జైశ్రీరమ్.
|| 8-5 ||
శ్లో. అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేబరమ్|
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః.
తే.గీ. అంతకాలంబునన్ నన్ను నరసి కనుచు
దేహమును వీడువారు స్వాధీనమతులు
నాదు తత్వమొందుదురయ, నయవిభాస!
తెలియుమియ్యది నీవు సందేహమేల?
భావము.
అంతకాలంలో కూడా నన్నే స్మరించుకుంటూ ఎవరు శరీరాన్ని వదిలి
వెళుతున్నారో, వారు నా తత్వాన్నే పొందుదురు. ఇందులో సందేహంలేదు.
|| 8-6 ||
శ్లో. యం యం వాపి స్మరన్భావం త్యజత్యన్తే కలేబరమ|
తం తమేవైతి కౌన్తేయ సదా తద్భావభావితః|
తే.గీ. దేహమును వీడు సమయాన దేనిపయిని
చిత్తముండునో దానినే జీవుడొందు,
నన్ను దలచుచున్ గతియించ నన్ను జేరు,
ముక్తి నొసగెడి నన్ గన ముక్తి కలుగు.
భావము.
కుంతీ కుమారా! మరణ సమయంలో ఏ విషయాన్ని స్మరిస్తూ కళేబరాన్ని
వదులుతారో, నిత్యమూ ఆ విషయాన్నే తలచుకోవడం చేత దానినే పొందుతారు.ఆ
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.