గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జూన్ 2022, ఆదివారం

ధూమో రాత్రిస్తథా కృష్ణః ..|| 8-25 || . శుక్లకృష్ణే గతీ హ్యేతే .. || 8-26 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

 జైశ్రీరామ్.

|| 8-25 ||

శ్లో.  ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్|

తత్ర చాన్ద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే.

తే.గీ.  కృష్ణపక్షంబు, పొగ, రాత్రి, తృష్ణ, దక్షి

ణాయనమున యోగి యారునెలలు,

పయనమును జేసి చంద్రుని వరలు జ్యోతి

పొంది వచ్చును తిరిగి తాన్, పుణ్యగేహ!

భావము.

పొగ, రాత్రి, కృష్ణపక్షం ఆరు నెలలు దక్షిణాయనం అనే మార్గంలో 

ప్రయాణించిన యోగి చంద్రుని జ్యోతిని పొంది తిరిగి వస్తాడు.

 || 8-26 ||

శ్లో.  శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే|

ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః.

తే.గీ.  శుక్ల, కృష్ణ, మార్గము లవి చూడ రెండు

శాశ్వతంబని తలపనౌన్, చక్కనైన

శుక్లమున జన్మ కలుగదు, చూడ మనకు,

కృష్ణ యందు పునర్జన్మ క్షితిని కలుగు.

భావము.

జగత్తులో శుక్ల, కృష్ణ అనే ఈరెండు మార్గాలు శాశ్వతం అని 

భావించబడుచున్నవి. మొదటి దానివలన పునర్జన్మ కలగదు.

రెండవ దాని వలన కలుగుతుంది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.