గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జూన్ 2022, గురువారం

భూతగ్రామః స ఏవాయం ..|| 8-19 || . పరస్తస్మాత్తు భావోన్యోవ్యక్తో .. || 8-20 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

 జైశ్రీరామ్.

|| 8-19 ||

శ్లో.  భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే|

రాత్ర్యాగమేऽవశః పార్థ ప్రభవత్యహరాగమే.

తే.గీ.  పార్థ! జీవతతియు కర్మ వశము చేత

జన్మలెత్తుచు పోవుచు జరుపుచుండు,

బ్రహ్మకున్ రాత్రి యయినంత ప్రాణికోటి 

నాశనంబగు నిజమిది, జ్ఞాన రూప!

భావము.

అర్జునా ఈ జీవ సముదాయమే కర్మ వశంగా అనేక జన్మలు 

ఎత్తుతూ (బ్రహ్మకు)రాత్రికాగానే నశిస్తుంది.

|| 8-20 ||

శ్లో.  పరస్తస్మాత్తు భావోన్యోవ్యక్తోవ్యక్తాత్సనాతనః|

యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి.

తే.గీ. అట్టి యవ్యక్త ప్రకృతికి, నననురూప

మును వినాశ రహితసనాతనమునయిన

భావమగుబ్రహ్మమునశించబోవదెపుడు

జీవులన్నియు పోయినన్, ధీవిశాల!

భావము.

ఆ అవ్యక్త ప్రకృతికంటే, భిన్నమూ, ఉత్తమమూ, ఇంద్రియాలకు 

గోచరం కానిదీ, సనాతనమూ అయిన భావం(పరమాత్మ)ప్రాణులన్నీ 

నశించినా నశించకుండా ఉంటుంది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.