జైశ్రీరామ్.
శ్లో. అశ్వస్య లక్షణం వేగః - మదో మాతంగ లక్షణమ్ |
చాతుర్యం లక్షణం నార్యాః - ఉద్యోగం పురుష లక్షణమ్ ||
(మహాసుభాషితసంగ్రహః)
తే.గీ. వేగమశ్వలక్షణమగు విశ్వమునను,
మదము గజలక్షణంబగు మహిని జూడ,
నేర్పు స్త్రీ లక్షణంబగు నేలపైన,
నిరతముద్యోగమే తగు పురుషులకును.
భావము. వేగం అనేది గుర్రానికి లక్షణము. గర్వం అనేది ఏనుగుకు లక్షణము.
చాతుర్యం అనేది స్త్రీలకు లక్షణము. ఉద్యోగం అనేది పురుషులకు లక్షణము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.