జైశ్రీరామ్.
|| 8-23 ||
శ్లో. యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః|
ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ.
తే.గీ. ఎట్టి సమయాన మరణింప నిముడు ముక్తి,
యెట్టి సమయాన మరణింప పుట్టుకొదవు
యోగులకునట్టి కాలమ్ము నూహచేయ
దెల్పెదను నీకు నర్జనా! తెలియునటుల.
భావము.
భరతకుల శ్రేష్టుడా! ఏకాలంలో శరీరం వదిలి వెళ్ళిన యోగులు
తిరిగి జన్మించరో. ఏ కాలంలో శరీరం విడిచి వెళ్ళిన యోగులు తిరిగి
జన్మిస్తారో, ఆ కాలం గురించి చెబుతాను విను.
|| 8-24 ||
శ్లో. అగ్నిర్జోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్|
తత్ర ప్రయాతా గచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః.
తే.గీ. అగ్ని, పగలుత్తరాయణ మారునెలలు
శుక్లపక్షంబులనుమార్గ సుగతి నెంచి
బ్రహ్మమును జేరుచుందురు బ్రహ్మవిదులు.
నీవు తెలియుమో యర్జునా! నేర్పుమీర.
భావము.
అగ్ని, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం ఆరు నెలలు అనే మార్గంలో
బ్రహ్మ విధులు బ్రహ్మను చేరుకుంటారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.