గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జూన్ 2022, గురువారం

తుమ్మితే తప్పేంటీ? శుభమే కదా? . ఆసనే శయనే దానే..... మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో. “ఆసనే శయనే దానే భోజనే వస్త్రసంగ్రహే,

వివాదే చ వివాహే చ క్షుతం సప్తసు శోభనమ్”

 తే.గీ.  భోజనమువేళ, పడుకొనఁ బోవువేళ,

దానమిచ్చునప్పుడు వస్త్ర ధారణమున,

కూర్చొనెడివేళ, పెండ్లిలో, ఘోరమైన

తగవులప్పుడు తుమ్ముట తగును, శుభము.

భావము. 

కూర్చునే సమయములో, పడుకునే సమయములో, దాన సమయములో,

భోజన సమయములో, వస్త్ర సంగ్రహ సమయములో, వివాద సమయములో,

వివాహ సమయములో, ఈ ఏడు సందర్భాల్లో తుమ్ము శుభ సూచకము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.