గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, మే 2025, శనివారం

పైశున్యం సాహసం ద్రోహం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్. 

శ్లో.  పైశున్యం సాహసం ద్రోహం   -  ఈర్ష్యాసూయార్థ దూషణమ్! 

వాగ్దండయోశ్చ పౌరుష్యం   -  క్రోధజోఁపి గుణోష్టకః!!

తే.గీ. కొండెమాడుట, సాహసంబొండు, ద్రోహ,

మీర్ష్య, దూషణ, తొందర, నితరులఁగని,

శిక్షవేయుట,  కటువుగ చెలగు పలుకు

టనెడి యెనిమిది కోపాన మనకు కలుగు.

భావము.  చాడీలు చెప్పడం, తొందరపాటుతనం, ఇతరులకు హాని చేయడం, 

ఓర్వలేనితనం, ఇతరులలో ఉన్న మంచి గుణాలను దోషాలుగా ప్రచారం చేయడం, 

కఠినంగా మాట్లాడడం, నిష్కారణంగా శిక్షించడం, పరుషంగా మాట్లాడడం - 

ఈ ఎనిమిదీ కోపం నుండి పుట్టిన దుర్గుణాలు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.