గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, మే 2025, మంగళవారం

మత్తః ప్రమత్తోశ్చోన్మత్తః ... మేలిమిబంగారం మన సమ్స్కృతి.

జైశ్రీరామ్.

శ్లో.  మత్తః ప్రమత్తోశ్చోన్మత్తః శ్రాన్తః క్రోధీ బుభుక్షితఃl

లుబ్ధో భీరుః త్వరాయుక్తః కాముకశ్చ న ధర్మవిత్ll

తే.గీ.  మత్తుఁ, డున్మత్త, లుబ్ధ, ప్రమత్త,  భీరు

వులును, క్రోధి, కాముకుఁడునా కలినినున్న

వాఁడును,మరియు నలసినవాఁడు,త్వరను

కలుగు వాఁడు, నిలపైన ధర్మంబు కానలేరు. 

భావము. "మత్తుడు, ప్రమత్తుడు, ఉన్మత్తుడు, అలసిపోయి ఉన్నవాడు, 

కోపంతో ఉన్నవాడు, ఆకలితో ఉన్నవాడు, లోభి, పిరికివాడు, 

తొందరపాటులో ఉన్నవాడు, కాముకుడు - వీరు ధర్మమును తెలుసుకోలేరు".

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.