జైశ్రీరామ్.
శ్లో. కుంభః పరిమితమంభః - పిబత్యసౌ కుంభసంభవో ఽంబోధిమ్ |
అతిరిచ్యతే సుజన్మా - కశ్చిత్ జ్జనకం నిజేన చరితేన ||
తే.గీ. పరిమితంబగు జలముచే వరలు కుండ,
కుండనుండి తా పుట్టియు కుంభజుఁ డిల
సంద్రమునను ద్రాగివేసెను, సన్నుతముగ,
తండ్రినే మించు ప్రతిభచే తనయు లరయ.
భావము. కుంభము (కుండ) పరిమితమగు నీటిని కల్గియుండును. ఆ కుంభము
నుండి జన్మించిన అగస్త్యుడు (కుంభసంభవుడు) సముద్రమునే త్రాగినాడు.
సుజన్మగల వ్యక్తి తన ఉత్తమ ప్రవర్తనచే తండ్రిని మించిన వాడవుతాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.