జైశ్రీరామ్.
శ్లో. స్వభావం న జహాత్యేవ - సాధురాపద్గతోऽపి సన్।
కర్పూరః పావకః స్పృష్టః - సౌరభం లభతేతరామ్॥
తే.గీ. ఆపదలు చుట్టుముట్టిన నోపు నుత్త
ముండు నైజంబు విడఁబోడు పుడమిపైన,
కప్పురము నగ్ని కాల్చినన్ ఘనతరముగ
సౌరభము పంచుచున్నట్లు, సౌమ్యులార!
భావము. ఆపదలు ఎదురైననూ ఉత్తముడు తన నైజమును విడనాడడు.
కర్పూరం అగ్నిచే దహించబడిననూ పరులకు సువాసన అందించుచున్నదిగదా.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.