గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జూన్ 2022, శుక్రవారం

తస్మాత్సర్వేషు కాలేషు ..|| 8-7 || . అభ్యాస యోగ యుక్తేన .. || 8-8 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

 జైశ్రీరామ్.

|| 8-7 ||

శ్లో.  తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ|

మయ్యర్పితమనోబుద్ధిర్మామేవైష్యస్యసంశయః.

తే.గీ. కాన, నీ వన్ని కాలాల కనుము నన్ను,

యుద్ధమును జేయుమట మనో బుద్ధులరసి

నాకునర్పింప నీవంక నన్ను జేరు

దువయ, సందేహమే లేదు, ప్రవర పార్థ!

భావము.

అందుచేత నువ్వు అన్ని కాలాలలోనూ నన్నే స్మరించు, యుద్ధం 

చెయ్యి. మనో బుద్ధులను నాకు సమర్పించిన నీవు నన్నే పొందుతావు. 

ఈ విషయంలో సందేహం లేదు.

 || 8-8 ||

శ్లో.  అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామినా|

పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచిన్తయన్.

తే.గీ.  అంచితాభ్యాస యోగ యుక్తాత్ములరయ

ఘనతరంబగు చింతనన్ ఘనుడగు పర

మపురుషుని చేరుకొందురు, మరువ కిద్ది,

పార్థ! చింతలన్ విడిచిన్ బరగు సుఖము.

భావము.

అర్జునా అభ్యాస యోగంతో కూడుకొని మనస్సు ఇతర విషయాలకు 

పోనప్పుడు, నిరంతర చింతన వలన దివ్యమైన పరమ పురుషుణ్ణి 

చేరుకుంటావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.