గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జూన్ 2022, గురువారం

యో యో యాం యాం తనుం భక్తః ..|| 7-21 || . స తయా శ్రద్ధయా యుక్త.. || 7-22 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

 జైశ్రీరామ్.

|| 7-21 ||

శ్లో.  యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి|

తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్.

తే.గీ.  భక్తు లెవరెవ రేస్వరూపములలోన

శ్రద్ధతోడ దైవారాధ నుద్ధతిగను

కోరకొందురో వారిలో కొలుపు దేను

భక్తి నా దేవతలపైన ప్రబలనిత్తు.

భావము.

ఏయే భక్తుడు ఏయే రూపంలో భగవంతుడిని శ్రద్ధతో ఆరాధించాలని 

కోరతాడో ఆయా భక్తునికి ఆయాదేవతయందే అచంచలమైన 

శ్రద్ధని నేను కలిగిస్తాను.

 || 7-22 ||

శ్లో.  స తయా శ్రద్ధయా యుక్త స్తస్యారాధన మీహతే|

లభతే చ తతః కామాన్మయైవ విహితాన్హి తాన్.

తే.గీ.  భక్తు లెవ్వార రెట్టిదైవముల గొలువ

నెంతు రవ్వారికినిభక్తి నెనరగొల్పి 

వారికాదైవ శక్తిగా ప్రబలి నేనె

కోర్కెలను తీర్తు, గ్రహియించుకొనుము పార్థ!

భావము.

అతడు శ్రద్ధతో కూడుకొని ఆరూపాన్ని ఆరాధించ సాగుతాడు. నాచే 

ప్రసాదింప బడిన ఆ కోరికలను,తాను ఆరాధించిన దేవతా

రూపంద్వారా పొందుతాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.