గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జూన్ 2022, బుధవారం

అపరేయమితస్త్వన్యాంషు..|| 7-5 || . ఏతద్యోనీని భూతాని.. || 7-6 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

జైశ్రీరామ్.

 || 7-5 ||

అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్|

జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్.

తే.గీ.  ఓమహాబాహుడా! యల్ప యొప్పిదమిది,

యిదియె కాక వేరగు జీవి యయిన ప్రకృతి

నాది, గనుమిది,  దాననే నడచుచుండు

జగము, లేదన్యమెంచినన్, ప్రగణితముగ.

భావము.

ఓ మహానుభాహుడా! ఇది అల్పమైనది.ఇంతకన్నా వేరై జీవుడిగా మారినదీ 

నా పరమైన ప్రకృతి అని తెలుసుకో. దాని వలననే ఈ జగత్తు భరించబడుతుంది.

|| 7-6 ||

ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ|

అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా.

తే.గీ. అన్ని ప్రాణులకునుమూల మరసిచూడ

యిట్టి యీ నా ప్రకృతిమూల మిదియె నిజము,

సృష్టి యుత్పత్తి నాశముల్ చేయుదేను

నేనె మూలమంచెరుగుము నీఖిలమునకు.

భావము.

ఈ నా ప్రకృతి అన్ని ప్రాణులకీ మూలమని తెలుసుకో. యావత్తు 

జగత్తు యొక్క ఉత్పత్తి, నాశనములకు మూలము నేనే అని తెలుసుకో.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.