జైశ్రీరామ్.
నవమోధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః
శ్రీభగవానువాచ|
భావము.
శ్రీకృష్ఢుడిట్లనుచుండెను.
|| 9-1 ||
శ్లో. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే|
జ్ఞానం విజ్ఞానసహితం యజ్జ్ఞాత్వా మోక్ష్యసేశుభాత్.
తే.గీ. నీ వశుభవిముక్తిన్బొంది నిరుపమాన
ముక్తిన్ బొందుదువో యట్టి పూజ్యమయిన
బ్రహ్మ విజ్ఞాన మున్ నీకు వరల జెపుదు
నీర్ష్య లేనట్టి యరైజునా యెరుగుమిదియు.
భావము.
దేనిని తెలుసుకోవడం వలన నీవు అశుభం(సంసారం)నుండి విముక్తుడవు
అవుతావో అటువంటి అతి రహస్యమైన ఈ(బ్రహ్మ)జ్ఞానాన్ని అసూయా
రహితుడవైన నీకు విజ్ఞానంతో సహా చెబుతాను.
|| 9-2 ||
శ్లో. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్|
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్.
తే.గీ. సహ్య రాజవిద్యా, రాజగుహ్యమిద్ది,
ఉత్తమము పవిత్రంబిద్ది, చిత్తమునను
నిలుచు తెలికగానిద్ది, నిలుపు ధర్మ
మిద్ది, యరయట తేలిక బుద్ధిమంత!
భావము.
ఇది రాజవిద్యా, రాజగుహ్యము, పవిత్రమయినది, ఉత్తమమయినది.
దీనిని సూటిగా అర్ధం చేసుకోవచ్చును. ధర్మ పరమైనది, అభ్యసించడం
తేలిక, నిలకడగా ఉంటుంది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.