జైశ్రీరామ్.
|| 8-11 ||
శ్లో. యదక్షరం వేదవిదో వదన్తి
విశన్తి యద్యతయో వీతరాగాః|
యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే.
తే.గీ. వేదవేత్త లశ్వరమందు రేదొ మరియు
రాగ దూరులై రచయితల్ సాగు దేని
నొంద బ్రహ్మచర్యమునను,
తెలిపెదను దాని నెరుగంగ, తెలియుమీవు.
భావము.
వేదవేత్తలు దేనిని నాశనం లేనిదిగా చెబుతారో, రాగ రహితులైన
రచయితలు దేనిని చేరుకుంటారో, దేనిని కోరి బ్రహ్మచర్యంలో
చరిస్తారో ఆ పదాన్ని నీకు సంగ్రహంగా చెబుతాను.
|| 8-12 ||
శ్లో. సర్వద్వారాణి సంయమ్య, మనో హృది నిరుధ్య చ|
మూర్ధ్న్యార్ధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్.
తే.గీ. ఇంద్రియద్వారముల్ మూసి హృదయమాత్మ
లోన నిలుపుచు, బ్రాణమున్ లో సహస్ర
దళపు పద్మంబునను నిల్పి యోగ
నిష్టతోడ సాధనచేయ నేర్వవలయు.
భావము.
ఇంద్రియ ద్వారాలన్ని నిరోధించి, మనసును ఆత్మలో నిలిపి, శిరస్సులో
తన ప్రాణశక్తిని నిలబెట్టి యోగ నిష్టని అవలంబించాలి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.