యాతుభఞ్జన్యై* నమః ।
నామ
వివరణ.
అసుర్ల్ందరినీ
భంజించిన తల్లి మన అమ్మ.
తే.గీ. *యాతు భఞ్జనీ*! దుర్గుణ యాతు వితతి
చెలగి నాలోననుండి నన్ గలఁగఁ జేయు
చుండెనమ్మరో భఞ్జించి, నిండుమదిని
నన్ను కాపాడుమా కృపన్, మిన్నగాను.
816. ఓం *పుణ్యశ్లోకప్రబన్ధాఢ్యా*యై నమః ।
నామ
వివరణ.
పుణ్యప్రద
శుభశ్లోకాన్విత ప్రబంధములలో ఉన్న జనని.
స్వయంకల్పిత పుణ్యశ్లోకీ వృత్తము.
గణములు…
మ
ర
ర
య
య.
యతి. 9 వ అక్షరము.
ప్రాస కలదు.
*పుణ్యశ్లోకప్రబన్ధాఢ్య*! పూజలన్ బొందుమమ్మా!
గణ్యంబౌ నీ పదాబ్జాళి కాంచుటెట్లోగదమ్మా,
పుణ్యంబుండున్ సదా నిన్నుఁ బూజలన్ గొల్వనీ, ప్రా
మాణ్యంబీవే కదా,
గాంచుమా ననున్, కన్నదీవే.
817. ఓం *సర్వాన్తర్యామిరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
సర్వజీవులయందు
అంతరముగా ఉండు జనని.
కం.
పరనిడు *సర్వాన్తర్యా
మిరూపిణీ*! నిన్నుఁ గొలుతు, మృదువచన గతిన్
నిరుపమ రీతిని గొలుపుము,
నిరతము నాలోననుండి నిండుమనముతో.
శ్లో. సామగానసమారాధ్యా శ్రోత్రకర్ణరసాయనమ్ ।
జీవలోకైకజీవాతుర్భద్రోదారవిలోకనా ॥ 119 ॥
818. ఓం *సామగానసమారాధ్యా*యై నమః ।
నామ
వివరణ.
సామవేదగానముతో
సమారాధ్య మన అమ్మ.
తే.గీ. *సామ గాన సమారాధ్య*! చక్కనైన
తల్లివీవమ్మ, మా యమ్మ! తలతు నిన్ను,
మానసంబున సతతంబు నే నుతింతు
నీదు మహిమంబు నెంచుచున్ నేర్పు మీర.
819. ఓం *శ్రోతృకర్ణరసాయన్యై* నమః
.
నామ
వివరణ.
వినువారి
చెవులకు ఆనందము కలిగించు వృత్తాంతము గలిగిన తల్లి.
తే.గీ. *శ్రోతృ కర్ణ రసాయనీ*! మాతృమూర్తి!
శబ్ద రూపక బ్రహ్మవు సకల వేద
సారమీవేను విననిమ్ము సన్నుతముగ,
వందనంబులు చేసెద నందుకొనుము.
820. ఓం *జీవలోకైకజీవాతవే నమః ।
నామ
వివరణ.
ఈ
ప్రపంచములో సమస్త జీవులనూ కాపాడు ఏకైన జనని అమ్మ.
తే.గీ. *జీవలోకైకజీవాతు*!సేవఁ జేసి
నీకు, నీకృపఁ గాంచినన్, మాకు మేలు
నంతయింతని చెప్పంగనలవిగాని
యంత చేసెదవోయమ్మ, యమరవినుత!
821. ఓం *భద్రోదారవిలోకనా*యై నమః ।
నామ
వివరణ.
క్షేమమును
కూర్చెడి ఉదారభావపూర్ణ కరుణాన్విత దృష్టితో చూచు జనని.
కం.
*భద్రోదారవిలోకన*!
నిద్రను నే నున్న గాని నిన్నే తలతున్,
క్షుద్రంబగు భావాళిని
యుద్రేకముఁ జూపి పాపి యూరటనిమ్మా.
శ్లో. తటిత్కోటిలసత్కాంతిస్తరుణీ హరిసుందరీ ।
మీననేత్రా చ సేంద్రాక్షీ విశాలాక్షీ సుమంగళా ॥ 120 ॥
822. ఓం *తటిత్కోటిలసత్కాంత్యై* నమః ।
నామ
వివరణ.
కోటి
కిరణముల కాంతులతో ప్రకాశవంతముగా ఉండుతల్లి.
కం.
ధాటిగ పలుకిమ్ము *తటి
త్కోటిలసత్కాంతి! * కరుణతోఁ గనుమమ్మా.
కోటికి యొక్కరు మాత్రమె
మేటిగ నిను గనుదురమ్మ, మిన్నగు భక్తిన్.
823. ఓం *తరుణ్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
నిత్య యవ్వనముతో నుండు తరుణి..
కం.
*తరుణీ*! కరుణా రూపిణి!
వరముగ లభియించినావు వరలఁగఁ జేయన్
పరమార్థము సాధింపగ
నరయుచు, నను కావుమమ్మ! హాయిగనుంచన్.
824. ఓం . *హరిసుందర్యై*నమః.
నామ
వివరణ.
హరిదేవునకు
హృదయముపై ఆసీన అయియున్న సుందరి అమ్మ.
కం.
*హరిసుందరి*! కరుణామయి
హరియింపుము పాతకములహర్నిశములు నిన్
సురుచిర పద పద్యంబుల
నరయగ రచియించి నీకు నందింతు మదిన్.
825. ఓం *మీననేత్రా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
కన్నులు చేపలవలె మిక్కిలి అందముగా ఉండును.
తే.గీ. *మీన నేత్రా*! మహోదార! మేలుచేయు
మమ్మరో కర్షకులకిల, నమ్మలేని
బాధలన్ దూలుచుండిరి ఫలము గనక,
ఫలితమందించి రక్షించు కలిత సుగుణ!
826. ఓం *ఇన్ద్రాక్ష్యై* నమః ।
నామ
వివరణ.
ఇంద్రుని
వలె వేయి కన్నులు కలతల్లి.
తే.గీ. వేలకన్నుల *యిన్ద్రాక్షి*! జాలమేల
నన్ను చూడఁగఁ గృపతోడ మన్ననమున,
నిన్నె సేవించువాడి నాపన్న రక్ష!
వందనంబులు
చేసెద నందుకొనుము..
827. ఓం *విశాలాక్ష్యై* నమః ।
నామ
వివరణ.
విశాలమయిన
కన్నులుగల తల్లి మన అమ్మ.
తే.గీ. ఓ *విశాలాక్షి*! జన్మమున్ భావిలోనఁ
గలుగ నీయక చూడుమా కనికరమున,
ముక్తి కల్పించి, కల్పించు శక్తి నొసగి,
కావ్యకల్పనఁ జేయించు కమలనయన!
828. ఓం సుమఙ్గలా*యై నమః ।
నామ
వివరణ.
మంచి
మంగళములకాలవాలము మన అమ్మ.
తే.గీ. ఓ *సుమంగలా*! మొరవినవో గణించి?
యతివలనురాగ మూర్తులు, క్షితిని వారు
పడెడి యగచాట్లు చూచినన్ బాధ కలుగు,
నీవె రక్షింపుమతివలన్, నిన్నుఁ గొలుతు.
శ్లో. సర్వమంగళసంపన్నా సాక్షాన్మంగళదేవతా ।
దేహహృద్దీపికా దీప్తిర్జి(హ్వ)హ్మపాపప్రణాశినీ ॥ 121 ॥
829. ఓం *సర్వమఙ్గలసమ్పన్నా*యై నమః .
నామ
వివరణ.
సమస్తమయిన
మంగలములకూ ఆలవాలమయినది అమ్మ.
తే.గీ. *సర్వ మంగల సంపన్న*! గర్వమడచి
దుర్విదగ్ధులనొంచుమా, యుర్విపైన,
సర్వమంగలముల్ కొల్ప సకలసిరులు
సుజనపాళికినందించి శోభ గూర్చు,
830 ఓం *సాక్షాన్మఙ్గలదేవతా*యై నమః ।
నామ
వివరణ.
సాక్షాత్త్
అమ్మ మంగల దేవతయే.
శా. *సాక్షాన్మంగల దేవతా*!
శుభకరీ! సర్వార్థ సంపత్కరీ!
మోక్షానందకరీ!
సదా జయకరీ! భుక్తిప్రదా శాంకరీ!
రక్షోవర్గ
సమూల నాశనకరీ!
రమ్యాక్షరీ!
సుందరీ
రక్షింపందగు
దీనులన్ జనని, నీ రక్షన్ మనన్ సాధ్యమౌన్.
కం.
*సాక్షాన్మఙ్గల దేవత*!
వక్షయ సన్మఙ్గలముల ననుపమముగ నీ
పక్షమునుండెడి సుజనుల
కక్షయముగ నిత్తువమ్మ!
హాయిఁ గొలుపగన్!
831. ఓం *దేహహృద్దీపికా*యై నమః ।
నామ
వివరణ.
హేహమునందుగల
హృదయ దీపమును ప్రకాశింపజేయు తల్లి మన అమ్మ.
తే.గీ. *దేహ హృద్దీపికా*! నాదు దేహమందు
వెల్గుచున్నట్టి నా యిల వేల్పువమ్మ,
హృదయ సుస్పందనంబీవె, మధురమయిన
భావ సంపదయున్ నీవె, భక్తవరద!
832. ఓం *దీప్త*యే నమః । (ఓం
*దీప్త్యై*
నమః)
నామ
వివరణ.
ప్రకాశించునది
అమ్మ.
తే.గీ. *దీప్తి*! నాలోన సుజ్ఞాన దీప్తిఁ గొలిపి
నిన్ను వర్ణించు భాగ్యంబు సన్నుతముగ
నా కొసంగుమా, నిన్ గొల్తు నయ నిధాన
వందనంబులు చేసెద నందుకొనుము.
833. ఓం *జి(హ్వ)హ్మ పాపప్రణాశిన్యై* నమః ।
నామ
వివరణ.
వక్సంభవ
పాపహారిణి మన అమ్మ.
తే.గీ. *జి(హ్వ)హ్మ పాపప్రణాశినీ*! జిత విరోధ!
పాపపుణ్యాలమూలమై పరగు జిహ్వ,
యెన్ని పాపముల్ చేసెనో యెఱుగతరమె
నీవె పాపాళి బాపుచు కావుము నను.
శ్లో. అర్ధచంద్రోల్లసద్దంష్ట్రా యజ్ఞవాటీవిలాసినీ ।
మహాదుర్గా మహోత్సాహా మహాదేవబలోదయా ॥ 122 ॥
834. ఓం అర్ధచన్ద్రోల్లసద్దంష్ట్రా*యై నమః ।
నామ
వివరణ.
అర్థచంద్రాకారమువలె
ప్రకాశించు కోరలున్న జనని.
తే.గీ. *అర్ధచన్ద్రోల్లసద్దంష్ట్ర*!వ్యర్థమయిన
పనులు చేయించకమ్మరో! పాపినగుదు,
భుక్తి ముక్తులఁ గొలిపెడి పూజ్యమయిన
పనులు నాచేత చేయించు, ప్రబలుచు మది.
835. ఓం *యజ్ఞవాటీవిలాసి*న్యై నమః ।
నామ
వివరణ.
యజ్ఞవాటిలో
విలాసవంతముగ విహరించు జనని.
తే.గీ. *యజ్ఞవాటీవిలాసినీ*! యహరహంబు
హృదయమే యజ్ఞ వాటిగా ముదముతోడఁ
జేసి యాగంబు చేయించు వాసిగాను,
వందనంబులు చేసెద నందుకొనుము.
836. ఓం మహాదుర్గా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
గొప్ప దుర్గమమయిన తల్లి.
కం.
కరుణించు *మహాదుర్గా*!
నిరుపమ సద్గతిని గొలుపు, నినుఁ గొలువంగన్,
సురుచిర సుందర సత్ పద
వర బంధుర కవితలల్లి పాడగనిమ్మా.
837. ఓం
*మహోత్సాహా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
ఎల్లప్పుడూ గొప్ప ఉత్సాహముతో ఉండు తల్లి.
తే.గీ. సత్వ సంస్తుత్య! యో *మహోత్సాహ*! నిన్ను
స్తుత్య పదపూర్ణభావనా సుగతి పద్య
పుష్పములతోడనర్చింతు పూర్ణ మతిని,
వందనంబులు చేసెద నందుకొనుము.
838. ఓం
*మహాదేవబలోదయా*యై నమః.
నామ
వివరణ.
శివుని
బలమునకు కారణ్మయిన తల్లి.
కం. శ్రీదవు, శుభదవు కనఁగ *మ
హా దేవబలోదయా* ! నయాంచిత దేవీ!
నా దారి నీవె జననీ!
మోదంబున కావుమమ్మ పూజింతు నినున్
శ్లో. డాకినీడ్యా శాకినీడ్యా సాకినీడ్యా సమస్తజుట్ ।
నిరంకుశా నాకివంద్యా షడాధారాధిదేవతా ॥ 123 ॥
839. ఓం *డాకినీడ్యా*యై నమః .
నామ
వివరణ.
విశుద్ధచక్రాధిదేవత
డాకినీమాత అమ్మయే.
తే.గీ. *డాకినీడ్యా*!మహాపూజ్య! శ్రీకరముగ
నిన్ను సేవించు వారలు
మన్ననఁ గని
బొందితో ముక్తి సామ్రాజ్యమందఁ గలరు,
వందనంబులు, నాకటులందనిమ్ము.
840. ఓం *శాకినీడ్యా*యై నమః ।
నామ
వివరణ.
మూలాధార
దేవత అయిన శాకినిచే స్తుతింపబడు జనని.
తే.గీ. *శాకినీడ్యా*! సుపూజ్య! ప్రశస్త తేజ!
లోక శోక వినాశినీ! శ్రీకరమగు
గుణములీయగన్, దౌష్ట్యంబులణచి వేయ
వందనంబులు చేసెద నందుకొనుము.
841. ఓం సాకినీడ్యా*యై నమః ।
నామ
వివరణ.
సాకినిచే
స్తుతింపఁబడు తల్లి మన అమ్మ.
తే.గీ. సాకినీ పూజ్య! గుణవంద్య! *సాకినీడ్య*!
సేవచేయగ నిమ్ము నన్ శ్రీపదముల
నెన్నుచున్ నీకు నిరతంబు మన్ననమున,
వందనంబులు చేసెద నందుకొనుము.
842. ఓం *సమస్తజుషే* నమః ।
నామ
వివరణ.
సమస్త
జీవకోటిచే పూజింపబడు జనని అమ్మ.
తే.గీ. నుత
*సమస్త జుషా*! దేవి! క్షితిని నిన్నుఁ
దెలుప నాకసాధ్యంబమ్మ, కలిత పుణ్యు
లిలను దెల్పఁ గలుగుదురు, సులలితముగ
వందనంబులు చేసెద నందుకొనుము.
843. ఓం *నిరఙ్కుశా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
నిరంకుశురాలు.
తే.గీ. నుత *నిరఙ్కుశా*! నన్ను సన్నుతిని గనుము,
శంక లేలను? నన్ను నిరంకుశముగ
నుండి శిక్షణ గొల్పుమా శ్రీనిధాన.
వందనంబులు చేసెద నందుకొనుము.
844. ఓం *నాకివంద్యా*యై నమః.
నామ
వివరణ.
అందరు
దేవతలచే నమస్కరింపబడు జనని.
తే.గీ. *నాకివంద్యా*! దురాచార నాశనివిగ,
దేవతలపూజలందెడి దివ్యమూర్తి!
యేలుచుందువు లోకము లేలుమమ్మ
నన్నునోయమ్మ! కృప జూపి సన్నుతముగ.
845. ఓం *షడాధారాధిదేవతా*యై నమః ।
నామ
వివరణ.
షట్
చక్రములకు ఆధారభూతమయిన్ అధిదేవత.
కం. అసమాన షడాధారవు,
వసియించుచు లోన చక్ర భాసితవగుచున్
దెస జూపి నడిపెదే, విను
త
*షడాధారాధిదేవతా*! నిను గొలుతున్.
శ్లో. భువనజ్ఞానినిశ్శ్రేణీ భువనాకారవల్లరీ ।
శాశ్వతీ శాశ్వతాకారా లోకానుగ్రహకారిణీ ॥ 124 ॥
846. ఓం *భువనజ్ఞాననిఃశ్రేణ*యే నమః ।
నామ
వివరణ.
భూలోకమున
జ్ఞానమునకు మెట్లు మ్మయే.
తే.గీ. స్వ *భువనజ్ఞానినిశ్శ్రేణి*! విభవమీవె
జ్ఞానసంభాసులందున, కన్న తల్లి!
నాదు సుజ్ఞాన తేజమై నన్నుఁ గనుము.
వందనంబులు చేసెద నందుకొనుము.
847. ఓం *భువనాకారవల్లర్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
భూమి యొక్క పతాకము.
తే.గీ. స్వ *భువనాకారవల్లరీ*! స్వాగతమ్ము,
నీవు స్వపతాకమమ్మరో భూవలయము
నందు భారత మాతకున్, యశవిభస!
వందనంబులు చేసెద నందుకొనుము.
848. ఓం *శాశ్వత్యై* నమః ।
నామ
వివరణ.
సృష్టిలో
శాశ్వతముగా నుండు జనని.
తే.గీ. *శాశ్వతీ*! నీకు సంస్తుతుల్,
సన్నుత పద!
శాశ్వతంబైన ముక్తిని సదయ నొసగు
తల్లివై మమ్ము కాపాడు చల్లనమ్మ.
వందనంబులు చేసెద నందుకొనుము.
849. ఓం *శాశ్వతాకారా*యై నమః .
నామ
వివరణ.
శాశ్వతమయిన
ఆకారము కల తల్లి.
తే.గీ. *శాశ్వతాకార*! రచియింతు శాశ్వతముగ
నిన్ను గనఁ జేయు కావ్యమున్ నేర్పు మీర
నీవె వ్రాయించుమోయమ్మ, నిరుపమముగ
వందనంబులు చేసెద నందుకొనుము.
850. ఓం *లోకానుగ్రహకారిణ్యై* నమః ।
నామ
వివరణ.
లోకానుగ్రగమునకు
కారణమయిన తల్లి మన అమ్మ.
శా.
*లోకానుగ్రహ కారిణీ*! జయకరీ లోకేశ్వరీ! పాహిమామ్,
శ్రీకారంబును జుట్టి వ్రాసితిని నీ చిన్నామముల్ వేయి, నా
నీకున్ దెల్వనిదేమి యున్నది సతీ!
నీవిచ్చుటన్ వ్రాసితిన్,
లోకుల్ మెత్తురొ, మెచ్చరో యెఱుఁగ, నాలోనున్నదీవే కదా.
శ్లో. సారసీ మానసీ హంసీ హంసలోకప్రదాయినీ ।
చిన్ముద్రాలంకృతకరా కోటిసూర్యసమప్రభా ॥ 125 ॥
851. ఓం
*సారస్యై* నమః ।
నామ
వివరణ.
సముద్రమున
నివసించు జనని.
ఉ.
*సారసి*! నిన్ను గొల్చెదను సన్నుత సత్ పద పద్య పుష్పముల్
నే రచియించినాడనని నే నెటులందును , నీవె నేనుగాఁ
జేరి రచింప వ్రాసితిని, చేకొను దీవె కృపా సముద్రమా.
కోరి యొసంగితిన్ గొనుమ కోరను చిల్లర కోరికల్ నినున్.
852. ఓం *మానస్యై* నమః ।
నామ
వివరణ.
మానస
సరోవరమున నివసించు తల్లి.
ఉ.
*మానసి*! మానసంబువయి మన్ననలంద కవిత్వ వృష్టి, సు
జ్ఞానసుధాస్రవన్తివయి కమ్మగ వ్రాయగఁ జేసితీవె, య
జ్ఞాన భవాంధమున్ దుడిచి కాచి రచింపగ చేసి తీవె, నిన్
నేను బ్రశంసఁ జేయఁ దగనే, నుతభాస్కర తేజమా! సతీ!
853. ఓం *హంస్యై* నమః ।
నామ
వివరణ.
ప్రాణముగా
హంసయై యుండు జనని.
కం.
*హంసీ*! సన్నుత మానస
హంసీ! గుణ సద్విభాసి యనుపమ! నాలో
హింసా గుణమణచితివి, ప్ర
శంసలు నేఁ జేయఁ జాల,
సన్నుత చరితా!
854. ఓం హంసలోకప్రదాయిన్యై నమః ।
నామ
వివరణ.
జ్ఞానహంసలోకమును
ప్రదానము చేయు తల్లి మన అమ్మ.
తే.గీ. *హంసలోకప్రదాయినీ*! యనుపమముగ
హంసలోకంబు మదిని బ్రశంస చేయ
సాధ్యమగునొకో? నీ కృపన్ సాధ్యమగును,
వందనంబులు చేసెద నందుకొనుము.
855. ఓం
*చిన్ముద్రాలఙ్కృతకరా*యై నమః ।
నామ
వివరణ.
చిన్ముద్రతో
అలంకరింపబడిన చేయి ఉన్న తల్లి.
కం.
వర *చిన్ముద్రాలఙ్కృత
కర*! తరణోపాయమదియు కనిపించదు శ్రీ
కరముగ చిన్ముద్రను నే
ధరియింతును నిన్నుఁ గాంచి,
ధన్యతనొందన్.
856. ఓం
*కోటిసూర్యసమప్రభా*యై నమః ।
నామ
వివరణ.
కోటి
సూర్యులకాంతితో సరిపోవు కాంతితో ప్రకాశించు తల్లి,
తే.గీ. *కోటిసూర్యసమప్రభా*! కువలయాక్షి!
జ్ఞాన నేత్రుండ గాను నేఁ గనగ నిన్ను,
నాదు భావనాకాశమం దేదొ గతిని
నిన్నుఁ జూడకపోదునా నిర్వికల్ప.
శ్లో. సుఖప్రాణిశిరోరేఖా సదదృష్టప్రదాయినీ ।
సర్వసాంకర్యదోషఘ్నీ గ్రహోపద్రవనాశినీ ॥ 126 ॥
857. ఓం
*సుఖప్రాణిశిరోరేఖా*యై నమః ।
నామ
వివరణ.
సంతోషముగా
జీవించు విధిని నిర్ణయించు జనని.
కం.
ప్రాణము నీవే యనునటు
లేణాక్షీ నిన్ గొలుతు మహేశ్వరివి, *సుఖ
ప్రాణిశిరోరేఖా*! యీ
క్షోణికి సుఖశాంతులనిడు కోమలి! కృపతో.
858. ఓం
*సదదృష్టప్రదాయిన్యై* నమః।
నామ
వివరణ.
మంచి
అదృష్టమును మంకొసగు జనని మన అమ్మ.
తే.గీ. నిన్ను గాంచు నదృష్టంబు నేర్పునిడు వి
ల *సదదృష్టప్రదాయినీ*! యసమ సుగుణ!
లసదదృష్టంబునే గొల్పు లక్ష్యమొప్ప,
నాకుఁ గనఁబడు కంటికి, నమ్మకముగ
859. ఓం
*సర్వసాఙ్కర్యదోషఘ్న్యై* నమః
.
నామ
వివరణ.
సమస్తమయిన
సంకర దోషములను నశింపఁజేయు జనని.
తే.గీ. *సర్వ సాంకర్య దోషఘ్ని*!, సన్నుతింతు,
వివిధ సాంకర్య దోషముల్ వేల్చు మదిని,
సర్వ దోషఘ్నివై నీవె సమయఁ జేసి
నన్ను కాపాడుమమ్మరో సన్నుతముగ.
860. ఓం
*గ్రహోపద్రవనాశిన్యై* నమః ।
నామ
వివరణ.
గ్రహములవలన
కలుగు ఉపద్రవములను నశింపఁజేయు తల్లి.
తే.గీ. నన్ గనెడి *గ్రహోపద్రవ నాశిని*! కని
నాకు గ్రహపీడలన్ బాపు శ్రీకరముగ
బాధలకు దూరమొనరించి ప్రబలనిమ్ము,
వందనంబులు జేసెద నందుకొనుము
శ్లో. క్షుద్రజంతుభయఘ్నీ చ విషరోగాదిభంజనీ ।
సదాశాంతా సదాశుద్ధా గృహచ్ఛిద్రనివారిణీ ॥ 127 ॥
861. ఓం
*క్షుద్రజన్తుభయఘ్న్యై* నమః ।
నామ
వివరణ.
భయంకర
జంతుపీడను నశింపజేయు తల్లి.
తే.గీ. *క్షుద్ర జన్తుభయఘ్ని* నన్ నిద్రనైన
క్షుద్రమానవజంతువుల్ కూల్చకుండ
కాచి రక్షించుమమ్మరో! కరుణఁ జూపి,
వందనంబులు చేసెద నందుకొనుము.
862. ఓం
*విషరోగాదిభఞ్జన్యై* నమః ।
నామ
వివరణ.
విషరోగాదులను
నివారించు జనని.
తే.గీ. పెక్కు విషరోగపీడలన్ జిక్కెఁ బ్రజ లి
ల *విషరోగాది భఞ్జనీ*! ప్రవర చరిత!
రోగముల్ బాపి బ్రతికెడి యోగమిమ్ము,
వందనంబులన్ జేసెదనందుకొనుము.
863. ఓం
*సదాశాన్తా* యై నమః ।
నామ
వివరణ.
ఎల్లప్పుడూ
శాంతస్వ్భావముతోనలరారు
జనని.
తే.గీ. ధర *సదాశాంత*! శాంతినే తప్పక యిడి
సంతసంబుగ నుండనీ సజ్జనులను,
నాదు మనమందు శాంతియు నీదె కనగ
వందనంబులు జేసెద నందుకొనుము.
864. ఓం
*సదాశుద్ధా*యై నమః ।
నామ
వివరణ.
ఎల్లప్పుడూ
శుద్ధిగా ఉండు జనని.
తే.గీ. విను *సదాశుద్ధ*! వివరింతు విపుల గతిని,
వ్యధలనెడబాపు
శుద్ధయై మదిఁ జెలంగు
శుద్ధ మతి నిన్నుఁ జూచుచుఁ జూపుచుండు,
కాన వ్యధలను పోకార్పు, ఘనతరముగ.
865. ఓం
*గృహచ్ఛిద్రనివారిణ్యై* నమః ।
నామ
వివరణ.
కుటుంబకలహములను
నివారించు దయాస్వరూపిణి అమ్మ.
స్వయంకల్పిత ఛిద్ర విరోధీ వృత్తము.
గణములు..
య
స
జ
స
గ.
యతి. 9వ అక్షరము. ప్రాస కలదు.
*గృహచ్ఛిద్ర నివారిణీ*! గృహము దేహం
బె, హర్షంబు గతించెనే, యిట మదంబా!
గృహచ్ఛిద్రము చేతనే, కృపను నీవే
మహత్వంబున మాపుమా, మనగనిమ్మా.
శ్లో. కలిదోషప్రశమనీ కోలాహలపురస్థితా ।
గౌరీ లాక్షణికీ ముఖ్యా జఘన్యాకృతివర్జితా ॥ 128 ॥
866. ఓం
*కలిదోషప్రశమన్యై* నమః ।
నామ
వివరణ.
కలికాలము
కారణముగా సంభ్వించు దోషములను నశింపచేయు తల్లి మన అమ్మ.
తే.గీ. తెలియ నేరను కలి దోష తిమిరము, విను
త! *కలిదోషప్రశమని*! పూత సుచరిత్ర!
కలిని కలిగిన దోషముల్ కాల్చుమమ్మ,
వందనంబులు చేసెద నందుకొనుము.
867. ఓం
*కోలాహలపురస్థితా*యై నమః ।
నామ
వివరణ.
కోలాహలపురమున
నివసించు తల్లి మన అమ్మ.
తే.గీ. కర్మ బద్ధ పాపాత్ములన్ గావ రమ్ము
దయను, *కోలాహలపురస్థితా*! యుదార
చరిత! సంతోష భావ సంభరిత! నీకు
వందనంబులు చేసెదనందుకొమ్ము.
868. ఓం
*గౌర్యై* నమః ।
నామ
వివరణ.
గౌరీదేవి
మన అమ్మయే.
తే.గీ.
* గౌరి*! నీ నామ మహిమయే కాచు నన్ను,
సారహీనంపు సంసార చక్రమందు
నలుగుచుంటిని,
కాపాడు నన్నుఁ గనుచు,
వందనంబులు చేసెద నందుకొనుము.
869. ఓం
*లాక్షాణిక్యై* నమః
.
నామ
వివరణ.
ప్రత్యేకమయిన
గుణములు కలిగిన తల్లి.
తే.గీ. వినుత *లాక్షాణికీ*! జగద్వేద్య!
వినుమ,
సత్య సంస్కార సద్గుణ సంపదలను
ప్రజలకందించి శుభములన్ బడయనిమ్ము,
వందనంబులు చేసెద నందుకొనుము.
870. ఓం
*ముఖ్యా*యై నమః ।
నామ
వివరణ.
సృష్టిలో
ప్రముఖురాలు జగదంబ లక్ష్మీమాత.
కం.
*ముఖ్యా*! నాకొదవిన యీ
ప్రఖ్యాతికి మూల మీవె, ప్రార్థింతు నినున్
విఖ్యాతిగ జనపాళిని
సఖ్యతతో గావుమమ్మ, సన్నుత చరితా!
871. ఓం *జఘన్యాకృతివర్జితా*యై నమః ।
నామ
వివరణ.
జన
మరణములకు లోబడి శరీరము లేనటువంటి జనని.
కం.
నీ కరుణనెంతును, *జఘ
న్యాకృతివర్జిత*! కను నను ననుపమ రీతిన్.
శ్రీకరముగ జగమేలెడి
నీకిల మరి సాటి లేదు నిరుపమశుభదా!
ఓం *జఘన్యా*యై నమః ।
కం.
నీ కరుణనెంతును,
*జఘ
న్యా*! కృతివర్జిత!
కను నను ననుపమ రీతిన్.
శ్రీకరముగ జగమేలెడి
నీకిల మరి సాటి లేదు నిరుపమశుభదా!
ఓం *ఆకృతివర్జితా*యై నమః ।
కం.
నీకరుణనెంతును, జఘ
*న్యాకృతివర్జిత*!
కను నను ననుపమ రీతిన్.
శ్రీకరముగజగమేలెడి
నీకిల మరి సాటి లేదు నిరుపమ శుభదా!
శ్లో. మాయా విద్యా మూలభూతా వాసవీ విష్ణుచేతనా ।
వాదినీ వసురూపా
చ వసురత్నపరిచ్ఛదా ॥ 129 ॥
872. ఓం
*మాయా*యై నమః ।
నామ
వివరణ.
మాయ
అమ్మ శక్తియే
తే.గీ. *మాయ*! నీ మాయ నెఱుగంగ మా తరంబె?
బాధలన్నిటిన్ క్షణములోఁ బాయఁ జేసి
మమ్ము రక్షించు తల్లివి, సమ్ముదమున
వందనంబులు చేసెద నందుకొనుము.
873. ఓం
*అవిద్యా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
అవిద్యా స్వరూపిణి.
తే.గీ. కనె *దవిద్యా*! మదిన్ నిన్ను ఘనతరముగ,
నాదు మదిలోన, నీకృపన్ మేదురమగు
నీదు దివ్య ప్రదీప్తిని నిత్యమిటులె,
వందనంబులు చేసెద నందుకొనుము.
874. ఓం
*మూలభూతా*యై నమః ।
నామ
వివరణ.
అన్నిటికీ
మూలమయిన తల్లి మన అమ్మ.
తే.గీ. *మూలభూత*! గుణోపేత! పూజ్య మాత!
సృష్టికే మూలమీవమ్మ, దృష్టిపెట్టి
నిన్ను దర్శించెదన్ మదిన్ మన్ననమున
వందనంబులు చేసెద నందుకొనుము.
875. ఓం
*వాసవ్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
యింద్రుని శక్తి.
తే.గీ. *వాసవీ*! మది నీపైన ధ్యాసపెట్టి
కొలువ నేర్చినన్ శుభములే కలుగుచుండు,
కొలువనిమ్మమ్మ నిన్ను నా కోర్కె తీర,
వందనంబులు చేసెద నందుకొనుము.
876. ఓం
*విష్ణుచేతనా*యై నమః ।
నామ
వివరణ.
విష్ణుదేవునిలో
ఉండు చైతన్య శక్తి అమ్మయే.
తే.గీ. *విష్ణుచేతనా*!
ధనముపై తృష్ణతోడ
నిన్ను నిర్లక్ష్యమొనరించి నెగడియుంటి,
పాప పరిహారమొనరించి వరలనిమ్ము,
వందనంబులు చేసెద నందుకొనుము.
877. ఓం
*వాదిన్యై* నమః ।
నామ
వివరణ.
వాదోపవాదములకు
మూలమయిన జనని.
తే.గీ. *వాదినీ*! కాంచు నను నీవు మోదమలర,
శ్రీద! సన్నుత సంస్కృతీ శ్రీదవగుము,
వాదనాశక్తిగా నీవె వరలు మదిని,
వందనంబులు చేసెద నందుకొనుము.
878. ఓం
*వసురూపా*యై నమః.
నామ
వివరణ.
అమ్మ
సంపదల రూపమే.
తే.గీ. వినుత *వసురూప*! నిన్ను నే విశ్వసించి
కొలుచుచుంటిని సతతంబు, విలువ నిలిపి
కంటి కగపడు నిన్ను నే గాంచునటుల,
వందనంబులు చేసెద నందుకొనుము.
879. ఓం
*వసురత్నపరిచ్ఛదా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
ఆనంద రత్నములు కలిగిన తల్లి.
తే.గీ. ఘనతరంబగు కళలీను కాంతివి,
విను
త *వసురత్నపరిచ్ఛదా*! తలతుమదిని
నిన్ను, కాపాడుమా నన్ను, కన్నతల్లి!
వందనంబులు చేసెద నందుకొనుము.
శ్లో. ఛాందసీ చంద్రహృదయా మంత్ర స్వచ్ఛందభైరవీ ।
వనమాలా వైజయంతీ పంచదివ్యాయుధాత్మికా ॥ 130 ॥
880. ఓం
*ఛాన్దస్యై* నమః ।
నామ
వివరణ.
చంద్రునివంటి
చల్లని మనసు కలిగిన జనని.
తే.గీ. *ఛాందసీ*! నీదు సంస్కృతిన్, సద్గుణముల
నరసి యుండగా నెంచితి వరమునిమ్ము
నేనునట్టులే యుండెద, నీ వరంబె
నాకు శక్తిని గొలుపును, భక్తిఁ గొలుపు.
881. ఓం
*చన్ద్రహృదయా*యై నమః ।
నామ
వివరణ.
చంద్రునివంటి
మనసున్న తల్లి.
తే.గీ. *చన్ద్ర హృదయా*! కృపాసాంద్ర! చక్కనమ్మ!
యింద్ర భోగంబులాశించ నిందు వదన!
నీవె మదిలోననుండుమా నీడ వోలె
వందనంబులు జేసెద నందుకొనుము.
882. ఓం
*మంత్రా*యై నమః ।( జైత్రా)
నామ
వివరణ.
అమ్మ
మంత్ర స్వరూపిణి.
తే.గీ. సగుణ! *మంత్రా* (జైత్రా)! వినుత గాత్ర సత్ పవిత్ర!
జయ నిధానమ! నిరతంబు జయము లిమ్మ,
వీడబోవక మదిలోన తోడు నిలుమ
వందనంబులన్ జేసెద నందుకొనుము.
883. ఓం
*స్వచ్ఛన్దభైరవ్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
స్వఛ్ఛందభైరవి.
తే.గీ. వినుత *స్వచ్ఛన్ద భైరవీ*! వినుతి వినుము,
స్వచ్ఛమైనట్టి మతినిమ్ము చక్కగాను
నిచ్చలున్ నిన్నుఁ బూజింప నిర్వికార
వందనంబులు చేసెద నందుకొనుము.
ఓం *మంత్ర(జైత్ర) స్వచ్ఛన్ద్ర భైరవ్యై*
నమః.!
తే.గీ. *మంత్ర (జైత్ర) స్వచ్ఛన్ద్ర భైరవీ*!
మహిమ చూపి,
మంత్రశక్తితో దుర్గతిన్
మాపుమమ్మ,
నిన్ను నమ్ముచు మదిలోన సన్నుతింతు.
వందనంబులు జేసెద నందుకొనుము.
తే.గీ. *జైత్ర స్వచ్ఛన్ద్ర భైరవీ*!
జయము నీకు,
మంత్రశక్తితో దుర్గతిన్ మాపుమమ్మ,
నిన్ను నమ్ముచు మదిలోన సన్నుతింతు.
వందనంబులన్ జేసెద నందుకొనుము.
884. ఓం
*వనమాలా* యై నమః ।
నామ
వివరణ.
వనపుష్పమాలను
ధరించిన్ జనని మన అమ్మ.
తే.గీ. మహిత *వనమాల*! నిన్ను నే మదిని కొలుతు,
నీదు పాదాల సన్నిధిన్ మోదమలర
పుష్పమై యుందు, కరుణించు పూజ్య మాత,
వందనంబులు జేసెద నందుకొనుము.
885. ఓం
*వైజయన్త్యై* నమః ।
నామ
వివరణ.
విష్ణువు
యొక్క వైజయంతీ మాల ధరించిన జనని.
తే.గీ. *వైజయన్తీ*! మనశ్శాన్తి వరల నిమ్ము,
సాజముగ నేను భక్తుడన్, సదయ గనుమ
నిన్ను సేవించుకోనిమ్ము నిరతము మది.
వందనంబులు జేసెద నందుకొనుము.
886. ఓం
*పఞ్చదివ్యాయుధాత్మికా*యై నమః ।
నామ
వివరణ.
దివ్యమయిన
ఐదు ఆయుధములను ధరించినది అమ్మ.
తే.గీ. *పఞ్చదివ్యాయుధాత్మికా*! భక్తినిడుము,
వఞ్చితుల బారి పడనీక కాఞ్చుమమ్మ,
శత్రువర్గమున్ దరుముమా, శరణమిమ్మ.
వందనంబులు జేసెద నందుకొనుము.
శ్లో. పీతాంబరమయీ చంచత్కౌస్తుభా హరికామినీ ।
నిత్యా తథ్యా రమా రామా రమణీ మృత్యుభంజనీ ॥ 131 ॥
887. ఓం
*పీతాంబరమయ్యై* నమః
నామ
వివరణ.
పట్టువస్త్రమయమయినది
మన అమ్మ.
కం.
*పీతాంబరమయి*! నేనున్
నీతో నివసింతునమ్మ! నీవే నాకున్
భ్రాతవు తల్లియు తండ్రియు,
ఖ్యాతిగ వసియింపనిమ్మ, కంజ దళాక్షీ!
888. ఓం
*చఞ్చత్కౌస్తుభా*యై నమః .
నామ
వివరణ.
కదిలే
కౌస్తుభ రత్నమును ధరించిన జనని.
కం.
అనుపమ *చఞ్చత్కౌస్తుభ*!
వినుమా నా మొరను నీవు వివరంబుగ నే
వినిపించెద పరమేశ్వరి!
కనుమా నన్ గృపను సతము కంజదళాక్షీ!
కం. *చఞ్చ త్కౌస్తుభ*! కృపతో
సఞ్చితకర్మ ఫలములను సమయింపుము,న
న్నెఞ్చుచు నీలో కలుపుము,
వఞ్చించకుమమ్మ! నీదు భక్తుఁడనమ్మా!
889. ఓం హరికామిన్యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
హరి యొక్క మధుర హృదయము.
కం.
కోరెద నుత
*హరికామిని*!
చేరెద నినుఁ జేరనిమ్ము శ్రీకరముగ నేఁ
గోరను వ్యర్థములైనవి
కోరెద సన్ముక్తి నెన్ని గుణ సాంద్ర నిధీ!
890. ఓం
*నిత్యా*యై నమః ।
నామ
వివరణ.
సర్వకాల
సర్వావస్థలయందూ నిత్యమయిన తల్లి.
కం.
*నిత్యా*! నాపై దయతో
స్తుత్యంబుగ నన్ను గాంచి సురుచిర ప్రేమౌ
న్నత్యంబును జూపింపుము
గత్యంతరమేలనాకు? గతి నీవె కదా.
891. ఓం
*తథ్యా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
సత్యముగా ఉన్న జనని.
తే.గీ. వినుత *తథ్యా*! శుభారాధ్య! విశ్వమాత!
మనగనిమ్మమ్మ నన్ను నీ మహిత పాద
సన్నిధానమునందునన్ జక్కగనిఁక,
వందనంబులన్ జేసెద నందుకొనుము.
892. ఓం
*రమా*యై నమః ।
నామ
వివరణ.
లక్ష్మీమాత
మన అమ్మ.
తే.గీ. మాన్య సంపూజ్య వైన *రమా* లలామ!
నీదు కృపఁ గాంచు భక్తులు నేర్పరు లిల
నైహికంబగు సుఖములనందఁ గలరు,
వందనంబులు చేసెద నందుకొనుము.
893. ఓం
*రామా*యై నమః ।
నామ
వివరణ.
మనోహర
రూపలావణ్యములు ఉన్న జనని మన అమ్మ.
కం.
శ్రీమాతా! శుభకరవగు
*రామా*! రమణీలలామ! ప్రార్థించెద నిన్
క్షేమము జనులకు నొసగుము,
ధీమంతులఁ గావుమమ్మ, దీప్తి నొసగుచున్.
894. ఓం
*రమణ్యై* నమః ।
నామ
వివరణ.
భక్తులను
ఆనందింపజేయునది మన అమ్మ.
కం.
*రమణీ*! దయతో వినుమిఁక
గమనించుము పేద జనులఁ గనికరమొప్పన్,
సుమధుర భావకలితవై
సమమగు సన్న్యాయమొదవ సాకుము వారిన్.
895. ఓం
*మృత్యుభఞ్జన్యై* నమః ।
నామ
వివరణ.
మృత్యువును
భంజించు తల్లి మన అమ్మ.
తే.గీ. *మృత్యుభఞ్జనీ*!
గొల్తు నిన్ స్తుత్యముగను,
దివ్య తత్వంబు కలిగించు భవ్యముగను,
విజితచిత్తుండనై నినున్ విశ్వసింతు
వందనంబులు చేసెద నందుకొనుము.
శ్లో. జ్యేష్ఠా కాష్ఠా ధనిష్ఠాంతా శరాంగీ నిర్గుణప్రియా ।
మైత్రేయా మిత్రవిందా చ శేష్యశేషకలాశయా ॥ 132 ॥
896. ఓం
*జ్యేష్ఠా* యై నమః ।
నామ
వివరణ.
సృష్టిలోనే
జ్యేష్ఠురాలు మన అమ్మ.
తే.గీ. కరుణ గాంచుమ *జ్యేష్ఠా*! ప్రకాశమాన
భక్తితత్త్వంబుఁ గల్పించి వరలఁ జేసి
భూమిపై నన్ను నిలుపుమా పూజ్యముగను,
వందనంబులు చేసెద నందుకొనుము.
897. ఓం
*కాష్ఠా* యై
నమః.
నామ
వివరణ.
సృష్టిలోనే
ఉన్నతమయిన తల్లి మన అమ్మ.
తే.గీ. వినుత *కాష్ఠా*! మహాసాధ్వి! ప్రేమఁ గనుమ,
పుత్ర వాత్సల్యమున్ జూపి పుడమిపైన
నన్ను వర్ధిల్లఁ జేయుమో
కన్నతల్లి!
వందనంబులు చేసెద నందుకొనుము.
898. ఓం
*ధనిష్ఠాన్తా*యై నమః .
నామ
వివరణ.
మేఘము
లోపలనున్న జనని మన అమ్మ.
తే.గీ. నుత *ధనిష్ఠాన్త*! నిన్ను సన్నుతులు చేసి
నాదు మదిలోన నిలుపుదు మేదురముగ,
కోరి నాకు సద్ గుణములు కూర్మినిమ్మ,
వందనంబులు చేసెద నందుకొనుము.
899. ఓం
*శరాఙ్గ్యై* నమః ।
నామ
వివరణ.
విల్లువంటి
శరీరము కలిగిన తల్లి మన అమ్మ.
తే.గీ. అనుపమాన ప్రశస్త *శరాఙ్గి*!
కొలుతు
నిన్ను నమ్మరో సద్భక్తినెన్ని కనుచు,
కన్నులన్ బెట్టి నన్ గూడ కావుమమ్మ,
వందనంబులు చేసెద నందుకొనుము.
900. ఓం
*నిర్గుణప్రియా* యై నమః ।
నామ
వివరణ.
గుణాతీత
విజ్ఞానమును యిష్టపడు తల్లి.
తే.గీ. *నిర్గుణప్రియా*!
నీవె నా స్వర్గ సీమ,
నిన్ను మించిన దేదియున్ నెమ్మనమున
గాంచినన్ లేదు నిజమమ్మ
కరుణఁ గనుమ
వందనంబులు చేసెద నందుకొనుము.
901. ఓం
*మైత్రేయా* యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
స్నేహశీలి.
కం.
*మైత్రేయా*! ననుఁ గాంచుమ
పాత్రుండను నేను నిన్ను
వర్ణించెద సన్
మైత్రీభావము తోడను,
పుత్రుఁడనేనమ్మ నీకు పుణ్యోద్భాసా!
902. ఓం
*మిత్రవిన్దా* యై నమః ।
నామ
వివరణ.
కృష్ణుని
భార్యలలో ఒకరగు మిత్రవింద మన అమ్మ.
తే.గీ.
* మిత్రవిన్దా*! మహానంద మేలు చేయు
తల్లి వీవంచు జనులు తాముల్లమలరఁ
గొలుచుచుండిరి నిన్నునో కువలయాక్షి!
వందనంబులు చేసెద నందుకొనుము.
903. ఓం
*శేష్యశేషకలాశయా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
తన భక్తులతో స్వాతంత్ర్యం పొందగలిగిన తల్లి.
తే.గీ. *శేష్య శేషకలాశయా*! జీవితమున
స్వేచ్ఛ కలిగిన మదిలోన వెలయుదీవె,
నిర్భరంబగు భక్తినే నిలుపుదువుగ,
వందనంబులు చేసెద నందుకొనుము.
శ్లో. వారాణసీవాసలభ్యా చార్యావర్తజనస్తుతా । [ వారాణసీవాసరతా ]
జగదుత్పత్తిసంస్థానసంహారత్రయకారణమ్ ॥ 133 ॥
904. ఓం *వారాణసీవాసలభ్యా*యై నమః ।
నామ
వివరణ.
కాశీలో
నివసించే వారిచే పొంద దగిన తల్లి.
తే.గీ. లలిత *వారాణసీవాస లభ్య*! జనని!
నీవె భక్తికి ఫలితంబు, ధీవిశాల!
నీవె మాయమ్మ, కృపఁ గని కావుమమ్మ,
వందనంబులు చేసెద నందుకొనుము.
ఓం *వారాణసీవాసరతా*యై నమః.
తే.గీ. రమ్య *వారాణసీవాసరత*!
నమామి.
గమ్యమును చూపి చేర్చుమా రమ్యముగను,
నిన్నె నమ్మితి నోయమ్మ! సన్నుతింతు,
వందనంబులు చేసెద నందుకొనుము.
905. ఓం
*ఆర్యావర్తజనస్తుతా*యై నమః ।
నామ
వివరణ.
ఆర్యావర్తవాసులచే
స్తుతింపబడు జనని అమ్మ.
శా.
*ఆర్యావర్త జనస్తుతా*! సుగుణ పోషా! నిన్ను నే గొల్చెదన్,
ధైర్యంబిచ్చుచు విద్యలిచ్చుచును మేధన్ గొల్పుమోయమ్మ, నీ
స్థైర్యంబెంచగ సాధ్యమౌనె కవికిన్ సన్మార్గ సద్గామినై
పర్యాయంబుగ నిన్ను గొల్తును సతీ!
ప్రఖ్యాతిగా నిద్ధరన్
906. ఓం
*జగదుత్పత్తిసంస్థాపన సంహారత్రయకారణా* యై నమః ।
నామ
వివరణ.
సృష్టి
స్థితి లయ కారకురాలు అమ్మ.
స్వయంకల్పిత కారణత్రయ వృత్తము.
*జగదుత్పత్తిసంస్థాపనసంహారత్రయకారణా*!
గణములు…… స ర
భ
మ
స
వ.
యతి.. 10వ అక్షరము. ప్రాస కలదు
*జగదుత్పత్తిసంస్థాపనసంహారత్రయకారణా*!
నిగమాంతాక్షరానంత! గణింతున్నీ కృప కోసమే,
మొగమాటంబదేలన్
దగ పొల్పున్ నన్నిలఁ
జూడగా,
జగమేలే నినున్ నామది సంస్థాపించి నుతించెదన్.
శ్లో. త్వమంబ విష్ణుసర్వస్వం నమస్తేఽస్తు మహేశ్వరి ।
నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే ॥ 134 ॥
907. ఓం
*తుభ్యం* నమః ।
నామ
వివరణ.
త్వం
అని సంబోధింపబడిన జనని
మన అమ్మ.
శా.
*త్వమ్*! భావాంబుధినుండి పుట్టితివిగా
తన్మాత్ర సుజ్ఞానమున్
సమ్భావింతును నిన్ను నేను జననీ! సత్యప్రభారాశిగా,
నమ్భోజాక్షి!
గుణప్రపూర్ణ దయతో నాశీర్వదించమ్మ నన్
శుమ్భద్గాత్ర విశేష పుణ్య ఫలదా! శోభిల్లగాఁ జేయుమా.
908. ఓం
*అమ్బా*యై నమః.
నామ
వివరణ.
జగన్మాతృ
రూపిణి మన అమ్మ.
తే.గీ. *అమ్బ*! ప్రేమతో గాంచెడి సాంబు రాణి!
కుంభవృష్టిగ కవితలన్ గొలుపుచుండి,
నీదు నామాళినే వ్రాయ నీవె చేసి
నన్ను కరుణతో చూచితే కమల నయన!
909. ఓం . *విష్ణు సర్వస్వ*యే
నమః.
నామ
వివరణ.
విష్ణువునకు సంబంధించిన అన్నియూ అమ్మయే.
తే.గీ. *విష్ణు సర్వస్వ*! గమనింప విష్ణువునకు
సర్వమీవేను, నీ కృపన్ సర్వసృష్టి
నతఁడుపోషింపఁ గలుగుచు స్తుతులు గొనుట
జరుగుచుండెను గణియింప జగతిలోన.
910. ఓం
*మహేశ్వర్యై* నమః ।
నామ
వివరణ.
మహేశ్వరునకు
సంబంధించిన ఈ తల్లి మహేశ్వరి.
తే.గీ. విను *మహేశ్వరీ*! లోకమున్ గనుచు నిజము
వ్యర్థ జీవులు జగతిని బాధలకును
మూలమగుచుండిరమ్మ, సమూలముగను
వ్యర్థ భంజనతోఁ గాచు సార్థకులను.
911. ఓం
*సర్వలోకానామ్జనన్యై* నమః ।
నామ
వివరణ.
సమస్త
లోకములకూ తల్లి మన జనని.
తే.గీ. వినుత *సర్వలోకానామ్ జనని*! మదంబ!
ఘనతనే గొల్పు కల్యాణ కారిణీ! ను
తంబుగను గొల్తు నిన్ నేను సంబరముగ,
వందనంబులు చేసెద నందుకొనుము.
912. ఓం *పుణ్యమూర్తయే* నమః ।
నామ
వివరణ.
అమ్మ
పుణ్యస్వరూపిణి.
తే.గీ. *పుణ్యమూర్తీ*!
జగత్ స్ఫూర్తి! పూజ్యవీవు,
పుణ్యసంప్రాప్తికై నిన్నుఁ బూజ చేయు
భక్తపాళికి పుణ్యంబు వరలఁ జేసి
రక్షణను గొల్పు తల్లివి రమ్య గేహ!
శ్లో. సిద్ధలక్ష్మీర్మహాకాళి మహలక్ష్మి నమోఽస్తు తే ।
సద్యోజాతాదిపంచాగ్నిరూపా పంచకపంచకమ్ ॥ 135 ॥
913. ఓం
*సిద్ధలక్ష్మ్యై* నమః ।
నామ
వివరణ.
సాధనకు
సిద్ధిని ప్రసాదించు సిద్ధలక్ష్మి మన అమ్మ.
తే.గీ. సిద్ధ లక్ష్మీ! *మహాలక్ష్మి*! శుద్ధ చిత్త
మలరఁ జేయుమా నాలోన పలువిధముల
భావనల్ వీడి నిన్ మది భక్తి నిలిపి
వందనంబులు చేసెద నందుకొనుము.
914. ఓం
*మహాకాల్యై* నమః ।
నామ
వివరణ.
గొప్ప
కాలికా మాత మన అమ్మ.
తే.గీ. నుత *మహాకాలి*! నిన్ను సంస్తుతుల దేల్తు,
క్షితిని నీవుండి బాపు దుస్థితులనరసి,
యతులితంబగు నీశక్తి నరయ నేర,
వందనంబులు చేసెద నందుకొనుము.
915. ఓం
*మహాలక్ష్మ్యై* నమః ।
నామ
వివరణ.
గొప్ప
లక్ష్మీ దేవి మన అమ్మ.
తే.గీ. శ్రీ *మహాలక్ష్మి*! నీ శక్తి చెప్పనగునె?
సృష్టి మొత్తంబు నడుపుచు చెలఁగుచున్న
విష్ణువున్ జేరి శక్తివై వెలుగుదీవె,
వందనంబులు చేసెద నందుకొనుము.
916. ఓం
*సద్యోజాతాదిపఞ్చాగ్నిరూపా*యై నమః ।
నామ
వివరణ.
సద్యోజాతముమున్నగు
పంచాగ్నులస్వరూపము అమ్మ.
స్వయం కల్పిత సద్యోజాత వృత్తము.
గణములు.
మ
ర
ర
ర
య.
యతి. 11వ అక్షరము. ప్రాస
కలదు.
*సద్యోజాతాదిపఞ్చాగ్నిరూపా*! జయంబు నీకున్,
విద్యాబుద్ధుల్ కృపన్ గొల్పినీవే వివేకమిమ్మా,
వేద్యంబై నీవునాకున్ కృపన్ భావిఁ జూపుమమ్మా,
సద్యోజాతా! ప్రపంచంబు నీవే సదాత్మవీవే.
917. ఓం
*పఞ్చకపఞ్చకా*యై నమః ।
నామ
వివరణ.
ఐదురెట్లుకైదురెట్లు
అమ్మ.
ఉ.
*పఞ్చకపఞ్చకా*! పరమ పావన నామ దయాంబురాశి! నా
సఞ్చిత పాపపుణ్యములు సన్నుతిగాఁ దొలగంగఁ జేయుమా,
యఞ్చిత రీతి నిన్ గొలుతునమ్మ! శుభావహవౌచు మాకిలన్
బఞ్చుము భక్తితత్వమును భక్త జనావని! లోక్ పావనీ!
శ్లో. యంత్రలక్ష్మీర్భవత్యాదిరాద్యాద్యే తే నమో నమః ।
సృష్ట్యాదికారణాకారవితతే దోషవర్జితే ॥ 136 ॥
918. ఓం
*యన్త్రలక్ష్మ్యై* నమః
.
నామ
వివరణ.
యంత్రలక్ష్మీ
స్వరూపిణి అమ్మయే.
తే.గీ. *యన్త్ర లక్ష్మీ*! మహాదేవి! యసమ శక్తి
వీవె జగతిలో వేరుగా లేవు కనగ,
మంత్రశక్తివి నీవె మా యంత్ర శక్తి,
వందనంబులు చేసెద నందుకొనుము.
919. ఓం *భవత్యాద్యై*
నమః
నామ
వివరణ.
అమ్మ
ఆదిమ శక్తి.
తే.గీ.
అమ్మ!
*భవత్యాది*!
నీ శక్తినమ్మ నేను,
కానిచో
వేయి నామముల్ నేను పది ది
నములలో
పద్యములయందు నమరఁ జేసి
వ్రాయనెట్లగు?
నీ శక్తి వ్రాయఁజేసె.
ఓం *భవత్యై*
నమః ।
కం.
భవతీ! నా హృదయంబున
నివసింపుము పుణ్యముండు నిను సేవింతున్,
జవసత్వంబులు నీవే
ప్రవిమల చరితంబు నీవె ప్రభ్వీ!
నాలో.
ఓం *ఆదయే*
నమః ।
నామ వివరణ.
ఆది దేవత అమ్మ.
తే.గీ. *ఆది*!
సృష్టికి చూడ నీవాదివమ్మ,
లేదు నీకన్న ముందునే యాదియుఁ గన,
సాదరంబుగ సేవింతు నాదుకొనుము,
వందనంబులు చేసెద నందుకొనుము.
920. ఓం *ఆద్యాద్యా* యై నమః ।
నామ
వివరణ.
ఆద్యకే
ఆద్య అమ్మ.
తే.గీ. ఆద్య *వాద్యాద్య*! సృష్టిలో నాద్య
జనని!
గనగ నీకన్న ముందుగాఁ గలిగి లేర
నుపమ యింకెవ్వరున్, నీవె కృపనుగనుమ.
వందనంబులు చేసెద నందుకొనుము
921. ఓం
*సృష్ట్యాదికారణాకారవితత*యే నమః ।
నామ
వివరణ.
సృష్టి
ప్రారంభమునకు కారణాకారము అమ్మయే.
సీ.
చింతింతు నిన్ను నే *సృష్ట్యాదికారణాకారవితత* ! శుభాకార! సతము,
భ్రాంతుల్ విడన్ జేసి భక్తిన్ బ్రసాదించి! నిన్నెన్ని కొలిచెడి నేర్పునిమ్ము,
చిత్తమేకాగ్రతన్ శ్రీకరంబుగ నీదు పాదపద్మములపై ప్రబలనిమ్ము,
బాధామయంబైన వేదనలవియేల నీవెమాలోనుండి ప్రోవతగును,
తే.గీ. ప్రాణ శక్తివి, జీవులన్ బ్రాణమీవె,
యన్నిటన్ గల నిన్ను నే నరయలేక
బాధలన్ జిక్కి కావగా బ్రతిమలాడి,
వేఁగుచుంటిని, ననుఁజూడవే మదంబ!
922. ఓం
*దోషవర్జితా* యై నమః ।
నామ
వివరణ.
దోషములను
విడిచిపెట్టిన జనని.
తే.గీ. *దోషవర్జితా*!
జగతిలో దోషములవి
నీదు సంస్మరణంబుచే దూది వోలె
కాలిపోవును, కరుణించి కాచు తల్లి!
వందనంబులు చేసెద నందుకొనుము
శ్లో. జగల్లక్ష్మీర్జగన్మాతర్విష్ణుపత్ని నమోఽస్తు తే ।
నవకోటిమహాశక్తిసముపాస్యపదాంబుజే ॥ 137 ॥
923. ఓం
*జగల్లక్ష్మై* నమః
నామ
వివరణ.
లోకమునకే
తల్లి మన అమ్మ.
తే.గీ. వర *జగల్లక్ష్మి*! జగతియే పావనమగు
నీదు నామంబు తలచినన్ శ్రీదవగుమ
భక్తులకు నీవు, ప్రేమతో ముక్తి నిమ్ము
కోరువారికి బంగారు కోవెలవుగ.
924. ఓం
*జగన్మాత్రే* నమః ।
నామ
వివరణ.
అమ్మ
లోక మాత.
తే.గీ. విను *జగన్మాత్ర*! పూజ్య సద్వినుత గాత్ర!
తల్లివై నీవు పాలింతువెల్లరినిల,
కల్లలెఱుగని వారిని కాచు తల్లి
వందనంబులు చేసెద నందుకొనుము
925. ఓం
*విష్ణుపత్న్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
విష్ణుదేవుని పత్ని లక్ష్మీదేవి.
తే.గీ. *విష్ణు పత్నీ*! సదానంద విప్ర వినుత!
లోక కల్యాణ సంధాత్రి లోకమాత!
సత్య సన్నుత సద్గుణా! సదయఁ గనుమ,
వందనంబులు చేసెద నందుకొనుము
926. ఓం
*నవకోటిమహాశక్తిసముపాస్యపదామ్బుజా*యై నమః ।
నామ
వివరణ.
నవకోటి
మహాశక్తి సమన్వితులచే పూజింపబడు జనని.
స్వయంకల్పిత శక్త్యోపాసన వృత్తము.
గణములు….
న
స
స
భ
జ
జ
గ…. యతి12వ అక్షరము. ప్రాస కలదు.
:జయము *నవకోటిమహాశక్తిసముపాస్య-పదామ్బుజా*!
భయము విడనాడి ప్రవర్తించి వసుధన్ మనజేయుమా,
ప్రియముజనపాళిపయిన్ జూపు వినుతంబుగ నమ్మరో!
రయమునను కావగ రావేల
రమణీమణికొల్చినన్.
శ్లో. కనత్సౌవర్ణరత్నా(ఢ్య)ఢ్యే సర్వాభరణభూషితే ।
అనంతానిత్యమహిషీప్రపంచేశ్వరనాయకి ॥ 138 ॥
927. ఓం
*కనత్సౌవర్ణరత్నాఢ్యా*యై నమః
నామ
వివరణ.
ప్రకాశించు
బంగారము, రనాలు కలిగిన జనని.
స్వయం కల్పిత కనకాభరణ వృత్తము
న
య
ర
ర
భ
జ
గ….. యతి
12వ అక్షరము . ప్రాస నియమము కలదు.
సకల *కనత్ సౌవర్ణ రత్నాఢ్య*! సర్వాభరణ భూషితా!
ప్రకటిత తేజోద్భాసవీవేను, భావోద్ధతిని గొల్పుమా,
నికర సుధోద్భాసాక్షరంబైన నిత్యంబనగ నీవెగా
సుకవితలో నీవేసుధన్ జింది శోభావళిగ జేయుమా.
928. ఓం
*సర్వాభరణభూషితా*యై నమః
నామ వివరణ.
సమస్త ఆభరణములచే అలంకరింపబడిన జనని.
తే.గీ. తలఁతు *సర్వాభరణ భూషితా !* మనమున
నిన్ను, జ్ఞానభూషణ మీయ
నిరుపమాన!
నాకు, భక్తితో నినుఁ జూడ
ప్రకటముగను,
వందనంబులు చేసెదనందుకొనుము.
ఓం *కనత్సౌవర్ణరత్నాఢ్య-సర్వాభరణభూషితా*యై నమః.
స్వయం కల్పిత కనకాభరణ వృత్తము
న
య
ర
ర
భ
జ
గ….. యతి
12వ అక్షరము.
ప్రాస నియమము కలదు.
సకల *కనత్ సౌవర్ణ రత్నాఢ్య! సర్వాభరణ భూషితా*!
ప్రకటిత తేజోద్భాసవీవేను, భావోద్ధతిని గొల్పుమా,
నికర సుధోద్భాసాక్షరంబైన నిత్యంబనగ నీవెగా
సుకవితలో నీవేసుధన్ జింది శోభావళిగ జేయుమా.
929. ఓం
*అనన్తానిత్యమహిష్యై* నమః ।
నామ
వివరణ.
అనంతమయిన
అనిత్యమయిన స్త్రీ మన అమ్మ.
కం. సన్తోషామ్భోధి! మహి *న
నన్తానిత్యమహిషి* ! చరణాబ్జము గొలుతున్.
సన్తత సన్తోషమ్బిడ
సన్తోషము తోడ మదిని చరియింపఁగదే.
930. ఓం
*ప్రపఞ్చేశ్వరనాయక్యై* నమః ।
నామ
వివరణ.
ప్రపంచమునకే
ప్రభ్విణి అయిన అమ్మ.
కం.
పఞ్చేన్ద్రియాధినేతవు,
పఞ్చాస్యుని రాణి వీవు, భక్తిని గొలుతున్
సఞ్చితములు బాపుమిఁక, *ప్ర
పఞ్చేశ్వరనాయకీ*!
ప్రపఞ్చము నీవే.
శ్లో. అత్యుచ్ఛ్రితపదాంతస్థే పరమవ్యోమనాయకి ।
నాకపృష్ఠగతారాధ్యే విష్ణులోకవిలాసిని ॥ 139 ॥
931. ఓం
*అత్యుచ్ఛ్రితపదాంతస్థే* నమః.
నామ
వివరణ.
అత్య్న్నతమయిన
పదాంతమందు ఉన్న జనని మన అమ్మ.
స్వయంకల్పిత ఉచ్ఛిత పద వృత్తము.
గణములు. …
న
త
స
త
స
… యతి
9వ అక్షరము. ప్రాస కలదు.
అహము *నత్యుచ్ఛ్రితపదా న్తస్థా*! యణచుమా.
యిహము తోపాటు పరమిమ్మా నాకు కృపతో,
స్పృహను నన్నుంచుచును సేవింపన్ గనుమిలన్,
దహర సన్మార్గమున తల్లీ
నన్ నిలుపుమా.
932. ఓం
*పరమవ్యోమనాయక్యై* నమః ।
నామ
వివరణ.
పరమగహరాకాశమునకు
నాయకురాలు మన అమ్మ.
కం.
ఓ పరమేశ్వరి! నాలో
శ్రీపర దేవతగ నిలుము చిత్తప్రభవై,
నే పద్య సుమము లను నీ
కే! *పరమవ్యోమనాయకీ*! కొన నిత్తున్.
933. ఓం
*నాకపృష్ఠగతారాధ్యై* నమః ।
నామ
వివరణ.
స్వర్గమునకు
చేరినవారందరిచేత ఆరాధింపబడు జనని మన అమ్మ.
తే.గీ. *నాక పృష్ఠ గతారాధి*! నాదు మదియె
నీకు సింహాసనంబమ్మ! నిత్యమీవు
కోరి వసియింపుమిచ్చటఁ గూర్మితోడ,
వందనంబులు చేసెద నందుకొనుము.
934. ఓం
*విష్ణులోకవిలాసిన్యై* నమః ।
నామ
వివరణ.
విష్ణు
లోకమును ప్రకాశింప చేయు తల్లి మన అమ్మ.
తే.గీ. *విష్ణు లోక విలాసినీ*! విశ్వవేద్య!
కలుష కష్టాష్టకంబును కాల్చుమమ్మ,
నీదు పదసన్నిధిన్ మతిన్ నిలుపనిమ్మ,
వందనంబులు చేసెద నందుకొమ్మ.
శ్లో. వైకుంఠరాజమహిషి శ్రీరంగనగరాశ్రితే ।
రంగనాయకి భూపుత్రి కృష్ణే వరదవల్లభే ॥ 140 ॥
935. ఓం
*వైకుణ్ఠరాజమహిష్యై* నమః ।
నామ
వివరణ.
ఈ
తల్లి వైకుంఠ రాజుకు పట్టమహిషి.
కం.
*వైకుంఠరాజమహిషీ*!
నీకున్ నే సేవఁ
జేయ నిలుపుము, నాకున్
వైకుంఠవాస భాగ్యము
నీ కరుణనె కలుగునమ్మ! నిజమిది జననీ!
936. ఓం
*శ్రీరఙ్గనగరాశ్రితా*యై నమః ।
నామ
వివరణ.
శ్రీరంగనగరమున
నివసించు తల్లి.
తే.గీ. ధర్మ దేవతవీవమ్మ! ధరణి నున్న
లోపములఁ జేరనీకు నన్, శాపమగును,
నయము గొలుపగ నిత్యంబు నాదు మదిని
దయను *శ్రీరఙ్గనగరాశ్రితా*! వసించు.
937. ఓం *రంగనాయక్యై*
నమః.
నామ
వివరణ.
రంగనాథుని
అర్థాంగి అమ్మ.
తే.గీ.
*రంగనాయకీ*!
జన్మసార్థకమగునుగ
రంగపట్టణ
భావనన్ ప్రజకు భువిని,
నీ
పదాబ్జముల్ విడువను భక్తిఁ గొలుతు,
నన్ను
రక్షింపుమమ్మరో సన్నుతముగ.
ఓం *రఙ్గభార్యా*
యై నమః ।
తే.గీ. *రఙ్గభార్యా*
భవత్ పాదరాజినెన్ని
కొలిచెదన్ భక్తితో,
నన్నుఁ గొలవనిమ్ము,
జన్మమెత్తిన ఫలమును జయనిధాన!
కలుగఁ జేయుము నాపైన కరుణఁ జూపి.
938. ఓం
*భూపుత్ర్యై* నమః
.
నామ
వివరణ.
భూదేవి
కుమార్తె అయిన సీత మన జగన్మాతయే.
కం.
*భూపుత్రీ*! శుభ గాత్రీ!
శ్రీ పరమేశాని! నిన్నుఁ జేరగనిమ్మా.
నాపయి దయఁ జూపుచు నే
పాపంబులునంటకుండ వర్ధిలనిమ్మా.
939. ఓం
*కృష్ణే* నమః ।
నామ
వివరణ.
శ్రీకృష్ణుని
భార్య ఈ జగన్మాత.
కం.
*కృష్ణే*! మోక్షముపై నీ
తృష్ణను కలిగించి తీవె, తీర్చుము కోర్కెన్,
విష్ణుని పాదోద్భవ యీ
తృష్ణను పోకార్పఁ గలదు దీన శరణ్యా!
940. ఓం
*వరద వల్లభే* నమః
నామ
వివరణ.
వరదరాజు
భార్య ఈ జగన్మాత.
తే.గీ. *వరద వల్లభా*! దినకరప్రభవు నీవు,
కరమునందించి కృపతోడ కావు మమ్మ,
స్థిర శుభాస్పద తీరంబు చేర్చుమమ్మ,
వందనంబులు చేసెద నందుకొనుము.
శ్లో. కోటిబ్రహ్మాదిసంసేవ్యే కోటిరుద్రాదికీర్తితే ।
మాతులుంగమయం ఖేటం సౌవర్ణచషకం తథా ॥ 141 ॥
941. ఓం
*కోటిబ్రహ్మాదిసంసేవ్యా* యై నమః.
నామ
వివరణ.
బ్రహ్మ
మున్నగు వారు కోటిమందిచే గొప్పగా సేవింపబడు తల్లి.
తే.గీ. *కోటిబ్రహ్మాదిసంసేవ్య*! క్షోణి పైన
కోట్ల భక్తాళి నీ సేవ కోరి చేయు
చుండిరోయమ్మ ప్రేమతోఁ జూచి నీవు
రక్షణను గొల్పు వారికిన్, రాజిత పద!
ఓం *కోటిబ్రహ్మాణ్డసేవ్యా*యై నమః ।
కం. ఏటికి జన్మము నెత్తితొ?
మేటిగ బ్రతుకంగ లేని మేనది యేలో?
కోటికొకడొందు ముక్తిని,
*కోటి బ్రహ్మాణ్డ సేవ్య*! కూర్చుము ముక్తిన్.
942. ఓం
*కోటిరుద్రాదికీర్తితా* యై నమః ।
నామ
వివరణ.
కోటి
రుద్రులచే దానము చేయఁబడిన జనని.
తే.గీ. *కోటి రుద్రాది కీర్తితా*! కుదురు మదిని,
కోటి రుద్రులు నాలోన కొలువుతీర
నేనునున్ నిన్ను కీర్తింతు నిరుపమాన
పద్యపుష్పార్చనము చేయ భక్తితోడ.
943. ఓం
*మాతులఙ్గమయం ఖేటం బిభ్రత్యై* నమః ।
నామ
వివరణ.
దానిమ్మతో
చేసిన కవచమును పట్టుకొనిన జనని.
స్వయంకల్పిత మాతులఙ్గ వృత్తము
గణములు…..న ర
స
మ
వ …. యతి
8వ అక్షరము….. ప్రాస నియమము కలదు.
మహిత *మాతులఙ్గమయం ఖేటం బిభ్రతీ*!
మహిమతో సదా సుమనోజ్ఞంబౌ కావ్యమున్
మహిని నిన్నుఁ జూప మదంబా వ్రాయింపుమా
స్పృహను నిల్పి నన్నుక్షితిన్ వెల్గన్ గానుమా.
944. ఓం
*సౌవర్ణచషకం బిభ్రత్యై* నమః ।
నామ
వివరణ.
చేతితో
బంగారు గొబ్బెమ్మను పట్టుకొనిన జనని.
స్వయంకల్పిత స్వర్ణ చిషక వృత్తము.
గణములు…..త స
భ
ర
గ.
.. యతి. 10వ అక్షరం. ప్రాస కలదు.
*సౌవర్ణ చషకం బిభ్రతి*! సాధురక్షా!
నీవే జనని నాకున్ గతి నిత్య పూజ్యా!
భావింతు నిను నాలో గని,
భాను తేజా!
సేవింప నిను సౌఖ్యంబులు చెందు నన్నున్
శ్లో. పద్మద్వయం పూర్ణకుంభం కీరంచ వరదాభయే ।
పాశమంకుశకం శంఖం చక్రం శూలం కృపాణికామ్ ॥ 142 ॥
945. ఓం *పద్మద్వయం దధానా* యై నమః ।
నామ
వివరణ.
రెండు
పద్మములను ధరించియున్న జనని.
తే.గీ. నన్ను *పద్మద్వయందధానా*! గణించి
నిన్ను మది నిల్పనిమ్మమ్మ కన్నతల్లి!
పరగ పద్మద్వయముగ నీ పాదయుగళిఁ
జేరి సేవింపనిమ్మంచు కోరుచుంటి.
946. ఓం
*పూర్ణకుమ్భం బిభ్రత్యై* నమః ।
నామ
వివరణ.
పూర్ణకుంభమును
ధరించిన జనని.
తే.గీ. తెలుపు *పూర్ణకుమ్భం బిభ్రతీ*! గణించి,
పూర్ణకుంభధారణఁ జేసి పొలుపు గనితొ?
పూర్ణ కుంభమె నీ చేత పొలుపు గనెనొ?
నాదు మది పూర్ణ కుంభమే శ్రీద! కొనుమ.
947. ఓం
*కీరం దధానా* యై నమః ।
నామ
వివరణ.
చిలుకను
ధరించిన జనని.
తే.గీ. వినుత *కీరం దధాన*! నిన్ గనితి నేను,
నాదు మది కీరముగ నీవు మోదమలర
ప్రాణ రూపివై వెలుగుదే పరవశింప,
వందనంబులు చేసెద నందుకొనుము.
948. ఓం
*వరదాభయే దధానా* యై నమః .
నామ
వివరణ.
వరములనొసగు
అభయముద్రతో కూడిన హస్తము కలిగిన జనని.
తే.గీ.
కనఁగఁ గృపతోడ నామదిన్ గల యచల త
నయవు, *వరదాభయేదధానా*, మదంబ!
విడువబోకమ్మమదిని సందడిగ నిలుము,
వందనంబులు చేసెద నందుకొనుము.
949. ఓం
*పాశం బిభ్రత్యై* నమః ।
నామ
వివరణ.
పాశమును
ధరించిన జనని.
తే.గీ. దీన శరణ!
*పాశం బిభ్రతీ*! జయోzస్తు,
పావనీ! కను మైహిక పాశములను,
భక్తి పాశమె ధరియింతు, వలవనన్య
పాశ బంధంబులన్ నినున్ బడయనెంచి.
950. ఓం
*అఙ్కుశం బిభ్రత్యై* నమః ।
నామ
వివరణ.
కోల
ధరించిన జనని.
తే.గీ. *అఙ్కుశం బిభ్రతీ*! నేను జఙ్కుఁ బాసి,
సఙ్కెలల్ మది నెడఁ బాసి యఙ్కితమయి
నీకు నర్పించుకొందు నన్ నీవు కొనుమ,
వందనంబులు చేసెద నందుకొనుము
951. ఓం
*శఙ్ఖం వహన్త్యై* నమః ।
నామ
వివరణ.
శంఖమును
ధరించిన జనని
తే.గీ. కలవు *శఙ్ఖం వహన్తీ*! ప్రకంపనవయి,
దశ దిశల్ మ్రోగు శఙ్ఖనాదముగ కలుగు
జయ నిధానవు, కలిగించు జయము నాకు
వందనంబులు చేసెద నందుకొనుము
952. ఓం
*చక్రం వహన్త్యై* నమః ।
నామ
వివరణ.
చక్రమును
ధరించిన తల్లి.
తే.గీ. వరద *చక్రమ్వహన్తీ*! శుభంబుఁ గొలుప
కాల చక్రంబుతో నీవు కదలుచుండి
యాత్మలోనిల్చి నన్నేలు హంసవీవె,
వందనంబులు చేసెద నందుకొనుము
953. ఓం
*శూలమ్వహన్త్యై* నమః ।
నామ
వివరణ. శూలమును వహించియున్న తల్లి.
తే.గీ. అసమ శూలమ్వహన్తీ! మహాత్ముల నిల
కావగా శూలధారివై కరుణ వీడి
దుష్ట సంహారమున్ జేయుదువు నిజంబు.
వందనంబులు చేసెద నందుకొనుము
954. ఓం
*కృపాణికాం వహన్త్యై* నమః ।
నామ
వివరణ.
ఖడ్గమును
ధరించియున్న జనని.
తే.గీ. ఖలులఁ జంపుమమ్మ! *కృపాణికామ్వహన్తి*!
నిలుపు సజ్జనపాళిని నీడనిచ్చి,
నీవు కాకున్న దిక్కేది నీరజాక్షి!
వందనంబులు చేసెదనందుకొనుము.
శ్లో. ధనుర్బాణౌ చాక్షమాలాం చిన్ముద్రామపి బిభ్రతీ ।
అష్టాదశభుజే లక్ష్మీర్మహాష్టాదశపీఠగే ॥ 143 ॥
955. ఓం *ధనుర్బాణౌబిభ్రత్యై* నమః ।
నామ
వివరణ.
ధనుర్బాణములు
కలిగి యున్న జనని.
కం.
శుభ్రదవు *ధనుర్బాణౌ
బిభ్రతి*! దురితాత్ములకిల పీచమడచుమా!
శుభ్రయశోవిలసిత! చి
త్తభ్రమ నెడబాపుమమ్మ! దయతో నాకున్.
956. ఓం
*అక్షమాలాం దధానా* యై నమః ।
నామ
వివరణ.
అక్షమాలను
ధరించిన తల్లి.
తే.గీ. *అక్షమాలాం దదానా*! పరీక్షలేల?
నక్షయంబుగ మదిలోన నక్షయమగు
నక్షరప్రభఁ గొలిపి నన్నాదుకొనుమ!
వందనంబులు చేసెద నందుకొనుము
957. ఓం
*చిన్ముద్రాం బిభ్రత్యై* నమః ।
నామ
వివరణ.
చిన్ముద్రతో
ఒప్పుచున్న జనని.
కం.
చిన్ముద్రాం బిభ్రతి నన్
సన్మార్గమునందు నడిపి సన్నుతితో స
చ్చిన్మార్గమునను నిలుపుము,
తన్మయమున నిన్నుఁ గొలుచి ధన్యుఁడ నగుదున్!
958. ఓం
*అష్టాదశభుజా* యై నమః .
నామ
వివరణ.
పద్దెనిమిది
భుజములతో ఒప్పుచున్న జగన్మాత.
కం.
*అష్టాదశభుజ*! లక్ష్మీ!
కష్టంబులు పాపుమమ్మ! కరుణను, నిన్నున్
స్పష్టంబగు పద్యంబుల
నిష్టముతో గొలుతునమ్మ హిమనగ పుత్రీ!
ఓం *లక్ష్మ్యై*
నమః.
కం.
*లక్ష్మీ*! ననుఁ గృపఁ గనుమా
సూక్ష్మజ్ఞానంబు నాకుఁ జూడగ నిన్నున్
లక్ష్మీప్రదముగ నిమ్మా,
లక్ష్మముగా నిన్నుఁ గొల్తు లక్ష్యము చేరన్.
959. ఓం
*మహాష్టాదశపీఠగా* యై నమః ।
నామ
వివరణ.
గొప్ప
అష్టాదశపీఠములందున్న తల్లి.
కం. మోదముతోఁ గనుము *మహా
ష్టాదశపీఠగ*! వనితల, జయగుణ నుతులన్,
బాధలనొందగఁ జేయక,
నీదయ రక్షించుగాక, నిర్మల తేజా!
శ్లో. భూమినీలాదిసంసేవ్యే స్వామిచిత్తానువర్తిని ।
పద్మే పద్మాలయే పద్మి పూర్ణకుంభాభిషేచితే ॥ 144 ॥
960. ఓం
*భూమీనీలాదిసంసేవ్యా* యై నమః ।
నామ
వివరణ.
భూదేవి,
నీలాదేవి లచే మిక్కిలి సేవింపబడు జనని.
స్వయం కల్పిత నీలా సంసేవ్య వృత్తము.
గణములు…
మ
ర
మ
య
జ
గ..
యతి 9వ అక్షరము. ప్రాస కలదు.
*భూమీ నీలాది సంసేవ్యా*! భుక్తి ముక్తి ప్రదాయినీ!
ప్రేమే నాపైన నీకున్న బ్రీతితో కావు మీశ్వరీ!
యేమాత్రంబైన నిన్ నిత్యంబీశ్వరీ! కొల్వకుంటినా?
శ్రీమాతా! భక్తమందారా! శ్రీకరంబై కనన్ గదే.
961. ఓం
*స్వామిచిత్తానువర్తిన్యై* నమః ।
నామ
వివరణ.
తన
స్వామి మనసు తెలుసుకొని ప్రవర్తించు జనని మన అమ్మ.
తే.గీ. *స్వామి చిత్తానువర్తినీ*! సన్నుతింతు.
ధీమతిన్ వరలింపుమా క్షేమమిడుచు
నాకునోయమ్మ, ప్రణమిల్లుదీకు జనని!
వందనంబులు చేసెద నందుకొనుము.
962. ఓం
*పద్మా*యై నమః ।
నామ
వివరణ.
కమలము
వంటి జనని.
కం.
*పద్మా*! తలచిన నీ ముఖ
పద్మంబును పద్యములవి పరుగున వచ్చున్,
పాద్మముగానొప్పుచు నభి
పద్మముగా నుతులు గనును, వరలింపఁగ నన్.
963. ఓం
*పద్మాలయా*యై నమః ।
నామ
వివరణ.
పద్మమునే
ఆలయముగా క్లిగి వసించు జనని.
తే.గీ. విశ్వ *పద్మాలయా*! నీదు వినుతి వింటి,
శాశ్వతంబగు సత్కీర్తి సదయఁ గొలుపు
ధర్మమయ దేవతవు నీవు తలచి చూడ.
వందనంబులు జేసెద నందుకొనుము.
964. ఓం
*పద్మిన్యై* నమః ।
నామ
వివరణ.
తామరపూవువలె
అందముగా ఉండు జనని.
తే.గీ. దివ్య *పద్మినీ*! నీ సేవ భవ్యమనుచు
సవ్యమగు రీతులన్ జేయు సన్నుతులిలఁ
గష్టముల పాలగుటకు నీవిష్టపడవు,
చేయినందింతువమ్మరో చేదుకొనగ.
965. ఓం
*పూర్ణకుమ్భాభిషేచితా* యై నమః ।
నామ
వివరణ.
పూర్ణ
కుంభముతో అభిషేకము చేయనడు జనని.
తే.గీ. *పూర్ణ కుంభాభిషేచితా*! ముగ్ధమోహ
నమ్బయిన నీదు రూపు లోకంబునందు
వ్యక్తమగునట్లు
మెలిగెడి భవ్యవీవు!
వందనంబులు చేసెద నందుకొనుము.
శ్లో. ఇందిరేందిందిరాభాక్షి క్షీరసాగరకన్యకే ।
భార్గవి త్వం స్వతంత్రేచ్ఛా వశీకృతజగత్పతిః ॥ 145 ॥
966. ఓం
*ఇన్దిరా* యై నమః ।
నామ
వివరణ.
ఇంద్రరూపిణి
అమ్మ.
తే.గీ. *ఇన్దిరా*! కని నామది మన్దిరమున
నీవు నివసించుమోయమ్మ! నిత్య శుభద!
భక్త జనులను బాలించు భాగ్యరాశి!
వందనంబులు చేసెద నందుకొనుము.
967. ఓం
*ఇన్దిరాభాక్ష్యై* నమః ।
నామ
వివరణ.
చంద్రుని
వలె ప్రకాశించు జనని.
తే.గీ. *ఇన్దిరాభాక్షి*!
నాదు హృన్మన్దిరమున
మేలుగా నిల్చి, నాకిట మేలుఁగొల్పు
మమ్మ! నమ్మినవారికిహంబునందు
కాచి రక్షించుచుందువు కనక దుర్గ!
968. ఓం
*క్షీరసాగరకన్యకా* యై నమః .
నామ
వివరణ.
పాలసముద్రుని
పుత్రిక ఈ అమ్మవారు.
తే.గీ.
క్షీర సాగర కన్యకా! కీర్తి ఫలద!
నాదు హృదయంబు క్షీరాబ్ధి, మోదమలర
యిచట వసియింపుమమ్మరో యిష్టముగను
వందనంబులు చేసెద నందుకొనుము.
969. ఓం
*భార్గవ్యై* నమః ।
నామ
వివరణ.
భర్గమహాముని
కుమార్తె మన అమ్మ.
తే.గీ. *భార్గవీ*! నాదు మదిలోని బాధలెన్ని
నీవు పోకార్పుమమ్మరో నిరుపమాన!
నిన్ను నా పద్యరచనలో నిరుపమముగ
భక్తులకు జూపి తెల్పెద శక్తికొలది.
970. ఓం
*స్వతన్త్రేచ్ఛా* యై నమః ।
నామ
వివరణ.
స్వతంత్రముపై
ఇచ్ఛకల జనని. స్వతణ్త్రేచ్ఛ అమ్మవారే.
తే.గీ. కను, *స్వతన్త్రేచ్ఛ*! నన్నిలన్ గరుణ తోడ,
లేదు స్వేచ్ఛేచ్ఛ నాకు, నీ వాదుకొనెడి
దైవముండగా నాకేల తల్లడంబు
వందనంబులు చేసెద నందుకొనుము.
971. ఓం
*వశీకృతజగత్పత* యే నమః ।
నామ
వివరణ.
విశ్వప్రభువగు
భగవానుని ఆకర్షించు జనని.
స్వయంకల్పిత వశీకర వృత్తము.
గణములు.
జ
స
జ
జ
గగ.
యతి 9వ అక్షరము. ప్రాసకలదు.
*వశీకృత జగత్పతీ*! పరమార్థమీవే,
నిశాచరు గణంబు నన్ నిలువంగ చేయున్,
ప్రశాంతమును కోల్పడన్ రహియింపఁ జేయన్
విశేషముగ నిన్ను,నేవిధినౌన్ మదంబా!
శ్లో. మంగళం మంగళానాం త్వం దేవతానాం చ దేవతా ।
త్వముత్తమోత్తమానాం చ త్వం శ్రేయః పరమామృతమ్ ॥ 146 ॥
972. ఓం
*మఙ్గలానాంమఙ్గలా* యై నమః ।
నామ
వివరణ.
మంగళములకే
మంగళములు మన అమ్మ.
స్వయంకల్పితమాంగల్య గౌరీ వృత్తము.
గణములు… న ర
త
త
త
గ.
యతి.
12వ అక్షరము. ప్రాసకలదు.
మహిత *మఙ్గలానాంమఙ్గలా*! నిన్ మదిన్ గొల్చెదన్,*
మహిమ నీ కృపన్ నేఁ గాంతునమ్మా,
మనోజ్ఞప్రభా!
విహిత కర్మగా నిన్ గొల్తు భక్తిన్ విధాత్రీ! మదిన్.
సహనశీలమున్ శాంతంబు, నిమ్మా, సదా వెల్గగన్.
973. ఓం
*దేవతానాందేవతా*యై నమః ।
నామ
వివరణ.
దేవతలకే
దేవత మన అమ్మ.
స్వయం కల్పిత దైవ సన్నుత వృత్తము.
గణములు..
ర
త
మ
య
ర
.. యతి. 9వ అక్షరము. ప్రాస కలదు.
*దేవతానాం దేవతా*! స్వాధీనమై నిన్ గొల్వనీ!
జీవితాంతంబీవెగా రాజిల్లఁ జేయన్ గల్గితే
భావమందున్, బోధయందున్ వా ఙ్మయంబందీవెయై
కావరమ్మా, సామ భాసా! కల్పవల్లీ! సంస్తుతుల్
974. ఓం
*ఉత్తమానాముత్తమా* యై నమః ।
నామ
వివరణ.
ఉత్తములకే
ఉత్తమురాలు మన అమ్మ.
కం.
చిత్తువుగ *యుత్తమానా
ముత్తమ*!
నా శక్తి నీవె యొప్పుగ ధరపై
నుత్తమ గతి నడిపింపుము,
బత్తిగ నిను గొలిచెద నిల,
భద్రా! జననీ!
975. ఓం
*శ్రేయసే* నమః ।
నామ
వివరణ.
క్షేమప్రదాయిని
మన అమ్మ.
కం.
*శ్రేయసి*! లోకశ్రేయము
వేయివిధంబులుగఁ గూర్చ వేల్పువు నీవే,
మాయాజాలము పాపుము,
ధీయుత! వందనము నీకు, దీవించు ననున్.
976. ఓం
*పరమామృత* యే నమః ।
నామ
వివరణ.
అమ్మ
గొప్ప అంఋత స్వరూపిణి.
కం.
*పరమామృత*! జయదా! నను
కరుణించుము శుభములొసగి, ఘనతరముగ నే
వరలింతును బద్యంబులఁ
బరమాద్భుతమయిన నీదు పావన చరితన్.
శ్లో. ధనధాన్యాభివృద్ధిశ్చ సార్వభౌమసుఖోచ్ఛ్రయా ।
ఆందోళికాదిసౌభాగ్యం మత్తేభాదిమహోదయః ॥ 147 ॥
977. ఓం
*ధనధాన్యాభివృద్ధ* యే నమః ।
నామ
వివరణ.
ధనధాన్యాదులను
వృద్ధి చేయు జనని.
తే.గీ.
సు
*ధనధాన్యాభివృద్ధి*! నా సొదను వినుమ,
సు ధనధాన్యాభివృద్ధి నీ శోభయె కద,
విజయ మార్గాన నడిపెడు విశ్వమూర్తి!
వందనంబులు చేసెద నందుకొనుము.
978. ఓం
*సార్వభౌమసుఖోచ్ఛ్రయా* యై నమః .
నామ
వివరణ.
సార్వభౌమత్వమును,
సుఖమయ జీవితమును అనుగ్రహించు జననింఅన అమ్మ.
తే.గీ. *సార్వబౌమసుఖోచ్ఛ్రయా*! సర్వమీవె,
నిర్వహణశక్తి నీవెయై సర్వ కార్య
నిర్వహణమీవె చేయుచున్ నిఖిల జగతి
సర్వ సంపదలొసఁగెడు సన్నుత గుణ!
979. ఓం
*ఆన్దోలికాదిసౌభాగ్యా* యై నమః ।
నామ
వివరణ.
పల్లకీలలోప్రయాణించే
అదృష్టాన్ని ప్రసాదించు జనని.
తే.గీ.
భవిత*నాందోలికాది సౌభాగ్య*! యూహ
చేయఁ
జాలను, పతనమై చేరనేమొ
నిన్ను
నను భీతి కలుగుటన్, నీవె నన్ను
కాచిరక్షించు,
తప్పదు, కన్నతల్లి!
980. ఓం
*మత్తేభాదిమహోదయా*యై నమః ।
నామ
వివరణ.
మత్తేభములు
మొదలగు నవి కలిగిన జనని.
కం.
*మత్తేభాదిమహోదయ*!
క్షుత్తేలను గొలపఁబడెనొ? క్షుధఁ దాళకలే
కత్తరి దుష్కరులగుచును
క్షుత్తును పోకార్పుకొనరె, కూర్మిని కనుమా.
శ్లో. పుత్రపౌత్రాభివృద్ధిశ్చ విద్యాభోగబలాదికమ్ ।
ఆయురారోగ్యసంపత్తిరష్టైశ్వర్యం త్వమేవ హి ॥ 148 ॥
981. ఓం
*పుత్రపౌత్రాభివృద్ధ* యే నమః ।
నామ
వివరణ. వంశవృద్ధిని చేయు జనని.
తే.గీ. *పుత్రపౌత్రాభివృద్ధ*! నన్ ముదముతోడఁ,
గనుచు కాపాడుమమ్మరో ఘనతఁ గొలిపి,
పుత్రపౌత్రాభివృద్ధితోఁ పూజ్య! కనుమ,
నిన్ను సన్నుతించెదనమ్మ! నిరుపమాన!
982. ఓం
*విద్యాభోగబలాధికా*యై నమః ।
నామ
వివరణ. విద్య, భోగము, బలము మున్నగునవి అధికముగా కలిగిన జనని.
కం.
*విద్యాభోగ బలాధిక*!
సద్యశమును గొలుపు జనని చక్కగ మదిలో
నుద్యుక్తురాలివగుచును
సాధ్యాసాధ్యములు నెరపి సన్నుతిఁ గనుమా.
983. ఓం
*ఆయు రారోగ్య సంపత్త*యే నమః ।
నామ
వివరణ.
ఆయురారోగ్య
సంపదలు అమ్మయే.
తే.గీ. *ఆయురారోగ్యసమ్పత్త*! జ్ఞేయమీవె
జ్ఞానమును నీవె తల్లిరో కనగ మేము.
సదయ నారోగ్య భాగ్యముల్ ముదమునిమ్ము,
వందనంబులు చేసెద నందుకొనుము.
984. ఓం
*అష్టైశ్వర్యా*యై నమః ।
నామ
వివరణ.
అష్టైస్వర్యములూ
అమ్మయే.
కం.
నష్టంబులనే యణచుచు
కష్టంబులు బాపుచుండి కనురెప్పలటుల్
దృష్టినిపెట్టుచు కాచెడి
*అష్టైశ్వర్యా*! మదంబ! హాయినొసగుమా.
శ్లో. పరమేశవిభూతిశ్చ సూక్ష్మాత్సూక్ష్మతరాగతిః ।
సదయాపాంగసందత్తబ్రహ్మేంద్రాదిపదస్థితిః ॥ 149 ॥
985. ఓం
*పరమేశవిభూత్యై* నమః ।
నామ
వివరణ.
పరమేశ్వరుని
శక్తి అమ్మయే.
కం.
*పరమేశవిభూతీ*! శ్రీ
పరమేశ్వరు సతివి నీవె, భక్త జనాళిన్
వరలింపుము కాపాడుచు,
కరుణామయి వందనములు జ్ఞాన మొసఁగుమా.
986. ఓం
*సూక్ష్మాత్సూక్ష్మతరాగత* యే నమః ।
నామ
వివరణ.
సూక్ష్మముకంటేనూ
అతి సూక్ష్మతరమయిన జనని.
కం.
*సూక్ష్మాత్సూక్ష్మతరాగత!
లక్ష్మీసంవర్ధక పద లాలిత్యముతో
నీ క్ష్మాకున్ శుభతతులను
లక్ష్మీ మాతా! యొసగుము లక్ష్యము తోడన్.
987. ఓం
*సదయాపాఙ్గసన్దత్తబ్రహ్మేన్ద్రాది పదస్థిత*యే నమః ।
నామ
వివరణ.
తన
దయతో తడిసిన వంచబడిన శిరస్సులుకలిగిన బ్రహ్మేంద్రాదులులను కలిగిన
జనని.
స్వయంకల్పిత దయాపాంగ వృత్తము.
గణములు…న య
య
మ
భ
ర. యతి. 11వ అక్షరము. ప్రాస కలదు.
వర *సదయాపాఙ్గసన్దత్తబ్రహ్మేన్ద్రాది పదస్థితా*!
నిరుపమ జ్ఞానాక్షమిమ్మమ్మా, నిన్ గాంచన్ మది నిత్యమున్,
పరమన నీవే కదమ్మా నీపై భక్తిన్ దయనీయుమా,
సురుచిర సౌందర్యతేజంబా! చూడంగా నను రాగదే.
శ్లో. అవ్యాహతమహాభాగ్యం త్వమేవాక్షోభ్యవిక్రమః ।
సమన్వయశ్చ వేదానామవిరోధస్త్వమేవ హి ॥ 150 ॥
988. ఓం
*అవ్యాహతమహాభాగ్యా* యై నమః .
నామ
వివరణ.
అంతులేని
మహాభాగ్యురాలు అమ్మ.
స్వయం కల్పిత దివ్యాంబర దీప్తీ వృత్తము.
గణములు.
త
స
మ
జ
జ
గ.
యతి… 9వ అక్షరము…
ప్రాస నియమము కలదు.
*అవ్యాహత మహాభాగ్యా*! హార నూపుర శోభితా!
దివ్యాంబర మహావీధిన్ దీప్తివై కనిపించుమా
సవ్యంబుగ సుసాధ్యంబై సన్నుతుల్ గను శాంభవీ!
దివ్యాంబర మహా వృత్తాధీశ్వరీ జయరూపిణీ!
989. ఓం *అక్షోభ్య విక్రమా*యై నమః ।
నామ
వివరణ.
ఎప్పటికీ
తరగని పరాక్రమము కలిగిన జనని.
తే.గీ.
అనుప*మాక్షోభ్య విక్రమా*! యభినుతింతు.
దక్షులైనట్టివారినిఁ దలచి నిలుపు.
కావ్య కారణ కర్తవు, కవివి నీవు
వందనంబులు చేసెద నందుకొనుము.
990. ఓం
*వేదానామ్సమన్వయా* యై నమః ।
నామ
వివరణ.
వేదములకు
సమన్వయమగు జనని.
కం.
సరియెవ్వరు నీకు? మనో
హరి! *వేదానామ్సమన్వయా*! గుణ వినుతా!
సురుచిర సుందర వదనా!
పరమేశ్వరి! భక్తిఁ గొలుతు వర్ధిలనిమ్మా.
991. ఓం
*వేదానామవిరోధా*యై నమః ।
నామ
వివరణ.
వేదములకు
విరోధము కానిది అమ్మ.
కం.
*వేదానామవిరోధా*!
వేదజ్ఞానంబు నాకు వేగమె యిమ్మా,
నీ దయ నాకున్ గలిగిన
బాధలు విడి సుఖము కలుగు భవహర జననీ!
కం.
*వేదానామవిరోధా*!
ఖేదము కలిపింతువేల కేళియొ నీకున్?
బాధలఁ దొలగించుము,
నన్
నీదరికిన్ జేరనిమ్ము,
నిర్గుణ భాసా!
శ్లో. నిఃశ్రేయసపదప్రాప్తిసాధనం ఫలమేవ చ ।
శ్రీమంత్రరాజరాజ్ఞీ చ శ్రీవిద్యా క్షేమకారిణీ ॥ 151 ॥
992. ఓం
*నిఃశ్రేయసపదప్రాప్తి సాధనంఫలా*యై నమః ।
నామ
వివరణ.
శుభప్రదమయిన
శంకర పద ప్రాప్తిసాధనా ఫలితమునందించు జనని.
స్వయంకల్పిత సాధనా ఫల వృత్తము.
గణములు…
స
భ
య
జ
ర…
యతి 9వ అక్షరము..
ప్రాస కలదు.
వర *నిఃశ్రేయస పదప్రాప్తి సాధనంఫలా*!
కరుణింపంగదె ననున్ క్రాంతి రూప శాంభవీ!
నిరపాయంబుగ ననున్ నీవ చూడు ధాత్రిపై
వరపాదా!
కొలువనీ భావబంధమొప్పఁగన్
993. ఓం
*శ్రీమన్త్రరాజరాజ్ఞై* నమః ।
నామ
వివరణ.
శ్రీచక్రమంత్రమునకు
రాజ్ఞి మన అమ్మ.
కం.
*శ్రీమన్త్రరాజ రాజ్ఞీ*!
ధీమంతుల ముఖములందు తేజము నీవే,
నా మదిలో నీవుండిన
తేజము నాకును లభించు తేజో రూపా!
994. ఓం
*శ్రీవిద్యా*యై నమః ।
నామ
వివరణ.
శ్రీవిద్య
అమ్మయే.
కం.
*శ్రీవిద్యా* కరుణింపుము,
నీ విశ్వప్రభఁ గనుటకు నిను సేవింతున్.
జీవితమల్పము కాంచుము
నీవే నీ సేవఁ జేయు నేర్పునొసగుమా.
995. ఓం
*క్షేమకారిణ్యై* నమః ।
నామ
వివరణ.
క్షేమమునకు
కారణమయిన జనని మన అమ్మ.
తే.గీ. *క్షేమ కారిణీ*! శుభద! సు క్షేమము గన,
లోన నిను నిల్పి నే సుఫలుండనగుదు
నేను సేవింపఁ జాలనో నిన్ను జనని?
చాలకున్నచో
కలిగింపఁ జాలుదీవు.
శ్లో. శ్రీంబీజజపసంతుష్టా ఐం హ్రీం శ్రీం బీజపాలికా ।
ప్రపత్తిమార్గసులభా విష్ణుప్రథమకింకరీ ॥ 152 ॥
996. ఓం
*శ్రీంబీజ జపసన్తుష్టా*యై నమః ।
నామ
వివరణ.
శ్రీం
అను బీజాక్షర జపముచేయునంతలో సంతోషించు జనని.
స్వయంకల్పిత శ్రీంబీజ వృత్తము.
గణములు...
న
త
స
త
జ
వ…. యతి12వ అక్షరము..ప్రాస కలదు.
వినుత
*శ్రీంబీజ జప సంతుష్టా*! వినుతిన్ వినుమా
కనుమ నాలోని వర భావాలన్ కరుణం గొలుపన్
ధనములిమ్మంచు నిను కోరన్, బాధలు పెట్టకుమా,
మనము నీవల్ల గను సంతృప్తిన్, మదిలో నిలుమా.
997. ఓం
*ఐం హ్రీం శ్రీం బీజపాలికా*యై నమః ।
నామ
వివరణ. బీజాక్షరములయిన ఐం హ్రీం శ్రీం నకు పాలకురాలు అమ్మ.
స్వయం కల్పిత బీజపాలికా వృత్తము.
మ
ర
య
జ
గ….. యతి
9వ అక్షరము. ప్రాస నియమము కలదు.
*ఐం హ్రీం శ్రీం బీజపాలికా*! యాత్మనుండుమా!
ఐం హ్రీం శ్రీం శ్రీ సరస్వతీ! యద్భుతాక్షరా
ఐం హ్రీం శ్రీం పార్వతీసతీ! యక్షసేవితా!
ఐం హ్రీం శ్రీం దక్షపుత్రికా! హాయినిమ్మికన్
998. ఓం
*ప్రపత్తిమార్గసులభా*యై నమః .
నామ
వివరణ.
శరణాగతులగు
భక్తులకు ముక్తిమార్గమును సులభము చేయు తల్లి.
ఉత్సాహ వృత్తము.
సత్ ప్రపత్తిమార్గ సులభ!సన్నుతింతు నిన్నిలన్
సత్ప్రవృద్ధిఁ జేయుమమ్మసద్గుణమణులెన్నగన్,
సత్ ప్రబోధఁ గొలుపుమమ్మ, సంస్తుతింపనందరున్
సత్ప్రశాంతి నిమ్ము నాకు సన్నుతముగ నీశ్వరీ!
999. ఓం
*విష్ణుప్రథమకిఙ్కర్యై* నమః ।
నామ
వివరణ.
విష్ణు
దేవునకు మొదటి సేవకురాలు.
కం.
ప్రకృతీ! శ్రీ *విష్ణుప్రథ
మ కిఙ్కరీ*! నీ దయనిల మంచియె జరుగున్
సకలార్థ సారమీవే
యకలంక మహత్వ భక్తి ననుపమ! యిమ్మా.
శ్లో. క్లీంకారార్థసవిత్రీ చ సౌమంగళ్యాధిదేవతా ।
శ్రీషోడశాక్షరీవిద్యా శ్రీయంత్రపురవాసినీ ॥ 153 ॥
1000. ఓం
*క్లీఙ్కారార్థసవిత్ర్యై* నమః ।
నామ
వివరణ.
క్లీంకారముయొక్క
అర్థమయిన సవిత్ర స్వరూపిణి మన అమ్మ.
కం. *క్లీంకారార్ధ
సవిత్రీ*!
యోంకారములోన
నీవె యుంటివి జననీ!
ఐంకారంబును
నీవే,
శ్రీంకారా!
నిలుము నాదు చిత్తము లోనన్
ఓం *క్లీఙ్కారార్థసావిత్ర్యై*
నమః ।
నామ వివరణ.
క్లీంకారముయొక్క అర్థమయిన సవిత్ర స్వరూపిణి మన అమ్మ.
స్వయంకల్పిత క్లీంకార వృత్తము.
గణములు. మ య త త ర, … యతి8వ అక్షరము. ప్రాస కలదు.
*క్లీఙ్కారార్థ సావిత్రీ*!
కీర్తిసంపద్ప్రదా సుధీ!
శఙ్కాదూర! శ్రీదేవీ! శక్తియుక్తి
ప్రదాతవై
జఙ్కున్ బాపి నన్నేలే చక్కనమ్మా!
సుధాంబుధీ!
యఙ్కాఙ్కంబునన్ నీవే,యాత్మ రూపాదులన్ సుధీ!
1001. ఓం
*సౌమఙ్గల్యాధిదేవతా* యై నమః ।
నామ
వివరణ.
సుమంగలములకు
అధిదేవత మన అమ్మ.
కం.
ముదముగ *సౌమంగల్యా
ధిదేవతా*! మొక్కవోని దీక్షను గొనుచున్
ముదముగ సహస్ర నామము
లొదిగించితి పద్య తతిని, యోహో యనగన్.
1002. ఓం
*శ్రీషోడశాక్షరీవిద్యా*యై నమః ।
నామ
వివరణ.
షోడశాక్షరీ
మంత్రస్వరూపము అర్థసహితముగా వివరణ
శ్లో||
హరిప్రియా మహామాయా కామవాక్ఛక్తి బీజకం,
తారం
మాయా రమాబీజం వాగ్భవం చిత్తజన్మనః ||
విద్యాయాః
స్వద్వితీయంచ తృతీయం శక్తిసంజ్ఞకం,
శక్తివాక్కామబీజాని
మహామాయా హరిప్రియా,
బీజరూపా
షోడశీయం సర్వసంపత్తిదా పరా ||
హరిప్రియాబీజము
''శ్రీం''
కారము. మాయాబీజము ''హ్రీం'' కారము. కామబీజము ''క్లీం'' కారము. వాగ్బీజము ''ఐం'' కారము. శక్తి బీజము ''సౌః'' అను వర్ణము. తారమనగా ''ఓం''కారము. మాయాబీజము
''హ్రీం''కారము రమాబీజము ''శ్రీం'' కారము. వాగ్బీజము ''ఐం''కారము. కామరాజ
విద్యయొక్క ద్వితీయవర్ణము అనగా ''క్లీం''కారము. తృతీయబీజమనగా ''సౌః'' అను వర్ణము. శక్తిబీజ మనగా ''సౌః'' వర్ణము. వాగ్బీజమనగా ''ఐం''కారము. కామబీజ
మనగా ''క్లీం''కారము. మహామాయాబీజమనగా ''హ్రీం''కారము. హరిప్రియా బీజమనగా ''శ్రీం'' కారము. సర్వసమిష్టిగా మంత్రస్వరూపము:
''శ్రీం
హ్రీం క్లీం ఐం సౌః, ఓం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః, సౌః ఐం క్లీం
హ్రీం శ్రీం –
మతాంతరమందు
కూటత్రయ సహితము ఎట్లనగా:
శ్రీం
హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం క ఐం ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం
సౌః
ఐం క్లీం హ్రీం శ్రీం అని యగును. – (త్రైలోక్యమోహన కవచము.) అట్టి షోడశాక్షరీ విద్య
జగజ్జననియే.
కం.
ప్రాకటముగ వెలుగొందగ
శ్రీకర! *శ్రీ షోడశాక్షరీవిద్యా*! నీ
వీక్రియ వ్రాయించితివా,
నీ కృతి పది దినములందె నిరుపమ లక్ష్మీ!
1003. ఓం
*శ్రీయన్త్రపురవాసిన్యై* నమః ।
నామ
వివరణ.
లక్ష్మీయంత్రపురమున
వసించు తల్లి ఈ లీక జనని.
తే.గీ. మధుర కమనీయ కవిత లమర్చి యిచట
వేయి నామాల పద్యాలు వ్రాయఁ జేసి
తీవు పదిదినములలోన, దీప్తి గొలుపు
నిధివి, *శ్రీ యన్త్ర పుర వాసినీ*! నిజంబు.
శ్లో. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే ।
శరణ్యే త్ర్యంబకే (గౌరీ) దేవీ, నారాయణి నమోఽస్తు తే ॥ 154 ॥
1004. ఓం
*సర్వమఙ్గలమాఙ్గల్యా*యై నమః ।
నామ
వివరణ.
సమస్తమునూ
మంగళమూ, మంగళప్రదమునూ ఈ జనని.
తే.గీ. *సర్వ మఙ్గల మాఙ్గల్య*! సరసిజపద!
పద్యలక్ష్మీ సహస్రమున్ హృద్య గతిని
చదువు మహితులకిల శుభచయము గొల్పు
మంగలాంగివి నీకు సన్ మంగలములు.
ఓం *శివా*యై నమః.
నామ
వివరణ.
శుభప్రదమయిన
జనని.
శుభములకు
ఆలవాలమయిన జనని మన అమ్మ శివా.
పంచచామరము.
*శివా*!
శుభంకరీ! జయంబు, చిత్తమందు ప్రీతితో
నివాసముండుమమ్మ!
నన్ను నీవె కావ నిత్యమున్,
భవుండు
కూడ నీకు తోడు వచ్చునట్లు చేయుమా,
ప్రవృద్ధిఁ
గొల్ప ముక్తి నీయ వాసిగాను నాకిలన్.
1005. ఓం *సర్వార్థ సాధికా*యై నమః.
నామ
వివరణ.
సమస్త
అర్థమునూ సాధన అమ్మవలననే సంభవము.
సాధకులకు
సర్వార్థములు సాధ్యపడునట్లు అనుగ్రహించు జనని మన అమ్మ.
తే.గీ.
వినుత్
*సర్వార్థ సాధికా*
వినుము మొరను,
ప్రణవరూపిణీ
నీకు నా ప్రణతులమ్మ!
మంగలాకారవైన
నిన్ మదిని నిలిపి
సేవచేసెదనాత్మలో
చిత్తమలర.
ఓం *సర్వార్థసాధికా*యై నమః ।
కం.
ప్రేరేపించుచు మదిలోఁ
గోరుచు నను,
వ్రాయఁ జేసుకొంటివి జననీ!
తీరుగ సహస్ర మిట, శుభ
కారిణి! *సర్వార్థ సాధికా*! మంగళముల్.
1006. ఓం
*శరణ్యా* యై నమః ।
నామ
వివరణ.
అందరికీ
శరణునొసగెడి మాత.
కం.
జీవమగు *శరణ్యా*! నీ
దీవనలు లభించుటన్న దివ్యమె నాకున్
దీవించి వ్రాయఁ జేసితి
వీవిధముగ వేయి పేర్లు ప్రీతిగ నీవే!
1007. ఓం
*త్ర్యమ్బకా* యై నమః ।
నామ
వివరణ.
పరమేశ్వర
రూపము అమ్మయే.
తే.గీ. *త్ర్యమ్బకా*!
దేవి! నిన్నునత్యంతభక్తిఁ
గొలుచుటొప్పును, నేర్పుమా గొలుచుటెట్లొ,
పూజ్య! నీపాద యుగళిపై పుష్పమగుదు.
మాన్యగుణ ధామ నీకు సన్మంగళములు.
ఓం
*గౌర్యై* నమః.
నామ
వివరణ.
గౌరవర్ణముతో
ప్రకాశించు దేవీ స్వరూపిణి మన గౌరీమాత.
కం.
మంగల రూపిణి! *గౌరీ*!
(*దేవీ*!)
మంగలములు
నీవు కలుగ మాలో జననీ!
మంగలములు
నీకు సతము,
మంగలములు
కలుగఁ జేసి మము కృపఁ గనుమా.
1008. ఓం
*నారాయణ్యై* నమః
.
నామ
వివరణ.
పార్వతీ
దేవియే నారాయణి.
కం.
*నారాయణి*! నీ నామమె
పారాయణ చేయఁదగిన వరమంత్రము, సు
స్మేరముఖాంభోజా! నీ
వారిని కాపాడుము నుత పద!
మంగళముల్.
శ్రీ స్కన్దపురాణమున సనత్కుమారసంహితలోఁగల
లక్ష్మీసహస్రనామస్తోత్రాధారిత నామావలికి
శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్ర పద్యదళపద్మ
రచన సమాప్తము.
కాణ్వశాఖీయ
కౌశికస
గోత్ర
చింతా
వంశజ
సన్యాసిరామారావు
ధర్మపత్నివేంకటరత్నమాంబ
పుణ్య
దంపతుల
జ్యేష్ట
పుత్రుఁడును,
పూజ్య
సద్గురుదేవ
పరమాత్మ
స్వరూప
కల్వపూడి
వేంకట
వీర
రాఘవాచార్యుల
ప్రియ
శిష్యుఁడును
రామకృష్ణారావు
నామధేయుఁడనగు నాచే శ్రీమాత పదిదినములలో
రచింపంజేసిన
శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మ రచన సంపూర్ణమ్.
కం.
దినమునకొక
శతనామము
- లనుపమపద్యములలోన నలర రచింపన్
ఘనముగ పది దినములు నా
- మనమున నివసించె లక్ష్మి మహిమాన్వితయై.
కృతికర్త పరిచయము
భాషాప్రవీణ., చిత్రకవితాసమ్రాట్., కవికల్పభూజ., చిత్రకవితా సహస్రఫణి., ఆశుపద్యకవితాభిరామ.,చింతా రామ కృష్ణా రావు. M.A.,.
విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.
ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్
ఆర్వీధర్మిష్ఠ...
డీమార్టుకు
ఎదురుగా..
మియాపూర్, హైదరాబాద్. 49.
తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165
రచనలు.
1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.
2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో,
ప్రతీపాదమునా మూడు
ప్రాసయతులతో ఒక్క రోజులో వ్రాసినది.)
3) ఆంధ్రసౌందర్యలహరి.
4) ఆంధ్రామృతమ్, పద్యవిపంచి,
యువతరంగమ్. బ్లాగులలో అనేక స్వీయ రచనలు.
5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు
పద్యానువాదము.
6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.
7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)
9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.
10) ప్రజ పద్య సీస
గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.
11) బాలభావన శతకము.
12) మూకపంచశతి
పద్యానువాదము.
13) మేలిమిబంగారం మన
సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.
14) రమాలలామ శతకము.
(ఒక్క రోజులో వ్రాసినది.)
15) రాఘవా! శతకము.
16) రామకృష్ణ శతకము.
(ఒక్క రోజులో వ్రాసినది.)
17) రుద్రమునకు
తెలుగు భావము.
18) లలితా
శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
19) వసంతతిలక సూర్య
శతకము.
20) విజయభావన శతకము.
21) వృద్ధబాలశిక్ష
శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
22) వేదస్తుతి,
షోడశ చిత్రకవితలు.
23) శ్రీ
అవధానశతపత్రశతకము.
24) శ్రీచక్రబంధ
అష్టలక్ష్మీ స్తోత్రము.
25) శ్రీచక్ర బంధ
సప్తస్వర సర్వమంగళాష్టకము.
26) శ్రీచక్రబంధ
మంగళాష్టకము.
27) శ్రీచక్రబంధ
శ్రీరామ దశకము.
28)
శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.
29) శ్రీమద్యాదాద్రి
శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత నృసింహనామాంచిత
118 ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.)
30) శ్రీమన్నారాయణ
శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)
31) శ్రీమన్నారాయణీయ
పద్యానువాదము.
32) శ్రీయాజ్ఞవల్క్య
శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
33) శ్రీ లక్ష్మీ
సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.
34) శ్రీలలితా సహస్ర
నామాంచిత పద్యసహస్రదళపద్మము.
35) శ్రీవేణుగోప కంద
గీత గర్భ చంపకోత్పల శతకము. (బంధచిత్రకృతి ఒకే శతకమున
మూడు మకుటములతో మూడు శతకములు.)
36) శ్రీ శిరిడీశ
దేవ శతకము,(వారం
రోజులలో వ్రాసినది.)
37)
శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క రోజులో వ్రాసినది.)
38) శ్రీ
శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త శివశతకము.
39) సుందర
కాండ.(రామాన్వయముగా కందపద్యములు, సీతాన్వయముగా తేటగీతి
పద్యములు, హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల నక్షత్రమాల.)
40) సురగవి నవ
రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)
41) స్వతంత్ర భారత
వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత పాద
ఉత్పలమాలిక.
//స్వస్తి.//