శా. శ్రీమన్మంగళ సద్వధాన చతురుల్, శ్రీమంత సత్ పండితుల్,
ధీమంతుల్, వర కావ్యకర్తలు, మహ ద్ధీమూర్తు లీ సత్ సభన్
శ్రీమంతంబగు సద్వధానమున యీ చేపూరి యుప్పొంగగా
నీమంబొప్పగ వచ్చినారు. తమకు నే చేసెదన్ సన్నతుల్.
శా. శ్రీమన్మంగళ శ్రీనివాసుని దయన్ చేపూరి శ్రీరాం గుణో
ద్ధాముండద్భుత సద్వధాన మున మోదంబొప్ప సత్పూరణల్
ధీమంతుల్ గని మెచ్చ జెప్పుత, శుభాధిక్యంబు చేకూర్చుతన్,
శ్రీమాతన్ మదినిల్పి సాగుడు సుధీ! సిద్ధింప మీ కోరికల్.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.