గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జూన్ 2022, శుక్రవారం

పుణ్యో గన్ధః పృథివ్యాం ..|| 7-9 || . బీజం మాం సర్వభూతానాం.. || 7-10 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

 జైశ్రీరామ్..

|| 7-9 ||

శ్లో.  పుణ్యో గన్ధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ|

జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు.

తే.గీ.  నేనె పృథ్విలో వాసనన్, నేనె యగ్ని

లోని వేడిని, జీవులలోని ప్రాణ

మేనె, తపము తాపసులలో నేనె యెరుగ

అన్నియున్నేనె, యెరుగుమో యర్జునుండ!

భావము.

నేను పృథ్విలోని వాసనని. అగ్నిలోని వేడిని. జీవుల లోని ప్రాణాన్ని. 

తపస్సు చేసేవారిలో తపస్సుని.

 || 7-10 ||

శ్లో.  బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్|

బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్.

తే.గీ.  జీవులన్నింటిలోనున్న‌ జీవమగు స

నాతనమగు బీజము నేనె, జ్ఞానులందు

తెలివి నేనేను, ప్రతిభులన్ దెల్లమయెడి

ప్రతిభ నేనౌదునర్జునా పరులు కారు.

భావము.

అర్జునా! అన్ని జీవులలో సనాతన బీజాన్ని నేను అని తెలుసుకో. 

బుద్ధిమంతుల లోని తెలివిని. ప్రతిభా వంతుల లోని ప్రతిభను నేను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.