జైశ్రీరామ్.
అథ అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.
అర్జున ఉవాచ.
భావము.
అర్జునుడనుచున్నాడు.
|| 8-1 |||
శ్లో. కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ|
అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే.
తే.గీ. ఏది బ్రహ్మమౌ? నధ్యాత్మ యేది? కృష్ణ
ఏది కర్మమౌ నధిభూత మేదియగును?
దేనినధిదైవత మనంద్రు? తెలుపుమయ్య!
వ్యక్తమగునట్లు చెప్పుమా యసమతేజ!
భావము.
పురుషోత్తమా! ఆ బ్రహ్మ ఏది? ఆధ్యాత్మం ఏది? కర్మ అంటే ఏమిటి?
అధి భూతమని దేనిని అంటారు? అధి దైవతమని దేనిని అంటారు.
|| 8-2 ||
శ్లో. అధియజ్ఞః కథం కోऽత్ర దేహేస్మిన్మధుసూదన|
ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః.
తే.గీ. ఎట్టు లుంటివి దేహాన? నెట్టులీవు
నిగ్రహాత్ముల కెట్టుల నేర్పు మీర
ప్రాణములు వీడు సమయాన ప్రణవరూప!
తెలియగాబడుచుంటివి తెలుపుమయ్య!
భావము.
మధుసూధనా! ఈ శరీరంలో ఎలా ఉన్నావు? నిగ్రహ వంతులచేత
మరణ సమయంలో నీవు ఎలా తెలియ బడతావు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.