గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, మే 2025, శుక్రవారం

ఆపూర్యమాణమచలప్రతిష్ఠం ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో. ఆపూర్యమాణమచలప్రతిష్ఠం  -  సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్|

తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే  -  స శాన్తిమాప్నోతి న కామకామీ||

తే.గీ. చేరుచున్నను సతతంబు నీరు జలధి

నిశ్చలంబుగనుండును నిరుపమగతి,

భోగభాగ్యముల్ చేరినన్ పొంగిపోక

కోరికలు లేని ప్రాజ్ఞుని తీరునొప్పి. 

భావము. "సముద్రం నింపబడుతూనే ఉంటుంది.... నిశ్చలంగా ఉంటుంది. 

జలం దానిలో చేరిననూ దానిని కదిల్చలేవు... అదే రీతిగా భోగాలు తనలో 

ప్రవేశించినప్పటికీ నిర్వికారంగా ఉండే స్థితప్రఙ్ఞుడే.... కోరికలకు దూరమై 

సుఖశాంతులను పొందగలడు".

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.