గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జూన్ 2022, మంగళవారం

తేషాం జ్ఞానీ నిత్యయుక్త ..|| 7-17 || . ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ.. || 7-18 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

  జైశ్రీరామ్.

 || 7-17 ||

శ్లో.  తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే|

ప్రియో హి జ్ఞానినోऽత్యర్థమహం స చ మమ ప్రియః.

తే.గీ.  అట్టి నలువురీలో నన్ను ననితరమగు 

భక్తి గలుగుచుసేవించు వాడు శ్రేష్ఠు

డతనికిష్టంబు నేనౌదు డతడె నాకు

నిష్టుడంచు గ్రహింపుము నిష్టతోడ.

భావము.

ఈ నలుగురిలో నిత్యము నాతో కూడి పరమాత్మనైన నాయందు 

మాత్రమే  భక్తి కలిగి ఉండే జ్ఞాని శ్రేష్టుడు. అటువంటి వాడికి నేను 

ఎక్కువ ప్రియుణ్ణి. అతడే నాకు కూడా ఇష్టుడు.

|| 7-18 ||

శ్లో.  ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్|

ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్.

తే.గీ. వీరలందరుదారులే, వీరిలోన

జ్ఞాని నాదౌ స్వరూపమౌన్, కారణమిదె

నన్నె సర్వోత్తమగతిగ నెన్ను జ్ఞాని,

యాశ్రయించును నన్నే నవిశ్రమముగ.

భావము.

వీరందరూ ఉదారులే. జ్ఞాని మాత్రం నాస్వరూపమని నా 

అభిప్రాయము. ఎందుకంటే అతడే సర్వోత్తమైన గతి అని 

నన్నే ఆశ్రయించి ఉంటాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.