జైశ్రీరామ్.
|| 7-23 ||
శ్లో. అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్|
దేవాన్దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి.
తే.గీ. అల్ప బుద్ధులయినవారి కందు ఫలము
లరయ నశియించు, నాదేవతాళి గొలువ
చేరుదురు దేవతలను, నన్ జేరుదు రిల
నన్ను సేవించువారలు మన్ననముగ.
భావము.
అల్ప బుద్ధులైన వారికి లభించే ఫలం నశించి పోయేదిగా
ఉంటుంది. దేవతలను ఆరాధించేవారు దేవతలను చేరుతారు,
నన్ను ఆరాధించేవారు నన్ను చేరుతారు.
|| 7-24 ||
శ్లో. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయః|
పరం భావమజానన్తో మమావ్యయమనుత్తమమ్.
తే.గీ. పరమమున్ శ్రేష్ఠతమమునై పరగు నాదు
గుణము నెరుగని వారలు కనుదురు నను
పరిమితాకారుడ ననుచు, తరచి చూడ
జ్ఞాన చక్షువునకు నేను కనబడుదును.
భావము.
పరమము, సర్వశ్రేష్టమునైన నా స్వభావం ఎరుగని,
తెలివి తక్కువ వాళ్ళు ఇంద్రియాలకు గోచరం కాని పరిమితమైన
రూపంగా భావిస్తారు.
జైహింద్
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.