జైశ్రీరామ్.
శ్రీభగవానువాచ|
భావము.
శ్రీకృష్ణభగవానుడనుచున్నాడు.
|| 8-3 ||
శ్లో. అక్షరం బ్రహ్మ పరమం, స్వభావోధ్యాత్మముచ్యతే|
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః.
తే.గీ. బ్రహ్మమది నాశరహితమౌ పరమ మరయ,
నది స్వభావంబుచేత నాధ్యాత్మ మనగ
పిలువబడు, జీవసృష్టిని వెలయ జేయు
కార్యమే కర్మ మెరుగుమా ఘనుడ పార్థ!
భావము.
నాశరహితమైన యీ బ్రహ్మము గొప్పదయినది. ఆయన యొక్క
స్వభావము ఆధ్యాత్మ మనబడుతుంది. జీవరాశిని పుట్టించే సృష్టి
కార్యమునే కర్మ అంటారు.
|| 8-4 ||
శ్లో. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్|
అధియ జ్ఞో హమేవాత్ర దేహే దేహభృతాం వర.
తే.గీ. అరయ నధిభూత ము నశించునదియె పార్థ,
పురుషు డధిదైవతంబె యా పురుషులందు
నచట నధియజ్ఞుడను నేనె, యనుపమాన!
జ్ఞాన సంభాసుడా! పార్థ! కాంచుమిటుల.
భావము.
నర శ్రేష్టుడా! నశించి పోయే తత్వం అది భూతం. జీవుడు అధి దైవతం.
జీవులలో అధి యజ్ఞుణ్ణి నేనే.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.