గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మే 2022, మంగళవారం

మనుష్యాణాం సహస్రేషు..|| 7-3 || . భూమిరాపోనలో వాయుః.. || 7-4 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

 జైశ్రీరామ్.

 || 7-3 ||

శ్లో.   మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే|

యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః.

తే.గీ. మోక్ష సిద్ధికై యత్నించు భూమిపైన

వేలలో నొక్కడే, యందు వేలలోన

నొక్కడే నన్నెరుంగును నిక్కమిదియె,

పుణ్యసత్ఫలయుతునకే పొసగునిద్ది.

భావము.

వేలాది మనుష్యులలో ఏ ఒక్కరో మోక్షసిద్ధి కోసం ప్రయత్నిస్తారు. 

అలా ప్రయత్నించే సిద్ధులలో కూడా ఏ ఒక్కరో నన్ను యదార్ధంగా 

తెలుసుకుంటారు.

 || 7-4 ||

శ్లో. భూమిరాపోనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ|

అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా.

తే.గీ.  అగ్ని, భూమియు, వాయువు నాకసమును,

నీరు, మనసును, బుద్ధ్యహంకారము లను,

అష్టప్రకృతులు నావిగా నరయుమీవు,

తెలియ జెప్పెద నేనవి తెలియు మీవు.

భావము.

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మరియు మనస్సు బుద్ధి, 

అహంకారం అని నా ప్రకృతి ఎనిమిది విధాలుగా ఉన్నది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.