గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, మే 2025, సోమవారం

భారతసైనికులారా! విజయోఽస్తు. తే.11 - 5 - 2025.

 జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏼

భారతసైనికులారా! విజయోఽస్తు.

ఉ.  దుష్కృత పాగ్విమూఢులగు దుష్టులు దేశవినాశకారకుల్

ముష్కరపాళి హిందువులఁ బూజ్యులనెన్నుచు కాల్చి చంపిరా

ముష్కర జాతి మాయగను పూజ్య న.మో. వర దీక్షబూని రా

శుష్కపు జన్ములన్ దునుమి శోభిలఁ జేసెడు మాతృదేశమున్.


శా.  యావద్భారతజాతి యేకబిగితో నా జాతిపై యుమ్మినన్

త్రోవే కానక చచ్చిపోవుదురుగా దుష్టాత్ములాయేటిలో,

భావిన్ ముష్కరులుండనట్టు లిపుడే ప్రఖ్యాత యుద్ధంబునన్

గావించున్ గద శ్రీ న.మో. జగతికే కల్యాణమున్ గూర్చుచున్.


ఉ.  హైందవ తేజసంబున రహించెడి భారత దేశమాతనే

కొందలమందఁ జేయఁగ నకుంఠితరీతిని యెవ్వరిద్ధరన్

ముందునకొచ్చినన్ దునిమి మూర్ఖపు జాతి విహీనసుస్థితిన్

బంధుర రీతిఁ జేయు సురభారత వీరుల కంజలించెదన్.


ఉ.  అమ్మా! భారత దేశమాత! గనుమోయమ్మా! మహావీరులౌ

నెమ్మిన్ శత్రువినాశనైపుణిని క్షోణిన్ బేరు గన్నట్టి నీ

సమ్మాన్యంపు సుతాళియన్ క్షిపణులన్, సాధింతురమ్మా జయం

బిమ్మాన్యుల్ జగదేకవీరులు కనన్ సృష్టిన్ బ్రభామూర్తులే.


ఉ.  మంగళభారతావనిని మంగళమూర్తులు వీర సైన్యమీ

మంగళమూర్తులెప్పుడును మంగళముల్ కనుగాక ధాత్రిపై,

పొంగుత భారతాంబ తన పుత్రులసద్విజయంబు గాంచుచున్

నింగిని దేవతాతతి గణించి జయంబులు పల్కుగావుతన్.

🙏🏼

జయతు హైందవమ్

జయతు భారతమ్.

అమ్మ దయతో🙏🏼

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.