జైశ్రీరామ్.
|| 7-29 ||
శ్లో. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతన్తి యే|
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్.
తే.గీ. సాధకులు జరా మరణముల్, సతవరంబె
విడువనెంచి నన్ గొలుతురో, విశ్వమందు
నాత్మ తత్వ జ్ఞులగుదురా యాత్మనెరిగి,
కర్మమునుగూర్చెరుగుదురు, ధర్మరూప!
భావము.
జరా మరణాల నుండి విడుదల కావాలని ఎవరు నన్ను ఆశ్రయించి
సాధన చేస్తారో వాళ్ళు సంపూర్ణంగా ఆబ్రహ్మమూ ఆత్మ తత్వాన్ని
యావత్తు కర్మనీ తెలుసుకుంటారు.
|| 7-30 ||
శ్లో. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః|
ప్రయాణకాలేऽపి చ మాం తే విదుర్యుక్తచేతసః.
తే.గీ. ఆదిభూతంబుతోడనా యాది దైవ
తంబుతోడను నాది యజ్ఞంబుతోడ
కూడియున్న నన్నెవరిల గొప్పగాను
తెలుసుకొందురో తుదిని నన్ తీరుగ గను.
భావము.
సమస్త అధిభూత (పదార్థ క్షేత్రము), అధిదైవ (దేవతలు), మరియు
అధియజ్ఞము (యజ్ఞములకు ఈశ్వరుడు) లకు అధిపతిని నేనే అని
తెలుసుకున్న జ్ఞానోదయమయిన జీవాత్మలు, మరణ సమయంలో
కూడా పూర్తిగా నా యందే స్థితమై ఉంటారు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
జ్ఞానవిజ్ఞానయోగో నామ సప్తమోऽధ్యాయః
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.