గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, మే 2025, ఆదివారం

పరవాచ్యేషు నిపుణః ... మేలిమిబంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.

శ్లో.  పరవాచ్యేషు నిపుణః  -  సర్వో భవతి సర్వదా |

ఆత్మవాచ్యం న జానాతి  -  జానన్నపి విముహ్యతి ||

తే.గీ.  పరుల దోషముల్ చూపుచు పలుకుటందు

నిపుణులే యందరున్ భువిన్, నిశ్చయమిది,

తమదు తప్పులనెన్నడున్ దలపరుకద,

తెలిసియున్ దాచుకొందురు తెలియనీక.

భావము.  ఇతరుల తప్పులను చూపడంలో అందరూ ఎప్పుడూ నిపుణులే 

అయివుంటారు. అలాంటివారే తమ తప్పులను గుర్తించరు. గుర్తించినా, 

గుర్తించనట్టు ఉంటారు.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.