గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జూన్ 2022, సోమవారం

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ..|| 8-13 || . అనన్యచేతాః సతతం యో .. || 8-14 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

 జైశ్రీరామ్.

|| 8-13 ||

శ్లో.  ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్|

యః ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిమ్.

తే.గీ.  బ్రహ్మవాచక మోమ్మును పలుకు నెవరు

నన్స్మరించుచు బలికి ప్రాణములు విడుచు

నతడు పరమగతిని పొందు, నవనిపైన, 

నిజము గ్రహియింపుమర్జునా నీవు సతము.

భావము.

బ్రహ్మ వాచకమైన ఓం అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ, ఎప్పుడూ 

నన్ను స్మరిస్తూ, ఎవరు శరీరం విడిచి పెడతారో అతడు పరమ గతిని 

చేరుకుంటాడు.

 || 8-14 ||

శ్లో.  అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః|

తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః.

తే.గీ.  అన్య చింతన లేక న న్ననవరతము

చింతనము చేయు వారల చిత్తమందె

యుండి, సులభుడనై యొప్పి యుందు పార్థ!

నీవు గ్రహియింపు నా మాట నేర్పుమీర.

భావము.

అర్జునా! మనస్సు ఇతర విషయాలవైపు వెళ్ళ నీయకుండా, నిత్యమూ, 

నిరంతరమూ నన్ను ఎవరు స్మరిస్తారో నిత్య యుక్తుడైన ఆ యోగికి నేను 

సులభుణ్ణి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.