జైశ్రీరామ్..
|| 8-15 ||
శ్లో. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్|
నాప్నువన్తి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః.
తే.గీ. పరమపదమైన నామోక్షపదము గన్న
మహితు లరయ నశాశ్వత, మహితమునగు
దుఃఖ మూలమౌపునర్జన్మ తొలగి ముక్తి
పొంది సుఖింతురు పూర్ణ గతిని.
భావము.
పరమ పదమైన నామోక్ష పదాన్ని పొందిన మహాత్ములు, దుఃఖానికి
ఉనికి పట్టూ, అశాశ్వతమూ అయిన పునర్జన్మని పొందరు.
|| 8-16 ||
శ్లో. ఆబ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోऽర్జున|
మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే.
తే.గీ. బ్రహ్మలోకము వరకును వచ్చునవియె
తిరిగి లోకములన్నియున్, తిరిగి జన్మ
మెత్త జేయునవియె నన్ను నెట్టులయిన
చేరిన విముక్తి కల్గును ధీర పార్థ!
భావము.
అర్జునా! బ్రహ్మ లోకం వరకూ అన్ని లోకాలూ తిరిగి వచ్చేవే
పునర్జన్మను ఇచ్చేవే). నన్ను చేరితే మాత్రం పునర్జన్మ ఉండదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.