గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, మే 2025, శుక్రవారం

మూర్ఖాణాం పండితా ద్వేష్యా ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  మూర్ఖాణాం పండితా ద్వేష్యా  -  దరిద్రాణాం మహాధనాః |

అధార్మికాణాం ధర్మిష్ఠా  -  విరూపాణాం సురూపిణః ||  (మహాభారతం)    

తే.గీ.  మూర్ఖులకు పండితులు రిపుల్ భూమిపైన,

బీదలకు రిపుల్ ధనుకులు, పృథ్విపైన

ధర్మ దూరులకును రిపుల్ ధర్మపరులు,

రూపవంతులు రిపులు కురూపులకును.

భావము.  మూర్ఖులకు పండితులు శత్రువులు. బీదవాళ్లకు ధనికులు 

శత్రువులు. పాపులకు ధార్మికులు శత్రువులు. కురూపులకు సురూపులు శత్రువులు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.