గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జూన్ 2022, ఆదివారం

ఇచ్ఛాద్వేష సముత్థేన ..|| 7-27 || . యేషాం త్వన్తగతం పాపం .. || 7-28 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

 జైశ్రీరామ్.

 || 7-27 ||

శ్లో.  ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వన్ద్వమోహేన భారత|

సర్వభూతాని సమ్మోహం సర్గే యాన్తి పరన్తప.

తే.గీ. ఓ పరంతపా! రాగంబు నొనరు ద్వేష

ములను పుట్టుమోహంబున పుట్టినపుడె

జీవు లొందెడు భ్రాంతిని, ధీవరేణ్య!

అర్జునా గ్రహియింపుమీ వహము విడిచి.

భావము.

పరంతపా! అర్జునా! రాగద్వేషాల నుండి జనించే ద్వందాల మోహం 

వలన పుట్టుకతోనే అన్ని జీవులూ భ్రాంతిని పొందుతున్నాయి.

 || 7-28 ||

శ్లో.  యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్|

తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతాః.

తే.గీ.  పుణ్య కర్మల వలన నే గణ్య జనుల

పాపమంతంబగునొ వారు ద్వంద్వ మోహ

ములకు దూరులై చెదరక నిలచు దీక్ష

తోడ నన్ గొలుతురరయుమా, దుర్విదార!

భావము.

పుణ్య కర్మల వలన ఏ జనుల యొక్క పాపం అంత మైనదో, వాళ్ళు, 

ద్వంద మోహాల నుండి పూర్తిగా విముక్తులై చెదరని దీక్షతో నన్ను 

కొలుస్తారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.