గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జూన్ 2022, గురువారం

మత్తః పరతరం నాన్యత్కిఞ్చి..|| 7-7 || . రసోహమప్సు కౌన్తేయ.. || 7-8 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

 జైశ్రీరామ్.

 || 7-7 ||

శ్లో.  మత్తః పరతరం నాన్యత్కిఞ్చిదస్తి ధనఞ్జయ|

మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ.

తే.గీ.  ఓ ధనుంజయా!నన్నుమించొక్కటైన

లేదు, లోకాన, సర్వమున్ నాదు కృషిని

నడుచు, సర్వమున్, నా యందె నడపబడును

దారమున మణులట్టుల ధీరవర్య!

భావము.

ధనుంజయా! నాకన్నా ఏక్కువైనదీ ఏదీలేదు. జగత్తు యావత్తు దారంలో 

మణులవలె నాలో గుచ్చబడి ఉన్నది.

|| 7-8 ||

శ్లో.  రసోహమప్సు కౌన్తేయ ప్రభాస్మి శశిసూర్యయోః|

ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు.

తే.గీ. నీరు రుచి నేనె, వేద యోంకార మేనె,

తలప నెలవంక , సూర్యుల వెలుగు నేనె,

నేనె మనుజులన్ దీక్షయు, నింగిలోన

శబ్దమేనేను, గ్రహియించు జయనిధాన.

భావము.

కౌంతేయా! నేను నీటిలోని రుచిని, సూర్యచంద్రులలోని వెలుగును, 

వేదాలలోని ఓంకారాన్ని, ఆకాశంలో ఉన్న శబ్ధ గుణాన్ని. 

మానవులలోని పట్టుదలను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.