గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జూన్ 2022, బుధవారం

సహస్రయుగపర్యన్తమహర్యద్ ..|| 8-17 || . అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః .. || 8-18 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

జైశ్రీరామ్.

|8-17 ||

శ్లో.  సహస్రయుగపర్యన్తమహర్యద్ బ్రహ్మణో విదుః|

రాత్రిం యుగసహస్రాన్తాం తేऽహోరాత్రవిదో జనాః.

తే.గీ.  కనగ విధికి వేయి మహాయు గములు పగలు,

కాంచ నటులె వేయి మహాయు గములు రాత్రి,

తెలియు వార లహోరాత్రముల నెరిగిన

వారని తెలియుము పార్థ! నీవు.

భావము.

వేయి మహా యుగాలు బ్రహ్మకు ఒక పగటి కాలం. వేయి మహా 

యుగాలు బ్రహ్మకుఒక రాత్రి కాలం. ఇది తెలిసిన వారు అహో రాత్రుల 

గురించి తెలిసిన వారు.

|| 8-18 ||

శ్లో.  అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః ప్రభవన్త్యహరాగమే|

రాత్ర్యాగమే ప్రలీయన్తే తత్రైవావ్యక్తసంజ్ఞకే.

తే.గీ.  విధికి పగటివేళ జనించు విపుల వస్తు

జాల మవ్యక్తమందుడి, వేళ మళ్ళి

రాత్రి కన్నియు నవ్యక్త బ్రహ్మ మందు

లీనమైపోవు, తెలియుము జ్ఞాన విభవ!

భావము.

బ్రహ్మ దేవునుని పగటి కాలంలో అవ్యక్తములో నుండి చరాచర వస్తు 

జాలమంతా జనిస్తుంది. రాత్రి కాగానే అవ్యక్తమైన బ్రహ్మము లోనే అంతా 

లీనమై పోతుంది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.