జైశ్రీరామ్.
|| 8-9 ||
శ్లో. కవిం పురాణ మనుశాసితార-
మణోరణీయంసమనుస్మరేద్యః|
సర్వస్య ధాతారమచిన్త్యరూప-
మాదిత్యవర్ణం తమసః పరస్తాత్.
తే.గీ. శాసకుడు, సనాతనుడును, సర్వవిదుడు,
తలప సూక్ష్మాతిసూక్ష్ముడు, తలప నలవి
కాని రూపుడు, భర్త, ప్రకాశ రవియు,
తపసునకతీతుడతనినితలతురెవరొ,
భావము.
సర్వజ్ఞుడు, సనాతనుడు, శాసకుడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు,
అందరిని భరించే వాడు, చింతించడానికి అలవికాని రూపం కల వడూ,
సూర్యుని వలె తేజో వంతుడూ, తపస్సుకి అతీతమైన వాడూ, అయిన
పురుషుణ్ణి ఎవరు నిత్యమూ ధ్యానిస్తారో,
|| 8-10 ||
శ్లో. ప్రయాణకాలే మనసాచలేన
భక్త్యా యుక్తో యోగబలేన చైవ|
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్
స తం పరం పురుషముపైతి దివ్యమ్.
తే.గీ. వారు ప్రాణము విడువేళ ధీర మతిని
భక్తితో యోగ బలముచే ముక్తి గనుదు
రరయుచున్ హరిన్ భౄమధ్యమందు నపుడు,
ఐహికము వీడి పరకాంక్షులతులితముగ.
భావము.
అతడు ప్రాణం వదిలి పోయే సమయంలో చలించని మనసుతో,
భక్తిని కలిగి ఉండి, యోగ బలంతో, ప్రాణాన్ని కనుబొమల మధ్య చక్కగా
నిలిపి దివ్య మైన ఆపరమ పురుషుణ్ణి చేరుకుంటారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.